Showing posts with label book. Show all posts
Showing posts with label book. Show all posts

Friday, October 2, 2026

సామల సదాశివ స్వరలయలు : ప్రారంభ వ్యాసం

 


Swaralayalu

పండిత్‌ నెహ్రూ మనదేశ ప్రధానిగా ఉండగా బి.వి. కేస్కర్‌ ప్రసారశాఖ మంత్రి. అతడు శాస్త్రీయసంగీతం బాగా తెలిసినవాడు. ఆ సంగీతం పట్ల వల్లమాలిన అభిమానం గలవాడు. అది అభిమానం మాత్రమే అంటే సరిపోదు. అదొక చాదస్తం. ఆ చాదస్తం వలన తన ఆధీనంలోని ఆలిండియా రేడియో కార్యక్రమాల కోసం కొన్ని విడ్డూరమైన ఆదేశాలు జారీ చేసినాడు. అందులో ఒకటి, ఆలిండియా రేడియో ఎప్పుడైనా శాస్త్రీయ సంగీతాన్నే ప్రసారం చేయాలె, అది హిందుస్తానీ అయినా పర్వాలేదు.

కర్ణాటక అయినా పర్వాలేదు. కానీ శాస్త్రీయంకాని కార్యక్రమాలు ప్రసారం చేయకూడదు. ముఖ్యంగా సినీ గీతాలు ప్రసారం చేయకూడదు. ఈ ఆదేశం ఎంత అందంగా వుందో చూచినారా! ఏ కొందరో వినేది శాస్త్రీయ సంగీతం. అధిక సంఖ్యాకులు వినాలని కోరేది సినిమా సంగీతం. మాస్‌ మీడియాను క్లాస్‌ మీడియా చేసే ప్రయత్నమిది. ఈ ఆదేశం కారణంగా రేడియోస్టేషన్లలో భద్రపరచబడిన ఎన్నెన్ని సినిమా పాటల రికార్డులు నష్టమైనాయో!

ఇంకొక ఆదేశం. హార్మోనియం విదేశీవాద్యం కనుక అది రేడియోస్టేషన్లలో వుండగూడదు, ఎంతటి గాయికా గాయకులైనా హార్మోనియం పట్టుకొని  రేడియోస్టేషన్లలో ప్రవేశించకూడదు. ఆ కాలంలో ప్రఖ్యాత గాయికా గాయకులు హార్మోనియం సహకారంతోనే గాన కచ్చేరీ నిర్వహించేవాళ్ళు. బేగం అఖ్తర్‌ కారణంగా, పండిత్‌ నెహ్రూ కారణంగా కేస్కర్‌ రేడియో స్టేషన్లకు హార్మోనియంను అనుమతించినాడు. ఆ ముచ్చట్లు తరువాత చెప్తాను.

మరొక ఆదేశం. ఎంతగొప్ప గాయికా గాయకులైనా రేడియోస్టేషన్లో పాడటానికి ముందు “వాయిస్‌ టెస్ట్‌” జరిపించుకోవాలి. అప్పటివన్నీ “లైవ్‌ ప్రోగ్రాములు” కనుక స్వరపరీక్ష చేయించటం సబబే అనిపిస్తుంది. కానీ వేల సంఖ్యలో వుండే శ్రోతల మధ్య కూర్చుండి మైక్‌ సహకారమున్నా లేకున్నా గంటలు గంటలు తమ సంగీతాన్ని వినిపించే ఆనాటి గాయికా గాయకులకు స్వరపరీక్ష నిర్వహించటమంటే వాళ్ళను అవమానించటమే. వాయిస్‌ టెస్ట్‌ పేరు వినగానే స్వరశ్రీ” కేసర్‌బాయి కేర్కర్ రేడియోస్టేషన్‌ నుండి తన కారు తిప్పుకొని ఇంటికి వెళ్లిపోయిందట. ప్రఖ్యాత సితార్‌ వాదకులు పండిత్‌ రవిశంకర్‌, ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌లు రేడియో స్టేషన్లను “బాయ్‌కాట్‌” చేసినారట. కేస్కర్‌గారి చాదస్తం వలన ఆలిండియా రేడియో స్టేషన్లన్నీ కళ తప్పినప్పటికీ శాస్త్రీయ సంగీత రసికులకు రకరకాల (ప్రసార కార్యక్రమాలు వీనులవిందు కలిగించినవి. ఇప్పటికీ ఆ సంప్రదాయం నడుస్తున్నది. ఆదివారం రవివాసరీయ ఫంగీత కార్యక్రంలో, శనివారం జాతీయ సంగీత కార్యక్రమంలో, నవంబర్‌నెల నడిమి నుండి నెలరోజులకు పైగా జరిగే ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో హిందూస్తానీ గాత్రం, వాద్యం, కర్ణాటక గాత్రం, వాద్యం వినిపిస్తూ సంగీత రసికులకు ఆనందం కలిగిస్తున్నారు.

ఆలిండియా రేడియోలోనే కాక కొన్ని టీ.వి. చానళ్లలోను హిందూస్తానీ శాస్త్రీయ సంగీత స్పర్శ గల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ముచ్చట్లలో నేను చెప్పదలచుకున్నది టీ.వీ. చానళ్లలో వచ్చే శాస్త్రీయ సంగీత స్పర్శ గల కార్యక్రమాల గురించే,

ముచ్చట్ల సందర్భంలో, బేగం అఖ్తర్ కారణంగా, పండిత్‌ నెహ్రూ కారణంగా, హార్మోనియం గురించిన తన ఆదేశాన్ని కేస్కర్‌ రద్దు చేసుకున్నాడని రాసి వుంటిని. ఆ ముచ్చట వినదగిందే.

హైదరాబాదు నిజాంను తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ళు విమర్శిస్తుంటారు. అతని గురించి నాలుగు మంచి మాటలెవరైనా రాస్తే సహించలేరు. అట్లాగే పండిత్‌ నెహ్రూను, ఇందిరాగాంధీని గురించి నాలుగు మంచిమాటలు రాస్తే అప్రసన్నులయ్యే వాళ్లు కొందరున్నారు. నిజాంను గురించి ఇక్కడ రాయను. నెహ్రూ కుటుంబం సంగీతానికి రేడియో చేయూత గురించి నాలుగు మాటలు రాస్తాను. బాధపడేవాళ్లను ఇంకా బాధపెట్టాలనే ఉద్దేశం కాదు నాది. నాలుగు మంచి మాటలంటే రాయటం న్యాయమే అని భావిస్తాను.

