Saturday, December 11, 2010

Medha - 6

Another instalment of content from my page Medha in Andhra Bhoomi!

The link for the latest edition of Medha

మరో ప్రపంచం

November 21st, 2010

పట్టణాల్లో వాళ్ళకు పట్టదు గానీ, వర్షాలొచ్చాయంటే చాలు పురుగులు, తేళ్లు, పాములు, రకరకాల జీవుల కదలిక ఎక్కువవుతుంది. అంటే వర్షాలు లేని సమయంలో కూడా వీటి కదలిక ఉండనే ఉంటుందని అర్థం చేసుకోవాలి.

భూమిమీదా, నీటిలో, అడవిలో, ఎక్కడయినా సరే, మనకు ముందు పెద్దపెద్ద ప్రాణులు మాత్రమే కంటబడతాయి. పక్షులు, పశువులు, చేపలు మరెన్నో రకాలను మనం చూస్తాం. ఇవన్నీ కలిసి వాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే సన్నజీవులను వెనక్కు నెడుతుంటాయనవచ్చు. సన్నటి పురుగులు, కనీకనిపించని కీటకాలు ఎన్నో పట్నంలోనయినా సరే మట్టిలో కదులుతూనే ఉంటాయి. మొక్కనాటడానికని తోడబోతే చీమలదండు బయటపడుతుంది. లుకలుకలాడుతూ మరేవో పురుగులూ ఉంటాయి. సాలీళ్లు, బీటిల్స్ (పేడ పురుగులు), జెర్రులు మొదలు తేళ్లు, పాములదాకా ఎన్నెన్ని ప్రాణులో! అన్ని వాటంతటవి బతుకుతుంటాయి.

నిజానికి ఈ పురుగుల ప్రపంచానికీ, మనిషి ప్రపంచానికీ సంబంధం లేదని అనిపించవచ్చు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదని, అనుభవం ఒకవేపు, పరిశోధకులు మరోవేపు చెపుతున్నా మనం పట్టించుకోవడం లేదు. మట్టిలోని అణువులకు అంటుకుని, కంటికి కనిపించని బాక్టీరియా మొదలు మరెన్నో ప్రాణులు, మొక్కలు ఉంటేనే మన బతుకు ఈ రకంగా సాగుతుంది. అవి మనం అనుకున్నట్లు చెత్త, మురికి కావు. వాటితోనే మట్టి కూడా జీవంతమవుతుంది.

మన యింటిముందు మట్టిలోని (మట్టి ఉంటే!) ఈ జీవులన్నీ ఒక్కసారిగా మాయమయినాయనుకుందాం! ఆలోచనే భయంకరంగా ఉంది. ఒక్కసారి మట్టి తగ్గిపోతుంది. గాలిలో ప్రాణవాయువు, కార్బన్ డయాక్సైడ్, మిగతా రకరకాల వాయువుల మోతాదు మారిపోతుంది. వాతావరణ సమతూకం ఒక్కసారి కొత్త తీరుకు చేరుకుంటుంది. అదేదో అంగారకగ్రహం మీద నేలలాగ తయారవుతుంది.

నిజం! ఒక్క భూమిమీద మాత్రమే ఈ రకమయిన జీవావరణం ఉంది. ఈ పలుచుని పొరలోనే మనం కూడా ఒక భాగంగా ఉన్నాము. మనం బతకడానికి అవసరమయిన పరిసరాలు, పరిస్థితులు ఈ జీవావరణం వల్లనే వీలవుతున్నాయి.

జీవావరణంలోని ఎక్కువ శాతం ప్రాణులు. వాటిలోని జాతులు అన్నీ ఈ పైపొరలోనే ఉంటాయి. మొత్తం జీవం మనుగడకు అవసరమయిన రసాయన చర్యలన్నీ వాటి శరీరాల ద్వారానే జరుగుతుంటాయి. వాటి పనితనాన్ని వర్ణించడం ధైర్యమే అవుతుంది. చనిపోయి పడుతున్న జంతువృక్ష శరీరాలను తిరిగి రసాయనాలుగా మార్చే పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. పనికిరాని పదార్థాలను తినే ప్రాణులు కొన్ని. ప్రమాదకరమయిన వాటిని తినేవి మరికొన్ని. అది ఒక వలయం. చావు బతుకుల చక్రనేమి క్రమం. అందులో నుంచి, బతికిఉన్న చెట్లు, జంతువులకు తిండి పుట్టే పద్ధతి మరింత ఆశ్చర్యకరం! ఈ వరుస కొనసాగకపోతే జీవం లేదు, మనం లేము! అందుకే లుకలకలు, వికారాలతో సహా జీవులన్నీ ఉంటేనే మనకు మనుగడ!

