Saturday, April 17, 2010

On Writing

ఆలోచన“ఆలోచనైతే జరుగుతున్నది గాని, పని జరుగుతలేదు!”

“ఎందుకు? ఆలోచన మాత్రం పనిగాదా?”

“అట్లగాదు, నా ఆలోచన ఏం పనిజేతమా? అని!”

“అయితే?”

“అలోచనే జరుగుతున్నది. పని జరుగుతలేదు!”

“మళ్ల అదే మాట! ఆలోచనగూడ పనే!”

“ఏమన్న రాయాలని ఆలోచన”

“శాన బాగున్నది.”

“రాత మొదలవుతలేదు. ఆలోచననే సాగుతున్నది.”

“ఆలోచన వేరు! రాత వేరు!”

“ఆలోచన లేనిదే రాత ఎట్ల?”

“అందుకే ఆలోచన వేరు రాత వేరు అన్నది!”

“మరేం జేయాలె?”

“రాయదలుచుకుంటే రాయాలె!”

“లేదంటే?”

“అలోచించాలె!”

“ఆలోచించి రాయాలెగద”

“రాసి ఆలోచించగూడదా?”

“అదెట్ల?”

“రాతంటే ఏమి? అక్షరాతతోటి ఆలోచన!”

“మరి ఆలోచనంటె?”

“ఏమో?” నీ ఆలోచన అక్షరమో బొమ్మనో ఇంకొకటో నీకుదెలుసు!”

“అది తెలుసుకోవాలనే ఆలోచన!”

“అక్కడనే ఉంది అసలు కిటుకు. ఆలోచన గాలికి పోతున్నది. అది నిలబడితే, నీ ఆలోచనకు రూపము గలుగుతుంది.”

“ఎట్ల?”

“అది నీకు దెలువాలె.!”


No comments: