I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
The sounds of the boy's flute filled the bunds of the
fields, crops, canals and the hills at a distance.
He had no knowledge of the ragas (musical scales) nor had he
learnt about the swaras (musical notes). His mentors were – the koel, the
carpenter bee, the mountain brook, the mooing of the cows, the gentle breeze
floating over the fields, the thunder, the beetle and the Lavangi birds.
A naturally gifted flautist, he had a great sense of music
though ignorant of musicology, its theories, principles and terminology.
Comparing notes and notes, he would tune the shruti (pitch). His breath kept
the laya (rhythm & tempo). Only three talas (beats) emerged from his rhythm
& tempo – they were Adi, Eka and Roopaka.
The melodic patterns (moorchanas) he conjured up were simply
out-of-the-world combinations.
2
He was a cattle grazer and nine years old. After eating
yesterday's remnant rice and gruel with salted fish as side dish, he put some
of the rice gruel in a small pot and a pickled piece of raw mango, covering it
with a plate. Wrapping the lunch-pot in a piece of cloth, he reached the river
bund riding a buffalo.
The shade of the neem tree was his throne; his cattle were
his subjects, and his weapon was his flute!
A tattered loin cloth and an equally torn head scarf were
his silken attires. Whenever it rained, he made a couple of buffalos stand
close together and sat down under them. When the river swelled, he crossed it
on the buffalos. Cows and buffalos were his armed guards. Equipped so, he could
stand up even to a tiger.
3
Once he reached the grazing field, he bade them go on their
own and settled himself under the tree, playing and singing.
He pulled out the flute and played on it to mesmerize the
world. The lyrics for the songs were his heart itself.
Sometimes his song jumped and pranced. It flowered and
spread gentle fragrance all around and bubbled up like the waters of a little
spring.
Sometimes his song looked at the world and wondered, paled
or shivered.
Another time his song searched for something. It gazed at
the sky keenly; pierced the depths of the earth, and counted the water drops in
the river.
At times it went into tears. It curled with some unknown
fear, sulked with hunger and took on the form of the entire gamut of human suffering
and wept.
Yet another time the song assumed the all-knowing lotus
yogic posture and offered grass flowers in supplication. Also, it probed the
depths like a fish in the water.
Kissing the flute with his lips, the boy turned into one who
lost cognizance of his own handiwork.
4
One day from an adjacent farmland, a girl worker came
looking for him following the song.
She was eight. She sat still before him listening to the
song.
She did not divide his kingdom or usurp it.
She became one with his kingdom, with his song and with him.
She would come every day by his song time and sit there
before him.
The tattered cloth on her midriff did not cover her
nakedness completely. She had a pair of bangles on her arm, and two aluminum
anklets on her legs.
If the boy's face was the image of the sun, her face was the
lotus in the side-by-pond.
5
One day when he played on the flute, the whole world
listened to it under a spell. And the girl turned into that very song.
In the meantime, some monstrous bird hovered in the sky with
an earth-shattering sound. Stunned with the sound, the boy stopped playing and
fell at once to the ground. The girl flew to his side. Shivering and wailing,
she embraced him.
The demon bird flew away. After a while the two naïve kids
got up and surveyed around with bleary eyes.
His cows and buffalos grazed as usual. Flowers were in
bloom. The neem tree stood outspread just as before. The brook flowed on
gurgling.
He mustered up courage to pick up the flute and once again
harmonized the three sacred notes into a cadence that questioned this universe.
The girl continued to cling to him.
Far away in Europe, there was a war raging. Japan let itself
loose on Pearl Harbor.
The boy came out of the impact. Matching the pitch of the
daily visitor demon birds, he played a new combination to which the girl
listened, smiling and captivated.
- ఇది కంద పద్యమేనా? ఏమో? నాకు తెలియదు. రాశాను, అంతే.
నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు,
ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటుంటే,
పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి
మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు.
వచనం (కథ, నవల, వ్యాసం) రాయడం
గాల్లో విమానం నడపడం లాంటిదనీ, పాట రాయడం, రోడ్డు మీద కారు నడపడం లాంటిదనీ అన్నారాయన. ఇక పద్యం,
పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే,
వెళ్లవలసిన చోటికి అదే వెళుతుంది! అన్నారాయన. ఏ పనయినా అంతే,
చేతనయిన వారికి, చాలా సులభంగానే
కనపడుతుంది. మిగతా వాళ్లకది చెక్కల బావిలో మోటార్ సైకిల్ నడిపినట్లుంటుంది.
చెక్కలతో బావి కట్టి, అందులో గోడల మీద, సైకిల్, మోటార్ సైకిలూ, నడిపిన గురుభిక్‌సింగ్ ప్రదర్శన నాకు
ఇన్నేళ్లయినా గుర్తుంది. ఆయనకదే బతుకు. (బహుశ: దాని అంతం కూడా!) ఎట్లా నడుపుతారు,
అంటే, ‘ఓస్! సులభం’
అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు. కనుక, నాతో మొదలు ఎవరయినా ప్రయత్నించవచ్చు. జారిపడినా దెబ్బలు
తగలవు!
చిన్నప్పుడు, అదెందుకో, ఏమిటో తెలియకుండానే, శతకాలకు శతకాలు భట్టీయం (ఇది నోటికి నేర్చుకునే విద్య!) వేయించేవారు. ఇది
పక్కనే పెడితే, మా ఊరి బడి ఒక సెంటర్ స్కూలట. సెంట్రల్ కాదని
మనవి. చుట్టుండే అయిదారు పల్లెలకు అది కేంద్రమని అర్థం! ఆ బడులలో పంతుళ్లు వచ్చి
ఒక ‘సెంటర్ క్లాస్’ అనే కార్యక్రమంలో ‘మాదిరి తరగతి’ అనే మాడల్ క్లాసులు
నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కనబెడితే, ఈ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదూ?
నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం, పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు, కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులాగుంది.
వాళ్లంతా, నట్టుతూ, ముక్కుతూ మూడు నాలుగు పద్యాలు చదివి, అలసి ఆగిపోయారు.
నేను మాత్రం, వద్దన్నా ఆపకుండా, మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. అది మూడవ, నాలుగవ తరగతిలో ఉన్నప్పటి మాట!
సినిమా పద్ధతిలో సీన్ కట్ చేస్తే, ఎనిమిదవ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్లు గారు తెలుగు
చెపుతారు. చాలా బాగా చెపుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ, అంటే పదాలను విడగొట్టి చూపడం, తరువాతి అంచె. అర్థం చెప్పడం, సమన్వయం, ఆ తరువాత జరుగుతాయి. పద్యాన్ని మరో సారి చదువుతారు. అప్పుడు
పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా, ఒక క్రమంలో కూచుంటారు గదా! రెండు బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి.
