Friday, February 26, 2010

A question - Upanishads

ఉపనిషత్తులంటే ఏమిటి? వాటిలో ఏముంటుంది?


కొన్ని దశాబ్దాల కింద మనదేశంలో ‘బేసిక్ విద్య’ అనే పద్ధతి ఉండేది. ఆ పద్ధతికింద చదువులు నడిచే బడిలో పొద్దునా, సాయంత్రం, ప్రార్థనలు ఉండేవి. అందులో అన్ని మతాల గ్రంధాలనుంచి తీసిన ప్రార్థనలూ ఉండేవి. వాటిలో భాగంగనే సహనావవతు అని మొదలయే మంత్రం ఒకటి ఉండేది. అది, చదువులకు కూచునే ముందు గురుశిష్యులు, తమ చర్చ పనికివచ్చేదిగా సాగాలని, అభిప్రాయభేదాలు రాగూడదని చేసే ప్రార్థన. అది తైత్తిరీయం అనే ఉపనిషత్తునుంచి తీసింది. (దాన్నేదో మంత్రంగా చదవడం తప్ప, చెప్పిన వాళ్లకూ, అప్పజెప్పినవాళ్లకూ ఎవరికీ దాని అర్థం తెలిసిందిలేదు. అది వేరే సంగతి!)

వేదాలు నాలుగని అందరికి తెలిసే ఉంటుంది. వాటిలో ఏముందనే సంగతి కొందరికి తెలిసి ఉంటుంది. వేదాలు విస్తారమయినవి. ఆనాటి చదువు గొప్ప సంప్రదాయం గలది. ఒక విషయం నేర్చుకున్న తర్వాత, అందులోని అనుమానాలను శిష్యులు అడిగితే, గురువులు వాటికి వివరణ చెప్పేవారు. వేదాల చివరలోనూ అదే జరిగింది. అదే వేదాంతం. అంటే వేదాల చివరి భాగం. వాటికే ఉపనిషత్తులనికూడా పేరు.

ఉపనిషత్తులు మొత్తం నూటయెనిమిది ఉన్నాయంటే, వేదాలను గురించిన చర్చ ఎంత విస్తారంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అన్నింటిలోకీ, ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, మొదలయినలవి ముఖ్యమయినవి. ఆదిశంకరుల మొదలు మహామహులెందరో వీటికి వ్యాఖ్యానాలు చేశారు. ఉపనిషద్ అంటే దగ్గరగా చేర్చి, అనుమానం తొలగించడమని భావం.

ఇంకా తెలుసుకోవాలన్న కోరిక గల వ్యక్తిని బ్రహ్మత్వానికి దగ్గరగా చేర్చడం ఉపనిషత్తుల ఉద్దేశ్యం. బ్రహ్మ అంటే ఇక్కడ నాలుగు తలల బ్రహ్మకాదు. హిందూతత్వం ప్రకారం, అసలైన సత్యానికి పరబ్రహ్మమని పేరు. అనాదిగా ఆ నిజాన్ని అర్థంచేసుకోవడమే తాత్వికుల కృషికి లక్ష్యం. బ్రహ్మగురించి తెలిసినవారికి, తమగురించి తమకు తెలుస్తుందని, అందుకు గురువు కేవలం దారి మాత్రమే చూపగలడని, తర్వాత విద్యార్థిదే బాధ్యత అనీ, హైందవం బోధించింది.

వేదాల్లో మనిషి బ్రతుకుగురించి, ధర్మం గురించి చెప్పబడింది. ధర్మం రకరకాలుగా ఉంటుంది. అందులో కొంత పని. కొంత ఆలోచన. వీటి ఆలోచనే వేదాంతం.

What are Upanishads and what is their content?

A few of decades back our schools followed a method called ‘Basic Education.’ In the schools that followed the system, there would be a prayer meeting both in the morning and evening. Extracts from all religious denominations would form part of that prayer. There was a mantra which goes ‘Sahanavavatu’ as a part of that prayer. It was a mantra recited by the teacher and the taught before they commence a session of education. They pray that their session should be useful and there should not be any differences of opinions during it. It is a part of the Upanishad called Taittireeyam. (That people who recited it and those who made them recite it never knew the purport of the mantra is another matter!)

Many would know that Vedas are four in number. Their content is known to only a few. Vedas are vast in their extent. The education of the time had a hoary tradition. Once a lesson is over, the students would ask questions regarding the topic and teachers would clear the doubts as a ceremony perhaps. The same happened at the end of the Vedas too. That is what is called as Vedanta or the end of Vedas. The other name for the knowledge thus put together is known as Upanishads.

One can imagine the extent of discussion that took place on Vedas when one comes to know that there are in all 108 Upanishads. Of them, Isha, Kena, Katha, Prasna, Mundaka, Mandukya, Taittireeya etc are of prime importance. Starting from Adi Shankara many a scholar made commentaries on them to continue the discussion. The term Upanishad stands for bringing near and clears the doubts.

The aim of the Upanishads is to take the inquisitive to the nearest point to the Brahman. Brahman here is not the one with the four faces known to be in charge of creation as per mythology. Indian philosophy recognizes the ultimate truth as the Parabrahman. Philosophers spent all their time from time immemorial to reach this understanding. If one gets to know Brahman, one also gets know the self, is the belief. That a preceptor can only show the way towards this truth and the rest depends totally on the inquirer is also the said in Hinduism.

Vedas contain knowledge about human life and Dharma. This Dharma is of various kinds. Work nad thought also are the parts of it. The discussion about work and thought is the Vedanta!

Let us enjoy wisdom!
!!!!!!!

No comments: