ఒక అమ్మాయి, మామూలు కుటుంబం మనిషి, మహారాణి అవుతుంది. అనుకున్నట్టే, ఆమె తీరులో చాలా మార్పు వస్తుంది. ఆమె ప్రవర్తన కారణంగా, భర్తకు కోపం వస్తుంది. బుద్ధుడు వారిద్దరి మధ్యన సయోధ్య
కూరుస్తాడు. ఈ కథ వింటుంటే, మనుషుల ప్రవర్తన
గురించి, అది మారే తీరు గురించి అర్థమవుతుంది.
నేను నిరంతరం చదువుతూ ఉంటాను. నచ్చిన విషయాలను పదిమందితో
పంచుకోవాలనుకుంటాను. కనుకనే ఈ కథను అనువదించి ఇక్కడ అందజేస్తున్నాను. ఆ తర్వాత
వింటారో వినరో మీ యిష్టం.
బుద్ధుని జాతక కథలను గురించి చాలామందికి తెలుసు. కానీ అవి ఈ మధ్యన అంతగా ప్రచారంలో ఉన్నట్టు కనిపించదు. మా చిన్నతనంలో పత్రికలలో కార్టూన్ కథల కింద చదివిన గుర్తుంది.
అదంతా పక్కన పెడితే, సుజాత జాతకం అన్న ఈ కథ చిన్నది, కానీ గొప్పది.
జాతక కథలు
పళ్ళమ్మేవాని కూతురు
సుజాత జాతకం
జేతవనంలో విడిది చేసి ఉన్న సమయంలో బుద్ధుడు రాణి మల్లిక
గురించిన ఈ కథను వివరించాడు.
ఒకనాడు రాజు పసేనది, అతని రాణి మల్లికల మధ్యన పేచీ వచ్చింది. రాజుకు చాలా కోపం వచ్చింది. రాణి ఉనికిని కూడా పట్టించుకోని స్థితికి వచ్చాడు.
బుద్ధునకు ఈ సంగతి తెలిసింది. వారిద్దరి మధ్య సయోధ్య
కుదిరించాలని నిర్ణయించాడు.
ఉదయాననే అయిదు
వందల మంది భిక్షువులు
వెంటరాగా ఆయన శ్రావస్తి నగరంలో భిక్షాటన కొరకు బయలుదేరాడు. నేరుగా రాజప్రాసాదం
ముఖద్వారం వద్దకు వెళ్లాడు. రాజు బుద్ధుని భిక్షాపాత్రను అందుకొని వారందరినీ తన
భోజనశాలలోకి తీసుకువెళ్లాడు. అక్కడి సేవకులకు అన్నం,
మిగతా తినుబండారాలు
తీసుకురమ్మని ఆదేశం ఇచ్చాడు. అర్ఘ్యం ఇచ్చే సమయంలో బుద్ధుడు తన చేతిని బిక్షాపాత్ర
మీద అడ్డుగా పెట్టాడు. ‘రాణి గారు ఏదీ?’ అని అడిగాడు. ‘గురువర్యా, ఆవిడతో మీకు ఏం పని?’
అని రాజు బదులుగా
అడిగాడు. ‘ఆమెకు తల
తిరిగినట్టుంది. అనుభవిస్తున్న ఈ గౌరవం మర్యాదల మత్తులో పడిపోయింది,’ అన్నాడు రాజు.
బుద్ధుడు ప్రత్యుత్తరంగా,
‘అయ్యా! ఆ
గౌరవస్థానాన్ని మీరే ఆమెకు స్వయంగా అందజేసి,
ఆమెను ఉన్నతపదవికి
చేర్చారు. దాన్ని ఆమె అనుభవిస్తుంటే మీరు చికాకు పడడం పొరపాటు. ఆమెను నిర్లక్ష్యం
చేయకుండా, ఆమె చేసింది అని మీరు అనుకుంటున్న చిన్న పొరపాటును మీరు
సహించాలి,’ అన్నాడు.
గురువుగారి మాటలను రాజు శిరసా వహించాడు. రాణి కోసం కబురు
పంపాడు. ఆమె వచ్చింది. దంపతులిద్దరూ కలిసి భిక్షువులతో సహా బుద్ధులకు సేవలు
అందించారు.
భోజనం ముగిసింది. అనుమోదన తెలియ చేస్తూ బుద్ధుడు, రాజదంపతులకు సలహా ఇచ్చాడు. ‘భార్యాభర్తలిద్దరూ
ప్రశాంతంగా కలిసి బతకడం మంచిది’ అని చెప్పాడు. ఆనాటి తరువాత, పసేనది, మల్లిక కలిసి సుఖంగా
జీవించారు.
