I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Showing posts with label Youtube. Show all posts
Showing posts with label Youtube. Show all posts
Monday, September 29, 2025
Nedunuri Krishnamurthy Concert B in 4 Parts
Concert B Part 1
Wednesday, July 16, 2025
M S Balasubrahmanya Sharma - Mahalakshmi
Shravanam here!
M S B Sharma
sings
Mahalkshmi - Jaganmata
of Papanasam Sivan
Pallavi:mahAlakSmi jaganmAtA manamirangi varamaruLAnupallavi:mahA vishNuvin mArbenum maNi pIThamadanil amarndaruLmanmatanai InraruLum thAyE dayAnidhiyE mahA mAyECharanam:pArkkaDal tarum krpAkari parindu vandenai Adaripankaja malar vaLar annaiyE kaDaikkaN pAr rAmadAsan paNiyum
Thanks for visiting my Blog!!
Monday, June 23, 2025
Lokabhiramam 2 - Science Panduga
సైన్స్ పండుగ
సైన్సు అందించిన అందమయిన మత్తులో హాయిగా గడుస్తున్న
దినం కాదిది. ఆ రోజు గడిచింది. ఇది మరుసటి రోజు. అవగాహనకు అందని అంశాలను, అనర్థాలకు దారితీస్తున్న అంశాలను, మరింత సులభంగా పరిశీలించడానికి, ఇప్పటివరకూ వచ్చిన
సైన్సు, కొంత వెసులుబాటు మాత్రమేనని, అందరికీ అర్థమయింది, అంటాడు ఆల్డస్ హక్స్‌లే.
---
సైన్సుకు స్వంతంగా విలువలు ఉండవు. విలువలు
మనుషులకు ఉంటాయి. సైంటిస్టులు మనుషులు. సైన్సును వాడుకునేవాళ్లు మనుషులు.
---
పుష్పా! ఈ సదస్సుల్లో నేను పాల్గొనడానికి
పద్ధతేమిటి?’ యించుమించు ఈ అర్థం వచ్చే ప్రశ్న ఏదో అడిగాను.
‘అదేమిటి? నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను’ అన్నాడు
పుష్పా. అవును. పుష్ప అమ్మాయి కాదు. పుష్పమిత్ర భార్గవ అనే పి.ఎం. భార్గవ.
జంటనగరాల్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ అనే గొప్ప
సంస్థను ప్రారంభించిన డైరెక్టర్ ఆయన. ఆ సంస్థ అప్పటివరకూ ఆర్ ఆర్ లాబ్స్‌లోనే
భాగంగా ఉండేది. స్వంత భవనాలు, మిగతా సౌకర్యాలు
వచ్చిన తరువాత ప్రారంభోత్సవానికి ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలను చాలామందిని
పోగేసి రెండు వారాలపాటు సదస్సులు నిర్వహించారు. నేను అడిగింది, ఆ సదస్సుల్లో
పాల్గొనడం గురించే. నేను మాలిక్యులార్ బయాలజీ చదువుకున్నాను. పిఎచ్. డి కూడా
చేశాను. కానీ సదస్సుల నాటికి కేవలం సైన్సు జర్నలిస్టును! సైంటిస్టును కాదు. సదస్సుల వివరాలను, పాల్గొంటున్నవారి వివరాలను కలిపి ఒక పెద్ద పుస్తకం వేశారు.
దేశవిదేశాలలోని వారెంతో మంది, పాల్గొన డానికి
అప్లికేషన్స్ పంపారు. వారిలోంచి ఎంపికయినవారు రెండుమూడు వర్గాలలో, సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్ ‘చాలా ముఖ్యమయిన వ్యక్తులు’
మాత్రం ఆహ్వానాలు అందుకుని వచ్చారు. పెద్ద సంస్థల డైరెక్టర్లు, ప్రభుత్వంలో సెక్రటరీలలాంటి వారితో సమానంగా, ఆ లిస్టులో నా పేరు ఉంది. అప్పట్లో దేశంలో ఉండిన రెండు
సైన్సు పత్రికల ఎడిటర్లు కూడా వచ్చారు. ఆరుగురు నొబేల్ బహుమతి గ్రహీతలు వచ్చారు.
