I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Wednesday, March 18, 2026
Thursday, January 22, 2026
సాదత్ హసన్ మంటో 1 : On Sadat Hasan Manto : Article in Telugu
సాదత్ హసన్ మంటో 1
సాదత్ హసన్ మంటో
సాహితీ
మిత్రులతో మాట్లాడుతూ ఉండగా రచయితల గురించి ప్రసక్తి వచ్చింది. పట్టించుకుని
ప్రపంచానికి ఎత్తి చూపించవలసిన రచయితల గురించి చర్చ మొదలయింది. సాదత్ హసన్ మంటో ఉర్దూలో పెద్ద
ఎత్తున కథలు రాసిన మహా
రచయిత.
మామూలు పద్ధతికి ఎదురుతిరిగి తన కలం వాడితో వేడి పుట్టించిన రచయిత. ఆయన కథలు
తెలుగులో వందకు పైగా వచ్చాయని మిత్రులు చెపితే, ఆశ్చర్యం కలిగింది. ఆ కథలు మంటోలాగే
మనుషుల మధ్యన ఉండి కూడా మనుషులకు దూరమయినట్టు భావన కలిగింది. మంటో
భారతీయుడు. స్వాతంత్రం తరువాత అప్పటి దారుణ పరిస్థితులను గురించి, దేశం
విడిపోవడం
గురించి, మరీ బట్టబయలుగా కథలు రాసి సంచలనం
సృష్టించాడు. కోర్టులపాలయ్యాడు. చివరికి దేశాన్ని వదిలి పాకిస్తాన్ పారిపోయాడు. మంటో మన
దేశంలో ఉండకపోవడం ఒకరకంగా మనకు నష్టం.
మంటో
పేరులో మాత్రమే అతని మతం కనిపిస్తుంది. అతని అభిమతం మాత్రం పూర్తిగా వేరు.
సంస్కృతి అంతకన్నా వేరు. అది అతని రచనల్లో కొట్టవచ్చినట్టు
కనిపించింది.ఇక్కడ కొట్టవచ్చినట్టు అన్నమాట అక్షరాలా నిజం. “ఖోలో” లాంటి కథలు ముఖంలో పిడిగుద్దు గుద్దినట్టు వచ్చి
తగిలాయి. అందరికిలాగే “టోబా టేక్సింగ్' కూడా కలకాలం గుర్తుంటాడు. మంటో కథలు అన్నీ ఇంత మొరటుగాను, ఇంత
మొనగలిగినవిగాను ఉండవు. కొన్ని మెత్తగానే, చెప్పవలసిన సంగతులను తలకెక్కిస్తాయి. ఈ
రచయిత కథలు తెలుగులో వచ్చి ఉంటే, వాటి గురించి చర్చ జరగకపోవడం మాత్రం
గొప్ప అన్యాయం. సమాజంలో ఉన్న కుళ్లు గురించి తెలియకుండానే బతుకులు సాగుతాయి. ఉన్న
కుళ్లును ఏ రకంగా ఎత్తిచూపినా, దాని గురించి చర్చ మొదలుకావాలి.
చాలామంది రచయితల బాధ ఇదే. ఎత్తి చూపని సమస్యలు చివరకు అన్నిరకాలా
తెరమరుగవుతాయి. అది జరగకూడదనే రచయితలందరూ గొంతెత్తి ఘోషించారు. గోలచేశారు. బాధలను
గమనించిన ఈ రచయితలు వాటిని మనసులో దాచుకోకుండా అందరికీ పంచి ఇచ్చారు. మంచి మాత్రమే
పంచడం ఒక పద్ధతి అయితే, చెడును ఎత్తిచూపి మంచి దారులు ఉండాలని
సూచించడం మరో ఎత్తు. పూలు, వెన్నెలలను గురించి పాటలు రాసుకుంటే
అభ్యంతరం లేదు. కానీ, చీకటి గురించి చెప్పి చిరు దీపం
అందించిన రచయితలను మనం మరింత ఎక్కువగా గుర్తుంచుకోవాలి.
సాదత్
హసన్ మంటోను పాకిస్తానీ రచయిత అంటున్నారు. అతను రాసిన ఉర్దూ ప్రస్తుతం మన దేశంలో
వాడుకలో ఉన్న ఉర్దూ ఒకటి కాదు. కానీ, మంటో కాలంలో ఆ యాసభాష మన దగ్గర కూడా
మాట్లాడుకున్చదే! చివరకు అప్పటి సినిమాల్లోనూ ఆ భాష ఉండేది. మంటో కథలను నాటకాలుగా
మలిచి నసీరుద్దీన్ షా లాంటివాళ్లు ప్రదర్శిస్తున్నారు. అసలు కథలను చదివినా, ఆ భాషను విన్నా
అది మన హిందుస్తానీకి చాలా దగ్గరగా ఉంటుందని సులభంగానే అర్థమవుతుంది.
అక్కడక్కడ
మాత్రం మన సమాసాల వంటి కొన్ని మాటలు అందంగానే ఎదురువుతుంటాయి. అవి బహుశా ఈ కాలం అనువాదకులకు
సులభంగా లొంగవు. మంటో భారతీయ రచయిత. భారతీయ సమస్యలను ఎత్తి భారతీయ పాఠకుల కొరకు భారతీయ
భాషలోనే రాశాడని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. చెప్పవలసిన అవసరం ఉంది కూడా! మంటో
కథలు మరిన్ని రావాలి. సంకలనాలు రావాలి. వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి.
మంటో
మన దేశం వదిలి వెళ్లడానికి కారణాలు ఉన్నాయి. అలాగని ఆ మహారచయితను మనం
వదిలివేసుకోవడానికి లేదు. పారిపోయేనాటికి మంటోకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అతను
ఇప్పటి ముంబై, అప్పటి బాంబేలో ఉండేవాడు. దేశం
విడిపోయిన తరువాత మాహీమ్, భేండీ బజార్లలో జరిగిన ఘాతుకాలను
గురించి అతను కథలలో రాశాడు. నిజానికి ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే, ఇంకా
ఇక్కడే మిగిలినవాళ్ల గురించి ఆలోచనలు మొదలవుతాయి.
మంటో
ఎక్కువగా చదువుకున్నవాడు కాదు. అసలు అతనికి చదువు మీద పెద్ద పట్టింపులేదు.
కాశ్మీర్‌కు చెందిన మంటో కుటుంబం కొంతకాలం అమృత్‌సర్‌లో కొనసాగింది.
తండ్రి
గతించిన తరువాత మంటో పత్రికారంగంలో పని వెతుకుతూ బొంబాయి చేరుకున్నాడు. పత్రిక
ఆఫీసుల్లోనే పడుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలలో కొంచెం పని దొరికింది. అయితే, సినిమాల్లో
అతని రచనలు పేరు సంపాదించలేదు. నిలదొక్కుకోవడానికి చోటు అసలే దొరకలేదు. అతను రాసిన
సినిమాలన్నీ భయంకరంగా కుప్పకూలాయి! విచిత్రంగా మహానటుడు అశోక్‌కుమార్ లాంటివారు
మాత్రం అభిమానులుగా మిగిలిపోయారు. మంటో అప్పట్లో నిజంగా కుర్రవాడు. అయినా, బాబూరావ్
పటేల్ లాంటి పాత్రికేయులు అతడిని అభిమానించారు. అతని కథలను మెచ్చుకున్నారు.
భారతదేశపు మౌపాసా అన్నారు.
అప్పటి
సామాజిక, రాజకీయ పరిస్థితులు మంటోకు మంచి కథా
వస్తువులను అందించాయి. ఆ కథలలో భారతీయత నిండుగా కనిపించింది. కానీ, ఎంచుకున్న
విషయాలు, వాటిని చెప్పిన తీరు మాత్రం కొంత
కలకలానికి దారి తీశాయి. అతని
కథలు
అద్భుతమయినవి. కానీ, అంతే అసాధారణమయినవి.
పాకిస్తాన్
భారతదేశం నుంచి విడిపోయింది. చాలామంది ఇక్కడ కొనసాగలేక పాకిస్తాన్‌కు పారిపోయారు.
