Thursday, January 21, 2010

Kaloji narayana Rao - Autobiography Contd...

Writing about the book of a person of the calibre of Kaloji calls for some guts.
However, since Kalanna was a friend of almost every writer and was ready with a comment on their works, I ventured on this effort.
I am not making any qualitative assaying here.
I am only introducing the book.

Before I write anything about Kalanna, I would quote him from the book under introduction.
After giving material for a 200 and odd page book, he says the following words.మన ధోరణి ప్రకారం మనం చెప్తంగాని, 'జీవిత చరిత్రని ఈ విధంగ రాయాలె అని టెక్నిక్ లేదుగద.'
 నేను నాగొడవలో చెప్పుకున్నా అంతే, కథలు రాసినా అంతె. మంచికథ రాయాలె, టెక్నికల్ గా పర్ఫెక్ట్ గ వుండాలె, కళాత్మకంగా చిత్రించాలె అనుకుని కథ రాయలేదు. ఉపన్యాసకేసరి అవుదమని చెప్పి ఉపన్యాసాలుఎన్నడూ ఇవ్వలేదు. అట్నే నాగొడవ చెప్పుకున్నప్పుడు కూడా కవిత్వానికి సంబంధించిన రహస్యాలు, తపస్సు, సరస్వతీ పూజలు, సరస్వతీ ఉపాసనలు దృష్టిలో పెట్టుకుంటే నాగొడవ చెప్పకపోదు. ఇప్పుడు జీవిత చరిత్ర కూడ విప్పకపోదు.

అయ్యా దయచేసి ఒక్క సంగతి గుర్తుంచుకోండి. ఈ భావాలు మాత్రమే గాని భాష కాళన్నది గాదు. ఆ సంగతి పుస్తకం ఏసిన వాండ్లే ఒప్పుకున్నరు, ఎడిటింగు చేసిన వాండ్లలో కొందరికి ఆయన ధోరణి పట్టుబడలేదన్నరు.
 So, when you write, you do it as per your style and not on the standards set by others.
Only then what you write will stand apart from the other works.
Kaloji's autobiography is a piece of honesty just like his personality.
I wish someone takes steps to bring it out in English and Hindi, so that the world would come to know about the great personality that he was.

Now a little about kaloji and me!

ఎవరైనా హనుమకొండకు పోతే అక్కడ ముఖ్యంగా చూడనల్సినవి రెండు.
1. వెయ్యి స్తంభాలగుడి – అణగారిన శ్రమజీవులు సృష్టించిన కళాఖండం
2. కాళోజీ – అణగారిన శ్రమజీవులు నిర్మిస్తున్న పోరాట చరిత్రతోపాటు నడుస్తున్న బతుకంతా దేశానిదైన మనిషి
అంటరు వరవరరావుగారు.

నేను హనుమకొండలో చదువుకుంటున్న రోజులలో వెయ్యిస్తెభాల గుడిని పట్టించుకున్ననో లేదో గుర్తులేదు గాని, కాళోజీని చూచిన.
పార్కులో దోస్తులతో కలిసి ఆయన ముచ్చట్టలు చోప్పుకుంటుంటే చూచిన గుర్తు.ఎవరో గొప్పమనిషి అనిపించింది గాని ఆయనగురించి తెలియదు.

తర్వాత మాత్రం ఆయన నన్ను గోపయ్యా అని ప్రేమగా పిలిచేంత దగ్గరగ పొయ్యిన.
అయ్యా రాండి అని పిలిస్తే, ఏ ఊరు నాయినా అన్నరు.
ఆ తర్వాత దోస్తీ అయింది.

నాకు స్నేహితులూ, స్ట్రేంజర్సే గాని పరిచయస్తులు ఉండరని కాళన్న అనేవారట.
వరవరరావు గారు దాని మీద పెద్ద వ్యాఖ్యనే చేసినరు.
నేనూ అంతేనా అనిపించింది.
కాదనీ అనిపించింది.

ఒకసారి ఏదో సాహిత్య సభ. నేనూ ప్రసంగించినట్లే గుర్తుంది.
మంత్రి రఘువీరారెడ్డి ఉన్నరు.
నేను వేదికి మీద కూచోలేదు.

ప్రసంగం తర్వాత వచ్చి ఏ రెండో వరుసలోనో నా చోట్లో కూచున్న.
మంత్రి ప్రసంగం మొదలు పెట్టి ఏదో సందర్భంలో పక్కు చూచి కాళోజీగారు వెళ్లిపొయినట్లున్నరు అన్నడు.
అవును, అయన వేదిక మీద కూచున్న కుర్చీ ఖాళీగ ఉంది.
కానీ అయన నా పక్కన కూచోని నాతోటి ముచ్చట్లాడుతున్నడు.

గొంతెత్తి, పోలే ఇక్కడ గోపయ్య దగ్గరున్న అన్నడు.
అందరూ ఆశ్చర్యంగ ఇటు చూచినట్టు గుర్తు.