బేగం అఖ్తర్ దిల్లీ వెళ్లినప్పుడు సంగీత రసికుడైన అక్కడి ఆలిండియా రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ కొన్ని గజల్లు పాడవలసిందిగా ఆమెకు ఆహ్వానం పంపినాడట. ఆమె ఆమోదం తెలిపింది. ఆలిండియా రేడియో కార్యక్రమంలో ఆమె ప్రోగ్రాం ప్రకటించబడింది. ఆ ప్రకటన చదివిన ఇందిరాగాంధీ సాయంత్రం ఇల్లు చేరుకున్న పండిత్‌జీతో బేగం సాహెబా పాడుతుండగా రేడియోస్టేషన్లో కూర్చుండి వినాలని వున్నది అని చెప్పింది. పండిత్‌జీకి బేగం సాహెబా గజల్‌ వినటం సంతోషమేనాయె! వెంటనే ఫోనెత్తి కేస్కర్‌తో తాను ఇందిరాతో కలిసి ఆ రాత్రి బేగం సాహెబాను వినటానికి ఆలిండియా రేడియో స్టేషన్‌కు వెళ్తున్నట్లు చెప్పినాడు. కేస్కర్‌ రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌కు ఫోన్‌చేసి రాత్రి బేగం సాహెబా గజల్లు వినటానికి పండిత్‌జీ వెంట తానూ స్టేషన్‌కు వస్తున్నట్లు చెప్పి యేర్పాట్లు చక్కగా వుండాలని ఆదేశించినాడు. స్టేషన్‌ డైరెక్టర్‌ బేగం సాహెబా ప్రోగ్రాం రద్దయినట్లుగా తెలియపరచినాడు.

కారణమేమంటే రేడియో స్టేషన్‌కు హార్మోనియం తేవద్దన్నందున తన కార్యక్రమాన్నే రద్దు చేసుకున్నది బేగం సాహెబా,

మళ్లీ ఆమెను ఒప్పించటం ఎవరికైనా అంత తేలికకాదు. కేస్కర్‌ ఆదరాబాదరాగా స్టేషన్‌కు వెళ్ళి డైరెక్టర్‌తో మాట్లాడినాడు. బేగం సాహెబా దగ్గరికి వెళ్లి హార్మోనియంతో స్టేషన్‌కు రావలసిందిగా ఆహ్వానించినాడు.

అతని ఆహ్వానాన్ని గౌరవించవలసిన అవసరం ఆవిడకు లేదు. తన గజుల్లు వినాలని వండిత్‌జీ కోరుతున్నాడని వినగానే

ఆ కుటుంబం పట్ల గల గౌరవాన్ని పురస్కరించుకొని స్టేషన్‌కు వెళ్లటానికి సిద్ధపడింది. కేస్కర్‌ గారి గండం గడిచింది.

పండిత్‌ నెహ్రూ తండ్రి, పండిత్‌ మోతీలాల్‌ నెహ్రూ ఎక్కడికి వెళ్లినా బాయీజీల సంగీతం వినేవాడు. ప్రఖ్యాత సినిమానటి

నర్గిస్‌ తల్లి జద్దన్‌బాయి మోతీలాల్‌ నెహ్రూకు సన్నిహితురాలు. ఆమె పాడే గజల్లన్నా ఠుమ్రీలన్నా దాద్రాలన్నా మోతీలాల్‌ నెహ్రూకు చాలా ఇష్టం. ఇందిరాగాంధీ కూడా సంగీత సాహిత్యాల పట్ల ఆదరభావం కలది. చెప్పటానికెన్నో ముచ్చట్లున్నాయి. ఇక్కడొక ముచ్చట మాత్రం చెప్తాను.

ప్రదానమంత్రి ఇందిరాగాంధీ విరామసమయంలో టీ.వి. చూస్తూ కూర్చుంటే ఒక చానల్లో మధురమైన వీణాధ్వని వినిపించింది. మైసూర్‌బాణి, హంసధ్వనిరాగం. వాయిస్తున్న కళాకారుడు ఎస్‌.ఎన్‌. సూర్యనారాయణ. అతడు సుప్రసిద్ధ వైణికుడైన

వీణ నుబ్బన్న మనుమడు. ఆ వీణావాదనం ఇందిరాగాంధీకి ఎంతగా రుచించిందంటే అప్పటికప్పుడు ప్రసారశాఖమంత్రికి ఫోన్‌చేసి సూర్యనారాయణ వీణావాదనను అప్పుడున్న తొమ్మిది చానళ్లలో ప్రసారం చేయమని ఆదేశించింది.

ఒక టీ.వీ, ఇంటర్వ్యూలో ఎస్‌. ఎన్‌. సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందిరాగాంధీ కారణంగా సంగీత రసికులు దేశవిదేశాల్లో తన వీణావాదనం వినగలిగినారని, తన కార్యక్రమాలు దేశంలోని ప్రముఖనగరాల్లోనే కాక విదేశాల్లోను యేర్పాటవు తున్నాయని చెప్పినాడు.