డి.ఎన్.ఎ నిర్మాణం కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్, టెస్ట్‌ట్యూబ్ బేబీలను ప్రారంభించిన ఎడ్వర్డ్స్ లాంటివారు అక్కడ ఉన్నారు.
కానీ, సమావేశంలో మొదటి ఉపన్యాసం ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ
అనే పరిశోధకుడు సమర్పించారు. దీన్ని ప్రోటొకాల్ అంటారు. అంటే మర్యాదలు పాటించడ
మని అర్థం!
ఎఫ్రాయిమ్ కచాల్‌స్కీ అనే ఆ భారీ మనిషి,
ఇజ్రాయిల్ దేశానికి అధ్యక్షుడు, మన భాషలో రాష్ట్రపతిగా పనిచేశాడు. ఆ దేశంలో గొప్ప సైంటిస్టులను, పండితులను ప్రెసిడెంట్ చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు ఐన్‌స్టయిన్‌ను
అడిగారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. బహుశా ఆ మార్గంలోనే మన దేశంలో అవ్వల్ ఫకీర్
జైనులాబుదీన్ అబ్దుల్ కలామ్ గారు అధ్యక్షులయ్యారు. కచాల్‌స్కీ పేరున్న
జన్యుశాస్త్రవేత్త. మంచి ప్రసంగం చేసినట్టు గుర్తుంది. వివరాలు గుర్తుకు రావడం
లేదు. మొత్తానికి ఆయన మృదుభాషి. స్నేహశీలి. అంతకుముందు నా పరిశోధనపత్రం ఒకటి,
ఇజ్రాయల్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో అంగీకరింపబడింది. కానీ,
మనదేశానికి, ఆ దేశానికీ
సంబంధాలు సరిగా ఉండనందుకు నేను వెళ్లలేక పోయాను. ఒక మధ్యాహ్నం కచాల్‌స్కీ గారితో
చాలాసేపు కబుర్లు నడిచాయి. ఒక ఇంటర్‌వ్యూ రికార్డు చేశాను. అంతా ముగిసి బయటికి
వచ్చిన తరువాత, ఆయన్ను అనుక్షణం, ఇంటలిజెన్స్‌వారు పహరా కాస్తున్నారన్న సంగతి అర్థమయింది. ఒకాయన వచ్చి, నా రికార్డర్ లాక్కున్నాడు. ఆయనతో ఏం మాట్లాడావని గట్టిగా
అడిగాడు. ‘నేను సైన్సు మాట్లాడాను, కావాలంటే, ఆ క్యాసెట్ పట్టుకు పో’ అన్నాను. అతను ఊరుకున్నాడు. మిగతా
పాత్రికేయులను ఆయన దరిదాపులకు రానీయలేదట! ఆ దేశం నుంచి మైకేల్ సేలా అని మరో గొప్ప
ప్లాంట్ జెనెటిసిస్ట్ వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు.
జెనెటిక్స్‌ను ఎంతో ప్రేమగా చదువుకున్న నాకు
‘ఫ్రాన్సిస్ హ్యారీ క్రాంప్టన్ క్రిక్’ మరీ గొప్పవాడుగా కనిపించాడు. నాకు
కొంతమందిపట్ల మరీ ఆరాధనా భావం ఉంటుంది. అవకాశం ఉన్నాసరే, వారికి మరీ దగ్గరగా పోవడానికి మనసు ఒప్పుకోదు. క్రిక్‌తో గుంపులో
మాట్లాడడమేగాని, ఒంటరిగా కబుర్లు చెప్పే ప్రయత్నం చేయలేదు,
అందుకనే.
కార్ల్‌టన్ గాజుసేక్ అని మరో నొబేల్ లారేట్
వచ్చారు. ఆయన విశృంఖల భావాలు గల మనిషిగా
పేరున్న వ్యక్తి. కొండజాతులవారు, జెనెటిక్స్‌లో వారి
పద్ధతుల పాత్ర గురించి గొప్ప పరిశోధనలు చేసినా, ఎందుకో అందరూ ఆయనను చూచి జంకుతారనిపించింది. నేను మాత్రం ఆయనను టైమ్ కొరకు
అడిగాను. ‘నీవేమీ రికార్డ్ చేయనంటే, ఎంతసేపయినా
మాట్లాడవచ్చు’ అన్నారాయన. మేమిద్దరం గంటకన్నా ఎక్కువసేపు ఎన్నో సంగతులు
మాట్లాడుకున్నాము. స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయనకు, కొండ జాతులవారిలాగే, కొన్ని విచిత్రమయిన
అభిప్రాయాలున్నాయని అర్థమయింది. అది తప్పు కాదేమో అనిపించేలాగ మాట్లాడారాయన.