ఇంత విచిత్రమయిన జీవులు, వాటి వైవిధ్యం గురించి పరిశోధకులకు కూడా తెలిసింది తక్కువ! ఉదాహరణకు బూజులని చెప్పుకునే ఫంజీ జాతిలో 60వేల రకాలను యిప్పటికి గుర్తించారు. ఇందులోనే కుక్కగొడుగులు, పుట్టగొగులు కూడా చేరతాయి. అవన్ని కలిసి 15 లక్షల రకాలవుతాయి. మట్టిలో వాటితోబాటు నులిపురుగులుంటాయి. మట్టితోడగానే కనిపించే పురుగులు, మనుషుల కళ్లలోకి కడుపులోకి చేరుతుంటాయి కూడా! అవి ఎన్ని లక్షల రకాలున్నాయో లెక్క తెగలేదు. వీటిని మించిన సంఖ్యలో మరెన్నో సన్నప్రాణులుంటాయి. ఒక గ్రాము మట్టిలో పదిలక్షలకు పైగా సంఖ్యలో కొన్నివేల రకాల బ్యాక్టీరియాలుంటాయి. వాటిలో చాలా రకాలు పరిశోధకులు కూడా ఎరుగనవి. ఇక కీటకాల సంగతి సరేసరి!

మట్టిలో, బూజులు, బ్యాక్టీరియా, నులిపురుగులు, చీమలు గజిబిజిగా ఉంటాయనుకుంటే తప్పే. మనుషుల సమాజంలో లాగే మట్టిలోని, సమాజంలో లోతును బట్టి పరిస్థితులు మారుతుంటాయి. అక్కడి మట్టి, గాలీ, నీరు, తిండీ, అన్ని మారుతుంటాయి. అదే ఆధారంగా జీవజాతులూ మారుతుంటాయి. ప్రతిరకం ఒక ప్రత్యేకమయిన పరిస్థితిలో మాత్రమే మనలుగుతుంది.

మట్టిలోని ప్రాణులన్నింటి వివరాలను చేతయినంతగా, ఒక చోటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ళ్య.్య అనే వెభ్‌సైట్‌లో ఆ వివరాలు చూడవచ్చు. అది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లైఫ్! ‘జీవసర్వస్వం’ అంటే అర్థం కుదురుతుందో లేదో!

ఈ జంతు వృక్షాల పరిశీలన ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెడుతున్నది. పర్యావరణం అంటే మనిషి, పశువులే కాదు! ఈ ప్రాణులన్నీ అందులో భాగమే!

పట్టణాల్లో వాళ్ళకు పట్టదు గానీ, వర్షాలొచ్చాయంటే చాలు పురుగులు, తేళ్లు, పాములు, రకరకాల జీవుల కదలిక ఎక్కువవుతుంది. అంటే వర్షాలు లేని సమయంలో కూడా వీటి కదలిక ఉండనే ఉంటుందని అర్థం చేసుకోవాలి.

భూమిమీదా, నీటిలో, అడవిలో, ఎక్కడయినా సరే, మనకు ముందు పెద్దపెద్ద ప్రాణులు మాత్రమే కంటబడతాయి. పక్షులు, పశువులు, చేపలు మరెన్నో రకాలను మనం చూస్తాం. ఇవన్నీ కలిసి వాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే సన్నజీవులను వెనక్కు నెడుతుంటాయనవచ్చు. సన్నటి పురుగులు, కనీకనిపించని కీటకాలు ఎన్నో పట్నంలోనయినా సరే మట్టిలో కదులుతూనే ఉంటాయి. మొక్కనాటడానికని తోడబోతే చీమలదండు బయటపడుతుంది. లుకలుకలాడుతూ మరేవో పురుగులూ ఉంటాయి. సాలీళ్లు, బీటిల్స్ (పేడ పురుగులు), జెర్రులు మొదలు తేళ్లు, పాములదాకా ఎనె్నన్ని ప్రాణులో! అన్ని వాటంతటవి బతుకుతుంటాయి.