మంచి సంగతులు చెప్పి అంత సులభంగ కంటనీరు పెట్టుకో గలిగిన మనుషులను నేను ఇద్దరిని చూచిన.
ఒకరు మా మామ(ఆయనే మేనమామ కూడ)
రెండు కాళన్న.

ఎన్నెన్నిసార్లు ఎన్నెన్ని సంగతులు మాట్లాడుకున్నమో
కొనకు ఒకసారి వరంగలుకు పొయ్యిన.
పెద్ద సభ. కాళన్న నడువలేని స్థితిలో ఉన్నడు.

మనుషుల సాయంతోటి వచ్చినడు.

ఉపన్యాసము  గూడ లేదు.
దగ్గరికి చేరి నమస్కారం చేసిన. ఆయన గుర్తుపట్టలేదు.
నేనెవరో చెప్పిన. వణుకుతున్న గొతుతోటి, ఎవ్వరు గుర్తుకొస్తలేరు నాయినా అన్నడు కాళన్న.

నాకు కండ్లల్లో నీళ్లు తిరిగినయి.
తరువాత కొన్ని దినాలకే కాళన్న ఎళ్లిపొయినడు.

నన్ను గోపన్నా అని పిలిచే వాండ్లే తక్కువ.
అందులో శానమంది ఇట్లనే ఎళ్లిపొయినరు.
తలుచుకుంటే ఒంటరితనమనిపిస్తది.

ఇంతకొంచెము పరిచయానికి, దోస్తీకి నేను ఇంత కదిలిపోతే, ఆయన్నతోని మరింత దగ్గరతనం గలిగినవాండ్లు మరెంత కుములుతున్నరో

మంచితనము మాటమాటలో కనిపించే మనుషులు తక్కువ ఉంటరు.ఆయన మాటకు రచనకు పెద్ద తేడా ఉండదు.
కాయిదం ముందరికి రాంగనే బిగిసిపొయ్యే మనిషి గాదు కాళన్న.
మాట్లాడినంత సులభంగ రాసినడు.
అందుకే అందరికీ దగ్గరయ్యినడు.

తన సంగతులు చెప్పి వాటిని ఇదీ నా గొడవ అన గలిగిన మనిషి ఆయన.
ఆ పుస్తకాలను ఎన్న సార్లు చదివినా మళ్ల చదవాలనిపిస్తుంది.
1995లో అచ్చేసిన ఈ పుస్తకం ఇంకా దొరుకుతున్నదో లేదో తెలియదు.
ప్రయత్నించి చూడండి. సంపాయించి చదవండి.

ఒక సంగతి చెప్పాల్నో లేదో తెలియదు.
హిందూ అనే జాతీయ దినపత్రిక వారు ఫోలియో అని ఒక ప్రత్యేక సంచికలు అచ్చేసేవారు.
అందులో ఒకసారి డ్రగ్స్ గురించి వచ్చింది.
ఒక ఫొటోగ్రాఫరు తను తీసిన ఫొటోలను అమ్ముకున్నడు. అవి హిందూ వాండ్ల దగ్గర ఉన్నయి.
అందులో ఒకదాన్ని డ్రగ్స్ అలవాటయి మనిషిలాగున్నడనేమో ఒక వ్యాసంతోటి అచ్చు వేసినరు.
ఆ బొమ్మలో ఉన్నది కాళన్న. దానితోబాటే తీసిన ఇంకొక ఫొటో ఈ పుస్తకంలో ఉన్నది.

నేను పత్రిక వారికి మెయిలు పంపిన. క్షమాపణలు చెప్పమని.
ఏమయిందో తెలువదు.
ఈ పుస్తకం చేతుల్లోకి వచ్చినప్పుడల్ల నాకు ఆ పొటో కండ్లల్ల తిరుగుతది.

మంచి మనుషులు రాసిన మాటలు చదివితే మనసు తేలికవుతది.

4 comments:

Praveen Rangineni said...

విజయ గోపాల్ గారు,
సార్, మంచి పరిచయం కాళన్నగురించి. నేనెన్నడు తనని చూడలేక పోయిన గాని వారి "నా గొడవ" కవితా సంపుటి చదివిన ప్రతి సారి ఎక్కడో ఒక దగ్గర కన్నీళ్ళు వొస్తయి. ఈ పుస్తకం ఎక్కడైనా దొరుకుతదేమో చెప్పగలరా? అలాగే మీ దగ్గర సామల సదాశివ గారి అడ్రస్ ఉంటె ఇవ్వగలరా?
ప్రవీణ్

Vijayagopal said...

నా గొడవ దొరుకుతుంది.
విశాలాంధ్రలో చూసినరా?

Dr.సామల సదాశివ
విద్యానగర్
ఆదిలాబాద్
504002

ఇంతచాలు!

Vijayagopal said...

So, You are not in India!

Contact me on my mail.

vijayagopalk@gmail.com

Thanks.

anilkumar said...

sir i am very lucky with this i got a way to read books of the great telangana writer kaloji garu. and proud to meet u. i already contacted u with mail reply me sir pls