మేమంతసేపు మాట్లాడడం ఆశ్చర్యంగా కనిపించిందిలాగుంది, సిసిఎంబి వారి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ మా ఫోటో తీసి మరునాడు ఉదయానికి నోటీస్
బోర్డులో పెట్టాడు. నేను కాపీ తీసుకున్నాను. నేను రాసిన మరో వ్యాసంతో పాటు అది ఒక
దినపత్రికలో అచ్చయింది. ఆ పత్రిక వాళ్లు అరుదయిన ఆ ఫోటోను పడేశారు. కనుక అదిప్పుడు
నా దగ్గరమాత్రం లేదు.
జర్మనీ నుంచి వచ్చిన మరో నొబేల్ బహుమతి గ్రహీత
యువకుడు. అతను బంజారా హోటేల్ నుంచి సైకిల్ మీద, తార్నాకా రావడానికి ప్రయత్నించాడు. మన మ్యాపుల కారణంగా, ఊరంతా తిరిగి తిరిగి చివరకు రానే వచ్చాడు. అప్పట్లో అదొక సంచలన వార్త.
సైంటిస్టులు, పరిశోధకులు కూడా మనుషులే అనడానికి మరెన్నో
ఉదాహరణలను ఈ సదస్సు సందర్భంగా నేను చూడగలిగాను.
ఇంగ్లండ్ నుంచి ఎడ్విన్ డాస్ దంపతులు
వచ్చారు. డాస్ గారిని ఎడ్డీ అని పిలుస్తున్నారందరూ. ఆయన ‘అయామ్ ఎడ్డీ!’ అని పరిచయం
చేసుకుంటున్నాడు. కరిగే ప్లాస్టిక్‌లను కనుగొని, వాటి గురించి మరింత కృషి చేస్తున్న గొప్ప పరిశోధకుడాయన. వింత ఏమిటంటే, ఆయనకు ఐంద్రజాలికుడు అంటే మెజిషియన్‌గా కూడా. ప్రపంచమంతటా
మంచి పేరుంది. మ్యాజిక్ అంతా సైన్సే అనడానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఒకనాటి
సాయంత్రం సతీమణి సాయంతో ఆయన చక్కని ప్రదర్శన చేశారు. అందరికీ ఆయనంటే ఉన్న గౌరవం
నాలుగింతలయింది. ఈ సందర్భంగా సిసిఎంబి ఆస్థాన మెజీషియన్, మ్యుజీషియన్ మధుసూదన్ వామన్ పండిత్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది.
పరిశోధకుడు పండిత్ మంచి మెజీషియన్. అంతకన్నా హార్మోనియం మీద హిందూస్తానీ
సంగీతంలో మంచి దిట్ట. దేశంలోని ప్రసిద్ధ గాయకులందరితోపాటు సహకార వాద్యం వాయించాడు.
పండిత్ ఆ తరువాత మంచి మిత్రుడయ్యాడు.
గొప్ప పరిశోధకులంతా వేరు దేశాల వారే, అనుకుంటున్న నాకు, పెట్రోలు తినే
సూక్ష్మజీవులను కనుగొన్న ఆనంద చక్రబర్తి, ఎయిడ్స్
పరిశోధకుడు శార్‌ఙ్గరవన్ (ఈ పేరును అచ్చు వేయడం కుదరదేమో, శారంగరవన్ అనవచ్చు! తన పేరును సరిగా పలికిన అరుదయిన మనుషులలో నేనూ ఒకడినని
ఆయనచేతే అనిపించుకున్నాను), మరో టాటా (నిజంగా
ఒక టాటా పరిశోధకుడు ఉన్నాడు) కనిపించి, మిత్రులయి భుజాలు
పొంగేలా చేశారు. ఈ సదస్సుల సందర్భంగా కళల గురించి ఒక సెషన్ జరిగింది. మన
చిత్రకారులు పి.టి.రెడ్డి, ఎం.ఎఫ్. హుసేన్,
కవి విక్రమ్ సేఠ్, ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు చార్ల్స్ కోరియా మరెందరో ఆ సెషన్‌లో పాల్గొన్నారు.