కొంతకాలం తరువాత, సత్యశాలలో భిక్షువులు, ఆ సంఘటన గురించి, కొద్ది మాటలతోనే బుద్ధుడు, భార్యా భర్తల మధ్య సయోధ్య కుదిరించిన తీరు గురించి చర్చించుకుంటున్నారు. వారి మాటలను బుద్ధుడు విన్నాడు. టభిక్షువులారా! ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితమే కూడా, నేను వారిద్దరినీ కొద్ది మాటలతోనే సయోధ్య కుదిరే దారికి మార్చాను, అంటూ, గతంలో జరిగిన సంఘటనను కథగా చెప్పాడు.
బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో, వారణాసిలో బోధిసత్వుడు ప్రధాన సలహాదారుగా ఉండేవాడు.
ఒకనాడు, రాజు తన భవనంలోని ఒక
కిటికీ వద్ద నిలిచి ఉండగా, ఆవరణ అవతల ప్రదేశంలో
ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె తల మీద ఖర్జూరాలతో నిండిన గంప ఉన్నది.
రాజభవనంలోకి ప్రవేశించే ధైర్యం లేక, ఆమె వీధిలోనే నిలబడి, ‘ఖర్జూరాలు! రుచిగల పండిన తీయని ఖర్జూరాలు! నా ఖర్జూరాలను
ఎవరు కొంటారు?,’ అని అరుస్తున్నది.
ఆ చక్కని అమ్మాయిని చూచి,
ఆమె తీయని గొంతును
విని, రాజు ముగ్ధుడయ్యాడు. ఆమె గురించి తెలుసుకోమని సేవకులను
పంపించాడు. వారు తిరిగి వచ్చి ఆమె పేరు సుజాత,
పళ్ళు అమ్మే ఒకతని
కూతురు ఆమె, ఇంకా పెళ్లి కాలేదు,
అంటూ వివరం తెలిపారు.
రాజు వెంటనే సుజాతను తీసుకురమ్మని చెప్పి,
ఆమెను పట్టపురాణిగా
చేశాడు. ఆమె మీద ఎంతో ప్రేమ ప్రదర్శించాడు. చాలా గౌరవంగా చూడసాగాడు.
ఆ తరువాత ఎప్పుడో ఒక మధ్యాహ్నం పూట, రాజు, బంగారు గిన్నెలో ఉన్న ఖర్జూరపండ్లను తింటున్నాడు.
అక్కడికి సుజాత వచ్చింది. ‘మహాప్రభూ! ఏమి తింటున్నారు? పండు ఏదో చాలా బాగా కనబడుతున్నది!,’ అంటూ ఒక పండును అందుకున్నది. ‘చూడడానికి కూడా
బాగుంది పండు! ఇటువంటి పండ్లు ఎక్కడ పెరుగుతాయో?’
అన్నది ఆమె.
ఆ మాటలు విని రాజుకు చాలా కోపం వచ్చింది.
‘పళ్ళు అమ్మే మనిషి
కూతురువు! ఈ పళ్ళను గుర్తుపట్టలేదా? ఇవి మీ కుటుంబం వారి
ప్రత్యేకతగా గుర్తింపు పొందిన పళ్ళు. సిగ్గుచేటు! తలమీద బట్ట లేకుండా, బుట్ట పెట్టుకుని ఈ పళ్ళను నీవు అమ్మేదానివి. మహారాణివి
అయినావు కనుక, ఇప్పుడీ పండు గురించి అడుగుతున్నావా? వాటి పేరేమిటని అడగడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను నీవు మరిచిపోయావా?
ఒకప్పుడు నీవేమిటని
మరిచిపోయావా? లేక గొప్పలు పోతున్నావా?
ఇటువంటి గర్విష్టి
మనిషి నాకు భార్యగా ఉండకూడదు, తక్షణం వెళ్ళిపో!,’ అని కోపంగా అన్నాడు రాజు.
రాజుగారి సలహాదారు ఈ మాటలు విన్నాడు. రాజు కోపాన్ని ఏ రకంగా
నైనా తగ్గించాలి! రాణి గారిని వెళ్లగొట్టకుండా చూడాలి! అనుకున్నాడు.
రాజుగారు మరెవరు చెప్పినా వినరు. రాణి అక్కడి నుంచి
వెళ్ళిపోగానే, మెత్తని మాటలతో సలహాదారు ఇలాగన్నాడు. ‘మహాప్రభూ! తమరే కదా
స్వయంగా పళ్ళముకునే ఈ అమ్మాయిని మహారాణి పదవికి మార్చారు. అంతటి గొప్ప హోదా అందిన
ఆడమనిషి ఈ రకంగా ప్రవర్తించడం చాలా సహజం కదా! మీరే చేసిన ఒక పనికి మీరు తప్పకుండా
బాధ్యత వహించాలి. కోపం తగ్గించుకోండి! జరిగిన చిన్న పొరపాటును మన్నించండి.’