తమస్ లాంటి రచనలలో ఆ పరిస్థితులు మామూలు టీవీ (ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాయి.
కానీ, మంటో రచనలలో కనిపించిన లోతు మరింత
ఎక్కువ. మంటో తన రచనలలో ఏమాత్రం జంకకుండా తన మతం వారు చేస్తున్న ఘాతుకాలను కూడా
వివరించాడు. నిరసించాడు. కథలు చదివినవారికి ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది.
మంటో
1912లో పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు. తండ్రి పెద్ద పేరున్న బారిస్టర్. అతను మరీ
మొరటుమనిషి మారుటి తల్లి మాత్రం మంచిది. మంటో రచనల మీద మొదట్లోనే ఆ తల్లిదండ్రుల
ప్రభావం కూడా కనిపించింది. మంటోలోని తిరుగుబాటు పద్ధతి అక్కడే మొదలయింది అనవచ్చు.
ఇక అమృత్‌సర్‌లో అప్పటి పరిస్థితులు దారుణమయిన వని వేరుగా చెప్పనవసరం లేదు.
జలియావాలా బాగ్ గురించి చాలామందికి తెలుసు. అయినా, ఆ
పరిస్థితిని మనసులో చిత్రీకరించుకున్న
వారు
ఎక్కువగా లేరని అనాలి. ఏడేళ్ల వయసులోనే సాదత్, ఆ సంఘటనను అర్ధం చేసుకున్నాడు.
అతనితోపాటు దేశంలో మరెంతమందో ఆ విషయాన్ని అర్ధంచేసుకున్నారు. జాతీయ ఉద్యమం బలం
పుంజుకున్నది. అది మరింతగా ముందుకు సాగింది.
సరిగ్గా
ఈ కాలంలోనే మంటో ఆలోచనలు కూడా స్థిరపడసాగాయి. కుర్ర వయసులోనే అతను తిరుగుబాటుదారు
మనస్తత్వంలో స్థిరపడిపోయాడు. అనుభవం లేకున్నా ఎక్కడో చదివిన మాటలను అరువు తెచ్చుకుని
ఆకర్షణగల మాటలతో పోస్టర్లు తయారుచేయడంలో పాలుపంచుకున్నాడు. ఆస్కార్ వైల్డ్ రచనల
నుంచి నినాదాలను ఎత్తుకువచ్చాడని పరిశీలకులు తరువాత చెప్పారు. యూరోపియన్ సాహిత్యం
ప్రభావం భారతీయ రచయితల మీద అప్పట్లో బాగా ఉండేదని వాళ్లు సిద్ధాంతం కూడా చేశారు.
అలీఘడ్
ముస్లిం యూనివర్సిటీలో అర్ధమనస్కంగా చదువుకుంటున్న రోజుల్లోనే మంటో ప్రోగ్రసివ్
రైటర్స్ అసోసియేషన్‌లో చేరాడు. భారతీయ సాహిత్యమంతా రాజుల బూజు పద్ధతిలో
సాగుతున్నదని దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని సంఘం వారు ప్రచారం
చేస్తున్న భావనలకు మంటో తానూ భుజం కలిపాడు. అందరి పంథాలోనే తానూ రచనలు చేశాడు. అయినా, స్వంత
ఆలోచనలు గల సాదత్ త్వరలోనే సంగతి అర్థంచేసుకున్నాడు. “బూ” అంటే వాసన అని అర్ధం. ఈ
పేరుతో మంటో ఒక విచిత్రమయిన కథ రాశాడు. అది అతని అసలయిన రచనాక్రమానికి శంఖుస్థాపన
రాయిగా గుర్తించదగిన కథ. ఈ కథ చదవనివారికి ఇప్పుడయినా గొప్ప ఆశ్చర్యాన్ని
కలుగజేస్తుంది. కథలో ఇద్దరే మనుషులు. రణ్‌ధీర్ అన్న ఒక ధనిక యువకుడు. మరొక
నిమ్బవర్గపు అమ్మాయి. నిజానికి వారు మాట్లాడుకోరు. ఒక వర్షపురాత్రి ఆ అమ్మాయి రణ్‌ధీర్
ఇంట్లో ఆశ్రయం తీసుకోవలసి వస్తుంది. పరిస్థితులు వాళ్లు భౌతికంగా కలిసే వరకూ
దారితీస్తాయి. వర్షంలో తడిసి లోపలికి వచ్చిన అమ్మాయి వణుకుతూ ఉంటుంది. మరే భావమూ
లేకుండా, కేవలం జాలితో అబ్బాయి ఆమెకు పొడి బట్టలు
ఇస్తాడు. అమ్మాయి వణుకుతూ తడి బట్టలను విప్పుకోవడంలో తడబడుతుంది. యువకుడు
సాయంచేయడానికి వెళతాడు. అక్కడ మంటో కథను నడిపించిన తీరు మరొకరికి చేతగానిదిగా
కనపడుతుంది. మొత్తానికి రణ్‌ధీర్‌కు ఆ అమ్మాయి వాసన మనసులో మిగిలిపోతుంది.
ఆ వాసన బాగుంటుంది, బాగుండదు. అది ఆమె బాహుమూలాల్లో, తల వెంట్రుకల్లో, ఎదలో, ఒళ్లంతా గుప్పుమన్నదని అతను అనుభవం చెపుతాడు. జరిగినదంతా ఒళ్లు తెలియని తమకంలో జరిగింది. తెలివిలోకి వచ్చిన తరువాత కూడా, ఆ వాసన అతగాణ్ణి వదలదు. అది అతనికి వర్షాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ రాత్రి అందిన అనుభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ చివరకు వస్తుంది. రణ్‌ధీర్ ఒక గొప్ప యింటి అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. ఆమె అన్నిరకాలా అతనికి తగిన జోడు. అయినా, అందరినీ ఆకర్షించిన ఆ నవవధువు నాయకునిలోని మగటిమిని మాత్రం ఆకర్షించలేకపోతుంది. సాదత్ హసన్ మంటో కథలు చాలా అదుపులేకుండా ఉంటాయి. అవి బండ బూతులని అన్నవాళ్లే ఎక్కువ.
Wednesday, January 7, 2026
My Words on Viswanatha Satyanarayana : Part 3 (English) విశ్వనాథ గురించి...
My Words on Viswanatha SatyanarayanaPart 3
He opens one of those
novels, describing the pitter patter of the mid-summer showers. He goes on
saying that if you stay put, sleeping on the roof, thinking the rain would
cease, it would make your covers wet. But if you get up and go down, it would
cease even before you go into the house. With the same breath, He would explain
a scheme of bringing irrigation waters to the parched lands in an innovative
way. Pavani, his youngest son, recollected father’s discussions with Shri K.L.
Rao, the irrigation expert, about the various ways of bringing water to the
lands. He was assiduously collecting
material to be used at suitable places. Even if He takes up narration of an
irrelevant subject during a story, it would equally sound interesting. In one of those novels, perhaps
‘Samudrapudibba’ He writes of frogs that lay dried up during summer and come to
life after rains and start their cacophonic orchestra! Whoever said He was
unscientific? His observation was so keen. He boldly claimed that his writings
contain all the knowledge that He collected from all over the world.
If He was old styled and
against progress, he would not write novels like ‘Cheliyalikatta’ and ‘Terachi
Raju’. The ideas about human relations
expressed through the characters in these novels are examples of His thought
process. He was more progressive than the most progressive perhaps!
It’s interesting that He
lived and taught in Karimnagar. He inquired and collected details about the
mendicant tradition of Bavaji’s at Yelagandala Matham nearby. These Sadhus were
great musicians. They had their own ways of music. Taking cue from this, He
composed a novel under the title ‘Mroyu Tummeda’. This is perhaps one of his
novels which go beyond the comprehension of readers who even sympathise with
his style and subject. ‘Bhramaravasinividya’ a way of meditating on classical
music and the associated Goddess that He explains in this novel, is worth a
lot.
