Wednesday, November 19, 2008

A page from the diary

10-02-00

నాయకత్వంలో మంచి ఆనందం ఉంది. ఆ నాయకత్వం అందరికీ ఆమోదయోగ్యమయితే మరింత ఆనందకరంగా ఉంటుంది. మంచి ఆలోచన కలగడం ఒక ఎత్తు. దాన్ని పదుగురి ముందు పెట్టగలగడం మరొక ఎత్తు. అలా బయటకు వచ్చిన ఆలోచనలను బేరీజు వేసి, ఎవరినీ నొప్పించకుండా మెత్తమెత్తని చీవాట్లు వేస్తూ, అందరినీ ముందుకు తీసుకు పోతుంటే....., చిన్నప్పుడు రైలాట ఆడుతుంటే, ముందుండే వాడికేగదా, కూ! అనే అవకాశం, దారి నిర్ణయించే అవకాశం.....! ఇక్కడా అంతే!
అందుకే అందరూ ఆ నాయకత్వం కోసం నానా అగచాట్లు పడతారు. దాన్ని నెరపలేక అభాసుపాలవుతారు. అందరి చేతా తిట్లు తింటారు. నాయకత్వానికి కావలసింది, సత్వర స్థిర నిర్ణయశక్తి, చొరవ, పటిమ లాంటివి. ఇవి వయసుతో కొంత వస్తాయేమో గానీ, సహజంగా వచ్చేవే ఎక్కువ.

నేనెప్పుడూ పెరుమాండ్లను నాకుగా, నా కొరకు ఏదీ కోరి ఎరుగను. తిరుపతిలో వెంకన్న ముందు నిలబడి, మా వెంకన్నకు నోటి పూత తగ్గించమని, అందరూ సుఖంగా ఉండేలా చూడమని అడిగిన వాణ్ణి. సింహాచలంలో కప్పస్తంభం అని ఒకటి ఉంటుంది. దాన్ని కావిలించుకుని కోరిక కోరమన్నారు. నేను కోరుకున్నాను. ఇది స్వార్థము. ఆనందము నిండిన కోరిక. తీరుతుందేమో. (తీరలేదని నేను చెపితే, నరసింహుడేమనుకుంటాడో). చందనంలో దాగున్న స్వామి నన్ను కొంత ప్రభావితుడిని చేశాడు. (అప్పట్లో) పూజార్లు మాత్రం పూజార్లే, మారరు.

గుళ్లోగానీ, ఇంట్లోగానీ, దేవుని ముందు పెట్టే దీపం పేరు మాకు తిరువళికె. అది తమిళంలోని తిరువిళక్కునకు పట్టిన గతి. (లేదా మార్పు). ఒంట్లో తమిళం లేదు. ఒక తరం పోతే, ఇంట్లోనూ మిగలదు. దేవుని దీపం అనగూడదు. పెరుమాండ్ల తిరువళికె అనాలె. తమిళులం. కన్నడ ప్రాంతం నుంచి వచ్చి తెలుగు నాట బతుకుతున్నాం. ( సంగతి మా వారెవరూ ఒప్పుకోరు!). గుర్తింపు మాత్రం తెలుగు వారిగానే మిగిలింది.

My goodness! I had ideas about leadership even when I was not exactly teaching it! I was practising it at that point of time. I was reasonably good leader then. This is not just my judgement but many people endorsed the idea. Why then I left that very comfortable job? The question is who was comfortable? Everybody else except me! I never wanted to be a boss! I joined all India Radio, thinking that I will be a producer, doing creative work all through the life. I was having people like Bhradwaja in my view. They enjoyed their job! Of course the official rigmarole makes such people uncomfortable. Then there is compensation in the form of putting your creativity to best use. How many people in this world can throw their ideas on to the world like a media man does?
Then AIR has sucked! It literally chased me away!
Am I happy after that? Yes and No! It depends. If I had stayed there itself, I would have been a very different person. I do not have any complaints about that department even today. It is only people who make or break the institutions.