సంగీత రసజ్ఞులకు రేడియోద్వారా శాస్త్రీయసంగీతం వినే సదుపాయం మొదటినుంచి వున్నదే. అయితే కేస్కర్‌ కారణంగా శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం వినే అవకాశం కలిగింది. ఇటీవలి కాలంలో దూరదర్శన్‌లోను, ఇతర టీ.వీ. చానళ్లలోను రకరకాల సంగీత కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. కొన్నాళ్ల క్రిందట ఏదో ఒక చానల్‌లో సోనూనిగం నిర్వహించే సరిగమ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా జరిగేది. చౌరసియా సతీమణి ఏదో చానల్‌లో ఒక సంగీతయాత్ర నిర్వహించింది. మొట్టమొదటి కార్యక్రమం బనారస్‌లో ఉస్తాద్‌ భిస్మిల్లాఖాన్‌ ఇంటర్వ్యూ, ప్రఖ్యాత నర్తకి ఉమాశర్మ జరిపిన ఇంటర్వ్యూ సాకల్యంగానూ మనోహరంగానూ వున్నది. స్వరసామ్రాజ్ణి గిరిజాదేవి ఇంటర్వూ కూడా అంతే మనోహరంగ జరిగింది. ఠుమ్రీలతో పాటు ఆ కార్యక్రమంలో ఆ విదుషి ఒక 'కప్పా” చక్కగా పాడి వినిపించింది. షోరీమియా అనే సంగీత శాస్త్రజ్ఞుడు రూపొందించిన గాయనశైలి “ఠప్పా”. ఠప్పాను పాడే కళాకారులంతగా లేరిప్పుడు. గిరిజాదేవి, సుమతీ ముటాట్‌కర్‌, మాలినీ రాజూర్‌కర్‌ లు పాడిన ఠప్పాలు విని ఆనందించగలిగినాము. ఏ కారణం వల్లనో చౌరాసియా సతీమణి ప్రారంభించిన కార్యక్రమాలు త్వరలోనే ముగిసినాయి.

ఈ మధ్య మూడురకాల కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అన్నీ జి-మరాఠీ చానల్‌లోనే. నిన్నటి గాయికా గాయకులను అనుకరిస్తూ కొందరు పాటలు పాడుతున్నారు. పాడే వాళ్లలో స్పర్థ యేర్పడుతున్నది. న్యాయనిత్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.

నిన్నటి గాయికా గాయకులు పాడిన పాటలను తమ కంఠంతో పాడాలి కాని కాపీ చేయవద్దంటారు న్యాయనిర్దేతలు. అదంతా

ఆహ్లాదకరమైన గాయన వ్యాపారమే. సాధారణంగా నాలుగు స్వరాలుండే ఆ కార్యక్రమం “సరేగమప, మనం “సరిగమ” అంటే మహారాష్ర్రులు “సారేగమ” అంటారు. ఇంకో కార్యక్రమం పేరు సుర్‌తాళ్‌ మనం “స్వరము” అంటాము. అది తత్సమం. సూర్‌ అంటారు. మరాఠీభాష మహారాష్ర్ట ప్రాకృత జన్యం.

మరొక కార్యక్రమం ఆలాప్‌ తెల్లవారగట్ల 5.30 కు ప్రారంభమవుతుంది. అరగంటసేపు ప్రాతఃకాల రాగాలు వినవచ్చు. గాత్రంలో వినవచ్చు, వాద్యంలో వినవచ్చు. ఇంకొక కార్యక్రమం “ఏకాపేక్షాఏక్‌” అంటే ఒకరికంటే మరొకరు అని అర్ధం. ఈటీవి ఉర్దూ చానల్‌లో “గజల్‌సరా” అనే కార్యక్రమాన్ని మహమ్మద్‌ వకీల్‌ నిర్వహిస్తున్నాడు. న్యాయనిర్ణేతలుగా ఎవరెవరో వస్తున్నారు. ఇద్దరు మాత్రం స్థిరంగా వున్నారు. ఒకరు ప్రసిద్ధ గజల్‌ గాయిక దేవీ రమణమూర్తి. ఆమె సుప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి గారి కుమార్తె. ఇంకొక న్యాయ నిర్దేత హైదరాబాదు నగరానికి చెందిన సీనియర్‌ గజల్‌ గాయకుడు విఠ్ఠల్‌రావు.

నేను ప్రస్తావించిన కార్యక్రమాలన్నింటి గురించి వివరాలు రాయటానికి ముందు విఠ్ఠల్‌రావు గారిని గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలె. హైదరాబాదును పరిపాలించిన ఏడవ నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌ కడమ స్వదేశీ సంస్థానాలలోవలె తన దర్బారులో గాయకులను నియమించలేదు. చివరికి పండిత్‌ జస్‌రాజ్‌ తండ్రి పండిత్‌ మోతీరాంను దర్భారీ గాయకుడుగా నియమిస్తూ ఫర్మాన్‌ విడుదల చేసినాడు నిజాం. కానీ ఆ పీఠం మీద కూర్చుండక ముందే పండిత్‌జీ దివంగతుడైనాడు. ఆ పీఠం అలా ఖాళీగానే వుండిపోయింది. నిజాంకు సంగీతం బాగా తెలుసు. ఈ పత్రిక పుటల్లోనే రామ్మోహన్‌ నాయుడు రాసిన ఒక ముచ్చటను ఇక్కడ రాస్తాను.

ప్రతి శుక్రవారం నిజాం నవాబు సాధారణంగా పలబ్లిక్‌గార్డెన్‌లోని మసీదులో నమాజ్‌ చదివేవాడు. హైదరాబాదులో వున్నప్పుడు మేమాదృశ్యాన్ని చాలాసార్లు చూచినాము. ఒక శుక్రవారం నిజాం నవాబు తన పాత కారు దిగి మసీదువైపు నడుస్తుండగా ఫతేమైదాన్‌ లోంచి మధురమైన గజల్‌ గాయనం వినిపిస్తున్నది. ఆ సంగీతాన్ని క్షణకాలం విన్న నిజాం “అక్కడెవరో పాడుతున్నాడు. వెంటనే నాముందు ప్రవేశపెట్టండి” అని పోలీసులను ఆజ్ఞాపించినాడు. నిజాం కంఠంలోని అప్రసన్నతను గమనించిన అక్కడి అధికార్లు నమాజ్‌కు భంగం కలిగేటట్లు ఈ సమయంలో సంగీతం పాడుతున్న వాడెవడోగానీ, వానికెలాంటి శిక్షపడుతుందో అని లోలోపల భయపడుతున్నారు. ఆ గాయకుడు నిజాం సమక్షాన హాజరు పరచబడినాడు.