నిజానికి ఈ పురుగుల ప్రపంచానికీ, మనిషి ప్రపంచానికీ సంబంధం లేదని అనిపించవచ్చు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదని, అనుభవం ఒకవేపు, పరిశోధకులు మరోవేపు చెపుతున్నా మనం పట్టించుకోవడం లేదు. మట్టిలోని అణువులకు అంటుకుని, కంటికి కనిపించని బాక్టీరియా మొదలు మరెన్నో ప్రాణులు, మొక్కలు ఉంటేనే మన బతుకు ఈ రకంగా సాగుతుంది. అవి మనం అనుకున్నట్లు చెత్త, మురికి కావు. వాటితోనే మట్టి కూడా జీవంతమవుతుంది.

మన యింటిముందు మట్టిలోని (మట్టి ఉంటే!) ఈ జీవులన్నీ ఒక్కసారిగా మాయమయినాయనుకుందాం! ఆలోచనే భయంకరంగా ఉంది. ఒక్కసారి మట్టి తగ్గిపోతుంది. గాలిలో ప్రాణవాయువు, కార్బన్ డయాక్సైడ్, మిగతా రకరకాల వాయువుల మోతాదు మారిపోతుంది. వాతావరణ సమతూకం ఒక్కసారి కొత్త తీరుకు చేరుకుంటుంది. అదేదో అంగారకగ్రహం మీద నేలలాగ తయారవుతుంది.

నిజం! ఒక్క భూమిమీద మాత్రమే ఈ రకమయిన జీవావరణం ఉంది. ఈ పలుచుని పొరలోనే మనం కూడా ఒక భాగంగా ఉన్నాము. మనం బతకడానికి అవసరమయిన పరిసరాలు, పరిస్థితులు ఈ జీవావరణం వల్లనే వీలవుతున్నాయి.

జీవావరణంలోని ఎక్కువ శాతం ప్రాణులు. వాటిలోని జాతులు అన్నీ ఈ పైపొరలోనే ఉంటాయి. మొత్తం జీవం మనుగడకు అవసరమయిన రసాయన చర్యలన్నీ వాటి శరీరాల ద్వారానే జరుగుతుంటాయి. వాటి పనితనాన్ని వర్ణించడం ధైర్యమే అవుతుంది. చనిపోయి పడుతున్న జంతువృక్ష శరీరాలను తిరిగి రసాయనాలుగా మార్చే పద్ధతి ఆశ్చర్యకరంగా ఉంటుంది. పనికిరాని పదార్థాలను తినే ప్రాణులు కొన్ని. ప్రమాదకరమయిన వాటిని తినేవి మరికొన్ని. అది ఒక వలయం. చావు బతుకుల చక్రనేమి క్రమం. అందులో నుంచి, బతికిఉన్న చెట్లు, జంతువులకు తిండి పుట్టే పద్ధతి మరింత ఆశ్చర్యకరం! ఈ వరుస కొనసాగకపోతే జీవం లేదు, మనం లేము! అందుకే లుకలకలు, వికారాలతో సహా జీవులన్నీ ఉంటేనే మనకు మనుగడ!

ఇంత విచిత్రమయిన జీవులు, వాటి వైవిధ్యం గురించి పరిశోధకులకు కూడా తెలిసింది తక్కువ! ఉదాహరణకు బూజులని చెప్పుకునే ఫంజీ జాతిలో 60వేల రకాలను యిప్పటికి గుర్తించారు. ఇందులోనే కుక్కగొడుగులు, పుట్టగొగులు కూడా చేరతాయి. అవన్ని కలిసి 15 లక్షల రకాలవుతాయి. మట్టిలో వాటితోబాటు నులిపురుగులుంటాయి. మట్టితోడగానే కనిపించే పురుగులు, మనుషుల కళ్లలోకి కడుపులోకి చేరుతుంటాయి కూడా! అవి ఎన్ని లక్షల రకాలున్నాయో లెక్క తెగలేదు. వీటిని మించిన సంఖ్యలో మరెన్నో సన్నప్రాణులుంటాయి. ఒక గ్రాము మట్టిలో పదిలక్షలకు పైగా సంఖ్యలో కొన్నివేల రకాల బ్యాక్టీరియాలుంటాయి. వాటిలో చాలా రకాలు పరిశోధకులు కూడా ఎరుగనవి. ఇక కీటకాల సంగతి సరేసరి!

