Tuesday, September 27, 2011

Rajani Bhava Tarangalu - A Review

This is a review of the book titled Rajani Bhava Tarangalu.
This is a collection of articles by none other than Balantarpu Rajanikanta Rao garu.
It is no secret that I am his admirer.
Then is the review biased?
May be!


రజనీ భావ తరంగాలు (వ్యాస సంకలనం)
వెల: రూ. 100/-
రచన: బాలాంత్రపు రజనీ కాంతారావు
నవోదయ పబ్లిషర్స్, కార్ల్ మార్క్స్ రోడ్
విజయవాడ-520 002

ప్పన్నా తనామనా - మారోరె బైరన్న అని ఒక పాతకాలం పాట. ఈ పల్లవితో సినిమాల్లోనూ పాటలు వచ్చాయి. అప్పన్నా, తన్ననా, మాననా అని ఒకడంటే, మారోరే అని మరొకడన్నాడని రజని వ్యాఖ్యానం. కాదు, ‘అప్‌నా తన్ నమాన్‌నా’ అంటుంది ఈ సూపీ మాట అని వివరణ. అప్పన్న నుంచి ఆంధ్రా వరకు, గాంధర్వ వేదం నుండి శ్రీశ్రీ రేడియో నాటికల వరకు, వల్లగాని వైవిధ్యంతో వచ్చిన ఈ భావతరంగాలు ఒక్క బాలాంత్రపు రజనీకాంత రావు గారికే చెల్లు! వైఖరి గురించి చెప్పినంత సులువుగానే వందేమాతరం గురించి కూడా చెప్పడం రజనీగారిలోని ప్రత్యేకత.


కథకులు మధురాంతకం రాజారాంగారు ‘గణనీయులు’ అన్న కథలో ప్రతి మనిషికీ చరిత్ర ఉంటుంది అంటారు. ఇక రజనీ కాంతరావుగారి లాంటి వారికి చెప్పదలుచుకుంటే చరిత్రతోపాటు ఎన్నెన్ని శాస్త్రాలు, అంశాలు ఉంటాయో ఊహించవచ్చు. ఆంధ్రప్రభలో సంవత్సరంపైగా వారంవారం రాసిన 58 వ్యాసాలతో మరొకటి కూడా చేర్చి ప్రచురించిన ఈ పుస్తకం అందరూ చదవవలసినది!


వ్యాసాలలో, రజనీగారు కావాలని కొంత, అనుకోకుండా కొంత వైవిధ్యాన్ని పంచిన తీరు బాగుంది. సముద్రంలో అలలు ఒక క్రమంలో వస్తాయి. సముద్రం కన్నా విస్తృతమయిన రజనీకాంతుని మెదడులో అలలు పుడితే మాత్రం ఆ క్రమం ఆశించగూడదు. అయినా, ఆయనకు ఇది రాయండి అని చెప్పి రాయించుకోగలవారు ఎవరున్నారు? సినిమా, రేడియో, లలిత సంగీతం వరకు బాగానే ఉంది. వాటికి ముందు తర్వాత రజని మెదడులో గల సంపదను గురించి ఎంతమందికి తెలుసు? మహాపండితుల కుటుంబంలో పుట్టి, పాండిత్య వాతావరణంలో పెరిగిన రజనీగారు, సాహిత్య, పారస్వతాలను, సంగీత విశేషాలను గురించి చెప్పినా, కొత్త కోణాలు మన ముందుంచారు. కానీ, అనుకోని ఎన్నో విశేషాలను, ఏర్చి కూర్చి చెప్పి మరింత ఆసక్తిని పెంచారు. తాను పెరిగిన వాతావరణంలోని పెద్దల ఇళ్ళ గురించీ, జ్ఞాపకాల గురించి అలవోకగా చెపుతుంటే, వీరందరి గురించి మరింత వివరంగా చెపితే ఎంత బాగుండును అనిపించక మానదు!


విశ్వనాథ, పింగళి, కృష్ణశాస్ర్తి గారల గురించి చెప్పినంత ప్రేమతోనే, రేడియోలో ఇతరత్రా తనతోబాటు పనిచేసిన వారందరినీ గురించి చెప్పిన తీరు మనసుకు హత్తుకుంటుంది. రజని స్వయంగా, కవి, సంగీతజ్ఞుడు, పండితుడు. ఎన్నో గొప్పపనులు చేసి, చేయించిన మహామహుడు. అయినా తన గురించే గాక, మరెందరో మహామహుల గురించి చెప్పిన తీరు గొప్పది. ఎదుటివారిలోని మంచి తనాన్ని గుర్తించి, తలవంచే ఆయన మనస్తత్వం, ఆయనతో మెలిగిన వారికే తెలుస్తుంది. ఆచంట జానకిరాంగారి గురించి, మరిన్ని విషయాలను గురించి రాసిన వ్యాసాలు చదువుతుంటే ఈ భావతరంగాలలో తడిసిన వారికీ ఆ సంగతి తెలుస్తుంది.


184 పేజీల పుస్తకంలో ఎన్ని రంగాలు, ఎంతమంది మనుషులు (మామూలు వారు కారు) ఎన్ని విషయాలున్నాయో? ఈ వైవిధ్యం మామూలుగా దొరికేది కాదు. పెద్దలంతా ఈ రకంగా తమ అనుభవాలను రాయాలి! కేవలం నాఫ్టాల్జియా కొరకు కాదు! గతం గురించి తెలియడానికి ఈ రాతలొకటే ఆధారం! ఇలాంటి పుస్తకాలు ఈ మధ్యన అడపాదడపా వస్తున్నాయి. కొన్నింటిలో రచయిత ఒక్కరే అంతటా కనబడతారు. రజనీగారి భావతరంగాలలో ఆ ‘నేను’ కన్నా విషయాల మీద ఎక్కువ రాశారు.


రజనిగారు ఛాదస్తం మనిషి! ఎన్ని గొప్ప పనులు చేశారో ఆయనకే గుర్తు లేదు. అందుకే ఆయనకు రావలసినంత ‘గుర్తింపు’ రాలేదు. రజనీ భావతరంగాలు వదలకుండా చదివించగలవి. చదివితే, ఈనా చివరి మాటల గురించి మీకూ అర్థమవుతుంది!!

Let us enjoy good writings!
^&%^&%^&%

3 comments:

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) said...

రజనీకాంతరావు గారి వాగ్గేయకారుల చరిత్రను మళ్ళీ చదువుదామని నిన్ననే చేతిలోనికి తీసుకున్నాను. ఇంతలోనే మీరు వారి భావతరంగాలను పరిచయం చేసారు. తీరిక చూసుకొని/చేసికొని చదవాలి ఈ పుస్తకాన్ని కూడా.

జవహర్ గుత్తికొండ said...

మీకు తెలిసి ఉండవచ్చు, ఈ పుస్తకం avkf వారి వద్ద దొరుకుతోంది: http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=౬౬౨

జవహర్ గుత్తికొండ

శివరామప్రసాదు కప్పగంతు said...

@JAWAHAR GUTTIKONDA

I chekcked the link given by you and there are 4 books viz.

1. Andhra CharbhaaNi
2. ETiki edureeta
3. Jeji mamayya paaTalu
4. Satapatra sumdari

Can you inform in which link the Auto Biography of Shri Rajani is available.

If you are interested, I posted an article in my Blog and provided an audio file where Shri Rajani shall be speaking about his childhood days to his days in AIR.

http://saahitya-abhimaani.blogspot.in/2012/11/blog-post.html