అందులో మొదట్లోనే నేను ఉండేవాణ్ని! అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే,
ఆ పద్యం చదివేవాణ్ని! అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలాకాలం
నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి? క్లాసులో ఉండే
ఆడపిల్లలలో ఇద్దరు, ఇదంతా నచ్చలేదనుకున్నారు. ‘మీరు ఏ పద్యం
చెప్పబోతున్నారో ముందే వాడికి చెపుతారు. వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు! బడాయి!’
అన్నారు. ఆచార్లు గారికి నేనంటే, ఆనాటికీ, ఈనాటికీ అభిమానమే. ‘ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంత సేపు, అతను పద్యం మనసులో మననం చేసుకుంటాడు. మీరు చేయరు. అంతే!’ అన్నారు. సిలబస్‌లో
లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ, వంతు రాగానే, నేను పద్యం
అప్పజెప్పాను. పుస్తకం లేకుండానే! ఆ తరువాత ఏమయిందో నాకు గుర్తులేదు.
బడిలో నాతోబాటు పద్యాల పోటీలో పాల్గొన్న
మిత్రుడు, బంధువు విష్ణు, చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్లిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి
విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవరికీ ఇవ్వరు. పేరుతోబాటు ఒక నంబరేమయినా
ఉండేదేమో? గుర్తు లేదు. ఫలానా శర్మ, కేరాఫ్ 56, ఎ.పి.ఓ. అని రాస్తే
చాలు, ఉత్తరం వెళ్లిపోతుంది. ఏపీఓ అంటే ఆర్మీ పోస్ట్
ఆఫీస్ అని తరువాత తెలిసింది. (తెలిసిందా?) 56 అంటే విష్ణు ఉండే చోటయి ఉంటుంది. ఈ సంగతంతా పక్కన పెడితే, ఒకసారి ఉగాదికో, సంక్రాంతికో వాడికి
ఇన్‌లాండ్ లెటర్ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు.
వాడి దగ్గర గానీ, ఉందేమో ఉత్తరం, అడగాలి!
చిన్నాయనగారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో
‘వసుచరిత్ర’ పాఠం చెప్పారు. ఇంట్లో, సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యవిద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో
కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ, ఎందుకో అది కుదరదు.
దేనికదే వేరువేరుగా ఉండిపోతయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర, ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. ‘అన
విను, గృహస్థ రత్నంబ! లంబమాన రవిరథతురగ..’ అంటూ
వచనమంతా ఒక్క పట్టున అప్పజెబితే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అప్పకవీయం
పరిచయమయింది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకమది. నిడుదలు, జడ్డక్కరములు, పిరుందకడ యూదిన
యక్కరముల్ గురువులు. కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్‌తో గణములు,
గణముల కాంబినేషన్స్‌తో వృత్తములు, పద్యములు. తరువాత డి.ఎన్.ఏ. గురించి చదువుతుంటే నాకిదంతా గుర్తుకు
వస్తుండేది. ‘జరల్ జరల్ జగంబుకూడి సన్నుతిన్ రచింపగా, పరాజితార ధీరవీర పంచచామరంబగున్!’ పంచచామరం అనే పద్యం లక్షణం పంచచామరంలో!
రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్‌వ్యూహము.
‘రామాండెమంటే, సామాండెమా? గొల్లేశమంత కథ!’ అని ఒక మాట. రామాయణం సామాన్యం కాదు! బయలాటలో వచ్చే
గొల్లవేషమంత ఉంటుందని, అన్న మనిషి భావం! ఈ ఇంటర్‌వ్యూహము కూడా గొల్ల
వేషమంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము గనుక, అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది గనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్సుకు
సంబంధించింది. ముగ్గురు నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతయినంత వరకు నేనూ వారి
బుర్ర తిన్నాను. కైసర్ కలందర్ గారని ఒక అందమయిన పెద్దాయన, కమిటీ అధ్యక్షులు. ‘సైన్సు సరే! హాబీలేమిటి?’ అని అడిగారు. ‘తిండి, అమ్మాయిల’ గురించి
చెబితే కుదరదు. కనుక ‘సంగీతం, సాహిత్యం’ అన్నాను.
‘ఒక పద్యం చెప్పగలవా?’ అన్నారాయన. ‘కలడుల్లోక మహా మహోగ్ర’ అంటూ
వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక్క సంస్కృత సమాసం మరి! ‘అర్థం
చెప్పగలవా?’ అన్నారాయన. ‘ఓ యస్’ అన్నాను. భయపడ్డారేమో,
‘వద్దులే’ అని మరేదో అడిగారు. నాకా ఉద్యోగం ఇస్తారని అక్కడే
అర్థమయింది. అది మరో గొల్లవేషం కథ!
మళ్లీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి, ఆలోచన ఏదయినా వస్తే
వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేనూ జవాబుగా ఒక కార్డు రాసేవాణ్ని. ఒకసారి
ఆయన రాయవలసిందేదో రాసి, కార్డు వెనుక చిరునామా రాసేచోట పక్కన ఖాళీలో
రెండు పద్య పాదాలు రాశారు. ‘శాంతి సంగరంబు, స్వాతంత్య్ర సమరాన, సగము కాలినట్టి సమిధ నేను’ అని మాత్రం
రాశారాయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేనూ అదే పద్ధతిలో ‘కడమ సగముగాల్చి కవితా
ప్రపంచాన, కారు చీకట్లను పారద్రోలె!’ అని రాసి పంపాను.
నమ్ముతారో లేదో? కార్డు అందిన మరుక్షణం ఆయన ఆఘమేఘాల మీద
వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. ‘తెలుగు పద్యం’ గురించి నేను వేస్తున్న
పుస్తకంలో, నీ పద్యం ఉండాలి!’ అన్నారు. పద్యం లేదు. అదే
వేరే సంగతి!
మామూలు సంఘటన : దాన్ని ఎదురుకున్నామంటే అదొక గొప్ప! ఇతనికి పక్క ఊళ్లోఉండే అతనితో జరూరు పని ఉంది. పది
నిమిషాలలో వెళతాడు. కొంత మాట్లాడి మళ్లీ వస్తాడు. ఎంత తొందరగా వచ్చానో అంటాడు
పైగా. మరునాడు అతను మళ్లీ అక్కడికి పోతాడు. ఈసారి కొన్ని గంటలయినా
సరే వ్యవహారం తేల్చేయాలి. పొద్దున్నే బయలుదేరతాడు. అన్ని పరిస్థితులు, కనీసం ఇతని
దృష్టిలోనిన్నటిలాగే ఉన్నాయి. కానీ అక్కడికి చేరడానికి ఇతనికి పది గంటలు పడుతుంది.
