ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తయినది అంటున్న, అనుకుంటున్న ఈ శిఖరం మనదేశం ఉత్తరాన ఉండే హిమాలయ పర్వతాల్లో ఉంది. పర్వతశ్రేణికి అంత అందమయిన పేరుంటే, అందులో ఒక శిఖరానికి, ఎవరికీ అర్థంకాని ఈ పేరు ఎందుకని అనుమానం ఎవరికయినా కలుగుతుంది.
ఖగోళశాస్త్రంలో ఒక తోకచుక్కను, నక్షత్రాన్ని ఎవరు కనుక్కుంటే, దానికి వాళ్ల పేరే పెడతారు. ఈ శిఖరం అలా ఆకాశంలో అంతుపట్టని ఆకారం కాదు. అయినా దాన్ని పట్టించుకుని 1829 నుంచి 1834 దాకా రకరకాల కొలతలు వేయించి, సర్వే చేయించిన పెద్దమనిషి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు సర్ జార్జ్ ఎవరెస్ట్. సంవత్సరాలనుబట్టి ఆతను బ్రిటిష్ అధికారి అన్న విషయం అర్థమయే ఉంటుంది. అతను స్వయంగా మిలిటరీ ఇంజనీరు. భారతదేశానికి సర్వేయర్ జనరల్ గా పనిచేస్తున్న కాలంలోనే ఈ కొలతలు వేయించాడు. అప్పటి వరకు ఈ శిఖరానికి పీక్XV అనే పేరు ఉండేదట. అది ఉన్న స్థలాన్ని, ఎత్తునూ సరిగ్గా గుర్తించినందుకు ఎవరెస్ట్ గారి పేరే శిఖరానికి పెట్టారు. నేపాల్ వాళ్లు మాత్రం నాటికీ నేటికీ ఆ కొండను ‘సాగర్ మథా’ అని పిలుస్తారు. (అది మాతా కాదు. థా అక్షరం అచ్చుతప్పు అంతకన్నా కాదు. ఆకాశమనే సాగరానికి ఈ కొండ నుదురు వంటిది అని భావం. హిందీలో మాథా అంటే నుదురు.) నేపాల్ ఉత్తర ప్రాతంలోని షేర్పాలు, మిగతా టిబెట్ భాషలో మాట్లాడే వాళ్లంతా ఇవాళటికీ ఈ కొండను ‘చోమో లుంగ్మా’ అంటారు. అంటే ప్రపంచానికే తల్లి అయిన దేవత అని అర్థం,
ఎవరెస్ట్ గురించి చెప్పుకుంటున్నప్పుడు, 1953లో తొలిసారిగా ఆ శిఖరాన్ని ఎక్కిన టెల్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీలు గుర్తుకురాక మానరు. ఆ తర్వాత వేరువేరు దారుల్లో కనీసం 1200 మంది ఆ శిఖరం మీదకు ఎక్కారు. కానీ, మొదటి అధిరోహణ తర్వాత 50 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా అప్పటి హీరోలు ఇద్దరి కొడుకులు జామ్లింగ్ నార్గే, పీటర్ హిల్లరీలు మరో కొందరితోబాటు, 2003లో మరోసారి ఆ షిఖరం మీదకు ఎక్కారు. ఈసారి వారి కృషిని ఐమాక్స్ కెమెరాతో చిత్రీకరించారు. చిత్రం చాలా అద్భుంతగా ఉంది. (హైదరాబాద్ లోని ఐమాక్స్ లో ప్రదర్శింపబడిన మొదటి చిత్రాల్లో ఎవరెస్ట్ ఉండడం గమనించదగిన అంశం.)
ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఇంకా పెరుగుతున్నదని మీకు తెలుసా?
I have written such question answers meant to be read by children.
They are yet to be published.
I have not tried seriously to bring them out as a book.
This evening while I was walking home back from the market, I met Mr Chakradhar, a senior journalist friend.
During conversation, he asked me to restart my writing activity.
I mean, writing for the press and in Telugu.
I asked him what should I write?
He said "Better write for children!"
My feeling is that anything written for children will always be useful for people who do not know that particular subject.
I have followed this principle for my science writing.
If some person does not know what I am writing about, he will follow it better, if it is simple and easy to follow.
Many experts and seniors have accepted my idea and style.
It is high time I return to what I could do best.
Writing!
No comments:
Post a Comment