Tuesday, June 2, 2026

గలోష్ - మిఖయిల్ మిఖయిలోవిచ్ జోషెంకో కథ (రష్యా)


గలోష్ 

మిఖయిల్  మిఖయిలోవిచ్ జోషెంకో రచన 1927   (రష్యా)

గలోష్

మియిల్ మిఖయిలోవిచ్ జోషెంకో

 

(గలోష్ అంటే చలి దేశాలలో బూట్లమీదుగా వేసుకునే ఒక ప్లాస్టిక్ తొడుగు)

 

అది నిజంగానే సులభం, ట్రామ్‌లో ఒక గలోష్‌ను పోగొట్టుకోవడం గురించి చెపుతున్నాను.
ముఖ్యంగా నీవొకవేపును పిండేస్తూ ఉంటే ఇక మరొక దుర్మార్గుడు వెనకనుంచి నీ కాలును తొక్కేస్తూ ఉంటే మరీను. ఒక్కసారిగా ` గలోష్ మాయం.
గలోష్‌ను పోగొట్టుకోవడం అంటే కేవలం చాలా సింపుల్.
నా గలోష్ ఊరికే ఊడి వచ్చింది. రెప్పపాటు, అంటే కంటిరెప్పపాటులోగా అని, మీరు అనవచ్చు.
నేను ట్రామ్‌లోకి ఎక్కానా ` రెండు గలోష్‌లు ఉన్నాయి. వాటిని ఇంకా నేను చూడగలను. ఎక్కుతూ ` స్థిరం చేసుకోవడానికి అన్నట్టు నేను వాటిని ముట్టుకున్నాను కూడా.
అయినాసరే, నేను దిగే సమయానికి ` ఒకే గలోష్, కనబడుతూనే ఉంది, ఒక కాలిమీద ఉంది, కానీ మిగతా గలోష్ పోయంది. నా బూటు అక్కడే ఉంది. ఇక సాక్‌ను కూడా చూడగలుగుతున్నాను. ఇక నా లాగూ కూడా తన చోట్లోనే ఉంది. కానీ గలోష్ లేదు.
ఇక ట్రామ్‌వెంట పరుగెత్తడం, వీలుకాదుగా.
మిగిలిన గలోష్‌ను తీసేశాను, దాన్ని న్యూస్‌పేపర్‌లో చుట్టాను ` ఇక నా దారిన వెళ్లిపోయాను. ‘పని ముగిసిన తరువాత కొంచెం పట్టించుకుంటాను’ అనుకున్నాను. ‘దాన్ని అంత సులభంగా వదిలివేయజాలను. అది ఎక్కడున్నా సరే, వెదికి పట్టుకోవాల్సిందే’.
పని ముగిసిన వెంటనే, ప్రారంభించాను. నాకు తెలిసిన ఒకానొక ట్రామ్ డ్రైవర్‌తో మొట్టమొదట మాట్లాడాను.
అతను నా నమ్మకాన్ని మరింత గట్టి చేశాడు.
నిన్ను నీవు అదృష్టవంతుడిగా లెక్కపెట్టుకో. నీవు దాన్ని ట్రామ్‌లో పోగొట్టుకున్నావ్. మరేదయినా చోటనయితే ఇంత గట్టిగా చెప్పగలిగేవాడిని కాదు. కానీ, ట్రామ్‌లో మాత్రం నీ గలోష్ ఇప్పటికే దొరికినట్టు లెక్క! మాకు పోగొట్టుకుపోయిన వస్తువుల గురించి ఒక ప్రత్యేకమయిన ఆఫీసు ఉంది, తెలుసా కేవలం అక్కడికి వెళ్లు, తెచ్చేసుకో. అది దొరికినట్టే’ అతను అన్నాడు.
సరే, థాంక్యూ, నా మెదడులోనుంచి బరువు దిగిపోయింది. గలోష్ నిజానికి కొత్తది తెలుసా. దాన్ని ఓ రెండు సంవత్సరాలుగా మాత్రమే వేసుకుంటున్నాను’ నేనన్నాను.
మరుసటి నాడు నేను ఆ ఆఫీసుకు వెళ్లాను. ‘అన్నలారా, నా గలోష్ నాకు తిరిగి దొరికే అవకాశం ఏమయినా ఉందా? అది ట్రామ్‌లో నానుంచి దూరమయింది’ అడిగాను.