అలసి సాయంత్రానికి అక్కడకు చేరుకుంటే, ఇతను రాలేదని విసుగుచెంది అతను ఇతని స్థావరానికి
బయలుదేరాడన్నారు. బయలుదేరి అరగంటయింది. దారిలో ఎదురయి ఉంటాడు అనీ అన్నారు. ఇతడిని
కొంచెం సేపు ఉండమన్నారు. అతను త్వరలోనే వస్తాడన్నారు. ఇతను మాత్రం ఆత్రంగా
వెనుదిరిగి వచ్చాడు. ఈసారి అతను సంగతి తెలియకుండానే, క్షణంలో ఇల్లు
చేరుకున్నాడు. అతను పొద్దున్నే వచ్చాడనీ, నిజానికి ఇతను బయలుదేరకముందే వచ్చాడనీ చెప్పారు. నిజంగా
అతను ద్వారం దగ్గరే ఎదురయ్యి, వ్యవహారం గురించి చెప్ప ప్రయత్నించాడు. ఇతను మాత్రం తనకు
టైం లేదనీ, తొందరగా వెళ్లాలనీ
అంటూసాగిపోయాడు. ఇతని తీరు అర్థంగాక అతను అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు. ఇతని
గదిలోనే ఉండి మళ్లీమళ్లీ వచ్చాడా అని అడిగాడు. అతనింకా అక్కడే ఉన్నాడిప్పుడు.
అతడిని కలిసి సంగతి వివరించవచ్చునన్న సంతోషంతో ఇతను మెట్లెక్కసాగాడు. పైమెట్టు మీద
పడిపోయాడు. దొర్లుతూ వచ్చి బాధ కారణంగా మూర్ఛపోయాడు. కనీసం అరవను కూడా లేదు.
చీకట్లో ఉండి మూలుగుతున్నాడు. అతను కోపంగా మెట్లు దిగి గబగబా `దగ్గరనుంచా, దూరంనుంచా
తెలియలేదు` వెళ్లిపోవడం మాత్రం
కనబడుతూనే ఉన్నది. అతను వెళ్లిపోయాడు. I I I I ఇది కాఫ్కా రచన. దీన్ని కథ అనాలా? మరి కాఫ్కా కథకుడు
గదా? కథానికలు రాసే
వారందరికీ అతను అంత ఎత్తున కనిపిస్తాడు గదా? అందుకే కాఫ్కా తీరు (కాఫ్కాయెస్క్) అనే మాట పుట్టింది.
పద్ధతి పుట్టింది. ఇంతకూ కథానిక అంటే ఎట్లుండాలి? ఎవరు చెప్పగలరు?
మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా?’ ప్రశ్న ‘లేదండీ! అందరూ
పిల్లలే పుడుతున్నారు!’ జవాబు.
నీలంరాజువారు : లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. నేను
మురళీధర్ గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయట పడేశారు.
ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్
చేశారా? అని నాకు గాభరా!
ఆయన మళ్లీ పిలిచి (కాల్ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట
శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం
పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్’ కూడా
అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు
ఆదర్శం, అని వినయంగానే
అన్నాను. నేను ఈ ప్లానెట్ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన
గొప్పవారు!
(గురజాడ వారి ఇల్లు)
ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది
కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు
తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు
(ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి
ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం
గొప్పవాణ్ని! భళా! గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది.
మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో
ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం
వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి
మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడు గారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణ బాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల
పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!)
నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి
మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను!
తాపీ ధర్మారావు, సాలూరు
రాజేశ్వరరావు!!! వాసా వారు,
అంట్యాకుల
పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు! బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు
చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది.
బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో
విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం
నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే
ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది!
విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు
నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా! గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని
చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది
ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే
కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి.
ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు
చదువుకుంటున్నారు. పై అంతస్తు లోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను
వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది ‘మెటిల్డా’
అంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను
కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని
సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. అమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ
ప్రదర్శనకు పెట్టారు. ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి
గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగి
రాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే
అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు
తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిశెట్టి రామారావు కార్టూన్ల గురించిన
పుస్తకాలు దొరికాయి.
(సంగీత కళాశాల - వెనుక భాగం)
(సంగీతం మర్రి చెట్టు)
సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక
పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం
గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది.
మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ
మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం
లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం
చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక
పెద్ద మర్రిచెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి
ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన
భావం కలిగింది. ఆవరణ లోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతం వల్లనేమో
అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం
దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారు’ అని
అడగండి, ఎవరైనా చెబుతారు
అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు
దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత
సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు
చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను
పిలిచింది ఒక స్కూల్ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్ పేరున
పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు
జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్ ఇచ్చి
సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్ అక్కడ
స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి
దొరుకుతాయన్నారు. అందుకు టైమ్ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.
ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం
మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను
ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని
తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి
రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం
కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ
సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే
తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!
Arudra was wonderful song writer. That is only what many people know!
He was much more than that!
He wrote crime stories like "Palakla Vendi Glasu" and others. His "Samagra Andhra Sahityam" volumes are nothing less than a Magnum Opus. A university or an institute could not come up with such a research work on Telugu literature.
He was very good at Humor! Koonalamma Padalu is one such master piece!
Here is a page from the book!
Great Bapu's cartoons make the words much more meaningful!
The
Sphinx spoke only once, and the Sphinx said, "A grain of sand is a desert,
and a desert is a grain of sand; and now let us all be silent again." స్ఫింక్స్
ఒకేసారి మాటాడింది, స్ఫింక్స్ అన్నదిగదా, ఒక్క ఇసుకరేణువే ఎడారి, ఇక ఎడారి అంటే
ఒక్క ఇసుకరేణువు మాత్రమే, ఇక ఇప్పుడు మనం మళ్లా మౌనంగా ఉందాం అని.
I heard the Sphinx, but I did not understand. నేను
స్ఫింక్స్ మాటలు విన్నాను, కానీ నాకు అర్థంకాలేదు. Long
did I lie in the dust of Egypt, silent and unaware of the seasons. నేనెంతో
కాలం ఈజిప్ట్ దుమ్ములో పడి ఉన్నాను, నిళ్ళబ్దంగా, కాలం గతి తెలియకుండా.
Then the sun gave me birth, and I rose and walked upon the banks of the Nile, అప్పుడు
సూర్యుడు నాకు బతుకునిచ్చాడు, ఇక నేను లేచి నైలు గట్లమీద నడిచాను,
Singing with the days and dreaming with the nights. పగలు
పాడుతూ, రాత్రులు కలలుగంటూ.
And now the sun threads upon me with a thousand feet that I may lie again in
the dust of Egypt. నేను
మళ్లీ ఈజిప్టు దుమ్ములో పడి ఉండాలని, సూర్యుడు నన్ను చుట్టుకుంటాడు.