ఏమిరా! బేవఖ్త్ కీరాగీజీ అన్నట్లు భాగేశ్రీ రాగాన్ని పట్టపగలు పాడుతారా!” అని మందలించినాడు. తనకంటే చిన్నవాళ్లతో నిజాం మాట్లాడే పద్ధతే అది. హడలిపోయిన ఆ గాయకుడు చేతులు జోడించి “సర్కార్‌! నేను పాడుతున్నది భాగేశ్రీ

రాగమే కాని ఇప్పుడు పాడటం లేదు. రియాజ్‌ చేస్తున్నాను. రాత్రి ఒక నవాబు గారింట ఈ గజల్‌ పాడవలసి వున్నది” అని మనవి చేసుకున్నాడు. నిజాం నవాబు సంతుష్టి వ్యక్తం చేసి, సరే మంచిది. రియాజ్‌ సాగించు ఎప్పుడైనా కింగ్‌ కోఠీకి వచ్చి

మాకు వినిపించు” అని ఆజ్ఞాపించినాడు. వెంట వున్న అధికార్లు అతని పేరూ, అడ్రసు రాసుకున్నారు. అతనిపేరు విఠ్ఠల్‌రావు. ఈ ఘటనతో అతని కీర్తి నగరమంతా వ్యాపించింది.


Saturday, September 5, 2026

లోకాభిరామం : నవలా తరంగం - శిలాహాసం On a Tamil novel by LaSaRa

 


నవలా తరంగం - శిలాహాసం

నాకు పుస్తకాలు కొనే అలవాటు ఉంది. లేదు. నాలుగయిదు భాషలు చదువుతాను. కనుక నేను కొనదలచుకున్న పుస్తకాలకు సరిపడేన్ని పైసలు నా దగ్గర లేవు. కొన్న పుస్తకాలకు తగిన స్థలం ఇంట్లో లేదు. అయినా, ఫుట్‌పాత్‌ మీద మొదలు, పెద్ద అంగళ్లలో వరకు పుస్తకాలను చూస్తూ తిరగడం మాత్రం మానలేదు. అట్లనే వాల్డెన్‌ అనే ఒక అంగట్లోకి పోతిని (ఈ వాల్డెన్‌ అనే మాటకు అడవులు అని అర్థం ఉందని నా అనుమానం! జెర్మన్‌!) అక్కడ బెస్ట్‌ సెల్లర్స్‌ ఉండనే ఉంటయి. వాటి గురించి ఫ్లిప్‌కార్ట్‌, క్రాస్‌వర్డ్‌ వంటి వారంత ఊదరగొడుతునే ఉంటరు. వాల్డెన్‌లో ఒకచోట కొన్ని పుస్తకాల ధరలు తగ్గించి అమ్ముతున్నట్లు కనిపించింది. అనుకోకుండా అందులో ‘కథ’ అనే సంస్థ వారు వేసిన మంచి పుస్తకాలు కనిపించినయి. ఒకటి అనుకున్నవాణ్ని, అయిదు పుస్తకాలు తెచ్చి కూచుని చదివిన. అవన్నీ తమిళ రచనలకు ఇంగ్లీషు అనువాదాలు. వాటిల్లో ఒకటి రెండు చిరు నవలల జమిలి పుస్తకం.

రచయిత పేరు ‘లాసరా’ అని ఉంది. లోపల వివరంగా చూస్తే ఆ పెద్దాయన పేరు లాల్‌గుడి సప్తర్షి రామామృతం అని అర్థమయింది. (ఈ తమిళుల తస్సదియ్య సంస్కృతాన్ని కొమ్ములు విరిచి, చెవులు నులిమి ఎంత చెయ్యాలెనో అంత చేస్తరు. పేరును ‘లాల్‌గుడి సప్తరిషి రామామిర్తం’ అని రాసుకున్నారు. ఈ పుస్తకంలో లాసరా రాసిన రెండు చిరు నవలలున్నాయి. ఒకటి కల్‌ సిరిక్కిరదు, అంటే రాయి నవ్వింది, రెండవది ప్రాయశ్చిత్తం. ఈ రెండూ కలిసి నిజానికి ఒకటే నవల. మొదటి నవల అనువాదంలో 72 పేజీలు చదివి వదిలేస్తే, బాగనే ఉంది. తరువాతి నవల 80 పేజీలు చదివిన తరువాత మరింత బాగుంది. ఈ కథలో రాయి అంటే అమ్మవారి విగ్రహం. ఆమె మొదటి కథలో నవ్విందేమో తెలియదు. రెండవ భాగంలో ఆ సంగతి అర్థమవుతుంది. కమలాంబిక నవ్వుతుంది. కానీ, ప్రాయశ్చిత్తం ఎవరికి, ఏమో తెలియదు. రెండవ భాగంలో నిజానికి కొత్త పాత్రలు కొన్ని వచ్చి కొంప ముంచింది లేదు. కానీ, కథ ముందుకు సాగుతుంది. ప్రాయశ్చిత్తం తరువాత కూడా కథ మరింత ముందుకు నడుస్తుందేమో? నడిస్తే బాగుండునన్న భావం మిగులుతుంది. ఈ రెండు చిరు నవలలను కలిపిన నవల గురించి వ్యాఖ్యానించడానికి నాకు మనస్కరించడం లేదు. అయినా వాటిని గురించి అందరికీ చెప్పాలన్న భావం మాత్రం బలంగ మిగిలింది. ఈ రచయిత మరో బోలెడన్ని నవలలు, కథలు రాసినరు. అందులో కొన్ని ఉచితంగ నెట్‌లో అందుబాటులో ఉన్నయి. నాకు ధారాళంగ తమిళం చదవడం రాదు. ఎవరయినా చదివి వినిపిస్తే అర్థం చేసుకోగలను. లాసరా రచనలు కడు సరళంగ సాగుతయి కనుక మరింత సులభంగ, అర్థమవుతయని నమ్మకం. ఇంతకు ఒకటి రెండు సందర్భాలలో తమిళం చదువు అభ్యాసం చెయ్యలేదే, అని అనిపించడం వాస్తవం. ఈ అనువాద నవల చదివిన తరువాత ఆ భావం మరింత బలంగ మరోసారి కలిగింది.