A mention must be made of
the mystery novel ‘Puli mruggu’ that would make any writer of suspense
thrillers go bonkers. In this novel, a
man keeps turning into a tiger. One cannot imagine what made Him pick up such a
theme and write a sensational work. Pavani, tried bringing this novel in the
usual language that appears in magazines of the present day. The experiment did
not really give any good results. ‘Puli mruggu’ was approved to be made into a
TV serial. It never happened. It could never happen perhaps. The imagination
required and such skills to turn the story into a visual feat using lot of
technical methods, is not at hand so easily. The present day graphic driven
film people also may not come equal to the task.
Puranam Subramanya Sharma,
writer and magazine editor says, that the orthodoxy and the stubborn belief in
traditions in Him is perhaps a cover that He intentionally arranged for self.
His humanism and love for life were no means lesser. He says VS was one of those
who could not be an example of justified combination of old and new during the
times when new values, new beliefs and new ways of life were not yet well
defined!
Katuri Venkateswararao, a
great poet and close family friend of Him says, if great poets could imagine a
theme in ten ways, VS could do the same in hundred ways! Writing great works
for Him says Katuri, is like playing marbles!
His works deserve to be
read by the entire world. Only since Tagore translated his own works into
English, world noticed him. Not all of His works are could be translated. But
those that are, should be made available to readers of other languages!
Once again to say, geniuses
are rare! But there are geniuses! And there is Him, the writer, poet and many
more things, and is called Viswanatha Satyanarayana! Could there be another one
like him? There never was! There never is! There never would be! That is Him,
the true Monarch! Kavisamrat!!
He opens one of those
novels, describing the pitter patter of the mid-summer showers. He goes on
saying that if you stay put, sleeping on the roof, thinking the rain would
cease, it would make your covers wet. But if you get up and go down, it would
cease even before you go into the house. With the same breath, He would explain
a scheme of bringing irrigation waters to the parched lands in an innovative
way. Pavani, his youngest son, recollected father’s discussions with Shri K.L.
Rao, the irrigation expert, about the various ways of bringing water to the
lands. He was assiduously collecting
material to be used at suitable places. Even if He takes up narration of an
irrelevant subject during a story, it would equally sound interesting. In one of those novels, perhaps
‘Samudrapudibba’ He writes of frogs that lay dried up during summer and come to
life after rains and start their cacophonic orchestra! Whoever said He was
unscientific? His observation was so keen. He boldly claimed that his writings
contain all the knowledge that He collected from all over the world.
If He was old styled and
against progress, he would not write novels like ‘Cheliyalikatta’ and ‘Terachi
Raju’. The ideas about human relations
expressed through the characters in these novels are examples of His thought
process. He was more progressive than the most progressive perhaps!
It’s interesting that He
lived and taught in Karimnagar. He inquired and collected details about the
mendicant tradition of Bavaji’s at Yelagandala Matham nearby. These Sadhus were
great musicians. They had their own ways of music. Taking cue from this, He
composed a novel under the title ‘Mroyu Tummeda’. This is perhaps one of his
novels which go beyond the comprehension of readers who even sympathise with
his style and subject. ‘Bhramaravasinividya’ a way of meditating on classical
music and the associated Goddess that He explains in this novel, is worth a
lot.
A mention must be made of
the mystery novel ‘Puli mruggu’ that would make any writer of suspense
thrillers go bonkers. In this novel, a
man keeps turning into a tiger. One cannot imagine what made Him pick up such a
theme and write a sensational work. Pavani, tried bringing this novel in the
usual language that appears in magazines of the present day. The experiment did
not really give any good results. ‘Puli mruggu’ was approved to be made into a
TV serial. It never happened. It could never happen perhaps. The imagination
required and such skills to turn the story into a visual feat using lot of
technical methods, is not at hand so easily. The present day graphic driven
film people also may not come equal to the task.
Puranam Subramanya Sharma,
writer and magazine editor says, that the orthodoxy and the stubborn belief in
traditions in Him is perhaps a cover that He intentionally arranged for self.
His humanism and love for life were no means lesser. He says VS was one of those
who could not be an example of justified combination of old and new during the
times when new values, new beliefs and new ways of life were not yet well
defined!
Katuri Venkateswararao, a
great poet and close family friend of Him says, if great poets could imagine a
theme in ten ways, VS could do the same in hundred ways! Writing great works
for Him says Katuri, is like playing marbles!
His works deserve to be
read by the entire world. Only since Tagore translated his own works into
English, world noticed him. Not all of His works are could be translated. But
those that are, should be made available to readers of other languages!
Once again to say, geniuses
are rare! But there are geniuses! And there is Him, the writer, poet and many
more things, and is called Viswanatha Satyanarayana! Could there be another one
like him? There never was! There never is! There never would be! That is Him,
the true Monarch! Kavisamrat!!
Saturday, February 10, 2018
My Book of Stories
This book contains 20 stories of 10 writers from nine languages.
The review says that it is not possible to say that any of the stories in the book are better than others.
Interestingly I chose stories which sound comic but talk of the life in its various facets.
Friday, October 7, 2016
Friday, September 23, 2016
Thursday, September 22, 2016
Tuesday, September 13, 2016
Wednesday, April 11, 2012
Music Reviews 1950
The Telugu magazine Anandavani had a column for Akashavani Carnatic music.
Wednesday, November 2, 2011
Becoming Buddha - A review
బికమింగ్ బుద్ధా
ఎడిటర్: రేణుకా సింగ్
పేజీలు: 184 - వెల: రూ. 399/-
పెంగ్విన్ ఆనంద ప్రచురణ
బౌద్ధం భారతదేశంలో పుట్టింది ఇక్కడి నుంచే ఎన్నో దేశాలకు వ్యాపించింది. వాటిలో టిబెట్ కూడా ఒకటి. 1959లో టిబెట్‌లో చైనా ఆక్రమణ కారణంగా సంక్షోభం ఏర్పడింది. అప్పుడు దలైలామా, ఆయన గురువులు లక్షమంది టిబెటన్లకు ఆశ్రయమిచ్చింది. టిబెటన్ బౌద్ధులకు, భారతదేశం ‘ఆర్యభూమి’. టిబెటన్ బౌద్ధమంటే భారతీయ బౌద్ధమే అందుకే కృతజ్ఞతా పూర్వకంగా టిబెట్ వారు 1979లో, రాజధాని ఢిల్లీ నగరంలో తుషిత మహాయాన ధ్యాన కేంద్రాన్ని స్థాపించారు. దలైలామాతో సహా ఎందరెందరో బౌద్ధ ఆచార్యులు అక్కడ ప్రవచనాలు చేశారు. పాఠాలు చెప్పారు. ఆ ప్రవచనాలు 1979 నుంచి జరుగుతున్నాయి. వాటిలో పన్డింనెండింటిని ప్రస్తుతం కేంద్రం నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న రేణుకా సింగ్ గారి సంపాదకత్వంలో సంకలనంగా ప్రకటించారు.పుస్తకానికి అర్థవంతమయిన జీవనం కొరకు బౌద్ధిక సంస్కృతి అని అర్థం వచ్చే ఉపశీర్షిక పెట్టారు. మహాయాన బౌద్ధం ఏకంగా నిర్యాణం కొరకు ప్రయత్నించదని అర్థమవుతుంది.
మనిషికిగల కోరికల కారణంగా కొంత ఆత్మతత్త్వం తెలియక కొంత అందరూ కష్టాల పాలవుతున్నారు. మనం జంతువులవలె బతకగూడదు. తెలివిగల వారలం గనుక మనమూ బుద్ధులం కావాలి అని ఈ ఉపశీర్షికకు వ్యాఖ్యానం చెప్పవచ్చు! అందరూ తనలాగే ఆలోచనతో జ్ఞానం పొందాలి అంటాడు బుద్ధుడు. తెలివిగల వారు ముందు జీవితం సంతోషంగా గడపాలంటారు. ఇంకా తెలివిగలవారు జీవితంలో చక్రనేమి అనుభవాలు రాకుండా ప్రయత్నిస్తారు. అందరికంటే తెలివిగలవారు అందరికోసం జ్ఞానోదయం కొరకు పాటు పడతారని గౌతమ బుద్ధుడంటాడు. ఈ సంప్రదాయాన్ని సవివరంగా అయినా, సులభంగా వివరించిన ఈ ఉపన్యాసాల సంకలనం, బౌద్ధం మీద ఆసక్తిగల వారికి ఆదర్శగ్రంథం. అలాగని, మిగతావారికి దీనితో పనిలేదనుకుంటే తప్పే.