But behold a marvel and a riddle! కానీవింతనూ చిక్కుప్రశ్ననూ చూడండి
The very sun that gathered me cannot scatter me. నన్ను
ఒకటి చేసిన సూర్యుడు నన్ను చెదరగొట్టలేడు.
Still erect am I, and sure of foot do I walk upon the banks of the Nile. నేనింకా
నిటారుగా నిలుచున్నాను, నైలు గట్లమీద నమ్మకంగా నడయాడుతున్నాను.
My article that appeared in my book and before that my column in Andhra Bhoomi daily, Sunday Magazine.
మా ఊరు
పేర్లు పెట్టడం అనేది
ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే ` ఎడ్వర్డ్ ఆబి
ఎప్పుడో ఒకసారి, చెప్పడానికి ఏముంది అని ఓ కవిత రాశాను. ‘అందరితో
కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను’ అన్నాను.
కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు
మారినట్టుంది, చెప్పడానికి చాలానే ఉంది అని కూడా
అన్నాను. చెప్పదలుచుకుంటే ఎంతయినా చెప్పవచ్చు. మూడు సంవత్సరాలనుంచి లోకాభిరామం
పేరుతో చాలా సంగతులు చెపుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్లు, తెలియనివాళ్లు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ
మధ్యన ఒకచోటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన చాలామందిలో నాకు పరిచయమున్న
వాళ్లు నలుగురే. ఆ నలుగురితోనే నాలుగు మాటలు మాట్లాడి, మరో నలుగురితో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటిదారి పట్టే
సందర్భంలో కళకళలాడుతున్న ఒక అమ్మవారు
దగ్గరగా వచ్చారు. బాగా పరిచయమున్నట్టే పలకరింపులు కూడా లేకుండా ‘మిమ్మల్ని ఒక
ప్రశ్న అడగాలండీ’ అన్నారు. ‘ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణం భాష
ఎందుకని వస్తుంది?’ అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు
మా ఊరు మళ్లీ గుర్తుకువచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా
అలవాటుగా చిన్ననాటినుంచి,
నేటివరకు ఇంట్లో
మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను.
ఆవిడ నవ్వేసి వెళ్లిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వారి వాళ్లందరూ క్రమం తప్పకుండా
చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం
ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్లారు. నాకు ఆనందమయిందా? ఏమో? అయ్యే ఉంటుంది! మా ఊరు పేరు ఏనుగొండ.
ఇంగ్లీషులో మాత్రం ‘వై’తో మొదలుపెట్టి రాస్తారు. మరిదాన్ని యేనుగొండ అనాలి కదా!
కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను
ఇప్పటికీ మా వాండ్లందరు ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్లున్నాయి.
రాంపూర్ అనే ఊళ్లు మనదేశంలో 84 ఉన్నాయట. ఇది
తపాలాశాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్లగుద్ది, మరిదేన్నయినా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు
కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవు గానీ, ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ
అని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పేర్లు రానురాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ
ఊళ్లనుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న
సంగతులేగానీ ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంతదూరంలో ఉన్న ఒకానొక
గుట్టకు ఊరగుట్ట అని పేరు. దానిమీద ఒక విచిత్రమయిన రాయి ఉంటుంది. మామిడికాయ
ఆకారంలో ఉండే ఆ రాయి, ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు
ఒక పెద్దరాతి మీద కొంతమాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది.
పుట్టినప్పటినుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం
పడలేదు. హైదరా బాద్ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్లు మా
రాతిని, మామిడికాయ రాతిని చూచింది, లేనిది తెలియదు. ఏనుగొండ అనే మా ఊరు
మొదట్లో ఆ గుట్టకింద ఉండేదట. గుట్టకింద అంటే గుట్ట ఉన్నచోట కాదు. దాని పక్కన అని
అర్థం. అక్కడినుంచి ఊరు రెండు అంచెలలో ప్రస్తుతం ఉన్నచోటికి వచ్చింది. ఇందుకు
సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో, మధ్యలో ఉండే పొలాలలో
తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలినమన్ను, కుండముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా
గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను
గమనించాను. అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు
దొరికాడు అని ఊళ్లో కలకలం మొదలయింది. అందరమూ కలిసి వెళ్లాము. గణేశుని విగ్రహాన్ని
తవ్వి బండికి ఎత్తించి ఊళ్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు, పురస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి
సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండే రెండు.
అందులో మాది ఒకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి
ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు.
విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి అట. అట్లా చేసిన విగ్రహం
ఏదో ఒక రకంగా మళ్లీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకూ నిజమే
అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే, ఆ విగ్రహం ఏమయింది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు
ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తొంగి చూచింది. నేను ఈ మధ్యన మా ఊరికి
వెళ్లడానికి కారణం కనిపించడం లేదు. ఈసారి వెళ్లి గణపతిని వెతకాలి. ఊళ్లో ఒక ఆంజనేయుని
గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటినుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ
అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి
అందులో నిత్యం ధూపం, దీపం నడిచేది కాదు. ఊళ్లో మాకున్న
కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు
రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరి వదిలి
బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు
ఊళ్లో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్దమనిషి వచ్చి ఊళ్లో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను.
ఆయన ఏమయినా గుడిని పట్టించుకుంటున్నాడేమో తెలియదు. కార్తీకమాసం వస్తే
ఊళ్లో వాళ్లు రోజుకు ఒకరు చొప్పున కార్తీకపూజ అనే ఆకుపూజ చేయించే వారు. నాకే
నమ్మకం కలగదుగానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత నా తలమీద పడింది. తెలిసిన కుటుంబాల
వారు పొద్దున్నే సరంజామాతో వచ్చి ‘ఇవాళ కార్తీకం చెయ్యాలె! అన్మాండ్లకు చెండూరం
పెట్టు, సాయంత్రం పూజ కూడ చేయించు’ అని
అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు. కనుక నేను కాదనలేక పోయే వాడిని.
సరంజామాలో సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున
దేవుని నైవేద్యానికి, నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దానిపేరు సాహిత్యం.
సాహిత్యం అన్నమాటకు సరయిన అర్థమేమిటో ఇప్పటికయినా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని
విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి, గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి
హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో
తెలియదు. తెలిసిన తరువాత ఎవరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటే
గదా! ఝలక్ : ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా
అనుకోకుండా మరునాడు మహబూబ్‌నగర్ అనే పాలమూరుకు వెళ్లాను. అదేదో జక్కడు జాతరకు
పొయ్యొచ్చినట్టు, పాతి ముట్టిచ్చుకోని (అంటే ఏమో
ఎవరికన్న తెలుసునా పోవలసిన చోటికి పొయ్యి, వంటల పొయ్యి కాదు, వెళ్లి, చేరి లాంటిదన్నమాట, దాన్ని తాకి వెనిక్కి వస్తే అది
పాతి ముట్టిచ్చుకోవుడు) తిరిగి వచ్చిన. నాకిప్పుడు ఏనుగొండలోకి పొయ్యే మనసు లేదు, సమయము అంతకన్నా లేదు. పోయే టప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి
నాకొక చిత్రం అర్థమయింది. ఈ చిత్రము విచిత్రము గావచ్చును లేదా బొమ్మ గావచ్చును.