నవలలో ధర్మరాజన్‌ గారని ఒక నడివయసు కూడ దాటిన పెద్దాయన నాయకుడు. ఆయనను ఆదర్శంగ చూడడమా, మెచ్చుకోవడమా, జాలి పడడమా, అసహ్యించుకోవడమా, మనకు, కనీసం నాకు అంతుపట్టలేదు. ఇటువంటి ఒక పాత్ర మరెక్కడో ఒక్కచోట మాత్రం ఎదురయిందని అనుమానం. ‘తెరచిరాజు’లోనా?

కథాక్రమంబెట్టిదనిన: నాకు కథ చెప్పాలనిపించడం లేదు. అంత కలగాపులగంగ గుర్తొస్తున్నది. అది కావాలని, రచయిత పన్నిన పన్నాగమని నాకర్థమవుతున్నది. ధర్మరాజన్‌కు తలిదండ్రులు లేరు. పెద్దనాయన దగ్గర బుద్ధులు నేర్చి, ఆయన చెప్పినందుకు ప్రపంచం మీద పడతడు. మంచి ఉద్యోగమే చేస్తడు. కానీ, వ్యక్తిగతంగ నాకులాగే, ఎక్కడా నిలకడ లేదు. ధర్మరాజన్‌ను చూచి అందరూ గౌరవిస్తరు. తలకెత్తుకుంటరు. ఆయన మాత్రం జారిపోయి కష్టాలలో మునిగిపోతడు. ఆయన దగ్గర ఉద్యోగం చేసిన ఒక అమ్మాయి, వివాహిత, ఆమెకు కొడుకు కూడ ఉంటడు. కానీ, ఆమెకు సుఖం లేదు. మొగుడు ఎందుకూ పనికిరాని సన్నాసి. ఆ అమ్మాయికి, ధర్మరాజన్‌కు బిడ్డ-తండ్రి వంటి ప్రేమ. ధర్మరాజన్‌కు ధర్మత: కమలాంబిక గుడిలో పూజారితనం హక్కుగ ఉంటుంది. అక్కడ పెదనాయన కొడుకు ఉన్నడు. పని చేయడం ఇష్టమే. పైసలు మాత్రం వద్దు. ఒక మార్వాడీ ఇంట్లో వంటవానిగ పనికి చేరుతడు మన నాయకుడు. కథలోని అమ్మాయి నగలు ఆ మార్వాడీ దగ్గర కుదువబెట్టి ఉన్నయి. వాటినీయన దొంగిలిస్తడు. సేఠ్‌ చని పోతడు. మన హీరో జెయిలు పాలవుతడు. తిరిగి బయటకి వస్తడు. కథ సాగుతుంది.

చెప్పిన గద, కథ చెప్పాలని లేదని! సినిమాకు కుదరదేమో గానీ, టీవీ సీరియల్‌కు బాగ పనికివచ్చే రచన యిది. ఇన్ని మలుపులు, ఇన్ని రకాల పాత్రలు, మామూలుగ మనకు నవలల్లో కనపడవు! ఇంగ్లీషు, నవలలు చదవడం అలవాటున్న వాండ్లందరు, ఈ పుస్తకం సంపాయించి చదవాలని నాకనిపించింది. ఇది గొప్ప నవల కాదు. గొప్ప నవల అంటే ఎట్లుంటుందో నాకు తెలియడము లేదు. ఆ చర్చలోకి పోయే సంకల్పము ప్రస్తుతము లేదు. కానీ, లాసరా రచనలు అందరూ చదవదగినవి. ఈ మాట నేననడం లేదు.

డా.గాబ్రియేలా అయిషింజర్‌ ఫెరొ-లుజీ అనే భాషావేత్త, ద్రావిడ భాషల గురించి పరిశోధించినరు. ఆమె ఈ రచయితను ఆకాశానికెత్తింది. ఆమె చెప్పిన ఒక సంగతి మాత్రం నాకు ముఖంలో గుద్దినట్లుగ తగిలింది. లాసరా ప్రతీకలను అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మల బ్రతుకు తీరు, వారి సంప్రదాయాలు తెలిసి ఉండాలంటుంది ఆమె. శ్రీపాద గురించి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ఈ మాట ఎవరయినా అని ఉండవచ్చు. అనకున్నా, ఇప్పుడు నేనంటున్న. ఈ మహా రచయితల ఎక్స్‌ప్రెషన్‌ సిసలయిన బాపనితనం నిండినదే.

ఒక రచయిత నాలుగయిదు రచనలు చదివితే, రచయితను గుర్తించగలగడం నిజంగా ఒక ఫీటు. లాసరా విషయంలో ఇది నిజమంటారు మరో తమిళ విమర్శకులు. లాసరా కాస్త కఠినమయిన రచయిత. ఆయన చెప్పినదంత అర్థమయిందని నేను అనలేను అంటారు గాబ్రియేలా! ఆయన వాక్యాలు సింపుల్‌కన్న సింపుల్‌. భాష తప్పకుండా సింపుల్‌. ఎక్కడ ప్రయత్నించినా కాంప్లెక్సిటీ కనిపించదు. కానీ, ఆ పాత్రలు, అవి చేసే పనులు, అనే మాటలు మనలను ఆలోచనల్లో ముంచుతయి. ధర్మరాజన్‌ ఒకనాడు దారి పక్కన కూచుని, ముందు ఉత్తరీయం పరిచి, పిల్లంగ్రోవి మీద సంగీతం వాయించడం మొదలుపెడతడు. ఆయనకు ఆ పని చేయవలసిన అవసరం ఏమి? అర్థంకాదు. కానీ, దాంతోనే ‘ప్రాయశ్చిత్తం’ మొదల వుతుంది. ‘చదువరులారా, రండి. కన్నీళ్ల కలయిక, నదులన్నిటి సంగమంకన్న గొప్పది. అక్కడ ఇక మన అవసరం లేదు. మనం వాళ్లని వదిలేద్దము! సరేనా!’ అంటూ ముగుస్తుంది రెండవ నవల, తరువాత కమలాంబ నవ్వుతుంది!!