So, this was the day I chaired the Co-ordination meeting at Vizag. We all went to Simhachalam. I thought I did a mistake to visit a Vaishnavite temple in an official manner and dress. I asked God for some small favour. He never gave it to me! He had different plans for me. I welcomed it! No regrets!
I am used to take life as it comes!

Talking of temples I became aware of some terminology. I commented about the Tamil terms still in use in our households. They are transformed so very much that we ourselves do not recognise the fact that we follow Tamil culture. In fact some of our people hate Tamil and Tamilians.
Funny!

Thursday, November 13, 2008

African folk tales

African Folk Tales

I found these stories in an unexpected book. written by genius by name Dr. Tirmala Ramachandra. The book is a collection of his articles on matters of literaturs and related things.

His other book Hampi to Harappa, of course in Telugu is an example of one writes an autobiography. He was a man of many things. A polyglot, journalist, linguist and more than anything a true blue researcher, that was Ramachandra. I don’t know if it would be naive to say that he was a clan man, and his original name was Ramachandra charya. That apart, I have a habit of keeping away from people if I am too very awe struck with their virtuosity. Francis Crick, Veena Balachander are some of the people from whom I kept a distance even though there were occasions to befriend them. Tirumala Ramachandra was another in that list. I have a belief that proximity robs off the element of awe.

Coming to the point, I found a book of articles Sri Ramachandra . it was a collection of articles he has written for various magazines and news papers. I found some very interesting facts and ideas in many articles there. I thought I can make use of some of the material for my blog. When I simply opened the book now, casually to see what is it that I can pick up, I stumbled on an article that I neglected earlier. The article is about African culture. A real polyglot Tirumala studied everything and anything that came his way. Here are a couple of stories that he narrated in the article, word by word.

More about Ramachandra sometime later!

ఆఫ్రికన్ జానపద గాధలు
కుందేలు - మనం
చంద్రుడు ఒకమారు ఒక పురుగును పిలిచి ‘నీవు మానవ లోకానికి వెళ్లి ఇలా చెప్పు “నేను చస్తాను! చస్తూ బతుకుతాను. నేను చస్తే మీరూ చస్తారు. చస్తూ బ్రతుకుతారు!”’ అని అన్నాడు. పురుగు బయలుదేరి పోతూ ఉంది.

అంతలోనే దానికి దారిలో ఒక కుందేలు తటస్థపడింది. ‘పురుగా, పురుగా! ఎక్కడికి ప్రయాణం?’ అంది. ‘ఏం పని మీద వెళుతున్నావు?’ అని మళ్లీ అడిగింది. ‘నన్ను చంద్రమహారాజు పంపారు. మానవుల దగ్గరికి పోతున్నాను. ఆయన మాట ఒకటి వారికి అందజేయాలి!’ అని విషయం వివరంగా చెప్పింది పురుగు. ‘నీవు ఏ కాలానికి మానవలోకానికి చేరడం? నేను త్వరగాపరుగు తీస్తాను. నేనా సంగతి అందజేస్తాలే. నీవు తిరిగి వెళ్లు!’ అని కుందేలు దానితో చెప్పి, అది సమాధానం చెప్పే లోపుగానే పరుగు తీసిందట.

కుందేలు దారిలో తను చెప్పవలసింది సగం మరిచింది. మానవ లోకం చేరిన మీదట వారిని కలుసుకుని, ‘చంద్రమహారాజు నన్ను పంపాడు. “నేను చస్తే చచ్చి నశిస్తాను. మీరుకూడా చచ్చి పూర్తిగా నశిస్తారు.” అని చెప్పమన్నాడు’, అని అన్నదట. తర్వాత చంద్రలోకానికి తిరిగి వెళ్లి తను మానవులతో చెప్పిన అన్ని విషయాలు మనవి చేసిందట.

చంద్రుడు మహోగ్రుడయ్యాడు. ‘నేను క్రిమికి అలా చెప్పలేదే? నేను చెప్పని విషయం ఎలా చెప్పావు? ఎంత సాహసం?’ అని ఒక కర్ర తీసుకుని కుందేలు మోరమీదికి విసిరాడు. దాని దెబ్బకు కుందేలు ముక్కు నడుమకు తెగింది. అప్పటినుంచే కుందేళ్ల ముక్కులన్నీ తెగి ఉన్నాయి. కానీ మనుష్యులు మాత్రం కుందేలు చెప్పింది నేటికీ నమ్ముతున్నారు.