సలహాదారు చెపుతున్న మాటలలోని అంతర్యాన్ని రాజు అర్థం
చేసుకున్నాడు. సుజాతను పిలిపించాడు. కటువుగా మాట్లాడినందుకు ఆమెకు క్షమాపణలు
చెప్పాడు. తిరిగి ఆమెను పట్టమహిషి స్థానంలో స్థిరం చేశాడు. ఆమెకు కలిగిన గర్వాన్ని
పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. తరువాత వారిద్దరూ అన్యోన్యంగా, ప్రశాంతంగా జీవితం గడిపారు.
కథ ముగించిన తర్వాత బుద్ధుడు,
ఆ జాతక వివరం
చెప్పాడు. ఆ కాలంలో, బ్రహ్మదత్తుడే,
పసేనది రాజు, మల్లిక, రాణి సుజాత,
నేను రాజుగారి
సలహాదారు, అని వివరించాడు.
A Fruit
Seller’s Daughter
Sujāta
Jātaka
It was while staying at Jetavana that the Buddha told this story about Queen Mallikā.
One
day, there was a quarrel between King Pasenadi
and Queen Mallikā. The
king was so enraged with the queen that he completely ignored
her existence.
The Buddha knew all about this quarrel and resolved to make peace between the two.
Early
in the morning, he entered Sāvatthī for alms with
a following of five
hundred bhikkhus and stood at the palace gate. The king took the
Buddha’s bowl and led the entire party into the dining hall.
The king had his servants bring the rice and cakes, but, as
he started pouring the Water of Donation, the Buddha put his hand over the
vessel and
asked, “Sire, where is the queen?”
“What
do you have to do with her, Venerable Sir?” the
king asked in return.
“Her head is turned. She has become intoxicated with the honor she
enjoys.”
“Sire,” the Buddha replied, “since you yourself bestowed this honor on her and elevated her to this rank, it is wrong for you to be so upset that she enjoys it. Rather than cast her aside, you must put up with the small offense that you feel she has committed against you.”
The king hearkened to the words of the Teacher and sent for the queen. As soon as she came, she and the king together served the Buddha and the bhikkhus.
After the meal, the Buddha offered anumodana and advised the royal couple, “It is good for husband and wife to live together in peace.” Indeed, from that day onward, Pasenadi and Mallikā lived happily together.
Some time later, in the Hall of Truth, the bhikkhus were talking about how the Buddha had reconciled the king and queen with only a few words. When the Buddha heard what they were discussing, he said, “Not now only, bhikkhus, but, long ago, too, I reconciled them with a few
words
of admonition.” Then he told this story of the past.
Long, long ago, when
Brahmadatta was reigning in Bārānasi, the Bodhisatta was his
chief advisor.
One day, as the king was standing at an open window overlooking the courtyard, he saw a beautiful young woman with a basket of dates on her head. Not daring to venture into the palace, she stood in the street, crying, “Dates! Delicious, ripe, juicy dates! Who’ll buy my dates?”
The king was so overcome by her fresh beauty and her sweet voice that he immediately ordered his courtiers to find out who she was. They reported that her name was Sujātā, that she was the daughter of a fruit seller, and that she was not married. The king sent for Sujātā and made her his chief queen. The king loved her dearly and bestowed great honor upon her.
One afternoon, while the king was eating dates from a golden dish, Sujātā entered the room. “My Lord,” she asked, “what are you eating? This is such an interesting fruit!” she exclaimed, picking up one of the dates. “It is so pretty and so red! I wonder where it grows.”
When the king heard this, he became very angry.
“Daughter of a fruit merchant!” he cried. “Do you not recognize this fruit? These dates are a specialty of your own family. You should be ashamed of yourself! Bare-headed and roughly clad, you once peddled these fruits yourself. Now that you have become queen, you dare to ask the fruit’s name! Have you completely forgotten who you are and what you once were, or are you just putting on airs? You are much too proud to be my wife! Begone!”
The advisor heard this and thought, “I must appease the king’s anger and prevent him from sending the queen away.
He won’t listen to anyone else.” As soon as the queen had withdrawn, the advisor said softly, “Your Majesty, it was you who transformed this woman from a fruit seller into a queen. This behavior is natural for a woman who is suddenly promoted to such a high position. You must take some responsibility for what you yourself have done. Quench your anger, Sire, and forgive her for this simple fault!”
The king understood the wisdom of his advisor’s words and summoned Sujātā. He apologized for his harsh words, restored her to her position as queen, and resolved to overlook the pride she had seemingly developed. They spent the rest of their lives in peace and harmony.
Having concluded his story, the Buddha identified the birth: “At that time, Pasenadi was King Brahmadatta, Mallikā was Queen Sujātā, and I was the royal advisor.”
No comments:
Post a Comment