అనువాదం: అనువాదం విషయంలో ఎందరో పెద్దలు సిద్ధాంతాలు చేసినరు. నాకవేవీ పట్టలేదు. నా సిద్ధాంతాలు నేను చేసుకుని కొన్ని అనువాదాలు చేసిన. తిట్లు దీవెనలు, రెండూ తిన్న. నన్ను అర్థం చేసుకోలేని వారున్నరని అర్థమయింది. అనువాదం చేస్తున్నది కాల్పనిక సాహిత్యమయితే, మూల రచయిత, దయ్యమయి మనకు పట్టాలె. వారి శైలి కూడ విషయమంత బలంగ, అనువాదంలో ప్రతిబింబింప వలె. ఇది నా పద్ధతి. కల్‌ సిరిక్కిరదు, తమిళ ప్రతి చదవడానికి ప్రయత్నించిన తరువాత, పద్మా నారాయణన్‌ అనువాదం బాగుందని తోచింది గాని, భాష, భావం కలయిక, అంటే అభివ్యక్తి మూలానికి ఎంత సమీపంగ ఉన్నదీ తెలియలేదు. అనువాదం చదువుతుంటే, అడుగడుగున, మూలభాష గుర్తుకు రావాలని నాకనిపిస్తుంది. రచన అసలయిన ఇంగ్లీషు ఇడియంతో సాగుతుంటే నాకు అసౌకర్యంగ తోస్తుంది. ఈ విషయం గురించి చాల మందితో, చాల చర్చించిన. ఇంకా అది కొనసాగవలసి ఉంది.

ప్రాయశ్చిత్తం: తిరిగి గోమతి యింట్లో, ఆయన తన పెట్టెను పరీక్షించాడు. తాళం బదులు ఒక తీగ చుట్టి ఉంది. తన బట్టలన్నీ ఉన్నాయని గమనించాడు. కాఫీ ఫిల్టరు, స్టీలుగ్లాసు కూడా. పాస్‌బుక్‌, ఎఫ్‌డీ రసీదు, చెక్కుబుక్కు లేవు. పోలీసు వాళ్లు తీసేసుకుని ఉంటారు. ఒక వస్తువు కంటికి కనపడింది. అది గుడ్డలో చుట్టి ఉంది. ఆకారం వల్ల అదేమిటో తెలిసింది - తన పిల్లంగ్రోవి. ఆయన దాన్ని తీశాడు. శుభ్రంగా తుడిచాడు, కళ్లతో తడిమాడు.. ఆయన తన పరిసరాలను మరిచిపోయాడు.

మూడున్నర సంవత్సరాలు... మొదటి స్వరపు తీయని గాలి వెలికివచ్చి గుండెను తడిపింది. ఆయన సర్వస్వాన్ని ముంచెత్తింది. లోపల ఒక పచ్చని చిగురు తలయెత్తింది.

అక్కడ రచయిత రాసిన మాటలు మనసులో కుచ్చుకుంటయి. అదే రచన యొక్క సక్సెస్‌కు గుర్తింపు. అట్లని రచన గొప్పది కానవసరం లేదు.

ఈ జమిలి నవల నిజంగా ఒక మసాలా మిక్స్‌! కానీ మసాలా నవల్లో ఇలాంటి మాటలుంటయా? ఏమో?


Monday, March 9, 2026

Thursday, October 16, 2025

లోకాభిరామం సన్నాయి నొక్కులు (Sannayi Nokkulu) Telugu Column Article ...

లోకాభిరామం   

సన్నాయి నొక్కులు 

సన్నాయి అనే నాదస్వరం గురించి నా వ్యాసం


Sunday, September 7, 2025

The Flute - A short story of Adivi Bapiraju (rendered into English)

The Flute

A short story of Adivi Bapiraju 

(rendered into English by K B Gopalam)


The Flute

Adivi Bapiraju

 

The sounds of the boy's flute filled the bunds of the fields, crops, canals and the hills at a distance.

He had no knowledge of the ragas (musical scales) nor had he learnt about the swaras (musical notes). His mentors were – the koel, the carpenter bee, the mountain brook, the mooing of the cows, the gentle breeze floating over the fields, the thunder, the beetle and the Lavangi birds.

A naturally gifted flautist, he had a great sense of music though ignorant of musicology, its theories, principles and terminology. Comparing notes and notes, he would tune the shruti (pitch). His breath kept the laya (rhythm & tempo). Only three talas (beats) emerged from his rhythm & tempo – they were Adi, Eka and Roopaka.

The melodic patterns (moorchanas) he conjured up were simply out-of-the-world combinations.

2

He was a cattle grazer and nine years old. After eating yesterday's remnant rice and gruel with salted fish as side dish, he put some of the rice gruel in a small pot and a pickled piece of raw mango, covering it with a plate. Wrapping the lunch-pot in a piece of cloth, he reached the river bund riding a buffalo.

The shade of the neem tree was his throne; his cattle were his subjects, and his weapon was his flute!

A tattered loin cloth and an equally torn head scarf were his silken attires. Whenever it rained, he made a couple of buffalos stand close together and sat down under them. When the river swelled, he crossed it on the buffalos. Cows and buffalos were his armed guards. Equipped so, he could stand up even to a tiger.

3

Once he reached the grazing field, he bade them go on their own and settled himself under the tree, playing and singing.

He pulled out the flute and played on it to mesmerize the world. The lyrics for the songs were his heart itself.

Sometimes his song jumped and pranced. It flowered and spread gentle fragrance all around and bubbled up like the waters of a little spring.

Sometimes his song looked at the world and wondered, paled or shivered.

Another time his song searched for something. It gazed at the sky keenly; pierced the depths of the earth, and counted the water drops in the river.

At times it went into tears. It curled with some unknown fear, sulked with hunger and took on the form of the entire gamut of human suffering and wept.

Yet another time the song assumed the all-knowing lotus yogic posture and offered grass flowers in supplication. Also, it probed the depths like a fish in the water.

Kissing the flute with his lips, the boy turned into one who lost cognizance of his own handiwork.

4

One day from an adjacent farmland, a girl worker came looking for him following the song.