మట్టిలో, బూజులు, బ్యాక్టీరియా, నులిపురుగులు, చీమలు గజిబిజిగా ఉంటాయనుకుంటే తప్పే. మనుషుల సమాజంలో లాగే మట్టిలోని, సమాజంలో లోతును బట్టి పరిస్థితులు మారుతుంటాయి. అక్కడి మట్టి, గాలీ, నీరు, తిండీ, అన్ని మారుతుంటాయి. అదే ఆధారంగా జీవజాతులూ మారుతుంటాయి. ప్రతిరకం ఒక ప్రత్యేకమయిన పరిస్థితిలో మాత్రమే మనలుగుతుంది.

మట్టిలోని ప్రాణులన్నింటి వివరాలను చేతయినంతగా, ఒక చోటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ళ్య.్య అనే వెభ్‌సైట్‌లో ఆ వివరాలు చూడవచ్చు. అది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లైఫ్! ‘జీవసర్వస్వం’ అంటే అర్థం కుదురుతుందో లేదో!

ఈ జంతు వృక్షాల పరిశీలన ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెడుతున్నది. పర్యావరణం అంటే మనిషి, పశువులే కాదు! ఈ ప్రాణులన్నీ అందులో భాగమే!

సాలెపురుగు తన గూట్లో తానెందుకు చిక్కుకోదు?
గోపాలం కెబి, November 21st, 2010

ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. విషజంతువుల శరీరంలోని విషం, ఆ జంతువుకు మాత్రం హానీ కలిగించదు. మన కడుపులో మాంసంతో సహా ఏం చిన్నా అరుగుతుంది. ఆ కడుపు మాత్రం అరగకుండా అట్లాగే ఉంటుంది. ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి గనుకనే జీవులు కొనసాగుతున్నాయి.