నమ్మినవారికి కూడా ఆలోచన కలిగించే పద్ధతిలో ఎంతో గొప్పగా ఉన్నాయి ఇందులోని ప్రసంగాలు.
మొదటి ప్రసంగం చదివితే చాలు, అప్పటివరకు ఆయన పేరు వినని వారికయినా సరే, ఆయనమీద గొప్పగౌరవం కలుగుతుంది. ‘ఇది మనకు కాదు!’ అని మామూలు వారు అనుకునే విషయాన్ని ఆయన, చిన్న పిల్లలకు కథ చెప్పినంత సులభంగా చెప్పారు. మామూలు మనుషులు సత్యాలను చూడలేకపోతారు. బౌద్ధం సత్వాన్ని చూడగల తెలివిని ఇస్తుంది. నీకు నీవే రక్షకుడవు. శత్రువువు. బుద్ధుడు నిన్ను రక్షించడు. కర్మను అనువర్తించితే అది నిన్ను రక్షిస్తుంది అని చెప్పిన తీరు, అందరికీ అర్థమయ్యేట్లుగా ఉంది. పుస్తకంలోని అన్ని ఉపన్యాసాలు ఇంత సులభంగా ఉన్నాయనలేము గానీ ఏదీ అర్థంకాని రకంగా లేవని మాత్రం చెప్పవచ్చు. ధర్మమని ఒకటి ఉందంటే అవునని ఊరుకుంటే చాలదు. ధర్మంతో మనకు సంబంధం ఉండాలి అంటారు రామా తుబ్టెన్ యేషే. ఈ భావం అందరికీ అర్థమయితే ఎంతో మేలు జరుగుతుంది. కొన్ని అంశాలను గురించి సనాతన బౌద్ధం కనబరిచే తీరు మరాలి అని దలైలామా అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
బౌద్ధ వాఙ్మయంలో గతంలో తప్పులు దొర్లినట్లు ఆయన అనడం అంతకన్నా ఆశ్చర్యకరం. బోధిచిత్తం గురించి క్యాబ్జే లింగ్ రిన్‌పోచ్ మాటలు కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. బోధిచిత్తం ఉంటే అందరూ బోధి సత్యులవుతారు అంటారాయన. పుస్తకం చివరన పాలిటిక్స్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ పేరునగల ప్రొఫెసర్ రాబర్ట్ తుర్మన్ గారి ఉపన్యాసం సమకాలీన సమస్యలను, జీవనాన్ని గురించి వ్యాఖ్యానిస్తుంది. మిగతా ప్రసంగాలలో అంతా సాంప్రదాయక విషయాలే ఉన్నాయి. బౌద్ధం గురించి బాగా తెలిసిన వారికి ఈ చివరి ప్రసంగవ్యాసం ఎక్కువ నచ్చుతుంది. జీవులపట్ల ప్రేమ, బోధనలను హేతువాదంతో విశే్లషించడం, సాధనలు బౌద్ధానికి ప్రాణప్రదమయిన అంశాలని మొత్తం మీద అర్థమవుతుంది. తుర్మన్ ప్రసంగ వ్యాసంలో మాత్రం కర్మసిద్ధాంతాన్ని గురించి చేసిన వ్యాఖ్యానాలు అందరినీ ఆలోచనకు గురి చేస్తాయి. ఆ ఆలోచన నమ్మకాలనుబట్టి మరీ తీవ్రంగా ఉంటే ప్రమాదం కూడా ఉంది.
అర్థవంతమయిన జీవనం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగితే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి!
Wednesday, October 12, 2011
Sri Gita Govinda Kavyamu - A Book of Paintings
శ్రీ గీతగోవింద కావ్యము
రచన, బొమ్మలు: డా. టి. సాయి కృష్ణ
పేజీలు: 700, వెల: రూ. 1100/-
ప్రతులకు: ప్రజాహిత పబ్లిషర్స్,
1-1-1/18/1, గోల్కొండ, క్రాస్ రోడ్స్
హైదరాబాద్- 500 020
కాఫీ టేబుల్ పుస్తకాలు అనే పద్ధతి తెలుగు ప్రచురణ రంగంలో ఇంచుమించు లేదు. పుస్తకాన్ని, ఉన్నచోటే ఉంచి, హాయిగా కాఫీ చప్పరిస్తూ, గంటల తరబడి ఆనందంగా చూచి (!) చదివే పుస్తకాలు ఈ రకం కిందకు వస్తాయి. పుస్తకానికి వంద రూపాయలంటేనే గుడ్లప్పగించే మనవారికి వెయ్యి రూపాయల పుస్తకం అంటే గుండె ఆగిపోతుందేమో? అందుకే ప్రసిద్ధ చిత్రకారులు సాయికృష్ణగారు ఈ పుస్తకాన్ని ఆంగ్ల, ఆంధ్రాలలో కలిసి వేయించి, మంచి ఆలోచనలగల పని చేశారు. డాక్టర్ సాయికృష్ణ గారు, వృక్షశాస్త్ర నిపుణులు, బోధకులు, పరిశోధకులు. కానీ, ఆయన పేరున్న చిత్రకారులుగానే పాఠకులకు, ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. అందమయిన బొమ్మలతో ఆయన ఎప్పుడో అందరినీ అలరించారు. ఒకే విషయం గురించి ఎక్కువ బొమ్మలు గీయాలనిపించింది ఆయనకు అది గీతగోవిందం ఎందుకు కాకూడదన్న ఆలోచన, అదే తన విషయమన్న నిర్ణయాలకు ఆయనను అభినందించాలి. ఎంతకాలం శ్రమించారో మరి, ఇదుగో ఈ సుందర దృశ్య కావ్యం మన ముందుకు వచ్చింది.
జయదేవకవి గీతగోవిందం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘సావిరహే తవదీనా’ కారణంగా అది తెలుగువారి ఇంట ప్రవేశించింది. నిజం చెప్పాలంటే ఈ 28 పాటల ‘కావ్యం’ అసలు సిసలయిన శృంగారం (అడల్ట్, ఎరోటిక్) వ్యవహారం. అర్థం పట్టించుకోనివారు, ప్రకృతి-పురుష తత్వంగా చూచేవారు, దీన్ని భక్తి సాహిత్యంలో చేరుస్తూ వచ్చారు. సాయికృష్ణగారు మాత్రం పాటపాటకే గాదు, పాటలోని ప్రతి చరణానికి మూర్తిమత్వాన్ని ఆపాదించి అందమయిన బొమ్మలు (రెండు వందల పైన) వేశారు. బొమ్మలు ఎంత బాగున్నాయో? ఎంత బాగున్నాయో? అంత బాగున్నాయి! అంత బాగున్నాయి.
ఈ పుస్తకంలోని బొమ్మలు కొన్ని కేవలం నలుపులు తెలుపు రేఖా చిత్రాలు. కొన్నింటికి ఒక రంగు మాత్రమే వేశారు. ఎక్కువ బొమ్మలు మాత్రం రంగుల్లో ఉన్నాయి. ముఖ పత్రం మీద డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అన్న మాటలున్నాయి. కానీ రంగుల బొమ్మలు కూడా కుంచెలతో రంగులద్దినవి కావు. వీటికంతా డిజిటల్‌గా, కంప్యూటర్‌తో రంగులు వేశారు. అయినా బొమ్మలు ఆకర్షణగలవిగా ఉన్నాయి. దశావతారాలు, మిగతా కొన్ని చిత్రాలలో స్థాపత్యం పద్ధతిలో అంగసౌష్టవం కనబడుతుంది. రాధామాధవుల చిత్రాలు, వారితో వచ్చే మిగతా వ్యక్తుల రూపాలు, ఫ్రీ హ్యాండ్‌గా కనబడతాయి. కాని వాటిలో సాయికృష్ణ కనబరిచిన పనితనం ముగ్ధమనోహరంగా ఉంది.