She was eight. She sat still before him listening to the song.

She did not divide his kingdom or usurp it.

She became one with his kingdom, with his song and with him.

She would come every day by his song time and sit there before him.

The tattered cloth on her midriff did not cover her nakedness completely. She had a pair of bangles on her arm, and two aluminum anklets on her legs.

If the boy's face was the image of the sun, her face was the lotus in the side-by-pond.

5

One day when he played on the flute, the whole world listened to it under a spell. And the girl turned into that very song.

In the meantime, some monstrous bird hovered in the sky with an earth-shattering sound. Stunned with the sound, the boy stopped playing and fell at once to the ground. The girl flew to his side. Shivering and wailing, she embraced him.

The demon bird flew away. After a while the two naïve kids got up and surveyed around with bleary eyes.

His cows and buffalos grazed as usual. Flowers were in bloom. The neem tree stood outspread just as before. The brook flowed on gurgling.

He mustered up courage to pick up the flute and once again harmonized the three sacred notes into a cadence that questioned this universe. The girl continued to cling to him.

Far away in Europe, there was a war raging. Japan let itself loose on Pearl Harbor.

The boy came out of the impact. Matching the pitch of the daily visitor demon birds, he played a new combination to which the girl listened, smiling and captivated.

Tuesday, August 19, 2025

లోకాభిరామం - పద్యంవిద్య - Lokabhiramam - Padyamvidya

లోకాభిరామం - పద్యంవిద్య



నా పుస్తకం నుంచి మరో వ్యాసం - మీ కోసం

పద్యంవిద్య

రాస్తారా అన్నప్పుడు,

చూస్తానంటే తప్పని, రాస్తానన్నా!

రాస్తే ఏమవుతుందో,

చూస్తాననుకున్నానూ, రాస్తున్నాను!

- ఇది కంద పద్యమేనా? ఏమో? నాకు తెలియదు. రాశాను, అంతే.

నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు, ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటుంటే, పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు. వచనం (కథ, నవల, వ్యాసం) రాయడం గాల్లో విమానం నడపడం లాంటిదనీ, పాట రాయడం, రోడ్డు మీద కారు నడపడం లాంటిదనీ అన్నారాయన. ఇక పద్యం, పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే, వెళ్లవలసిన చోటికి అదే వెళుతుంది! అన్నారాయన. ఏ పనయినా అంతే, చేతనయిన వారికి, చాలా సులభంగానే కనపడుతుంది. మిగతా వాళ్లకది చెక్కల బావిలో మోటార్‌ సైకిల్‌ నడిపినట్లుంటుంది.

చెక్కలతో బావి కట్టి, అందులో గోడల మీద, సైకిల్‌, మోటార్‌ సైకిలూ, నడిపిన గురుభిక్‌సింగ్‌ ప్రదర్శన నాకు ఇన్నేళ్లయినా గుర్తుంది. ఆయనకదే బతుకు. (బహుశ: దాని అంతం కూడా!) ఎట్లా నడుపుతారు, అంటే, ‘ఓస్‌! సులభం’ అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు. కనుక, నాతో మొదలు ఎవరయినా ప్రయత్నించవచ్చు. జారిపడినా దెబ్బలు తగలవు!

చిన్నప్పుడు, అదెందుకో, ఏమిటో తెలియకుండానే, శతకాలకు శతకాలు భట్టీయం (ఇది నోటికి నేర్చుకునే విద్య!) వేయించేవారు. ఇది పక్కనే పెడితే, మా ఊరి బడి ఒక సెంటర్‌ స్కూలట. సెంట్రల్‌ కాదని మనవి. చుట్టుండే అయిదారు పల్లెలకు అది కేంద్రమని అర్థం! ఆ బడులలో పంతుళ్లు వచ్చి ఒక ‘సెంటర్‌ క్లాస్‌’ అనే కార్యక్రమంలో ‘మాదిరి తరగతి’ అనే మాడల్‌ క్లాసులు నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కనబెడితే, ఈ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదూ? నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం, పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు, కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులాగుంది. వాళ్లంతా, నట్టుతూ, ముక్కుతూ మూడు నాలుగు పద్యాలు చదివి, అలసి ఆగిపోయారు. నేను మాత్రం, వద్దన్నా ఆపకుండా, మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. అది మూడవ, నాలుగవ తరగతిలో ఉన్నప్పటి మాట!

సినిమా పద్ధతిలో సీన్‌ కట్‌ చేస్తే, ఎనిమిదవ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్లు గారు తెలుగు చెపుతారు. చాలా బాగా చెపుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ, అంటే పదాలను విడగొట్టి చూపడం, తరువాతి అంచె. అర్థం చెప్పడం, సమన్వయం, ఆ తరువాత జరుగుతాయి. పద్యాన్ని మరో సారి చదువుతారు. అప్పుడు పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా, ఒక క్రమంలో కూచుంటారు గదా! రెండు బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి. అందులో మొదట్లోనే నేను ఉండేవాణ్ని! అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే, ఆ పద్యం చదివేవాణ్ని! అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలాకాలం నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి? క్లాసులో ఉండే ఆడపిల్లలలో ఇద్దరు, ఇదంతా నచ్చలేదనుకున్నారు. ‘మీరు ఏ పద్యం చెప్పబోతున్నారో ముందే వాడికి చెపుతారు. వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు! బడాయి!’ అన్నారు. ఆచార్లు గారికి నేనంటే, ఆనాటికీ, ఈనాటికీ అభిమానమే. ‘ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంత సేపు, అతను పద్యం మనసులో మననం చేసుకుంటాడు. మీరు చేయరు. అంతే!’ అన్నారు. సిలబస్‌లో లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ, వంతు రాగానే, నేను పద్యం అప్పజెప్పాను. పుస్తకం లేకుండానే! ఆ తరువాత ఏమయిందో నాకు గుర్తులేదు.