సమాపన కార్యక్రమంలో ప్రధాని రాజీవ్ గాంధీ
పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత మేమంతా భోజనాలకు బయలుదేరాము. ‘ప్రధాని
మనతో భోజనం చేయనున్నారు. ఆయన కొరకు వేచి ఉండాలి’ అని వార్త వచ్చింది. తాంక్స్
గివింగ్ డే, టర్కీ డిన్నర్‌లో రాజీవ్‌గాంధీగారితో మాట్లాడే
అవకాశం కూడా దొరికింది. ఆకర్షణ గల అందగాడతను. ప్రధానమంత్రి ఉండగా, ఫ్రాన్సిస్ క్రిక్ జెనెటిక్స్ అంటే ఏమిటి? అని ఒక పాపులర్ ప్రసంగం అంతకు ముందు చేశారు. నొబేల్
బహుమతి గ్రహీత విషయాన్ని సులభంగా చెప్పిన తీరు అందరికీ నచ్చింది. సైన్స్ ఏజ్
మాసపత్రిక సంపాదకుడు సురిందర్ ఝా ఆ ప్రపంగ పాఠాన్ని పత్రికలో అచ్చు
వేయాలనుకున్నాడు. రికార్డింగ్ కోసం భార్గవను అడిగాడు. సిసిఎంబి వారు అన్ని
ప్రసంగాలను రికార్డు చేశారు. క్రిక్ ఉపన్యాసాన్ని వదిలేశారు. భార్గవ, అంటే పుష్ప నన్ను అడిగాడు. నేను రికార్డింగ్ ఇచ్చాను.
ప్రసంగపాఠం అచ్చయింది.
సంగీతోత్సవాలు, నాటకోత్సవాలు జరుగుతుంటాయి. సిసిఎంబిలో జరిగింది సైన్స్‌పండుగ. అంత ఎత్తున
కాకున్నా, అడపాదడపా సైన్స్ ఉత్సవాలు జరిగితే ప్రజలకు,
సైన్స్‌కు మధ్యన ఉందనుకుంటున్న దూరం తగ్గుతుంది.
This article is from my column Lokabhiramam in Andhrabhoomi Daily Sunday magazine.It also appeared in my book Lokabhiramam Part 1
Spread the word if you like my blog and the posts here
Labels:
article,
blog,
experiences,
gopalam,
science,
telugu,
vijayagopal,
Youtube
Tuesday, June 17, 2025
Oodavalasina Shankham - ఊదవలసిన శంఖం
ఊదవలసిన శంఖం
‘నేను చెప్పే మాటలు ఎవరికీ పట్టవని నాకు తెలుసు.
అయినా చెపుతాను. ఈ మాటలు, నేను చెప్పకుంటే
మరెవరూ చెప్పరూ, చెప్పలేరు.’ అంటాడొక చైనా తాత్వికుడు.
‘ఊదర సంగై ఊది వెచ్చాల్, విడియుంబోదు విడియాట్టుం’ అని ఒక తమిళ సామెత. ఊదే శంఖాన్ని ఊదేస్తే తెల్లవారేటప్పుడు
తెల్లవారనీ, అని అర్థం.
కనీ, పెంచి, కనిపించిన దేవతలు అమ్మ, నాన్న! బతుకుకు, చదువుకు గురువు, తరువాత హితుడు, స్నేహితుడు నాన్న! (నేను, నాన్నగారు, స్నేహితులూ అనలేదని
ఎవరూ బాధపడనవసరం లేదు! మా తీరే అంత!) ఈ పని ఈ రకంగా చేయండి, అని నాన్న ఏనాడూ చెప్పింది లేదు. అయినా అన్నింటికీ ఆయనే గురువు. నాన్న సైకిలు
పెట్టే చోట, గోడలో ఒక చిన్న చెక్క తలుపు అల్మారా ఉండేది.