పనిలో పనిగా ఈ చిత్రకారులు గీతగోవిందం గురించి చాలా సమాచారం సేకరించారు. వ్యాఖ్యానాలను సేకరించారు. ప్రతి శ్లోకాన్ని, పాటను, నాగరిలిపితో బాటు ఇంగ్లీషు (ట్రాన్స్లిటరేషన్), తెలుగు భాషలలో కూడా పొందుపరిచారు. రచనకంతా ఇంగ్లీషు తెలుగు వ్యాఖ్యానాలు కూడా జత చేశారు. కనుక పుస్తకం సమగ్రమయింది. ఈ కార్యక్రమానికంతా పండితులు సాయం చేసినట్లు రాసుకున్నారు. ప్రవేశిక లాంటి వ్యాసాలు గానీ, వ్యాఖ్యానం గానీ, అకడమిక్‌గా లేకపోతే ఎవరూ ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు.
గీతగోవిందం సంస్కృత రచన కదా? అది గీత్గోవింద్ ఎందుకయింది? సర్గల శీర్షికలోలోనే తేడాలున్నాయి. పాటలకు సూచించిన రాగతాళాల గురించి మరింత శ్రద్ధ అవసరం. మధ్యమావతి తాళం కాదు. ఒక శ్లోకాన్ని లేదా పాటను మూడు భాషల్లో అచ్చువేస్తే మూడు, మూడు దారుల్లో ఉన్నాయి. లెక్కలేనన్ని అచ్చుతప్పులున్నాయి. 275, 276 మరిన్ని పేజీల్లోని నాగరి అక్షరాలను ఎవరయినా పట్టించుకున్నారా? భారతీయ భాషలను ఇంగ్లీషులో రాయడానికి, అందరూ అంగీకరించిన పద్ధతులున్నాయి. వాటిని గురించి ఈ పుస్తకం పట్టించుకోలేదు. అ, ఆలకు పాటించిన పద్ధతిని ఇ, ఈలకు, ఉ, ఊలకు పాటించలేదు. ఇక మాటల విరుపు, (పదభంగం) గురించి ఎంత తక్కువ చెపితే అంత మేలు. నాగరిలో పాదమంతా ఒకటే పదం. తెలుగులో వీలుకొద్ది విరుపులు, ఇంగ్లీషు మేలు!
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంత అందంగా అచ్చు వేసిన పుస్తకంలోని ఈ స్ఖాలిత్యాలు, మనసుగల పాఠకుడిని కలతకు గురిచేస్తాయి. ఈ అందమయిన పుస్తకం తప్పకుండా మరోసారి అచ్చవుతుంది. అప్పుడు తగిన సంపాదకునికిచ్చి తప్పులు లేకుండా వేస్తే అది అర్థవంతంగా కూడా అవుతుంది.
Let us enjoy some good books!
^&**&^^&**&^
Tuesday, September 27, 2011
Rajani Bhava Tarangalu - A Review
This is a collection of articles by none other than Balantarpu Rajanikanta Rao garu.
It is no secret that I am his admirer.
Then is the review biased?
May be!
రజనీ భావ తరంగాలు (వ్యాస సంకలనం)
వెల: రూ. 100/-
రచన: బాలాంత్రపు రజనీ కాంతారావు
నవోదయ పబ్లిషర్స్, కార్ల్ మార్క్స్ రోడ్
విజయవాడ-520 002
అప్పన్నా తనామనా - మారోరె బైరన్న అని ఒక పాతకాలం పాట. ఈ పల్లవితో సినిమాల్లోనూ పాటలు వచ్చాయి. అప్పన్నా, తన్ననా, మాననా అని ఒకడంటే, మారోరే అని మరొకడన్నాడని రజని వ్యాఖ్యానం. కాదు, ‘అప్నా తన్ నమాన్నా’ అంటుంది ఈ సూపీ మాట అని వివరణ. అప్పన్న నుంచి ఆంధ్రా వరకు, గాంధర్వ వేదం నుండి శ్రీశ్రీ రేడియో నాటికల వరకు, వల్లగాని వైవిధ్యంతో వచ్చిన ఈ భావతరంగాలు ఒక్క బాలాంత్రపు రజనీకాంత రావు గారికే చెల్లు! వైఖరి గురించి చెప్పినంత సులువుగానే వందేమాతరం గురించి కూడా చెప్పడం రజనీగారిలోని ప్రత్యేకత.
కథకులు మధురాంతకం రాజారాంగారు ‘గణనీయులు’ అన్న కథలో ప్రతి మనిషికీ చరిత్ర ఉంటుంది అంటారు. ఇక రజనీ కాంతరావుగారి లాంటి వారికి చెప్పదలుచుకుంటే చరిత్రతోపాటు ఎన్నెన్ని శాస్త్రాలు, అంశాలు ఉంటాయో ఊహించవచ్చు. ఆంధ్రప్రభలో సంవత్సరంపైగా వారంవారం రాసిన 58 వ్యాసాలతో మరొకటి కూడా చేర్చి ప్రచురించిన ఈ పుస్తకం అందరూ చదవవలసినది!
వ్యాసాలలో, రజనీగారు కావాలని కొంత, అనుకోకుండా కొంత వైవిధ్యాన్ని పంచిన తీరు బాగుంది. సముద్రంలో అలలు ఒక క్రమంలో వస్తాయి. సముద్రం కన్నా విస్తృతమయిన రజనీకాంతుని మెదడులో అలలు పుడితే మాత్రం ఆ క్రమం ఆశించగూడదు. అయినా, ఆయనకు ఇది రాయండి అని చెప్పి రాయించుకోగలవారు ఎవరున్నారు? సినిమా, రేడియో, లలిత సంగీతం వరకు బాగానే ఉంది. వాటికి ముందు తర్వాత రజని మెదడులో గల సంపదను గురించి ఎంతమందికి తెలుసు? మహాపండితుల కుటుంబంలో పుట్టి, పాండిత్య వాతావరణంలో పెరిగిన రజనీగారు, సాహిత్య, పారస్వతాలను, సంగీత విశేషాలను గురించి చెప్పినా, కొత్త కోణాలు మన ముందుంచారు. కానీ, అనుకోని ఎన్నో విశేషాలను, ఏర్చి కూర్చి చెప్పి మరింత ఆసక్తిని పెంచారు. తాను పెరిగిన వాతావరణంలోని పెద్దల ఇళ్ళ గురించీ, జ్ఞాపకాల గురించి అలవోకగా చెపుతుంటే, వీరందరి గురించి మరింత వివరంగా చెపితే ఎంత బాగుండును అనిపించక మానదు!
విశ్వనాథ, పింగళి, కృష్ణశాస్ర్తి గారల గురించి చెప్పినంత ప్రేమతోనే, రేడియోలో ఇతరత్రా తనతోబాటు పనిచేసిన వారందరినీ గురించి చెప్పిన తీరు మనసుకు హత్తుకుంటుంది. రజని స్వయంగా, కవి, సంగీతజ్ఞుడు, పండితుడు. ఎన్నో గొప్పపనులు చేసి, చేయించిన మహామహుడు. అయినా తన గురించే గాక, మరెందరో మహామహుల గురించి చెప్పిన తీరు గొప్పది. ఎదుటివారిలోని మంచి తనాన్ని గుర్తించి, తలవంచే ఆయన మనస్తత్వం, ఆయనతో మెలిగిన వారికే తెలుస్తుంది. ఆచంట జానకిరాంగారి గురించి, మరిన్ని విషయాలను గురించి రాసిన వ్యాసాలు చదువుతుంటే ఈ భావతరంగాలలో తడిసిన వారికీ ఆ సంగతి తెలుస్తుంది.
184 పేజీల పుస్తకంలో ఎన్ని రంగాలు, ఎంతమంది మనుషులు (మామూలు వారు కారు) ఎన్ని విషయాలున్నాయో? ఈ వైవిధ్యం మామూలుగా దొరికేది కాదు. పెద్దలంతా ఈ రకంగా తమ అనుభవాలను రాయాలి! కేవలం నాఫ్టాల్జియా కొరకు కాదు! గతం గురించి తెలియడానికి ఈ రాతలొకటే ఆధారం! ఇలాంటి పుస్తకాలు ఈ మధ్యన అడపాదడపా వస్తున్నాయి. కొన్నింటిలో రచయిత ఒక్కరే అంతటా కనబడతారు. రజనీగారి భావతరంగాలలో ఆ ‘నేను’ కన్నా విషయాల మీద ఎక్కువ రాశారు.
రజనిగారు ఛాదస్తం మనిషి! ఎన్ని గొప్ప పనులు చేశారో ఆయనకే గుర్తు లేదు. అందుకే ఆయనకు రావలసినంత ‘గుర్తింపు’ రాలేదు. రజనీ భావతరంగాలు వదలకుండా చదివించగలవి. చదివితే, ఈనా చివరి మాటల గురించి మీకూ అర్థమవుతుంది!!
Let us enjoy good writings!
^&%^&%^&%
Tuesday, September 13, 2011
'Mo' - Nishadam
I was only waiting to meet him again and talk!
But, Alas, that is never to be!
Recently I wrote a review of his latest anthology of poems.
That was when he was still around!
I thought, like last time I wrote about him, we would again meet!
Anyway, Here is the review that appeared in Bhoomi daily!
‘మో’ నిషాదం (కవితా సంకలనం)
రచన: వేగుంట మోహన్ ప్రసాద్
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర
పేజీలు: 186 - వెల: రూ. 100/-
ఈ విశ్వంలోని ఏ విషయమూ ఒక క్రమంలో లేదు. కనీసం సింపుల్‌గా లేదు. అంతా గజిబిజి. అందంగా చెప్పగలిగితే సంక్లిష్టత. అది అస్పష్టత మాత్రం కాదు. జీవానికి ఆధారమయిన డి.ఎన్.ఎ., ప్రొటీన్లలో నిజానికి ఒక క్రమం ఉంటుంది. డి.ఎన్.ఎ. తాటినిచ్చెన లాగుంటుంది. అప్పుడది పని చేయదు. మెలి తిరుగుతుంది. ముడుచుకుంటుంది. చిక్కులు పడేదాకా చేరుతుంది. ప్రొటీన్లూ అంతే! సంక్లిష్టం అయితే గానీ, వాటికి తగిన గుర్తింపు, ఉనికి లేదు. ఈ సంక్లిష్టతలో నుంచి మరింత సంక్లిష్టత పుడుతుంది. అణువులలాగే మాటలు కూడా రకరకాల కలయికల్లో వస్తాయి. ఈ ప్రపంచంలో ప్రతి విషయంలోనూ సంక్లిష్టత ఉంది. కానీ, మాటలలో మాత్రం అది ఉండకూడదంటారు. భాష ప్రయోజనం, భావాలను ఇచ్చి పుచ్చుకోవడం, భావాలు అర్థం కాకుంటే అపార్థాలు పుడతాయి. కానీ ఎందుకని సంక్లిష్టమయిన భావాలు అందవు? అలవాటు లేదుగనుకనా? సంక్లిష్టతే సహజంగదా? భాష కూడా అట్లా ఉంటేనే గజిబిజి భావాలను, ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలోచనలు సింపుల్‌గా రావు. మరిమాటలెందుకు సింపుల్‌గా రావాలి?
ఇక కవిత దాకా వస్తే అది బతుకును ప్రతిబింబించాలంటారు. బతుకు మరి సజావుగా ఉండదని తెలియదా? కవితలో సంక్లిష్టతే సహజం కదా? బతుకులో పదచిత్రాలు మాత్రమే ఉన్నాయా? ఎక్కడో ఒక కవి సహజంగా కవిత చెపితే అంతా అదిరిపోతారెందుకు? ఈ ‘నిషాదం’ రాసిన ‘మో’ నిజంగా బతుకు కవి. మిగతా వారంతా వేమనలు. పండు వలిచి చేతిలో పెడతారు.
నేనేదో సింపుల్‌గా చెపుతాను. అయినా అది ఎవరికీ అర్థం కాదు. అంటాడు మో. అందుకే తనతీరు కొంత మార్చుకున్నాడులాగుంది. సాంధ్య భాషలోని ‘మో’ ఈ నిషాదంలో కనబడుతున్నాడా? వెదకాలి! ‘రచన ఎవరయినా చదివేదాకా దానికొక అస్తిత్వమంటూ ఉండదు’ అంటాడు మో. తను ముందుమాటగా రాసిన ‘ఆధునిక కవితా నేపధ్యం (థ్యం?)లో! ఇదొక మాస్టర్ స్టేట్మెంట్. ఈ కవి, తన సంగతి తనకు తెలియక రాయలేదు. బతుకును ప్రతిబింబించాలని రాశాడు. తన రచన అందరినీ సంతృప్తి పరచలేదని చెపుతున్నాడు కూడా. కానీ, కాలం, బతుకు ‘మో’ను కూడా అందరి దారిలోకి లాగినట్లుందేమిటి? మోహన్ ప్రసాద్, రకరకాల కవితలను, పద్ధతులను స్టడీ చేసిన అకడమిషియన్. ఆ ప్రభావం కవితల్లో వద్దన్నా తొంగిచూస్తూ ఉండేది. అది కూడా కాస్త తగ్గుముఖం పట్టింది.
‘మో’ నిషాదానికి ‘సీతారాం’, ‘ఆరున్నొక్క రాగం’ పాడారు. ఆయన తన మార్గంలో మోని విశ్లేషించారు. ఇందులో కావలసినంత సంక్లిష్టత ఉంది! బావుంది! కాంప్లెక్సిటీ ఈజ్ వల్నరబుల్’ అంటాడు డేవిడ్ క్రిష్టియన్. సంక్లిష్ట కవిత్వాన్ని, అస్పష్ట కవిత్వంగా అపార్థం చేసుకొంటాడు అంటాడు ‘మో’! సామాజిక స్పృహ లేకుంటే కవిత అర్థం గాదు! అది స్వంత గోలవుతుంది. అందుకేనా? పారడాక్స్ లు, అయిరనీలు, పొలిటికల్ పోయెమ్లూ? ‘మో’ మనల్ని ముల్లుతాడనుకుని చదువుతుంటే.
అంతర్ మధన పర్యంకంపై తిరుగుతున్న పంకాని నొక్కిందెవరు? దానిమీట చెక్కిందెవరు? అంటాడేమిటి? ఇంతకంటే బాగా చెప్పడం కుదరడం లేదా? 2000 సంవత్సరం నుంచి మొదలు, నిషాదంలో కవితలను కాలక్రమం ప్రకారం చేశారు. అక్కడే మార్గం మారిందనాలి! 2001లో ‘ఉర్దూ-అక్షరాలు’ మరీ మామూలు కవితయిందేమిటి?
2001లో ‘గుసగుసలు పోతారు మీరు, పోతేపోయాడు గానీ ఈ సన్యాసిగాడు’ ఇందులో అస్పష్టతా లేదు సంక్లిష్టతా లేదు! 2008 వచ్చేసరికి ‘వేణువుద్వారా, వేయింతల వలపు, వనమంతా విశ్వగీతికాలాపన’, రేడియో పాటలాగ వినిపిస్తుందేమిటి? 2010లో ‘రెండు వెలుపలలోంచి లోపలి ఒక వెలుగు లోగిలి’! చివరాహరిన ‘వడ్లగింజలో నువ్వుల గింజ’!
ఏం చేసినా ‘మో’ అంటే ‘మో’ ఒకడే. బట్ విల్ ద రియల్ మో ప్లీజ్ కమ్ అవుట్?
Let us enjoy good books!
(*)(*)(*)(*)
Sunday, August 7, 2011
Chankyas Chant - A Review
చాణక్యుని అసలు పేరు విష్ణుగుప్తుడు. అతని గురించి, అతనికి జరిగిన అవమానం గురించి మనం చదువుతూనే వచ్చాం. ఈ పుస్తకం చాణిక్యుని తండ్రి మరణంతో మొదలవుతుంది. కథ బలంగా ముందుకు సాగుతుంది. ఒక అధ్యాయం ముగుస్తుంది. రెండవ అధ్యాయం ‘ప్రస్తుత కాలం’ అంటూ మొదలవుతుంది. అది చాణక్యుని కథ కాదు. అది ఒక అపర చాణక్యుని కథ. అతని పేరు గంగాసాగర్ మిశ్రా. లక్నోకు చెందిన బీద బాపనయ్య అతడు. చాణక్యుడు తన కుటిల రాజనీతినంతా ఉపయోగించి, చంద్రగుప్తుడిని రాజుగా చేసిన వృత్తాంతం బేసి అధ్యాయాలలో, సరిగ్గా అదే పద్ధతిలో చాందినీ గుప్త అనే అమ్మాయిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయడంలో మిశ్రా ప్రదర్శించిన రాజనీతి సరసంఖ్య అధ్యాయాలలో సాగుతుంది ఈ నవల. ఈ నవలను ఎంతో పరిశోధించి రాశానంటాడు రచయిత. పుస్తకం చివరలో అయిదారు పేజీల రిఫరెన్సులు కూడా ఇచ్చాడు. గత చరిత్ర గురించి చదవడం అలవాటయిన వారికీ, ప్రస్తుత రాజకీయాలలోని ఆంతర్యం ఎరిగిన వారికీ ఈ నవల ‘ఫరవాలేదు’ అనిపిస్తుంది. కానీ, ఈ రెండు అంశాల గురించి ఏమాత్రం క్లూ లేనివారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఇది ‘ఆహా!’ లేదా ‘వావ్!’ లెవెల్లో నచ్చుతుంది. మంచి రేసీ ప్రోజ్ కనుక చదవడమూ సుఖంగా సాగుతుంది. ఇందులో గొట్టు ఇంగ్లీషు లేదు మరి!
చాణక్యుడు, గంగాసాగర్ పాత్రలు ఆకట్టుకునే రకంగా ఉన్నాయి. కానీ, వాటిలో అన్ని రకాలుగా పోలికలు మాత్రం లేవు. గమ్యం ఒకటే! తాను అనుకున్న పనిని సాధించి తీరాలి! అందుకు వారి పద్ధతులు వేరుగా కనబడతాయి. కాలం, మనుషులు వేరుగదా! ఇంతకూ ఈ ఛాంట్ అంటే మంత్రం ఎక్కడ నుంచి వచ్చింది. చాణక్యుని ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది. ఆమె అతనికి చేరువ కాలేకపోయింది. ఆమె గురించి ఇంకా చెబితే కథ బయటకు వస్తుంది. ఆమె, చాణక్యుని విజయం కోసం ఒక మంత్రాన్ని జపిస్తుంది. చాణక్యుడు ఈ మంత్రాన్ని జపించినట్లు ఎక్కడా కనబడదు. మంత్రం, మన ప్రస్తుతపు చాణక్యునికి దొరుకుతుంది. (అందుకు అలవిమాలిన పూర్వరంగం ఉంది!) ఒక అమ్మాయి అభివృద్ధి కొరకు ఆ మంత్రాన్ని జపిస్తే అది తిరుగు లేకుండా పని చేస్తుందని పాత కథలో అమ్మాయి చెపుతుంది. అక్కడ చాణక్యుడు, చంద్రగుప్తుడు ఇద్దరూ అబ్బాయిలే. ఇక్కడ మాత్రం చాందినీ గుప్త మంత్ర బలంతో ప్రధాన మంత్రి అవుతుంది. మరి మిశ్రా బుద్ధిబలం కూడా మంత్ర బలంతోనే వచ్చిందా?
టీవీలో చంద్రప్రకాశ్ తీసిన చాణక్య అందరినీ కుదిపింది. ఈ నవల చదవడానికి ఎంత బాగున్నా, అంత కుదిపే బలం మాత్రం లేదు. ఇందులో లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి. పాత్రలు వచ్చి పోతుంటాయి. ప్రధాన పాత్రలకు కూడా ఒక సరయిన రూపం ఏర్పడదు. చంద్రగుప్తునిలో నంగిరి పింగిరితనం తప్ప శౌర్యం కనబడదు. చాందినీ కొంత ఎదుగుతున్నట్లు కనబడినా పీ.ఎం. లెవెల్ కనబడదు. నవలను చదువుతూ వెనుక జరుగుతుండే కుట్రలు, పన్నాగాలు, ప్లానులు, స్ట్రాటజీలను స్టడీ చేయదలుచుకుంటే మాత్రం ప్రశ్నలు మిగులుతాయి.
చాణక్యుడు జుట్టుముడి వేసుకోలేదని ఒక కథ ఉంది. భోజన పంక్తిలో అవమానం, జుట్టు ఈ రచనలో కనిపించవు. వీటిని వెదకనవసరం లేదు. రచయిత దీన్ని ఒక నవలగా రాశాడు. పాత్రలకు ఎవరెవరినో మాటల అంటగట్టానని అతనే వివరాలిచ్చాడు. పుస్తకంలో హాయిగా చదివించే శక్తి ఉంది. కనుక చదవడమే! ప్రస్తుత రాజకీయాల గురించి మరీ పాఠం చెపుతున్నట్లు తోచినచోట పేజీ తిరగేయడమే. కొంపమునగదు!
Thursday, July 28, 2011
Damerla Rama Rao - A Book
రచన: వి. కలికావతారం
పేజీలు: 97, వెల: రూ. 95/-
ప్రతులకు: సి.పి. బ్రౌన్ అకాడమీ
53, నాగార్జున హిల్స్
పంజగుట్ట, హైదరాబాద్ - 82
ఫోన్ నెం. 040-23423188, 23430448-50
దామెర్ల రామారావు వాసనలు యింకా రాజమండ్రిలో మిగిలాయంటారు. ఆయన బతికింది 1897 నుంచి 1925 వరకు మాత్రమే. అంత తక్కువ వయసులోనే కలకాలం గుర్తుండవలసిన కళాఖండాలను ఆవిష్కరించాడతను. కానీ వాటిని జాగ్రత్తగా కాపాడడం మనవారికి ముందు తోచలేదు. తరువాత చేతగాలేదు. దామెర్ల కళాఖండాలన్నీ కాలానికి, వాతావరణానికి బలయ్యాయి. కలికావతారం లాంటి వారు మిగిలిన కొన్ని బొమ్మలను డిజిటల్ రూపంలో తెచ్చి వీలయినంత వరకు శుభ్రం చేసి అందరి ముందూ ఉంచారు. అప్పటికీ ఆయన గురించి ఎవరికీ పట్టనే లేదు. కనుకనే అకాడమీ వారు, కలికావతారం చేతనే, ఉన్న కొద్ది సమాచారాన్ని చిన్న పుస్తకరూపంలో తెప్పించారు. 100 పేజీల ఈ పుస్తకంలో 35కు పైగా పేజీల్లో బొమ్మలు, స్కెచెస్ ఉండడం ఎంతో ఉచితంగా ఉంది. ఆ బొమ్మలను చూస్తుంటే, మనం పోగొట్టుకున్న సంపద గురించి అర్థమవుతుంది. కళ్ళు చెమ్మగిల్లుతాయి.
ఎందుకు వేశారో తెలియదు గానీ, రెండవ అధ్యాయంగా శుభరాయ మహారాజ్‌గా మారిన ఒకానొక సుబ్బారావుగారి గురించి కొంచెంగా వివరాలిచ్చారు. రథంమీద అంటించిన కాయితాల మీద ‘శుభరామ్’ వేసిన బొమ్మలు అద్భుతంగా ఉంటాయి. ఈ పుస్తకంలో ఆయన గురించి రాసిన చోటే ఒక బొమ్మయినా అచ్చు వేసి ఉంటే ఎంతో బాగుండేది.
కూల్డ్రేను, గుడులలోకీ, పెళ్ళిళ్లలోకీ రానివ్వలేదు. అది గతశతాబ్దం తొలి రోజుల మాట. ఛాదస్తం నిలువెత్తుగా నిలబడిన రోజులవి. కానీ, అతను మాత్రం తన శిష్యులను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. బాపిరాజు నవలలు, కథలు తెలిసినంత, ఆయన బొమ్మలు మనకు తెలియవు. ఈ సంగతి గురించి కూడా పట్టించుకోవలసిన అవసరం ఉంది. వరదావారి శిష్యులు, శీలా వీర్రాజుగారు, కవి, రచయిత, చిత్రకారులు. వారిచేత గతం గురించి అప్పటి పద్ధతులను గురించి రాయించాలి.
ఇక పుస్తకంలోని అస లు విషయం దామెర్ల రామారావు, జీవితం, కళ ఇంతకు ముందే అనుకున్నట్లు అందులో వాసి ఉంది. రాశి లేదు. ఎన్నిసార్లు చెప్పినా కొనే్న సంగతులు కానీ, చిత్రకళ గురించి అంత ఆసక్తి లేని వారయినా, ఈ పుస్తకాన్ని ముందు ఉంచుకుని, ఒక్కొక్క బొమ్మనూ జాగ్రత్తగా పరిశీలించాలి. చదవడం గురించి చెప్పనవసరం లేదు. రామారావు భార్య సత్యవాణి కూడా చిత్రకారిణి కావడం ఒక విచిత్రం. ఆమె గురించి నాలుగు మాటలు, ఆమె గీసిన బొమ్మలు పుస్తకంలో ఉన్నాయి. భర్తను, పురిటి కందు బిడ్డను పోగొట్టుకుని సత్యవాణి చిత్రలేఖనానికి దూరంగా మారింది.
పుస్తకం గురించి కాదు, పుస్తకం చదవండి. బ్రౌన్ అకాడమీ వారు. ఈ ఒరవడిలో మరిన్ని మంచి విషయాల గురించి మంచి పుస్తకాలు తేవాలి. దామెర్ల గురించిన వ్యాసం, చిత్రాలు, 1930 దశకంలోనే నేషనల్ జియోగ్రాఫిక్‌లో వచ్చాయంటే ఆశ్చర్యం. ఆయనను ప్రపంచం అప్పుడే గుర్తించింది. మనమే మరిచి పోయాం!
దామెర్ల రామారావు వంటివారు అరుదు. వారిని ‘ఎవరు?’ అనగూడదు. ప్రశ్నకు జవాబు అందించిన కలికావతారం అభినందనీయులు.
Tuesday, May 10, 2011
Sriman Puttaparti Narayanacharya - A review
ఆయనది పరిధిలేని పాండిత్యం
-గోపాలం కె.బి
రచన: డా.పుట్టపర్తి నాగపద్మిని
సి.పి.బ్రౌన్ అకాడమీ,
53, నాగార్జున హిల్స్,
పంజగుట్ట, హైదరాబాద్
పేజీలు: 216, వెల: రూ. 95/-
ఫోన్: 23423188, 23430448
‘నారాయణాచార్యుల వాక్కు వణుకు లేనిది’ అన్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు. ఆ వ్యక్తిని గురించి, వాక్కును గురించి, బ్రౌన్ అకాడమీవారు సమగ్రమయిన పుస్తకం వ్రాయించారు. ఆ పుస్తకాన్ని ఆచార్యులవారి కుమార్తె నాగపద్మినిగారు రాయడం నిజంగా గొప్ప విషయం. నారాయణాచార్యులను గురించిన ఈ పుస్తకాన్ని నాగపద్మినిగారు ఒక కూతురుగా రాయలేదు. తండ్రిని ముందు గురువుగానే ఎంచి, అసలయిన అకడమిక్ సిద్ధాంత వ్యాసం పద్ధతిలో, శ్రమకోర్చి, వివరాలను సేకరించి, సోదాహరణంగా ఆమె చక్కని పుస్తకాన్ని అందించారు. మేరునగమంతటి మేటి పండితునికి, కూతురు పట్టిన ఈ నివాళి, సాహిత్యాభిమానులందరి నివాళిగా నిలిచింది.
నారాయణాచార్యులవారు సముద్రము వంటి వ్యక్తి. అందులోని లోతు అందరికీ అర్ధం కాదు. కానీ అందరికీ అందుతుంది. ఎన్నో భాషలలో పరిచయం, ప్రపంచం గురించిన అవగాహన కలిగి వారి కలానికి కలిగిన వైవిధ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారంగా ఒక కవి, రచయిత పేరు చెప్పగానే ఒకటి రెండు రచనలు అందరికీ తెలిసి ఉంటాయి. పుట్టపర్తి వారి విషయంలో ఇది అంత సులభంగా జరగదు. పెనుగొండ లక్ష్మి నిజానికి అందరికీ తెలుసు. కానీ అది వారి రచనలలో ఒకటి మాత్రమే. అదొక్కటే ఆయనగారి రచనలలో గుర్తుండిపోయేది మాత్రం కాదు. శివతాండవమయినా అంతే!
ఆచార్యులవారు కవి, రచయిత, అనువాదకులు, విమర్శకులు, వ్యాఖ్యాత ఇంకా ఎనె్నన్నో. ఎన్ని భాషలు నేర్చారు? ఎన్ని పనులు చేశారు? ఆ వైవిధ్యం గురించి వారికి తెలుసు! అందుకే ‘నా కవిత్వం బాగాలేదంటే కోపంరాదు. నేను పండితుణ్ణి కాదు అంటే మాత్రం కోపంవస్తుంది!’ అంటారాయన. రచనలను గురించి రాసినంత వివరంగా, వారి జీవితం గురించి కూడా మంచి పుస్తకం వస్తే బాగుంటుంది.
యువ ప్రాయంలో కాల్పనికత, తరువాత క్షేత్ర ప్రశస్తి, ఆ తరువాత ఆధ్యాత్మికం-రచనలు, వ్యాసంగం మామూలుగానే జరిగినట్టు కనపడుతుంది. పుస్తకంలో రకరకాల రచనలను వ్యాసాలుగా వివరించడం బాగుంది. ఆచార్యులవారి అభివ్యక్తి పద్ధతిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ అంశం గురించి ప్రత్యేకంగా మరింత రాస్తే బాగుండును. ‘దేవాంగనా వరిత దృక్పరిపూతమూర్తే’, ‘శిలలైన మనసులకు నే పాడలేనూ!’, ‘ఈ విరహ వీణలో ఎంతయానందమ్ము’ అన్నీ ఒకే కలంనుంచి వచ్చిన మాటలేనా? అదే కలం వేల సంఖ్యలో భక్తిరచనలు చేసింది. అదేకలం మరొక చోట ‘అవిగో మహాత్ముని నెత్తుటి చుక్కలు! ఏరుకోండి, ఏరుకోండి!’ అన్నది. పాండిత్యమంటే అది!
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గురించి పరిశోధన జరగలేదనడానికి లేదు. కానీ, జరగవలసింది మరెంతో ఉందన్న భావం ఈ పుస్తకం చదివిన తరువాత కలిగింది. తెలుగు జాతి రత్నాలు అన్న శీర్షికలో ఈ పుస్తకం రావడం ఎంత సమంజసంగా ఉంది. నాగపద్మినిగారు తదితరులు ఈ ప్రయత్నాన్ని ప్రారంభంగా భావించి, ఆచార్యుల వారి గురించి సాహితీ లోకానికి, సామాన్యులకు మరింత తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆశించడం ఆశకాదు! వారి గురించి వారి రచనల గురించి వచ్చిన ఈ పుస్తకం అందరిలోను ఈ ఆశను రేకెత్తిస్తుంది అంటే అనుమానమూ లేదు
చివరగా ఒక మాట! నారాయణాచార్యుల వారికి, ఏవో అవార్డులు రాలేదని ఒక అసంతృప్తి, కొందరిలో మిగిలి ఉంది. అందుకు కారణం ఆచార్యులవారే. వారేదో ఒక ప్రక్రియనుమాత్రమే పట్టుకుని అందులోనే సుడులు తిరిగి ఉంటే అందరూ గమనించేవారు. కానీ ఆయనది పరిధిలేని పాండిత్యం! ఆ గొప్పదనం, కొలబద్దకు అందలేదేమో? చాలా కొద్దిమంది మాత్రమే కొలతలకు లొంగకుండా ఎదిగిపోతారు. అరుదయిన ఆ తీరుగల వ్యక్తిత్వాన్ని స్థాలీపులాక న్యాయంగా, అద్దంలో కొండను చూపిన తీరుగా, ఈ పుస్తకం మనకు చూపిస్తుంది.















