పాబ్లో నెరూడా కవిత
by
Pablo Neruda
నిశ్శబ్దం
మనమంతా యిప్పుడు పన్నెండు దాకా లెక్క పెడదాం
ఇక అందరమూ మవునంగా ఉందాం
ఈ భూమ్మీద కనీసం ఒకసారి
మనం ఏ భాషలోనూ మాట్లాడకుండా ఉందాం
ఒక క్షణం మనం ఆగుదాం
చేతులు అంతగా ఆడించకుండా ఉందాం.
అదొక అపరిచిత క్షణమవుతుంది
తోపుడు ఉండదు, ఇంజన్లు ఉండవు
ఒక అకస్మాత్తు అపరిచితత్వంలో
మనమందరమూ కలిసి ఉంటాం
చల్లని సముద్రంలో జాలరులు
తిమింగలాలను బాధించరు
ఉప్పు కూడదీస్తున్న మనిషి
కమిలిన తన చేతులను చూచుకుంటాడు.
పచ్చని యుద్ధాలను సిద్ధం చేసేవారు,
గ్యాసుతో యుద్ధం, అగ్గితో యుద్ధం,
ఎవరూ మిగలని విజయాలూ,
ఆ తరువాత శుభ్రమయిన దుస్తులు ధరించి
ఇక తమ సోదరులతో కలిసి
నీడలో, ఏం చేయకుండా నడుస్తారు
నేను కోరినదాన్ని పూర్తి పనిలేమితో
పోల్చి తికమక పడకండి.
జీవితమంటే దాని గురించే
నాకు మరణంతో ఏ బంధమూ అవసరం లేదు.
మన బతుకులను కదలుతూ ఉంచడం గురించి
అందరమూ ఇంత ఏకాగ్రచిత్తంతో ఉంటే
ఒక్కగాసారి ఏం చేయలేకుండా ఉంటే
బహుశః ఒక మహత్తర నిశ్శబ్దం
మనల్ని మనం అర్థం చేసుకోలేనితనం
మనల్ని మనం మరణంతో బెదిరించడాలనే
ఈ విషాదానికి అడ్డు తగులుతుందేమో
అంతా చచ్చినట్టు కనబడినప్పుడు
తరువాత బతికే ఉందని రుజువయినప్పుడు
భూమి మనకు ఏదో బోధిస్తుందేమో
ఇప్పుడిక నేను పన్నెండు దాకా లెక్కబెడతాను
మీరు ఊరికే ఉండండి నేను వెళ్లిపోతాను
English version
Now
we will count to twelve
and
we will all keep still.
For
once on the face of the earth,
let’s
not speak in any language.
let’s
stop for one second,
and
not move our arms so much.
It
would be an exotic moment
without
rush, without engines.
we
would all be together
in
a sudden strangeness.
Fisherman in the cold sea
would
not harm whales
and
the man gathering salt
would
look at his hurt hands.
Those
who prepare green wars,
wars
with gas, wars with fire,
victories
with no survivors,
would
put on clean clothes
and
walk about with their brothers
in
the shade, doing nothing.
What
I want should not be confused
with
total inactivity.
Life
is what it is about.
I
want no truck with death.
If
we were not so single-minded
about
keeping our lives moving,
and
for once could do nothing,
perhaps
a huge silence
might
interrupt this sadness
of
never understanding ourselves
and
of threatening ourselves with death.
Perhaps
the earth can teach us
as
when everything seems dead
and
later proves to be alive.
Now
I’ll count to twelve
and
you keep quiet and I will go.
Every
single poem in Extravagaria is rewarding beyond words, beyond time. Complement
it with Neruda’s beautiful metaphor of the hand through the fence and the story
of his extraordinary life adapted in an illustrated love letter to language,
then revisit Paul Goodman on the nine types of silence and the lovely The Quiet
Book.
No comments:
Post a Comment