నేను, తమ్ముడు పొద్దున్నే ముఖం కడుక్కుని వచ్చి అక్కడ
నిలబడి, ‘ఎలుకా! మాకేమయినా యియ్యవా?’ అని అడగాలి. కళ్లు మూసుకుని అడగాలి. అల్మారాలో ఎలుక
ఉంటుంది. అది మాకు బిస్కెట్లు, చాక్లెట్లూ
ఇస్తుంది. ఇప్పటిలాగా చారెడు, బారెడు చాకొలేట్లు
లేవపుడు. ప్యారీ, దక్కన్, రావల్‌గావ్ అంటూ రెండు వేపులా చెవులు మెలేసిన చాక్లెట్లవి. బుద్ధిగా
పిడకబూడిదతో పళ్లు తోముకుని, ముఖం కడుక్కుని
వచ్చి నిలబడడమంటే, ఎలుక కొరకేనా?
నాన్న ఆ ఊళ్లోనే, అంటే మా ఊళ్లోనే బడిలో టీచర్. ఆయన సిద్ధమయి, ధోవతి కట్టుకుని, తాంబూలం వేసుకుని, సైకిలు తీసుకుని ఠీవిగా బయలుదేరితే దారిలో ఎవరూ అడ్డువచ్చేవారు కారు. కానీ
అదంతా చూచే ఓపిక ఎక్కడిది? ఉడుతలా పరిగెత్తి
బడికి చేరుకునేవాణ్ని. పుస్తకాలు లేవు. కనీసం పలక లేదు. నాకసలు బడిలో ఎడ్మిషనే
లేదు. ప్రార్థన అయింతర్వాత చెప్రాసీ (బంట్రోతు) శాంతయ్య, నన్ను ఇంట్లో దింపుతాడు. అతను భుజంమీద ఎత్తుకుని యింటికి తెస్తుంటే, నచ్చక, ఒకనాడు, అతని చెవి కొరికినట్టు జ్ఞాపకం! శాంతయ్య తలకు రుమాలు
కట్టుకునేవాడు. మరి చెవి కొరకడం ఎట్లా కుదిరింది? ఇప్పుడు అనుమానం
వస్తోంది. పెద్దవాణ్ని అయింతర్వాత శాంతయ్య ఎప్పుడూ ఆ సంగతులు చెప్పి మురిసి
పోతుండేవాడు.
నేనూ బడిలో చేరాను. అక్షరాలు దిద్దే అవసరం
లేకుండా, ఏకంగా పుస్తకం పట్టుకున్నానట. ఒకనాడు అందరినీ
నిలబెట్టి నాన్న డిక్టేషన్ చెబుతున్నాడు. నేను మెడ రిక్కించి ముందున్నవాడి
పలకలోకి తొంగి చూచాను. తలమీద ఠపీమని
దెబ్బపడింది. తిరిగి చూస్తే, నాన్న! పలక
కిందపడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయాను. పలకను నాన్న ఇంటికి తెచ్చాడు. ఆయన చెప్పిన
మాట, అప్పటికే నేను రాసి ఉంచాను అన్న సంగతి ఆ పలక
ప్రకటించింది! నాన్న గట్టిగా నవ్వాడు! నేనూ గర్వంగా నవ్వాను.
క్రమశిక్షణంటే నాన్న తరువాతే ఎవరయినా! ఆయన్ను
చూచి గడియారం తత్తరపడేదేమో? చివరి వరకూ ఆయన అదే
పద్ధతిగా బతికారు.
ఇంట్లో తాతయ్య పుస్తకాలు ఒక పెద్ద అల్మారా
నిండా ఉండేవి. వాల్మీకం మొదలు ఆనంద రామాయణం దాకా, ఎన్ని రామాయణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆరోగ్యం, వైద్యం, యాత్రాచరిత్రలు, గారడీ విద్య
మొదలయిన పుస్తకాలన్నీ తాతయ్య కొని చదివారంటే భుజాలు పొంగిపోతాయి. ఆ పుస్తకాలను తరుచు దులిపి, నిర్వహించడం నా డ్యూటీ. ఆ పుస్తకాలు నావి, అని గర్వం!