పంచాయతి సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు, పట్నమయిన పాలమూరు అను మహబూబ్‌నగర్‌లోని ఒక వార్డు మాత్రమే అయింది. ఊరి గుర్తింపు గంగలో
పోయింది. అయినాసరే, మా ఊరి గురించి చెప్పుకోవలసిన
సంగతులు నా మనసులో మాత్రం కావలసినన్ని ఉన్నయి.
As a tribute to Sri Rajeswara Sastry, his grandson who passed away recently....
చికిలింత
వెంకట్రాయులుగారి భవనంలో ధనలక్ష్మి మూలుగుతూంటుంది `
అని అందరూ చెప్పుకుంటారు. ధనలక్ష్మి మూలుగు సంగతి
దైవమెరుగునుకాని, నౌకరు రంగడు మట్టుకు ` ఆడాపాడా మద్దెలకొట్టా ` ఒక్కడే కావడం మూలాన,
గంపచాకిరీ చెయ్యలేక ఓపికున్నప్పుడు విసుక్కుంటాడు: ఓపిక
లేనప్పుడు విసుక్కుంటాడు: ఓపిక లేనప్పుడు మూలుగుతూంటాడు. వాడి మూలుగు రాయలకి
అలవాటై పోయింది. అలవాటుకొద్దీ, ఆపూట రాయలు రంగడిని
పక్కయింటికి వెళ్లి, పత్రిక పట్టుకురమ్మన్నాడు. అలవాటుకొద్దీ వాడు
వెళ్లాడు. వట్టి చేతుల్తో తిరిగి వచ్చాడు. ` ఏం? ` వాళ్లు పత్రిక కొనడంమానేశారుట!` ` మన బాదపడలేకట!` మొగంమీద
కొట్టినట్టు అనేశాడు, ఆ పెద్దమనిషి! `ముష్టి అణాపేపరు అడిగి
పట్టుకు రాలేని నీవు ఎందుకు పనికివస్తావురా?` `ముప్పొద్దులూ మీ యింటపడి మేయడానికి` `మేయబట్టే,` యింత పోతరం!` `పోనీండి : పొమ్మంటే పోతాను` `చేతనైతే పొమ్మనకముందే పోవాలి: ` పోతున్నానుగా` రంగడు ఓపిక తెచ్చుకుని, గిరుక్కున వీధి గుమ్మంవేపు తిరిగాడు. `ఒరేయ్ రంగడూ!` నీ వాలకం చూడగా,
అన్నమాట నిలుపుకునేట్టున్నా వేంరా?- నీకు యిదేం దుర్బుద్ధిరా?’ రాయడు, కుర్చీలోంచి,
కాళ్లుక్రిందపెట్టి లేవడానికి ప్రయత్నం చేశాడు. ఎదురు గుమ్మంలోకి, ఎవరో అమ్మాయి
వచ్చింది. పచ్చగా ఉంది. పది పద్ధెనిమిది ఏళ్ళుంటాయి. మొగాన లక్ష్మి ఓడుతూంది.
కట్టుకున్న కోక, తగని దరిద్రగొట్టుగా ఉంది. ఎవరమ్మాయ్, నీవు? పనిమనిషినండి!` ఎవరింట్లో? యీ యింట్లోనే. ఎప్పటి నుంచీ ?` మీరు ఒప్పుకుంటే ఇప్పటినుంచీ!- రంగడు, ఉన్నచోటే
నిలిచిపోయి, విరగబడి నవ్వాడు. `మా అయ్యగారిది అదృష్ట జాతకం! నేను యింతకు ముందే నౌకరీ
మానుకున్నాను` ఏం జీతం సరిగా యివ్వరా? అసలు యిచ్చిందెప్పుడు? యిన్నేళ్లాయె, ఎర్రని ఏగాని కళ్ల జూడలేదు. ఉన్న నౌకరీ ఊడితే, ఈ వయసులో అన్నం
ఎట్లా? సన్నాసుల్లో కలిసిపోతాను! మంచి ఆలోచనే!` కలిసిపోగానే నాకో
కార్డుముక్క రాసేయి! తెరిపి చేసుకుని నేను వచ్చి కలుస్తాను. రాయడు, వాళ్ల మాటకు అడ్డం
వచ్చాడు. అమ్మాయ్!` నీకు నౌకరీ ఎందుకు? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు భారత ప్రభుత్వం వారు! అయితే పోయి వారినే అడుగు. అడుగుదామనుకున్నాను కాని ` అంతలోనే యిది ప్రజా ప్రభుత్వం అన్నమాట జ్ఞాపకం వచ్చింది. ఏరాjయయితే నేం పళ్లూడగొట్టుకునేందుకు? మీరూ ప్రజలేకదా అని వచ్చాను. హుఁ` కూత ఘనంగా ఉందే
వచ్చిన దోవనే దయచేయి` యింతలో రాయల భార్య, నాగమ్మ రంగడిమీద
పొల్లుకేకలెట్టుకుంటూ అక్కడికి వచ్చింది. ఆలా, దుంగల్లే అక్కడ
నిలబడిఉంటే కూరెవరు తరుగుతారనుకున్నావురా!` `అయ్యగారు!` నేను నౌకరీ
మానేశాను లెండమ్మ!` ఆ నౌకరీ నా కిప్పించండమ్మా! తరగడంలో నేను మొనగాడిని `
అని అందుకుంది ఆ వచ్చిన అమ్మాయి! `నీ వెవరు!` `అమాయకులందరూ నన్ను అభం శుభం తెలియని ఆడపిల్లంటారు: ఆడపిల్ల
లందరూ అచ్ఛం ` మొగరాయడంటారు. ఎవరేమన్నా పడేందుకు ఓపికలేక,`
ఇలా పరుగెత్తుకుంటూవచ్చి యిక్కడ తేలాను. నీ పేరేమిటి? ఇన్నాళ్లూ రోజుకోపేరు : ఇవాళ మీరేం నామకరణం చేస్తారో? ఇన్నాళ్ళూ ఎలా బ్రతికావ్? ‘మునుపు తిన్న తాయిల్లాలు మనసులో నెమరేసుకుంటూ! పండగనాడూ
పబ్బంనాడూ, మీలాంటివాళ్ల లోగిళ్ళముందు నిలవబడి, గారెలవేపుడు గుమాయించే గాలి పీల్చుకుంటూ!’ ‘గాలిపీలుస్తూ బ్రతకమట్టే, కన్నుల పండువుగా వున్నావు మా తల్లీ! కనీ పెంచే వయస్సంతా మా అయ్యగారి పాదాల
దగ్గిర గడిచిపోయింది. నిన్ను పెంచుకుంటా నమ్మడూ: దేవుడితోపులో చిక్కని
చెట్టుక్రింద, అల్లంతమేర చిమ్ముకుని, ఆ నీడనే పడుందాం: రా అమ్మా` నన్ను కన్నతల్లి
చిన్నప్పుడే కన్ను మూసింది. ఆపేరుని పిలుచుకుంటా?... అచ్చటా ముచ్చటా తీరాలి తల్లీ! కాదనకమ్మా’ అన్నాడు రంగడు ` మాట కలిపించుకుని` ముషిట అణాపేపరు కాగితం అడిగితేలేనివాడివి, ఆడపిల్లనేం సాకుతావురా అని ధుమధుమలాడాడు రాయడు. ‘చూస్తారుగా! రా అమ్మా! రా! అక్కడ నుంచుంటే లాభం లేదు.`
అయ్య పెట్టాపెట్టడు, అడుక్కుతినా నివ్వడు’ అని అడుగు ముందుకువేశాడు రంగడు. రాయడు కుర్చీలోంచి ఒక్కదుముకు దుమికి` ‘ముష్టి`నీ పెంపకమేమిటి?