సాలె పురుగు ప్రశ్నకు మూడురకాల జవాబులు కనిపించాయి. వాటిల్లో మొదటిది - ఒక రకం చమురు గురించి చెపుతున్నది. సాలె పురుగు కాళ్ళలో ఒక రకం చమురు ఉంటుందనీ, అందుకే దారాలు వాటికి అంటుకోవని కొందరు అన్నారు. కానీ ఈ రకం చమురు గురించి ఎవరూ వివరాలు కనుగొన్నట్లు లేదు. కనుక అది ఊహ మాత్రమే అనవచ్చు. రెండవది - సాలె పురుగు తయారు చేసే దారాలు అన్నీ ఒకే రకంగా ఉండవు. ఒక్కోరకం దారం లావు, తీరు వేరుగా ఉంటుంది. అన్నిటికన్నా లావుగా ఉండేది వేలాడే తాడు. అదీ ఆధారంగా ఉండే విలువ తాళ్లూ అంటుకునే రకం కావు. పురుగులు ఎక్కువగా వీటి మీదనే తిరుగుతాయనీ, అందుకే తమ గూట్లో తాము చిక్కకుండా ఉంటాయని కొందరన్నారు. ఇది కొంతవరకు నిజం. సాలెపురుగులు ఎక్కువగా నిలువు తాళ్ళ మీదనే తిరుగుతాయి. అయినా గుండ్రంగా అల్లిన తాళ్ళమీదకు పోవని చెప్పడానికి లేదు. అట్లా పోయినప్పుడు కూడా అవి చిక్కకుండా వచ్చేస్తాయి! ఇక మూడవ జవాబుతో చిక్కుముడి విడిపోతుంది. ఇది సిసిలయిన సైంటిస్టుల జవాబు. పెద్ద భూతద్దాల కింద సాలెపురుగు కాళ్లను పరిశీలిస్తే వాటిలో కొక్కాలు ఉన్నట్లు తెలిసింది. నడిచేందుకు పట్టునిచ్చే రెండు కొక్కాలు ప్రతికాలు చివరనా ఉంటాయి. మూడవది కూడా ఒకటి ఉండి గూటిమీద నడిచేటప్పుడు పోగులు తెగకుండా జాగ్రత్తగా వాటి నుండి కాళ్లు వదిలిస్తూ ఉంటుందని పరిశోధకులు చూడగలిగారు. దారాలకు సాగే లక్షణం ఉంటుంది. కనుక కొక్కెం దారాన్ని లాగి, కాలి నుంచి వేరు చేస్తుంది. వీణ తీగెను లాగినప్పుడులాగే, ఈ తీగెలు కూడా కంపిస్తాయట గూడా! సాలె పురుగు తయారుచేసే పట్టుదారానికి, అసలు పట్టుకన్నా గట్టి గిరాకీ ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ దారం గట్టిదనం రహస్యం తెలిస్తే బులెట్ ఫ్రూఫ్ దుస్తుల తయారీలో ఆ పద్ధతిని వాడవచ్చునని కొందరు పరిశోధిస్తున్నారు. శరీర భాగాలలో వాడాలని వైద్యపరిశోధకులు, చేప గాలల నుంచి మొదలు రాళ్ళమీద పాకేందుకు వాడే తాళ్ళ కోసం, విమానాల్లో వాడకం కోసం మరిన్ని పరిశీలనలు జరుగుతున్నాయి. తయారయిన దారాలను అవసరమయినంతగా సేకరించడం కుదరదని తెలీదు. అందుకే బయోటెక్నాలజీ వారు రంగంలోకి దిగి దారాలను తమ పద్ధతిలో తయారు చేస్తామంటున్నారు.

జీవం - అంకెల్లో..!

November 21st, 2010

మొట్టమొదట జీవం ఏకకణజీవుల రూపంలో పుట్టింది 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం. అయినా ప్రాణం యొక్క అవశేషాలు మాత్రం 600 మిలియన్ సంవత్సరాలు నాటివి మాత్రమే దొరికాయి.

ఒక మిలియన్ బిలియన్ల చీమలు ప్రస్తుతం భూమిమీద ఉన్నాయని ఒక లెక్క.

కనీసం పదికోట్ల రకాల బహుకణ జీవులు ప్రస్తుతం భూమిమీద ఉన్నట్లు మరో లెక్క.

క్రీ.పూర్వం 10,000 సంవత్సరాలప్పుడు మానవ జనాభా కోటికి మించలేదు.

1974 నుంచి 1999 మధ్య అంటే 25 సంవత్సరాల్లో మనుషుల సంఖ్య నాలుగు బిలియన్ల నుంచి ఆరు మిలియన్లకు పెరిగింది.

అంకెలు అబద్ధమాడవా?

November 22nd, 2010

అమెరికాలో ఒకప్పుడు మెక్ కార్తీ అనే ఒక సెనేటర్‌కు ఒక్క దెబ్బతో గొప్పపేరు వచ్చేసింది. అతను చేసిన ఘనకార్యం, అంకెలను వాడుకోవడం, అంకెలతో ఆడుకోవడం. ఒకానొకనాడు అతను చట్టసభలో లేచి నిలబడి, చేతిలో ఒక కాయితాల కట్టను ఎత్తి ఊపుతూ ‘అమెరికన్ ప్రభుత్వపు అతి కీలకమయిన స్టేట్ శాఖలో 205గురు కమ్యూనిస్టులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదుగో వాళ్ళ వివరాలు!’ అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అవాక్కయ్యారు. రెండు రోజుల తర్వాత ఆ అంకె 207 అయింది. ఒక్కసారిగా అది 57కు దిగింది. అధ్యక్షుడు ట్రామన్‌కు రాసిన లేఖలో మెక్ కార్తీ ఈ అంకెను వాడాడు. ఆ తర్వాత 81 మంది వివరాలు నాదగ్గర ఖచ్చితంగా ఉన్నాయన్నాడు.