నాన్న బాగా చదువుకున్న మనిషి. కానీ
సర్టిఫికేట్లు లేని చదువది. ఏదో ఒక చిన్న ట్రెయినింగ్ పొంది ప్రైమరీ స్కూల్
పంతులుగా సెటిలయ్యారాయన. అందులోని ఆనందం గురించి తర్వాతెప్పుడో చెప్పాడాయన మాతో!
ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నాకు అక్షరాలతో పరిచయం ‘చందమామ’తో మొదలయింది.
మూడవ తరగతిలో ఉన్నప్పుడు చందమామ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవడం అలవాటయిపోయింది.
అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు కూడా గుర్తున్నయి.
నాన్న తాను చదివిన నవల, పత్రిక ఏదయినా సరే
తరువాత నా ఒళ్లో పడేయడం అలవాటయింది. కోడిగుడ్డు దీపం పెట్టుకుని, అయిపోయిందాకా అపరాధపరిశోధక నవల చదివి, ఆ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే, భయంగా పడుకోవడం గుర్తుంది. ‘ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకమని ఏదీ లేదు’ అని
నాన్న అనుకున్నాడనిపిస్తుంది. అంగట్లో పప్పు కట్టిచ్చిన కాయితం కూడా చదవందే
పడేయకపోవడం, అపుడే అలవాటయింది.
సెలవులు వచ్చినయి అంటే, ఏ లైబ్రరీ నుంచో సంచెడు పుస్తకాలు యింటికి వస్తాయి. నిదానంగా చదివితే
నాలుగునాళ్లు కాలం గడుస్తుంది. కానీ, అంత ఓపిక ఏది?
పిచ్చెత్తినట్టు అన్నీ చదివేసి, మరో బ్యాచ్ కొరకు ఎదురుచూడడమే!
అది పరీక్షకు చదవవలసిన ‘సిలబస్’ పుస్తకం గాని,
సరదాగా చదివే నవలగాని, చదువుకాని చదువుగా చదివే మరో పుస్తకంగాని, పుస్తకమంటే, నాన్నలాగే మిత్రుడు, ఆప్తుడు! కష్టపడి చదవడం, సరదాగా చదవడమన్న
తేడా లేదు! అన్నీ యిష్టంగానే చదవడం అలవాటయింది. వరుసబెట్టి రెండు క్లాసిక్స్, రెండు నవలలు చదివి, అదే ఊపులో ‘సిలబస్’
కూడా చదివితే, అన్నీ ఒకేరకంగా, సినిమాలాగా గుర్తుకు వచ్చేవి.
మా ఊరి బడిలో అయిదవ తరగతి వరకూ ఉండేది. తరువాత,
పక్కనున్న పాలమూరులో చదువు. చిత్రంగా నాన్నకు, తిరిగి మా బడికే బదిలీ అయింది. చివరి పీరియడ్ జరుగుతుండగా,
(మామూలుగా, అది ఆటల పిరియడ్)
నన్ను వెతికి, ‘ఇంటికి పరుగెత్తకు!’ అని ఒక మాట చెప్పి వెళతాడు
నాన్న! అంటే ఆనాడు సినిమా చూచే కార్యక్రమం
ఉందని అర్థం! సినిమాలు చూడడమే కాదు, వాటిని గురించి
చర్చించడం కూడా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నమ్మండి, నమ్మకపొండి, జరదా పాన్ తినడం, నాన్న దగ్గర నేర్చుకున్నాను!
జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయాలన్నది నాన్న
ఫిలాసఫీ. పట్నంలోపడి, నన్ను నేను వెదుక్కుంటూ బతికేరోజుల్లో పండగకు
యింటికి వెళతాను. సాపాట్లు (భోజనాలు) అయింతరువాత నాన్న పాన్ వేసుకుని, ఆ అందమయిన పెట్టెను నా ముందుకు తోస్తారు. అది అలవాటు.
ఒకసారి, నేను
‘మానేశాను. వద్దు’ అన్నాను. ‘నాన్నా! టీ, కాఫీ తాగవు. మరే అలవాట్లూ లేవు. ఉన్న ఈ ఒక్క సరదా (అదే జరదా) మానేసి ఏం చేస్తావయ్యా?’ అన్నారాయన!