తప్పకుండా, ఏ రకం గలోష్ అది?’ వాళ్లు అడిగారు.
ఒక మామÖలురకం గలోష్. సైజు పన్నెండు’ నేను చెప్పాను.
మా దగ్గర పన్నెండువేలు, పన్నెండు సైజువి ఉన్నాయని మా వాళ్లన్నారు. గుర్తించడానికి వీలుగా ఏదయినా చెప్ప్పు.’
దాన్ని గుర్తించడానికి లక్షణాలు చాలా మామÖలు రకం. మడమ దగ్గర కొంచెం మురికి పట్టింది. ఇక లోపల లైనింగ్ లేదు. లైనింగ్ అరిగిపోయింది.
మా దగ్గర, అటువంటి గలోష్‌లు వెయ్యి ఉన్నాయని, మా వాళ్లంటున్నారు. గుర్తించడానికి ప్రత్యేకంగా ఏమయినా సమాచారం ఉందా?’
ఉన్నాయి, ప్రత్యేకమయిన లక్షణాలు. వేళ్ల దగ్గర ఇంచుమించు చిరిగి ఉంది ` అది వేలాడుతున్నట్టు ఉంది. ఇక మడమ ఉండీలేనట్టు ఉంది. అడి బాగా అరిగిపోయింది. కానీ సైడ్స్ మాత్రం మరీ అంత పాడవలేదు. అవి ఇంకా ఒక్క ముక్కగానే ఉన్నాయి’ నేనన్నాను.
కాసేపు కూచో, వెంటనే వెళ్లి చూస్తాం’ వాళ్లన్నారు.
కొంచెంసేపయినా కాకముందే వారు నా గలోష్‌తో వెనక్కు వచ్చేశారు. నాకు పట్టరాని సంతోషం అయ్యింది. మరీ కదిలిపోయాను. ‘అవును, వీళ్ల పద్ధతులు చాలా బాగా పని చేస్తున్నాయి. ఎంత మర్యాదగల మనుషులు వీళ్లు’ అనుకున్నాను. ‘ఒక్క గలోష్ కొరకు ఇంత కష్టపడుతున్నారు’ అనుకున్నాను.
అంతులేని థాంక్స్, నేను బతికి ఉన్నంతకాలం’ నేనన్నాను. ‘దయచేసి నాకిచ్చేసేయండి, వెంటనే కాలికి వేసుకుంటాను. నిజంగా ధన్యవాదాలు’
లేదు, డియర్ కామ్రేడ్,’ వాళ్లన్నారు. ‘అంత సులభంగా కుదరదు. మాకు ఎలా తెలియాలి’ వాళ్లన్నారు కదా. ‘ఇది నీవు పోగొట్టుకున్నదే అని’
అది తప్పకుండా నాదే.  నా గౌరవం సాక్షిగా మాట ఇస్తున్నాను’ నేను అన్నాను.
మేం నిన్ను నమ్ముతాము. ఇక మీ పట్ల మా సానుభూతి కూడా ఉంది. కానీ బహుశా నీవు పోగొట్టుకున్నది ఇదే గలోష్ కావచ్చు. కానీ, మేం దాన్ని అలాగ ఇవ్వడానికి లేదు. నీవు నిజంగా గలోష్ పోగొట్టుకున్నట్టు సర్టిఫికెట్ మాకు అవసరం. ఈ సత్యాన్ని నీవు మీ హౌస్ మేనేజ్‌మెంట్ ఆఫీసు నుంచి ధృవీకరించుకురావాలి. అప్ప్పుడు ఇక ఏ ఆలస్యమÖ లేకుండా, నీవు న్యాయంగా పోగొట్టుకున్న వస్తువును నీకు తిరిగి ఇస్తాము.’
కానీ అన్నలారా, ప్రియమయిన నా కామ్రేడ్‌లారా, ఈ వాస్తవం గురించి ఆఫీసులో ఎవరికీ తెలియదు. వాళ్లు సర్టిఫికేషన్ ఇవ్వకపోవచ్చు’ నేను చెప్పాను.
అవును, ఇస్తారు, అదే వాళ్లపని. మరి ఇక వాళ్లు ఉన్నది దేనికి?’ వాళ్లన్నారు.
నేను గలోష్ వేపు మరోసారి చూచి వచ్చేశాను.
మరుసటినాడు నేను మా ఆఫీసు పెద్ద దగ్గరికి వెళ్లాను.