నేను పెంచుకుంటాను’ అన్నాడు. అమ్మాయి ఉహుఁ అన్నట్టు తలవూగించింది. ‘అంతమాట మీరనరాదు ` నే వినరాదు. కనీ
పెంచే తల్లి ` యింట మహలక్ష్మల్లే ఉండగా, యీ తలకుమాసిన దాన్ని పెంచుకోవల్సిన అవసరం ఏం వచ్చె? ఏం తాతా? ఈ యింట ఎన్నడూ
తొట్టెకట్టలా? భోగిపళ్లు పోయలా` ముద్దకుడుము లీయలా,` అన్నెం పున్నెం
లేకుండా అంత నిప్పచ్చరంగా కాపురం చేస్తున్నారంటావా, అయ్యగారూ,` అమ్మగారూ?`’ అని గదమాయింపుగా మనసు చివుక్కుమన్నట్టు ` అయ్యో పాపం!` అని వాపోయినట్టు, వీళ్లది ఇలాటి పుటకేమా అని, విస్తుపోయినట్టు,`
భూమ్మీద ఇలాంటి మనుష్యులుకూడా ఉంటారా?` అని, ముక్కుమీద
వేలేసుకున్నట్టు, చెంపపెట్టు పెట్టినట్టు, మృదువుగా అడిగింది. రంగడు, నోరెత్తాడు: రాయడు,
పీక నులుముతానన్నట్టు, ఉరిమిచూసి, చేయిజాపి, పంజావిప్పాడు. ఆ అమ్మాయి, కనుఱెప్ప అయినా
కదిలించకుండా, రాయడిని పసిపిల్లవాడిని చూసినట్లుచూసి, ఫక్కున నవ్వింది: ‘పైకి భీకరంగా ఉండేవాళ్లు ` పరమ పిరికివాళ్లు! నిండుకుండ ఎన్నడూ తొణకదు. ఏమీలేని విస్తరి ఎగిరెగిరి
పడుతుంది. అన్నీ ఉన్నది అణిగి ఉంటుంది. ఈ నీతులన్నీ మామూలుగా కాపీబుక్కుల్లో
కనబడుతాయే! అయ్యగారు, అంతలెక్కన్నా, బళ్లోకి వెళ్ళినపాపాన పోలేదా ` ఏం? ఈ ఉరుములూ మెరుపులూ చూడగా చూడగా యీ యింట కలిమంత లేమి కూడా
ఉన్నట్టు ఘట్టిగా స్పష్టమౌతుంది` ఏం తాతా?` ఏమిటి వీరికి లోటూ`?’ `‘నాకేలోటూ లేదు!’ అని రాయడు గర్జించాడు. ‘అవునమ్మా ` నిజానికి ఏ లోటూ
లేదు: బంగారం లాటి కొడుకున్నాడు`’ `ఒరేయ్ రంగడూ!` వాడి పేరు యీ యింట
ఎత్తితే`’ ‘నాలుక చీలుస్తా నన్నారు. నాకెరికే!` అయ్యా! ఆమాటమీదనే ఉండండి! నాకు రెండునాలిక లున్నాయ్! ఒకటి చీల్చినా ఒకటి
మిగుల్తుంది’ ‘పీక తెగ్గోస్తే`’ ‘చేతుల్తో సైగచేసి, చెప్పాల్సింది
చెపుతాగాని, యింత లెక్క వచ్చినాక, యిక వదుల్తానా! అమ్మడూ, మా ఊళ్లో, మంచివాళ్ళున్నారు. మనసు చంపుకోనివాళ్ళున్నారు. కాని,
మా అయ్యడబ్బుకి వెరచి, మా అమ్మ నోటికి వెరచి ఒక్కళ్ళూ ఇదేమని అడిగినవాళ్లేలేరు! నీవు వచ్చి అడిగావు.
ఆ భారతం విప్పుతున్నా చూసుకో!` నిజానికి నన్ను
నిగ్గదీసి అడిగితే అబ్బాయిగారు యీ యింట పుట్టవలసినబిడ్డ కాడమ్మా! పెద్దలు
చేసుకున్న పుణ్యంకొద్దీ పుట్టాడుకాని. దక్కించుకునే యోగ్యత మాకు లేకపోయిందమ్మా!
తరిమేశామమ్మా!’ ‘అదేం?’ అంతే! మాఅయ్య తీరంతే` ‘మూడుతరాలకు సరిపోయే సంపదుంది` నౌకరీ చెయ్యను
నాన్నా!’ అన్నాడు బిడ్డ’ ` ‘అంతా నా స్వార్జితం`
కూచుని మేసేందుకు కాదు`నౌకరీచేయకపోతే`బయటికి నడవరా నాన్నా!’ అన్నాడు`అయ్య`అంతే`మాటపడి, ఒక్క నిమిట్ ఈ ఇంట
ఉండలా, బిడ్డ! పచ్చిమంచినీళ్లన్నా ముట్టలా!
కట్టుబట్టలతో తలొంచుకుని దారిపట్టాడు!’ ‘ఉహుఁ`నీవు అడ్డం
వెళ్ళలేకపోయినావా తాతా!`’ ‘ఎందుకు అమ్మడూ! బిడ్డకు యీ యమచర వదలకుండాలనా, ` బయటికి పోయాడో ` బాగుపడ్డాడే’ ‘బాగుపడ్డా డంటావా’ ‘ఢంకామీద దెబ్బకొట్టిచెపుతా! ఎంతకలికాలమైనా` ఉన్నాడని నమ్మినవాడికి నిదర్శనం యిస్తూనే ఉన్నాడమ్మా దైవం`
ఆ బిడ్డేబాగుపడక ` అడవులుపట్టి
అల్లాడిపోతే` పట్టపగలు చుక్కలు రాలవూ! మున్నీరు ఏకంగాదూ?