తినే తిండిని ఆనందంగా అనుభవించాలని, ఆదరాబాదరాగా తినకూడదని మాకు తెలియకుండానే అలవాటయింది.
ఇంట్లో ఉన్నవాళ్లందరమూ కలిసి తినడం ఇవాళటికి మాకందరికీ అలవాటు. నాన్న బడిపంతులు!
స్థితిపరులం కాదనే చెప్పాలి! కానీ తిండి సంగతిలో మాత్రం, ఎప్పుడూ లోటు లేదు. ముందుకు వచ్చింది ‘చారు’ మాత్రమే అయినా, ‘కొత్తిమెర చారు!’ అంటూ ఎక్సయిటయిపోయి, అన్నాన్ని మెత్తగా చేసి, కొంచెం చారుపోసి కలిపి, దాంతో గుండ్రంతో
వలయం చేసి (దాన్ని బావి కట్టడం అనేవాళ్లం!)
అందులో మరింత చారు పోసుకుని, ఆవకాయో, మరో కూరో నంచుకుంటూ ఆనందంగా తినడం, నాన్నకే చేతనయింది. అందుకే మాకూ చేతనయింది. ప్రతిరోజూ, అందరి అభిప్రాయాలు అడిగి, కూర గాయలు
తెచ్చేవారంటే, నాకిప్పుడు ఆశ్చర్యంగా ఉంది.
నాన్న వంటకు ఉపక్రమిస్తే, ఇక పండగే. ఒకసారి అమ్మ ఊళ్లో లేనప్పుడు, నూగులు, కొత్తిమీర, పచ్చిమిర్చిలతో నాన్న చేసిన పచ్చడి నాకు ఇవాళటికీ
గుర్తుందంటే నమ్మండి. మాకంతా, ‘వంటొచ్చిన
మగవాళ్లు!’ అని పేరుంది! ఎక్కువగా తినడం వేరు, ఇష్టంగా తినడం వేరు. ఇష్టం తెలిసి తినడం అంతకన్నా వేరు. బతుకు బడిలో నాన్న
దగ్గర ఎన్నో నేర్చుకున్నాము. అందులో ‘తీపి’ తినడం కూడా ఒకటి. ‘పెద్ద సభ జరుగుతూ
ఉంటుంది, తొక్కిడిగా జనం ఉంటారు. అపుడు ముఖ్య అతిథి
వస్తారు. అంత తొక్కిడిలోనూ జనం జరిగి, తోవ యిస్తారు.
‘మధురం’ మరి ముఖ్య అతిథి అని కథ చెప్పి, నాన్న మా చేతి తీపి
తినిపించేవాడు. ఇక్కడ, ఎక్కువ తినడం గురించి కాదు సంగతి. ఇష్టంగా
తినడం గురించి. ఎండ కాలంలో రెండుపూటలా, మామిడిపండు లేనిదే,
నాన్నకు భోజనం నడవదు. ఇంటి పండ్లు లేకుంటే అప్పటికప్పుడు
కొని అయినా, మామిడిపండు రసం కలుపుకుని, నాలుగు ముద్దలయినా తినాలి! ఇది కూడా ఒకరకమయిన
క్రమశిక్షణేనేమో?
యూనివర్సిటీ రోజుల్లోననుకుంటాను, ఎవరో నన్ను ‘నీకిష్టమయిన విషయాలు ఏమిటి?’ అని అడిగారు. ‘అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు, శాస్త్రీయ సంగీతం’ అన్నాను. ‘నాట్ నెససరిలీ ఇన్ దట్ ఆర్డర్’ అని కూడా
అన్నాను. వరుస కానవసరం లేదని భావం. ‘జిహ్వోపస్థ పరిత్యాగీ’ అని మొదలుపెట్టి నాన్న
ఒక శ్లోకం చెప్పారు. నా యిష్టాలలో మొదటి రెండింటిమీద ఆసక్తిలేనివాని బతుకు అని
శ్లోకం భావం మాత్రం గుర్తుంది. నేను పెళ్లి చేసుకోను, దేశాన్ని ఉద్ధరిస్తాను అన్నప్పుడు ఈ సంగతి చెప్పినట్టు నా అనుమానం. సందర్భం
సరిగా గుర్తురావడం లేదు.
నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొనితెచ్చాడు.
నేను దాన్ని ‘సన్నవిల్ల లాగా’ (చంటిపాపలాగ) చంకనేసుకుని తిరుగుతనని అందరూ అనేవారు.
రకరకాల కార్యక్రమాలు వింటూ కాలం గడపడం అలవాటయింది. సిలోన్, వివిధభారతి స్టేషన్లనుంచి వచ్చే హిందీ సినిమా పాటలు పిచ్చిగా వినడం
అలవాటయింది. తెలుగు పాటలు వారానికి రెండు అరగంటలు, సాయంత్రం సిలోన్‌లో కొన్ని వినిపించేవి అంతే. మా ప్రాంతంలో శాస్త్రీయ సంగీతం
వినడం నిజానికి ఎవరికీ అలవాటు లేదు. నాన్న మాత్రం గద్వాల సంస్థానంలో బాల్యంలో,
ఆ తరువాత కూడా చదువుకున్నారు. అక్కడ నాటకం, సాహిత్యం, సంగీతంలాంటి
రుచులన్నీ ఆయనకు తగిలాయి. అప్పుడప్పుడు పాతపద్ధతిలో ఆయన పాడుతుండేవారు కూడా!
నన్నొకసారి పిలిచి ‘నాన్నా! ఊరికే అస్తమానం ఆ సినిమాపాటలు వింటున్నవు, అప్పుడో యిప్పుడో సంగీతం (శాస్త్రీయం) విని చూడగూడదా?’
అన్నారు. ఆయన మాత్రం ప్రయత్నంగా సంగీతం విన్నట్టు నాకు గుర్తులేదు.
నాన్న ఈ మాటలన్నది నవంబర్, డిసెంబర్ రోజులనుకుంటాను. రేడియో సంగీత్ సమ్మేళన్ అని
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కచ్చేరీలు వచ్చేవి. మద్రాసు ‘సంగీతోత్సవం’ కచ్చేరీలను
హైదరాబాద్ రేడియో వారు కూడా రిలే చేసేవారు (తమిళంలో అనౌన్స్ మెంట్లు వస్తాయని
మానేశారట!) మొత్తానికి కారుకురుచ్చి
అరుణాచలం, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ లాంటి మహామహుల సంగీతం విన్నాను. ‘సంగీతమంటే, ఇదిగదా!’ అన్న భావం ఒకటి బలంగా నాటుకుపోయింది.
నాకు యిష్టమని చెప్పుకున్న విషయాలలో, మొదటి రెండింటి మీద, అంత ప్రేమ లేదు! నిజం! పుస్తకం, సంగీతం లేనిదే రోజు
గడవదు, ఇది అంతకన్నా నిజం!
---
‘అత్త పత్తెమయితే, ఇల్లల్ల పత్తెమ’ని మాకొక మాట ఉన్నది. ఇక్కడ పత్తెమంటే పథ్యం. తిండిలో నిబంధన.
నాకు యిష్టమయిన సంగతులు, అందరికీ
యిష్టముండాలని ఎక్కడా లేదు. కానీ, బతుకంటే
యిష్టంలేనివాళ్లు ఉండరు, ఉండగూడదని నా
నమ్మకం. అమ్మ, నాన్న నాకు బతుకు నేర్పించినట్లే, బతుకు మీద ప్రేమ నేర్పించి, వారి దారినవాళ్లు వెళ్లిపోయారు. అమ్మ, నాన్న పెద్దవాళ్లయి,
పోవడం సహజం! అయినా, వాళ్లు
ఉన్నారనుకునే బతుకు తున్నాను. మనవాళ్లందరూ, అనుక్షణం మనకళ్ల ముందు ఉన్నారు గనకనా!
మాత, పిత, గురుదేవులు, హితులు ` వీళ్లే దేవుళ్లనుకుంటే, ఎంత బాగుంటుంది?
అంతా కనిపించే దేవుళ్లు! కనిపిస్తారు, పలుకరిస్తారు, కనికరిస్తారు.
Labels:
article,
book,
Life,
lokabhiramam,
vijayagopal,
village,
Youtube
Subscribe to:
Posts (Atom)