నాకు ఒక డాక్యుమెంట్ ఇవ్వండి, లేదంటే నా గలోష్ పోయినట్టే’ అన్నాను.
ఆహా, నీవు నిజంగా దాన్ని పోగొట్టుకున్నావా లేక తమాషా చేస్తున్నావా? ఊరికే ఒక ముక్కను సంపాదించుకోవాలని పథకం వేస్తున్నావేమో?’ ఆయన అన్నాడు.
దేవుని మీద ఒట్టు, దాన్ని నేను పోగొట్టుకున్నట్టు’ నేను చెప్పాను.
కేవలం నీ మాట ఆధారంగా, నేను ఇవ్వలేనన్నది, చెప్పనవసరం లేని సంగతి’ ఆయన అన్నాడు. ‘ఇక ఇప్ప్పుడు నీవు ట్రామ్ డిపోనుంచి గలోష్ పోగొట్టుకున్నట్టు ఒక సర్టిఫికేషన్ తీసుకువస్తే, నీకు నేను ఒక డాక్యుమెంట్ ఇవ్వగలుగుతాను. లేకుంటే, నా వల్ల కాదు.’
కానీ వాళ్లే నన్ను మీ దగ్గరికి ఊరికే పంపించారు.’
మరయితే, ఒక స్టేట్‌మెంట్ రాయి’ అన్నాడాయన.
ఏమని రాసేది?’
ఫలానా ఫలానా రోజున ఒక గలోష్ పోయింది అని రాయి, ఇక విషయం తేలేవరకు నేను పైన ఇచ్చిన చిరునామాలోనే ఉంటానని మాట ఇస్తున్నాను అని కూడా రాయి’ చెప్పాడాయన.
నేను స్టేట్‌మెంట్ రాశాను. మరుసటి నాడు నాకు అఫీషియల్‌గా సర్టిఫికేషన్ అందింది.
దానితో నేను ఆఫీసుకు వెళ్లాను, ఇక అక్కడ, మీరు ఊహిస్తారో లేదో, ఏ మాత్రం నస లేదా ఆలస్యం లేకుండా, వాళ్లు నా గలోష్‌ను నాకు ఇచ్చివేశారు.
కానీ ఇక నా గలోష్ నా కాలిమీదికి వచ్చిన తరువాత నేను మరీ పొంగిపోయాను. అవును, వీళ్ల పద్ధతి బాగా ఇంకా నిజంగా పని చేస్తుంది! అనుకున్నాను. ఒక వెనకబడిన దేశంలో నా గలోష్ గురించి వీళ్లు ఇంతకాలం, కష్టం ఖర్చు చేయడం గురించి మీరు ఊహించగలరా? లేదు,  వాళ్లు దాన్ని ట్రామ్‌లోనుంచి బయటకు విసిరి ఉండవచ్చు ` అంత సులభంగాను. కానీ ఇక్కడ మాత్రం, ఒక వారంలోపల అది నాకు తిరిగి చేరింది. ఎంత మంచి వ్యవస్థ!
కానీ కష్టం ఏమిటంటే, వారం రోజుల పాటు ఈ రావడం, పోవడాలతో, నేను మొదటి గలోష్‌ను పోగొట్టుకున్నాను.
న్యూస్‌పేపర్‌లో చుట్టి దాన్ని చంకలో పెట్టుకుని మోస్తూనే ఉన్నాను. ఇక దాన్ని ఎక్కడ వదిలానన్నది మాత్రం గుర్తులేదు. ట్రామ్‌లో మాత్రం కాదు ` అదే పెద్ద సమస్య. దాన్ని నేను ట్రామ్‌లో పోగొట్టుకోలేదన్నది నిజంగా సిగ్గుచేటు ` ఇక ఇప్ప్పుడు నేను దాన్ని ఎక్కడ వెతకాలి?
కానీ మిగతా గలోష్ నాకు చిక్కింది. దాన్ని నేను అల్మారామీద పెట్టాను.
కాస్త మనసు బాగా లేనప్ప్పుడు, నేను గలోష్ వేపు చూస్తాను. ఇక నా మనసు తేలికవుతుంది. వ్యవస్థ చాలా గొప్పదని నాకు నేనే చెప్ప్పుకుంటాను.

(1927లో ప్రచురించిన కథ)




 

No comments: