సాదత్ హసన్ మంటో 1
సాదత్ హసన్ మంటో
సాహితీ
మిత్రులతో మాట్లాడుతూ ఉండగా రచయితల గురించి ప్రసక్తి వచ్చింది. పట్టించుకుని
ప్రపంచానికి ఎత్తి చూపించవలసిన రచయితల గురించి చర్చ మొదలయింది. సాదత్ హసన్ మంటో ఉర్దూలో పెద్ద
ఎత్తున కథలు రాసిన మహా
రచయిత.
మామూలు పద్ధతికి ఎదురుతిరిగి తన కలం వాడితో వేడి పుట్టించిన రచయిత. ఆయన కథలు
తెలుగులో వందకు పైగా వచ్చాయని మిత్రులు చెపితే, ఆశ్చర్యం కలిగింది. ఆ కథలు మంటోలాగే
మనుషుల మధ్యన ఉండి కూడా మనుషులకు దూరమయినట్టు భావన కలిగింది. మంటో
భారతీయుడు. స్వాతంత్రం తరువాత అప్పటి దారుణ పరిస్థితులను గురించి, దేశం
విడిపోవడం
గురించి, మరీ బట్టబయలుగా కథలు రాసి సంచలనం
సృష్టించాడు. కోర్టులపాలయ్యాడు. చివరికి దేశాన్ని వదిలి పాకిస్తాన్ పారిపోయాడు. మంటో మన
దేశంలో ఉండకపోవడం ఒకరకంగా మనకు నష్టం.
మంటో
పేరులో మాత్రమే అతని మతం కనిపిస్తుంది. అతని అభిమతం మాత్రం పూర్తిగా వేరు.
సంస్కృతి అంతకన్నా వేరు. అది అతని రచనల్లో కొట్టవచ్చినట్టు
కనిపించింది.ఇక్కడ కొట్టవచ్చినట్టు అన్నమాట అక్షరాలా నిజం. “ఖోలో” లాంటి కథలు ముఖంలో పిడిగుద్దు గుద్దినట్టు వచ్చి
తగిలాయి. అందరికిలాగే “టోబా టేక్‌సింగ్' కూడా కలకాలం గుర్తుంటాడు. మంటో కథలు అన్నీ ఇంత మొరటుగాను, ఇంత
మొనగలిగినవిగాను ఉండవు. కొన్ని మెత్తగానే, చెప్పవలసిన సంగతులను తలకెక్కిస్తాయి. ఈ
రచయిత కథలు తెలుగులో వచ్చి ఉంటే, వాటి గురించి చర్చ జరగకపోవడం మాత్రం
గొప్ప అన్యాయం. సమాజంలో ఉన్న కుళ్లు గురించి తెలియకుండానే బతుకులు సాగుతాయి. ఉన్న
కుళ్లును ఏ రకంగా ఎత్తిచూపినా, దాని గురించి చర్చ మొదలుకావాలి.
చాలామంది రచయితల బాధ ఇదే. ఎత్తి చూపని సమస్యలు చివరకు అన్నిరకాలా
తెరమరుగవుతాయి. అది జరగకూడదనే రచయితలందరూ గొంతెత్తి ఘోషించారు. గోలచేశారు. బాధలను
గమనించిన ఈ రచయితలు వాటిని మనసులో దాచుకోకుండా అందరికీ పంచి ఇచ్చారు. మంచి మాత్రమే
పంచడం ఒక పద్ధతి అయితే, చెడును ఎత్తిచూపి మంచి దారులు ఉండాలని
సూచించడం మరో ఎత్తు. పూలు, వెన్నెలలను గురించి పాటలు రాసుకుంటే
అభ్యంతరం లేదు. కానీ, చీకటి గురించి చెప్పి చిరు దీపం
అందించిన రచయితలను మనం మరింత ఎక్కువగా గుర్తుంచుకోవాలి.
సాదత్
హసన్ మంటోను పాకిస్తానీ రచయిత అంటున్నారు. అతను రాసిన ఉర్దూ ప్రస్తుతం మన దేశంలో
వాడుకలో ఉన్న ఉర్దూ ఒకటి కాదు. కానీ, మంటో కాలంలో ఆ యాసభాష మన దగ్గర కూడా
మాట్లాడుకున్చదే! చివరకు అప్పటి సినిమాల్లోనూ ఆ భాష ఉండేది. మంటో కథలను నాటకాలుగా
మలిచి నసీరుద్దీన్ షా లాంటివాళ్లు ప్రదర్శిస్తున్నారు. అసలు కథలను చదివినా, ఆ భాషను విన్నా
అది మన హిందుస్తానీకి చాలా దగ్గరగా ఉంటుందని సులభంగానే అర్థమవుతుంది.