బడిలో నాతోబాటు పద్యాల పోటీలో పాల్గొన్న మిత్రుడు, బంధువు విష్ణు, చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్లిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవరికీ ఇవ్వరు. పేరుతోబాటు ఒక నంబరేమయినా ఉండేదేమో? గుర్తు లేదు. ఫలానా శర్మ, కేరాఫ్‌ 56, ఎ.పి.ఓ. అని రాస్తే చాలు, ఉత్తరం వెళ్లిపోతుంది. ఏపీఓ అంటే ఆర్మీ పోస్ట్‌ ఆఫీస్‌ అని తరువాత తెలిసింది. (తెలిసిందా?) 56 అంటే విష్ణు ఉండే చోటయి ఉంటుంది. ఈ సంగతంతా పక్కన పెడితే, ఒకసారి ఉగాదికో, సంక్రాంతికో వాడికి ఇన్‌లాండ్‌ లెటర్‌ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు. వాడి దగ్గర గానీ, ఉందేమో ఉత్తరం, అడగాలి!

చిన్నాయనగారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో ‘వసుచరిత్ర’ పాఠం చెప్పారు. ఇంట్లో, సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యవిద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ, ఎందుకో అది కుదరదు. దేనికదే వేరువేరుగా ఉండిపోతయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర, ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. ‘అన విను, గృహస్థ రత్నంబ! లంబమాన రవిరథతురగ..’ అంటూ వచనమంతా ఒక్క పట్టున అప్పజెబితే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అప్పకవీయం పరిచయమయింది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకమది. నిడుదలు, జడ్డక్కరములు, పిరుందకడ యూదిన యక్కరముల్‌ గురువులు. కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్‌తో గణములు, గణముల కాంబినేషన్స్‌తో వృత్తములు, పద్యములు. తరువాత డి.ఎన్‌.ఏ. గురించి చదువుతుంటే నాకిదంతా గుర్తుకు వస్తుండేది. ‘జరల్‌ జరల్‌ జగంబుకూడి సన్నుతిన్‌ రచింపగా, పరాజితార ధీరవీర పంచచామరంబగున్‌!’ పంచచామరం అనే పద్యం లక్షణం పంచచామరంలో!

రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్‌వ్యూహము. ‘రామాండెమంటే, సామాండెమా? గొల్లేశమంత కథ!’ అని ఒక మాట. రామాయణం సామాన్యం కాదు! బయలాటలో వచ్చే గొల్లవేషమంత ఉంటుందని, అన్న మనిషి భావం! ఈ ఇంటర్‌వ్యూహము కూడా గొల్ల వేషమంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము గనుక, అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది గనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్సుకు సంబంధించింది. ముగ్గురు నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతయినంత వరకు నేనూ వారి బుర్ర తిన్నాను. కైసర్‌ కలందర్‌ గారని ఒక అందమయిన పెద్దాయన, కమిటీ అధ్యక్షులు. ‘సైన్సు సరే! హాబీలేమిటి?’ అని అడిగారు. ‘తిండి, అమ్మాయిల’ గురించి చెబితే కుదరదు. కనుక ‘సంగీతం, సాహిత్యం’ అన్నాను. ‘ఒక పద్యం చెప్పగలవా?’ అన్నారాయన. ‘కలడుల్లోక మహా మహోగ్ర’ అంటూ వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్‌ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక్క సంస్కృత సమాసం మరి! ‘అర్థం చెప్పగలవా?’ అన్నారాయన. ‘ఓ యస్‌’ అన్నాను. భయపడ్డారేమో, ‘వద్దులే’ అని మరేదో అడిగారు. నాకా ఉద్యోగం ఇస్తారని అక్కడే అర్థమయింది. అది మరో గొల్లవేషం కథ!

మళ్లీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి, ఆలోచన ఏదయినా వస్తే వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేనూ జవాబుగా ఒక కార్డు రాసేవాణ్ని. ఒకసారి ఆయన రాయవలసిందేదో రాసి, కార్డు వెనుక చిరునామా రాసేచోట పక్కన ఖాళీలో రెండు పద్య పాదాలు రాశారు. ‘శాంతి సంగరంబు, స్వాతంత్య్ర సమరాన, సగము కాలినట్టి సమిధ నేను’ అని మాత్రం రాశారాయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేనూ అదే పద్ధతిలో ‘కడమ సగముగాల్చి కవితా ప్రపంచాన, కారు చీకట్లను పారద్రోలె!’ అని రాసి పంపాను. నమ్ముతారో లేదో? కార్డు అందిన మరుక్షణం ఆయన ఆఘమేఘాల మీద వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. ‘తెలుగు పద్యం’ గురించి నేను వేస్తున్న పుస్తకంలో, నీ పద్యం ఉండాలి!’ అన్నారు. పద్యం లేదు. అదే వేరే సంగతి!


Tuesday, August 12, 2025

Lokabhiramam - Goppavaru - Goppa Ooru (గొప్ప వారు - గొప్ప ఊరు)

Lokabhiramam 


లోకాభిరామం


Goppavaru - Goppa Ooru 
(గొప్ప వారు - గొప్ప ఊరు)


మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా?’ ప్రశ్న
‘లేదండీ! అందరూ పిల్లలే పుడుతున్నారు!’ జవాబు.


నీలంరాజువారు : లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్‌ చేశారు. నేను మురళీధర్‌ గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయట పడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్‌ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్‌ చేశారా? అని నాకు గాభరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్‌ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్‌’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్‌’ కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్‌ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!

(గురజాడ వారి ఇల్లు)

ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు (ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం గొప్పవాణ్ని! భళా!
గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది. మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడు గారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణ బాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!) నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను! తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు!!! వాసా వారు, అంట్యాకుల పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!
బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది! విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!
గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తు లోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది ‘మెటిల్డా’ అంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. అమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగి రాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిశెట్టి రామారావు కార్టూన్ల గురించిన పుస్తకాలు దొరికాయి.

(సంగీత కళాశాల - వెనుక భాగం)
(సంగీతం మర్రి చెట్టు)


సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్‌ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణ లోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతం వల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారు’ అని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్‌ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్‌ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్‌ పేరున పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్‌ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్‌ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయన్నారు. అందుకు టైమ్‌ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.


ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్‌ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!