Rabbit - Men

Moon called an insect once and said, “you go to the world of man, and tell thus. ‘I will die. I will live dying. If I die you will also die. You will live dying.’” The insect set on the journey and was going.

Soon a Rabbit accosted it. “Oh! Insect where are you going?” it said. It again asked “On what errand are you going?” “King Moon has sent me. I am going to the man world. I have to convey his message to them.” The insect narrated the matter in detail. “When do you reach man’s world? I can run fast. I will deliver the message to them. You go back!” said the rabbit and even before it could answer fled away.

On the way Rabbit forgot the detail of the message. On reaching man’s world, it met them and said, ‘King Moon sent me. He asked me to tell, “I will die and thus I perish. You will also die and totally perish.”’ It went back to the moon world and narrated the message that it gave to the men.

Moon was very angry. “I did not tell the insect like that! How can you tell something that I did not tell? How dare?” saying so, he threw a stick on to the face of the rabbit. Rabbit’s nose was slit into the middle. Since then only rabbits have a slit nose. But, people however still believe what the rabbit told them.

సూర్యుడూ చంద్రుడూ
చాలా కాలం క్రితం సూర్యుడూ నీళ్లూ పరమ మిత్రులు. ఇద్దరూ భూమి మీదే ఇరుగుపొరుగున ఉండేవారు. సూర్యుడు నీటి
Long ago sun and water were very good friends. They lived as neighbours on the earth only. Sun
వద్దకు తరుచు వచ్చేవాడు. కానీ, నీరు మాత్రం సూర్యుని వద్దకు వెళ్లేది కాదు.
used to visit water frequently, but water seldom visited Sun.
ఇలా ఉండగా ఒకనాడు సూర్యుడు నీటిని అడిగాడు ‘మా యింటికి ఎందుకు రావు?’ అని. ‘నీ యిల్లు పెద్దది కాదు. నా
On one of the days, Sun asked water, “Why don’t you visit us?” “Your home is not big enough.
పరివారమంతా వస్తే చోటు ఉండదు. మేమంతా రావాలంటే, నీవు పెద్ద ఆవరణగల భవనం కట్టు. మా వారందరికీ దానిలో చోటు
If all my party comes there wouldn’t be enough places. If all of us have to come, you must construct
ఏర్పాటు చేయి!’ అని నీరు సమాధానమిచ్చింది.
a big house with a lot of place. Arrange place for all of us!” said water.
ఆ మాట విని సూర్యుడు ఇంటికి వచ్చాడు. భార్య చంద్రమ్మ నవ్వుతూ తలుపు తీసింది. సూర్యుడు ఆమెతో, తన మిత్రుడు
Listening that Sun came home. Wife Moon opened the door with a smile. Sun told her the word of
నీళ్లు చేసిన వాగ్దానం సంగతి చెప్పాడు. ఆమె సరేనన్నది. మరునాటినుంచి ఇల్లు కట్టడం ప్రారంభించారు ఇద్దరూ. ఇల్లు
water. She said right. Together they started constructing a house from the next day. As the work
ముగియగానే నీటిని ఆహ్వానించారు.
finished they invited water.