అక్కడక్కడ
మాత్రం మన సమాసాల వంటి కొన్ని మాటలు అందంగానే ఎదురువుతుంటాయి. అవి బహుశా ఈ కాలం అనువాదకులకు
సులభంగా లొంగవు. మంటో భారతీయ రచయిత. భారతీయ సమస్యలను ఎత్తి భారతీయ పాఠకుల కొరకు భారతీయ
భాషలోనే రాశాడని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. చెప్పవలసిన అవసరం ఉంది కూడా! మంటో
కథలు మరిన్ని రావాలి. సంకలనాలు రావాలి. వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి.
మంటో
మన దేశం వదిలి వెళ్లడానికి కారణాలు ఉన్నాయి. అలాగని ఆ మహారచయితను మనం
వదిలివేసుకోవడానికి లేదు. పారిపోయేనాటికి మంటోకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అతను
ఇప్పటి ముంబై, అప్పటి బాంబేలో ఉండేవాడు. దేశం
విడిపోయిన తరువాత మాహీమ్, భేండీ బజార్లలో జరిగిన ఘాతుకాలను
గురించి అతను కథలలో రాశాడు. నిజానికి ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే, ఇంకా
ఇక్కడే మిగిలినవాళ్ల గురించి ఆలోచనలు మొదలవుతాయి.
మంటో
ఎక్కువగా చదువుకున్నవాడు కాదు. అసలు అతనికి చదువు మీద పెద్ద పట్టింపులేదు.
కాశ్మీర్‌కు చెందిన మంటో కుటుంబం కొంతకాలం అమృత్‌సర్‌లో కొనసాగింది.
తండ్రి
గతించిన తరువాత మంటో పత్రికారంగంలో పని వెతుకుతూ బొంబాయి చేరుకున్నాడు. పత్రిక
ఆఫీసుల్లోనే పడుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలలో కొంచెం పని దొరికింది. అయితే, సినిమాల్లో
అతని రచనలు పేరు సంపాదించలేదు. నిలదొక్కుకోవడానికి చోటు అసలే దొరకలేదు. అతను రాసిన
సినిమాలన్నీ భయంకరంగా కుప్పకూలాయి! విచిత్రంగా మహానటుడు అశోక్‌కుమార్ లాంటివారు
మాత్రం అభిమానులుగా మిగిలిపోయారు. మంటో అప్పట్లో నిజంగా కుర్రవాడు. అయినా, బాబూరావ్
పటేల్ లాంటి పాత్రికేయులు అతడిని అభిమానించారు. అతని కథలను మెచ్చుకున్నారు.
భారతదేశపు మౌపాసా అన్నారు.
అప్పటి
సామాజిక, రాజకీయ పరిస్థితులు మంటోకు మంచి కథా
వస్తువులను అందించాయి. ఆ కథలలో భారతీయత నిండుగా కనిపించింది. కానీ, ఎంచుకున్న
విషయాలు, వాటిని చెప్పిన తీరు మాత్రం కొంత
కలకలానికి దారి తీశాయి. అతని
కథలు
అద్భుతమయినవి. కానీ, అంతే అసాధారణమయినవి.
పాకిస్తాన్
భారతదేశం నుంచి విడిపోయింది. చాలామంది ఇక్కడ కొనసాగలేక పాకిస్తాన్‌కు పారిపోయారు.
తమస్ లాంటి రచనలలో ఆ పరిస్థితులు మామూలు టీవీ (ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాయి.
కానీ, మంటో రచనలలో కనిపించిన లోతు మరింత
ఎక్కువ. మంటో తన రచనలలో ఏమాత్రం జంకకుండా తన మతం వారు చేస్తున్న ఘాతుకాలను కూడా
వివరించాడు. నిరసించాడు. కథలు చదివినవారికి ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది.
మంటో
1912లో పంజాబ్ రాష్ట్రంలో పుట్టాడు. తండ్రి పెద్ద పేరున్న బారిస్టర్. అతను మరీ
మొరటుమనిషి మారుటి తల్లి మాత్రం మంచిది. మంటో రచనల మీద మొదట్లోనే ఆ తల్లిదండ్రుల
ప్రభావం కూడా కనిపించింది. మంటోలోని తిరుగుబాటు పద్ధతి అక్కడే మొదలయింది అనవచ్చు.
ఇక అమృత్‌సర్‌లో అప్పటి పరిస్థితులు దారుణమయిన వని వేరుగా చెప్పనవసరం లేదు.
జలియావాలా బాగ్ గురించి చాలామందికి తెలుసు. అయినా, ఆ
పరిస్థితిని మనసులో చిత్రీకరించుకున్న
వారు
ఎక్కువగా లేరని అనాలి. ఏడేళ్ల వయసులోనే సాదత్, ఆ సంఘటనను అర్ధం చేసుకున్నాడు.