ఇంతకూ స్టేట్‌శాఖ ఉద్యోగుల్లోకి కమ్యూనిస్టులు నిజంగా దూరి ఉన్నారా? ఈ ప్రశ్నకు జవాబు ఎవరికీ తెలియదు. చివరకు మెక్ కార్తీకే తెలియదు. అతను సభ ముందు చేసిన ప్రసంగం అంతా ఒక కల్పన!

మెక్ కార్తీకి ఒక సంగతి మాత్రం బాగా తెలుసు! అంకెలంటే అందరికీ తాను చెప్పే సంగతి మీద సులభంగా నమ్మకం కుదురుతుందని అతను అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాడు. అప్పట్లో వైట్‌హౌస్ అధికారులకు, అతను చెపుతున్నదంతా కట్టుకథ అన్న అనుమానం రానే వచ్చింది. కానీ అతను అంకెలతో బాటు చెపుతున్నందుకు వారు కూడా అనుమానంలో పడ్డారు.

అంకెల సాయంతో చాలాసార్లు, చాలా మంది అందరినీ మోసపుచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఛార్ట్స్ సెయిఫ్ అనే గణిత పరిశీలకుడు ఈ మధ్యన ‘ఫ్రూఫినెస్ - ద డార్క్ ఆర్ట్స్ ఆఫ్ మాతమాటికల్ డిసెష్షన్’ అన్న పేరుతో ఒక పుస్తకం రాశారు. అంకెలను అందంగా వాడుకోవడం గురించి ఈ పుస్తకంలో ఆయన ఎన్నో ఆసక్తికరమయిన అంశాలను ప్రస్తావించారు. పుస్తకంలో తాను మెక్ కార్తీ గురించి రాసానని, అంకెలను వాడడం అన్న ట్రిక్‌కు అది గొప్ప ఉదాహరణ అనీ సెయిఫ్ అంటున్నారు.

‘అంకెలతో బాగా నమ్మకం కుదురుతుంది. అందునా, సుమారు ఉజ్జాయింపు కాకుండా ఖచ్చితమయిన అంకెలు చూపిస్తే ఎవరయినా ఆ సంగతిని సులభంగా నమ్ముతారు. నేను అంకెల గురించి పరిశోధిస్తాను అని చెప్పడంలో మాత్రం అంకెలు లేవు’ అంటూ సెయిఫ్ చమత్కరించారు. అదే మరి మెక్ కార్తీ చెప్పిన 205ను మాత్రం అందరూ సులభంగా నమ్ముతారు అంకెను చూడగానే లేదా వినగానే.

అవి అసలు సిసలయిన నిజం లాగా తోస్తుంది. అంకెలంటేనే వాస్తవం గదా మరి’ అంటారాయన.

కానీ అంకెలను సులభంగానూ, మరీ సీరియస్‌గానూ నమ్మితే ప్రమాదాలు ఎదురవుతాయి. అది ఉజ్జాయింపు అనే మాటకు వ్యతిరేకపదంగా మారుతుందని ఆయన అభిప్రాయం. ఇందుకు ఉదాహరణగా సెయిఫ్ ఒక చిత్రమయిన కథను చెప్పారు.

న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో ఒక డైనోసార్ నమూనా ఉంది. వచ్చిన వాళ్ళకు ప్రదర్శనలోని అంశాలను వివరించే ఒక ఉద్యోగి ‘ఈ రాక్షసిబల్లి వయసు 6,50,000,038 సంవత్సరాలు!’ అని చెప్పాడట. ‘అంత సరిగ్గా ఎట్లా చెపుతున్నావు?’ అని అడిగితే నేనిక్కడ గైడ్‌గా చేరి 30 సంవత్సరాలయింది. మొదట్లో నేను చేరినప్పుడు ఈ రాక్షసి బల్లి వయసు 65 మిలియన్ సంవత్సరాలని చెప్పారు!’ అన్నాడతను! నిజమే ఒక రకంగా అతని మాటను నమ్మవలసిన అవసరం ఉంది.