నీరు పరివారంతో వచ్చి, ‘నేను నీ యింట్లోకి రావచ్చా? ఇల్లు భద్రంగా ఉంటుందా?’ అని ప్రశ్నించింది సూర్య చంద్రుల్ని.
Water came with the entire retinue and said “can I enter your house? Will it be safe?”
‘రావచ్చు మిత్రమా! భయమేమీ లేదు!’ అన్నారు ఇద్దరూ. అప్పుడు నీరు సకల జలచరాలతోబాటు, లోపలికి ప్రవహించింది.
“ Oh! Friend! You can come. No fear at all!” Said both of them. Then the water flewin with all its
త్వరలో ఇల్లంతా మోకాటి బంటి నీరయ్యింది. ‘ఇంకా యిల్లు భద్రమేనా? మరికొంతమంది మావారు రావచ్చా?’ అని అడిగింది
aquatic life. Soon the house was filled with water up to the knees. “Is the house secure enough?
నీరు. ‘ఓ అలాగే’ అన్నారు సూర్య చంద్రులు. నీరు మరి కొంత ప్రవహించింది. ఇల్లంతా తలబంటి నీరు నిలిచింది. ‘ఇంకా నావారు
Can some more people come in?” asked the water. “Oh! Yes!” said Sun and Moon. Some more water
రావాలంటారా?’ అని అడిగింది నీరు. ‘సరే’ అన్నారు సూర్య చంద్రులు. మరేమీ తోచక నీరు మరింత జోరుగా ప్రవహించింది.
flew in. It reached the head level. “You feel some more of my team can come?” asked water.
సూర్య చంద్రులిద్దరూ ఇంటి కప్పుపై తేలాడేటంత నీరు నిండింది. మరల నీరు అడుగగా, సూర్య చంద్రులిద్దరూ అదే
Sun and Moon said “Yes” Unable to think, water flew in heavily. Sun and Moon were floating on the
సమాధానమిచ్చారు.
roof. Water asked again and Sun and Moon gave the same answer.
నీరు ప్రచండ వేగంతో పారింది. సూర్య చంద్రులిద్దరూ గత్యంతరం లేక ఆకాశంలో ఉండి పోయారు.
Water flew with heavy speed. Not finding an alternative, Sun and Moon remained in the sky!

Wednesday, November 5, 2008

A page from the diary

9-02-00
I sound very nostalgic and not very much happy with the situations in my musings written long back. There is no better person to invite change than me. I have always been keeping ahead of times. There are not many from my class who are savvy with a computer or internet. This is only an example.
In many things, I have the reputation of being a mixture of both old and new. When Andhra Prabha weekly was looking for an editor with a modern approach, they very much stopped with my name. I remember them saying that Gopal is a man with his heart in the past and mind in the future. My tastes are equally distributes in all the time lines. Classical musicians like many others keep lamenting about the falling standards. I see it as change.
In this entry there are more than one thing to comment upon. On that day perhaps, as usual, I was thinking about many things at once.
I have written about keeping the mind clean.
I have also talked about the milk processing in the past. Yes. Old methods are a favourite subject of mine. No qualms on that.

చిత్తము నిర్మలమయితే ఎదుటివాడు కుత్సితుడయినా నిర్మలుడుగానే కనబడతాడు. కొంతవరకు ఫరవా లేదుగానీ, ఆసాంతం అదే నయితే, చివరకు దారి గుంటలోకి చేరుస్తుంది. అలాగని నిరంతరం అందరినీ మన శతృవులుగానే భావిస్తూ, అందరినీ అనుమానిస్తూ కూడా గడవగూడదు.
ఈ భావం తరుచు చెప్పుకోవలసి వస్తున్నది.
(తరువాతి రాతకూ, పై మాటలకూ సంబంధం లేదు.)
దాలిగుంత అని ఒక ఏర్పాటు ఉండేది. అది అనారోగ్యానికి కూడా కారణమయ్యేదని ఇప్పుడనిపిస్తుంది గానీ, ఆ కాలపు పెరుగు గుర్తుకు వస్తే, ఏదీ ఆ కాలం అని ఆవేదన మొదలవుతుంది. నేలలో ఒక గుంట ఉంటుంది. అందులో పిడకలు పేర్చి, మధ్యలో ఒకటి రెండు నిప్పు కణికలు వేసి ఉంచాలి. కొంచెం రాజుకున్న తర్వాత పాలకుండ దాని మీద పెట్టి మీద చెక్క బోర్లించాలి. ఆ పాలు వెచ్చదనానికి నెమ్మదిగా కాగి, కాగి గోధుమరంగుకు దిగేదాకా చిక్కబడతాయి. సాయంత్రం కల్లా అడుగున వేడి పోతుంది. అప్పుడు పాలలో అక్కడే తోడు వేసి వదలడం. ఇక ఆ పెరుగు రుచి చెప్పనలవి గాదు. (ఆ లోపలి పొగకు, రుచికి ఏదో సంబంధం ఉందని ఇప్పుడనిపిస్తున్నది.)
ఈ కాలంలో లాగ మిల్క్ బాయిలర్స్, గ్యాస్ పొయ్యిలు, యు ఎచ్ టీ పాలు ఇవన్నీ లేవుగద. అంతా సావకాశంగా నడిచేది గద.
ఆరోగ్యం సంగతి ఎట్లున్నా, బ్రతుకు నాణ్యత గురించి, నిజంగా చర్చించవలసిన సమయమిది.
విభేదాలు అలుక్కుపోవడం, సంస్కృతి విషయంలోనయితే, ఎవరికీ ప్రత్యేకంగా గుర్తింపు మిగలదు.