అతనితోపాటు దేశంలో మరెంతమందో ఆ విషయాన్ని అర్ధంచేసుకున్నారు. జాతీయ ఉద్యమం బలం
పుంజుకున్నది. అది మరింతగా ముందుకు సాగింది.
సరిగ్గా
ఈ కాలంలోనే మంటో ఆలోచనలు కూడా స్థిరపడసాగాయి. కుర్ర వయసులోనే అతను తిరుగుబాటుదారు
మనస్తత్వంలో స్థిరపడిపోయాడు. అనుభవం లేకున్నా ఎక్కడో చదివిన మాటలను అరువు తెచ్చుకుని
ఆకర్షణగల మాటలతో పోస్టర్లు తయారుచేయడంలో పాలుపంచుకున్నాడు. ఆస్కార్ వైల్డ్ రచనల
నుంచి నినాదాలను ఎత్తుకువచ్చాడని పరిశీలకులు తరువాత చెప్పారు. యూరోపియన్ సాహిత్యం
ప్రభావం భారతీయ రచయితల మీద అప్పట్లో బాగా ఉండేదని వాళ్లు సిద్ధాంతం కూడా చేశారు.
అలీఘడ్
ముస్లిం యూనివర్సిటీలో అర్ధమనస్కంగా చదువుకుంటున్న రోజుల్లోనే మంటో ప్రోగ్రసివ్
రైటర్స్ అసోసియేషన్‌లో చేరాడు. భారతీయ సాహిత్యమంతా రాజుల బూజు పద్ధతిలో
సాగుతున్నదని దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని సంఘం వారు ప్రచారం
చేస్తున్న భావనలకు మంటో తానూ భుజం కలిపాడు. అందరి పంథాలోనే తానూ రచనలు చేశాడు. అయినా, స్వంత
ఆలోచనలు గల సాదత్ త్వరలోనే సంగతి అర్థంచేసుకున్నాడు. “బూ” అంటే వాసన అని అర్ధం. ఈ
పేరుతో మంటో ఒక విచిత్రమయిన కథ రాశాడు. అది అతని అసలయిన రచనాక్రమానికి శంఖుస్థాపన
రాయిగా గుర్తించదగిన కథ. ఈ కథ చదవనివారికి ఇప్పుడయినా గొప్ప ఆశ్చర్యాన్ని
కలుగజేస్తుంది. కథలో ఇద్దరే మనుషులు. రణ్‌ధీర్ అన్న ఒక ధనిక యువకుడు. మరొక
నిమ్బవర్గపు అమ్మాయి. నిజానికి వారు మాట్లాడుకోరు. ఒక వర్షపురాత్రి ఆ అమ్మాయి రణ్‌ధీర్
ఇంట్లో ఆశ్రయం తీసుకోవలసి వస్తుంది. పరిస్థితులు వాళ్లు భౌతికంగా కలిసే వరకూ
దారితీస్తాయి. వర్షంలో తడిసి లోపలికి వచ్చిన అమ్మాయి వణుకుతూ ఉంటుంది. మరే భావమూ
లేకుండా, కేవలం జాలితో అబ్బాయి ఆమెకు పొడి బట్టలు
ఇస్తాడు. అమ్మాయి వణుకుతూ తడి బట్టలను విప్పుకోవడంలో తడబడుతుంది. యువకుడు
సాయంచేయడానికి వెళతాడు. అక్కడ మంటో కథను నడిపించిన తీరు మరొకరికి చేతగానిదిగా
కనపడుతుంది. మొత్తానికి రణ్‌ధీర్‌కు ఆ అమ్మాయి వాసన మనసులో మిగిలిపోతుంది.
ఆ వాసన బాగుంటుంది, బాగుండదు. అది ఆమె బాహుమూలాల్లో, తల వెంట్రుకల్లో, ఎదలో, ఒళ్లంతా గుప్పుమన్నదని అతను అనుభవం చెపుతాడు. జరిగినదంతా ఒళ్లు తెలియని తమకంలో జరిగింది. తెలివిలోకి వచ్చిన తరువాత కూడా, ఆ వాసన అతగాణ్ణి వదలదు. అది అతనికి వర్షాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ రాత్రి అందిన అనుభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ చివరకు వస్తుంది. రణ్‌ధీర్ ఒక గొప్ప యింటి అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. ఆమె అన్నిరకాలా అతనికి తగిన జోడు. అయినా, అందరినీ ఆకర్షించిన ఆ నవవధువు నాయకునిలోని మగటిమిని మాత్రం ఆకర్షించలేకపోతుంది. సాదత్ హసన్ మంటో కథలు చాలా అదుపులేకుండా ఉంటాయి. అవి బండ బూతులని అన్నవాళ్లే ఎక్కువ.
No comments:
Post a Comment