భూమంతా వరదేసుకుపోదూ!’ ‘ఎక్కడున్నాడంటావ్?’ ‘ఎక్కడున్నా ` చల్లగా ఉంటాడు!`
బిడ్డకోసం, రోజుకు వేయి
మొక్కులు మొక్కుతా ` ఒక్క మొక్కన్నా వరం యివ్వదూ?’ ఇంతసేపటికి రాయడికి గొంతు పెగిలింది! ‘రంగడూ! నన్ను
చంపకురా!-’ అన్నాడు! నాగమ్మ కళ్లు ఎర్రబడి, ఉబ్బిపోయినాయి. వచ్చే శోకం, దిగమింగుకుంటూ
‘నోరు మూస్తావా లేదా!’ అనబోయి, బావురుమంది: రాయడు, నాగమ్మవంక కొరకొర
చూడబోయి కొరమారినట్టు దగ్గి గొంతు రాసుకుని` ‘ముష్టివాగుడు కట్టిపెట్టి పడుంటావా లేదా? వెధవ బెదిరింపులూ నీవూను! ఇదిగో అమ్మాయ్! వాడి వాగుడుకు
దరీ అంతూ అంటూ ఉండదు కాని ` వినిపించుకోక!
ఉండాలని వచ్చావు కదా ` ఉండిపో `ఏం ` అలా చూస్తావేఁ?` నిన్నేం
పస్తులుంచంలే` బంగారం మేపలేంగాని, కలో గంజో మాతోబాటు తాగుతూ పడుండు! పో` లోపలికి వెళ్లి `
తల దువ్వుకొని బొట్టూ కాటుకా పెట్టుకుని అమ్మగార్ని అడిగి
మరోకోక కట్టుకో!’ రాయడు యీ మాటలంటూనే పైపంచ బుజాన గిరవాటు వేసుకొని వీధిలోకి
చక్కాబోయినాడు. ‘అయ్యగారికి ఊష్ణం వచ్చిందేమోనమ్మా! లేకుంటే యింతమంచిగా,
యింత యీవిగా మాట్లాడటమే!`’ అని రంగడు కసురుకున్నాడు. నాగమ్మ నవ్వింది. ‘అమ్మాయ్! నీ పేరేమిటే!’ అని చనువుగా అడిగింది. ‘మీ కే పేరు యిష్టం?’ ‘మా అమ్మపేరు భావమ్మ. ఆ పేరు ఆడపిల్ల పుడితే పెట్టుకుందా
మనుకున్నా` నా నొష్టను రాయలా...’ ‘పోనీ మనవరాలికి పెట్టుకోవచ్చునుగా!’ నాగమ్మ ` కుమిలిపోయింది.
ఆపిల్ల చప్పున ఆమె కాళ్లు పట్టుకుని` ‘ఎన్నడూ
నోరెత్తనమ్మా మనసు నొప్పించనమ్మా!’ అంది! నాగమ్మ, పిల్లదాని తల
నిమురుతూ ‘నిన్నేమని పిలవనే?’ అంది! ‘పిల్లా!’ రేయ రేయ రేయ రోజులు గడచిపోతున్నాయి ` పిల్ల గుణగణాలు చూసి, నాగమ్మ, నీ కుల మేమని అడగలా? యింటి పెత్తనం అప్పగించింది. యివతల చెంబు అవతల పెట్టనీయకుండా, నాగమ్మను కూచోపెట్టి పిల్ల, ఆరిందాగా యిల్లు దిద్దుకుపోతూంది. పిల్ల, రోజుకో కథ
చెప్పకలదు. పూటకో పాట పాడకలదు! రాయడు కథలంటే చెవికోసుకుంటాడు. నాగమ్మ పాటలు వింటూ
అన్నంనీళ్ళూ మరచిపోతుంది. సంక్రాంతి వచ్చింది. పిల్ల తలంటి నీళ్ళు పోసుకుని నాగమ్మ పట్టుబలవంతాన, ఒకటో అరో సరుకు పెట్టుకుని, యింట మహలక్ష్మల్లే తిరుగుతూంది. చిటికలో పంచభక్ష్య పరమాన్నాలూ తయారు చేసింది.
వడ్డించాను రమ్మంది పదిగంటలకల్లా. రాయడు పడమటింట్లోకి వచ్చి కూర్చుని, పక్క విస్తరి చూసి ‘అది ఎవరికి?’ అన్నాడు. ‘తండ్రిప్రక్క ఎవరు కూర్చుంటారు?’ రాయడు తెల్లబోయి చూస్తూ కూర్చున్నాడు. ‘కలుపుకోండి, నెయ్యి వడ్డిస్తాను
` పండగనాడన్నా మారు విస్తరి వేయాలి కదా, కోపంవస్తే ముఖం కండలు చించుకుంటాం గాని, అనుబంధాలు కోసేసుకోగలమా? పాపం. ఎక్కడున్నాడో, ఏంచేస్తున్నాడో,
తిన్నాడో లేదో మీ అబ్బాయి. పోన్లెండి, చెప్పినమాట వినకుండా శఠించి పోయినవాడిని మీరేం చేయగలరు?
పక్కన వున్నట్టే భావించుకుని` పప్పూ బువ్వా తింటే కొంత మనశ్శాంతి!’ రాయడు అన్నంమీద వేసిన చెయ్యి వెనక్కు లాక్కుని, అంత ఎత్తున ఎగిరిపడి` ‘పోఁ బయటికి పోఁ’ అని అరిచాడు! నాగమ్మ, పరుగునవచ్చి,
పిల్లను కౌగలించుకుని, ‘నీవు పోతే నూతులో పడతా!’ అంది. రాయడు గది తలుపు బిడాయించుకుని ముసుగెట్టుకున్నాడు. పిల్ల,
ఒకసారికి పదిసార్లు, గుమ్మంలో నుంచుని బ్రతిమాలింది. ఉలకలా`పలకలా! నాగమ్మ ` పిల్ల, కనపడీ కనపడటంతోనే బావురుమంటోంది. రంగడుమట్టుకు డొక్కలు దించుకుపోతున్నా గుక్క చెల్లగా
గుక్కెడు మంచినీళ్లు త్రాగుతూ ‘నా సామిరంగా! యిన్నాళ్ళకు, నా కళ్లు చల్లబడ్డాయి అమ్మడూ!’ అని జపం చేస్తున్నాడు. ఒంటిగంట అయింది. మబ్బేసింది. ఒక చినుకు పడ్డది. అబ్బాయి వచ్చాడు. ‘అమ్మా!’... అన్నాడు. నాగమ్మ దిక్కులు
దద్దరిల్లి పోయేట్టు ఆవురుమంది. రంగడు చిందులు తొక్కుతున్నాడు. రాయడి గదితలుపు
బద్దలయ్యేట్టు మోగించాడు. రాయడు తలుపుతీశాడు. బిడ్డ తండ్రిని పలుకరించాడు. ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు,
యిల్లువిడిచి పోనట్టు, కలతలే లేనట్టు ` క్షణంలో కలసిమెలసి పోయాడు. అందరూ భోజనంచేశారు. తల్లి కొడుకును దగ్గిర కూర్చోబెట్టుకుని లక్షప్రశ్నలు
వేసింది. ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా ‘ఆ పిల్ల ఎవరమ్మా’ అని అడిగాడు. ‘పనిమనషిని!’ అని పిల్ల నదురూ బెదురూ లేకుండా జవాబు
చెప్పింది. ‘అలా అనుకుంటే మా కళ్ళుపోతయ్. ఎవరోఏమో, అడిగినా చెప్పదు. ఓ నాడు వచ్చింది. ఉండిపోయింది: నాతల్లే
చేసేది ` మళ్ళీ, యీ పిల్లే
చేస్తూంది నాకు పోషణ! మన యింటికి లక్ష్మి వచ్చిందిరా నాయనా!’ నా తండ్రిని
నాకిచ్చిందిరా తండ్రీ!’ ‘ఏమండీ! ఆమాటమటుకు అనద్దు! మాటమీదుండటం మొగసిరికాని, బింకాలు కొట్టిపోయి బిక్కమొగం వేసుకురావడం యిదేం ప్రజ్ఞ!
అయ్యగారికి తగ్గకొడుకే!’ అందిపిల్ల! ‘గడుసుది లాగుందమ్మా!’ అన్నాడు బిడ్డ!’ ‘గడుసో దుడుసో! మీ అయ్య కళ్ళు తెరిచింది. అందుకు సంతోషించు!’
అన్నాడు రంగడు. ‘అమ్మాయ్! నీకు పెళ్లిఅయిందా?’ అన్నాడు రాయడు, ఉన్నట్టుండి. ‘కాకపోతే`’ ‘మావాడికి నీకిచ్చి చేస్తాను!’ పిల్ల నవ్వింది. ‘చేసుకోగా చేసుకోగా యీ అడ్డాలపాపణ్ణే చేసుకోవాలా? నేనే చేసుకుంటే ` నాకు తాళికట్టేవాడు
నాన్నకు వెరవనివాడు కావాలి!’ ‘మావాడు అంతేనమ్మా! నన్నూ నాడబ్బుకూ ఠోలీ క్రింద కట్టి చక్కా
పోయినాడు.’ ‘పోయినవాడు పోకుండా తలవంచుకు వెళ్ళిన త్రోవనే మళ్లీ దయచేశాడు
కద! ఇక బుద్ధివచ్చింది. మీ చెప్పు చేతుల్లో ఉంటాడు. ఏరినపిల్లను కట్టుకుంటాడు.
పెళ్ళానికి కానీ మల్లెపూవులు కావాలన్నా మీకు ప్రాధేయపడతాడు. అంతేనా ` ఏమండోయ్, ఇలాటివాణ్ణి
కట్టుకునేందుకు, ఆడపిల్లలు కానీకి మూడు చొప్పున బజారులో చవగ్గా
దొరకడంలేదు. నా ఎరికలో, మీవాడికి` పెళ్ళి అయే యోగం లేదు`’ అని గట్టిగా
గదమాయించింది`పిల్ల!’ లక్షరూపాయలిచ్చి ` కట్ట బెట్టినా ` నా కక్కరలేదు’ అని
రెట్టించింది. ‘అమ్మా!` అమ్మా!` అంతమాటనకమ్మా! నాబిడ్డ గుణగణాలు నీకు తెలియవమ్మా! కోటిలో
ఒకడమ్మా!’ అని బ్రతిమాలింది, నాగమ్మ. అంటూ
చప్పున కాళ్లుపట్టుకోపోగా, పిల్ల ఎగిరి,
పక్కకు గంతేసి` ‘‘అత్తయ్యా’’ అంది. నాగమ్మ ` తెల్లబోయింది. బిడ్డ ఫక్కున నవ్వాడు. రాయడు` ఊఁ`ఊఁ అని మూలిగి, బిడ్డవంక చూసి`
అంటే`? అన్నాడు. ‘‘మీ కోడలన్నమాట!’’ అన్నాడు బిడ్డ. రాయడు వినీ వినడంతోనే ` ముఖకవళిక మార్చాడు` ‘ఉహు` యిదా నీ ప్రతాపం!-
ఎలా పోషిస్తావురా-’ ‘‘మనకా బాధలేదు నాన్నా!` ఈ పిల్ల పోషణలో ఉన్నాను`’’ ‘ఉహు!` అత్తగారు
స్థితిమంతులన్న మాట`’ ‘కాదండీ మామగారు` మీతో పోలిస్తే గర్భ
దరిద్రులు!` అల్లుడికో వేయి రూపాయలు జీతం ` దాంతో, ఏదో ఓపూట తినీ,
ఓపూట తినకా`’ పిల్ల నవ్వేసింది` ‘ఆఁ`ఆఁ` అంత వాడివైనావటరా నాన్నా!`’’ అంటూ రాయడు కొడుకుని కౌగలించుకునేందుకు ఉద్యుక్తుడైనాడు` బిడ్డ ` ఒక అడుగు వెనుకకు
వేసి` ‘ఆగు!` నీకు ఆ అర్హతలేదు`’
అన్నాడు `రాయడు ఎంతో
చిన్నబుచ్చుకున్నాడు` ‘అదేమిట్రా నాయనా!’ అని అతి దీనంగా అన్నది నాగమ్మ!` పిల్ల ` అత్తగారి దగ్గిరకు
చేరి రహస్యంగా ` ‘మరేం లేదు అత్తయ్యా! మీ అబ్బాయిది చంక వేసుకునే యీడు
కాదుగదా! మరి, రేపో మాపో ` మనవణ్ణికని ` పిల్ల సిగ్గు పడ్డది!` నాగమ్మ ` ఎగిరి గంతేసి నీ
కడుపుడకా!’ అంది!. రాయడు ` ముఖం చిట్లించుకొని
బిడ్డతో ‘ఒరేయ్ ` నీకు పిన్నంతరం పెద్దంతరం లేదురా ` నా కోడలుచేత నాకు బుద్ధి చెప్పిస్తావుట్రా` కానీ`నీకూ`యిదే`.’ ‘అదృష్టం పడుతుంది!`’ అని రంగడు పూర్తి చేశాడు.
Presented with a heavy heart!