Monday, November 3, 2008

Akka Kelavva, a haunting melody

అక్క కేళవ్వAkka kelavva, a haunting melody

I was almost addicted to radio and was used to listening all kinds of things till late in the night. I owe my taste in music and languages to radio!
One night I happened to listen to this song.. I was ignorant about the Vachana Sahitya in Kannada and the information that these Vachanas are sung by great masters. Saivite saints, starting with Basaveswara wrote these Vachanas and they are profusely sung by classical vocalists Akka Mahdevi is another saint who wrote great Vachanas and her works are examples of bridal mysticism. It is a rare thing that free verse poetry existing at that time. They called them Vachanas and not poetry. It is also rare that they are sung to classical ragas. In Telugu there are Vachanams. I don’t know if any musical renditions are there for them.

I was looking for the song everywhere, but could not find it.
This ocean called internet made things easier and I could once again listen to the wonderful rendition of the Vachana by .

Mallikarjuna Mansoor, a master singer of Karnataka who has made Hindustani Music all the more enjoyable.
I was told that he used to ride pillion on bicycle to the Radio station in Dharawad to perform a concert. You look at him, and you will never think that this is the man who can mesmerize people with his song!

I am a life time fan of Mansoorji and the song Akka kelavva.
I can understand a little bit of Kannada no doubt. But, to understand the philosophy of these Vachanas I read a lot about them.
Ultimately it so happened that I had to write a review of a book of translations of Vachanas into my mother tongue, Telugu.
The translation was by a great poet Sri K. Siva Reddy who also happens to be a friend.

Here I bring you the translation.
The original idea appears very simple. But as you understand there is a lot to it that evades our simple imagination. It is a wonderful example of bridal mysticism, I feel.

Literature of any genre has to be understood and enjoyed just like one enjoys a song. If a particular work is available in both forms the enjoyment is much more.
To me, the Vachanas as the word itself means appear nit exactly meant for singing. But the scholars of music having seen the value in them, made them immortal by rendering them musically.

అక్కా విన్నావా, నేనొక కలగన్నా
బియ్యము, వక్కా, తమలపాకూ, (తాటాకూ, కొబ్బరికాయా)చూచా,
చిన్నచిన్న జడల, (సుందర దంతాల)
గొరవడు, (ఇంటికి) భిక్షానికి రావడం చూచా,
మితిమీరిన మోహంతో (అతన్ననుసరించి,
పాణిగ్రహణం చేశా,)
చెన్నమల్లికార్జునుని చూచి, కళ్లు తెరిచా

Oh! Sister listen, I have seen a dream
I have seen rice, beetle nut, Beetle leaf, Palmyra leaf and coconut
With little plaits and beautiful teeth,
I have seen the Gorava come home for alms
With exceeding lust i have followed him and took his hand,
After seeing Chenna Mallikarjuna, I have opened my eyes.

Thus goes the translation. But, when I listen to the song, I find that there is redundancy of words in the translated version. I know that the translators were not exactly experts in Kannada. One of them did not even know the language. This translation was done in a workshop where a lot of material was given to them. They have mostly depended on an interpreter. That is how there are differences. I have searched for the Kannada script of this particular item. I failed. The words that I found redundant are kept in parenthesis. I look for some information on the matter.
I am sure people with musical ear will enjoy the song wholeheartedly. Please listen to the song.Enjoy Great Music!