ఇక్కడ అరవై అయిదు మిలియనులు లేదా ఆరుకోట్ల యాభయి లక్షలు అన్న అంకెను అతను మరీమరీ సీరియస్‌గా తీసుకున్నాడు. నిజానికి రాక్షసి బల్లులు అరవై అయిదు మిలియన్ సంవత్సరాల నాటివి అన్న లెక్క ఒక ఉజ్జాయింపు. అది ఒక లక్షసంవత్సరాలు అటూ, ఇటూ అయినా తప్పులేదు. అందులో 38 సంవత్సరాలు అనగా నెంత? అందుకే కార్టూన్ బొమ్మలోని కల్పితపాత్రల వయసులాగ, ఈ 65 మిలియనులు అన్న అంకె ఎంతకామయినా అట్లాగే ఉంటుంది మరి!

ఈ మధ్యన ఎన్నికలు, మిగతా కొన్ని సందర్భాలలో ‘ఒపీనియన్ పోల్’ అనే పద్ధతిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, అంకెల రూపంలో చెప్పడం బాగా సాగుతున్నది. ‘ఇలాంటి చోట్ల వారు చెప్పే అంకెలు, జయాపజయాల అవకాశాలు కూడా సీరియస్‌గా తీసుకోవలసిన అంకెలు కావు’ అంటారు చార్ల్స్ సెయిఫ్! అసలు ఎంతమంది నుంచి అభిప్రాయాలు సేకరించారు అన్న చోట అంకె విలువ, దానిమీద నమ్మకం మొదలవుతాయి. ఇద్దరిని అభిప్రాయం అడిగి, అందులో ఒకరి పక్షాన్ని లెక్కలోకి తీసుకుని 50 శాతం మంది ఇలా అంటున్నారు అంటే ఎలా ఉంటుంది?

ఇదంతా కూడా ఉజ్జాయింపుకు వ్యతిరేకమయిన ‘ప్రూఫినెస్’ కిందకే వస్తుంది!

కుక్కలు!

November 22nd, 2010

ఈ ప్రపంచంలో ప్రస్తుతం నలభయి కోట్ల కుక్కలు ఉన్నాయని అంచనా. అమెరికా, మెక్సికోలను కలిపితే జనాభా కూడా అంతే ఉంది!

ఒక కుక్క ముక్కులో వాసన పసిగట్టే రిసెస్టర్లు 22కోట్లు ఉంటాయి. మనిషి ముక్కులో అందులో నలభయ్యవ వంతు మాత్రమే ఉంటాయి.

కుక్క ముక్కును ఆధారంగా, వాసనలు పసిగట్టగల యంత్రాన్ని తయారుచేసే ప్రయత్నాలు పెన్‌స్టేట్ యూనివర్శిటీలో జరుగుతున్నాయి.

కుక్కలు 45,000 హెర్ట్జ్‌ల పౌనఃపున్యం వరకూ ధ్వనులను వినగలుగుతాయి. మనిషి వినికిడి శక్తి అందులో సగానికి సగం! నిజానికి కుక్కలకన్నా మంచి వినికిడి శక్తిగల జంతువు పార్పాయిస్. అది 1,50,000 వరకు వినగలుగుతుంది.

బెల్జియం, రష్యా, జెర్మనీ దేశాలలో 31,000 సంవత్సరాల నాటి కుక్కల అవశేషాలు దొరికాయి.

సిడో అనే కుక్క, కంప్యూటర్ స్క్రీన్ మీద కుక్క కనిపిస్తే దాన్ని ముక్కుతో ముట్టుకుంటంది. అదే మరో దృశ్యం కనిపిస్తే మాత్రం దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని వియెన్నా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రకటించారు!

కుక్కల్లో ‘అసూయ’ ఉందని పరిశోధకులు గమనించారు. తోటి కుక్కకు మంచి బహుమతి అందితే అవి మరింత శ్రమపడి యజమానిని మెప్పించే ప్రయత్నం చేస్తాయట

......అలలు......

November 22nd, 2010

(Save the picture to use as a desktop wallpaper)

అలలోనుంచి శక్తి వస్తుంది. తీరం తీరుకు అలలే కారణం! అలలు భయంకరమైనవి..

అయినా అందంగా ఉంటాయి!
Let us enjoy sceince!!

No comments: