Thursday, November 26, 2009

Zen Poem in Telugu


Zen Poem in Telugu




ఒక రాయి విసిరిన వేళ

గతంలో నేను నేర్చుకున్నవన్నీ

మటుమాయమయ్యాయి

ఒక్క క్షణం

అంతా అయోమయం

దైనందిన జీవితంలో

పనికోసం గాలించి

అడుగులేస్తున్న పాతబాటలోనే

నాకు

మానసిక ఇరకాటం లేదు

బలహీనత లేదు

నాబాటలో

అడ్డుగోడలు లేవు

నేను

ఒక రంగులోనో

వెలుగులోనో

అణిగి లేను

జ్ఞానులు

ఎక్కడయినా ఎప్పుడయినా

చెప్పేదొకటే

జ్ఞానం

ఇలాగే సిద్ధిస్తుందని.


జెన్ గురువు సెంజీ కవిత ఇది.


జెన్ కథలు అనే

(డి.చంద్రశేఖర రెడ్డి, యామిజాల జగదీశ్ గారల) పుస్తకంలోని ఒక కథ నుంచి



No comments: