I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Monday, March 23, 2026
లోకాభిరామం : భాష - బహాసా
లోకాభిరామం : భాష - బహాసా
భాష - బహాసా
అనవసరంగారు : రేడియోలో ఎవ్-సాయదార్లకు వాతావర్ణ సూచనలుంటయి, ఎప్పుడన్న విన్నరా? మేమయితే ఇదే ప్రశ్నను
ఇన్నరా? అని అడిగినా
అర్ధం చేసుకుంటము. వ్యవసాయము మా దగ్గర ‘ఎగుసము’ అవుతుంది. వేసవి, వేసంగి, యాసంగి అంటే ఒకటే
మాటనా? మాటల
మూలాలను వెతుకుతూ పోతే చిత్రమయిన సంగతులు ఎదురవుతయి. ఈ ఎదురయ్యేవి వెదుర్లు, వెదుళ్లు మాత్రం
కాదు. వేంకటేశ్వరుని అందరు వెంకటేశ్వరుడు అంటరు. ఆయనకు పట్టింపు లేదు. ఎంకటేశ్వర
అన్నా కోపం రాదాయనకు. యంగటేస్పరా అన్నాసరే ఏమీ అనుకోడు. మరాఠీవారి సంగతి మరీ
విచిత్రం. వ్యంకట్రావ్,
వ్యంకటేశ్ అని రాస్తరు. సంస్కృతంతోసంబంధంలేదనిఅర్ధం. చాలాగొప్పవారుకూడాసంబంధంఅన్నమాటనుసమ్మంధం, సమంధం, సమ్మందం అని
పలకగా విన్నాను. గౌతులచ్చన్నగారని ఒక నాయకుడు, ఇప్పటివారికి తెలియదు.
బెమ్మానందంరెడ్డి అనేవారు. అదేమిటని అడిగిన వారిని ‘ఆయనకు లేని అనుమానం నీకెందుకు’
అని కూడా అన్నరు. తిరిగి మరోసారి రేడియోలోకి వస్తే (ప్రసారంలో కాదు గానీ) ఒకాయన
‘అనవసరంగారు వెధవ రిపోర్టు తెమ్మన్నారండీ!’ అన్నరట. విషయమేమిటో ఎవరికయినా తోచినదా? రేడియోలో
అనౌన్సరుగారలు ఉందురు. ప్రజలకు వారు మాత్రమే తెలియుదురు. రేడియో స్టేషన్ చూడబోయే
వారంత, తమ అభిమాన
అనౌన్సర్లని చూడాలని ప్రయత్నింతురు. ఇంతయినా, ఆయన కెవరికో గౌరవంగానే అనౌన్సరుగారు, అనవసరంగా కనిపించారు.
వారి పేరు అనవసరం. వారు అవసరమే! ఇంతకూ వెధవ రిపోర్టేమిటి. అది వెదర్ (వాతావరణ)
రిపోర్టుకు పట్టిన గతి లెండి! వెంఢాకాలం: వేంకటేశ్వరులంత వారని పట్టుకుని ఎంగటేసనో, వ్యంకటేశనో అంటే
తప్పుగదా! అట్లాంటివారు మరి, అనాడీల కింద లెక్కవుతరు గదా! (అనాడీలనగా ఏమీ తెలియని
అమాయకులు అంతే గానీ, నాడిలేని
వారు మాత్రం కారు) కనుక ఒక పెద్దాయన ఎస్టర్ (యెస్టర్)డేని మార్చి వెస్టర్‌డే
అన్నారు. మరొకాయన ఇస్త్రీని విస్త్రీ అన్నారు. (అవునండీ, ఇంతకు తెలుంగులో ఈ
ఇస్త్రీని ఏమంటరు. చలవమడతలని ఒక మాట వినిపించేది. కానీ, ఇది వేడి (ఏడి)కాదు
మడత గదా! ఉర్దూలో ఒత్తుల సమస్య చిత్రంగ ఉంటుంది. సికిందర్ అని రాయాలంటే ఆ మాటకు
ముందు ఒక ‘అ’కారాన్ని రాస్తరు. ఎందుకు రాసిందీ, తెలియని వారు ఇస్కందర్ అని
పలుకుతరు. స్కూల్ అన్న మాటను, స్టేషన్ అన్న పదాన్నీ (అనిన, అన్న) రాసి సకూల్, సటేషన్ అనరు.
ఇస్టేషన్, ఇస్కూల్
అంటరు. బాగా మాట్లాడుతున్నమనుకుని మనవాళ్లు కొందరు శవం అన్న మాటను
‘శ్రవం’ అంటారు. అట్లాగే ఎండకాలం పోయి వెంఢాకాలమవుతుంది. రెండు, రొండవుతుందని తెలుసా మీకు. కన్యా శుల్కంలో అప్పారావుగారు, ఒక పాత్రచేత
ప్రయత్నంగ ‘రొండు’ అని పలికించినరు. ఆ రకంగా వారు పాత్రల మధ్య తేడా చూపించినరు.
మనమేమో తేడా తెలియక రెండు,
రొండు ఒకటే ననుకుంటున్నాము. ఒకాయన ఏకంగా ‘రొండు చింతలు’ అన్నడు.అది రెంటచింతల
అనే ఊరి పేరని నాకు తరువాత అర్థమయింది. పెద్దగా ఉరిమితే మనవాండ్లు అర్జునుని పేర్లు తలుచుకునేవారు.
మా ఊళ్లో, ఊరిలో ఒక
ముసలమ్మ ‘అర్జున, బీమ, ఆకేశవేని, భూతల్లి, దడదడ, గుడగుడ’ అని ఏదో
చదివేది. పట్టమహిషి: ‘మిరపకాయ కొరికి చూస్తే చుర్రే చుర్రే, దున్నపోతును గన్న
తల్లి, బర్రే
బర్రే’ అని పల్లెపాట ఒగటి,
ఒకటి ఉన్నదట. బర్రె అనే మాట, అందరికీ తెలిసినది కాకుంటే ఆశ్చర్యం లేదు. కొందరు దానిని
గేదె అంటరు. మరికొందరు ఎనుము అంటరు. ఈ ఎనుమలలో కొన్ని ఆ నలుపులోనే తెలుపుచాయలో
ఉంటయి. వాటి వెంట్రుకలు కూడ తెల్లగ ఉండడం చూచిన గుర్తు నాకుంది. తెల్లని ఆవు, అసలు సిసలు తెలుపు రంగు
ఉంటుంది. తెల్లబర్రె మాత్రం ఆ నలుపులోననే ఒక తెలుపు. దాన్ని మా ప్రాంతంలో
‘పల్లబర్రె’ అనేవారు. ఇప్పటికీ అంటనే ఉంటరు. బర్రెలకు, ఆవులకు దూడలు ఉంటయి.
‘దూడమ్మా, దూడా’ అని
కూడా జానపద గీతం ఉంది. స్త్రీల పాటలలో ఆవుదూడ, పులి గురించినది చాలా ఆర్తిని
కలిగించే పాట. ‘కాటుక కన్నులా గంగ్యావు కోడె, మీయమ్మను మేము పొడగాన లేదు’ అని
మావాళ్లు పాడడం నాకింకా గుర్తుంది. తెల్లని ఆవుదూడకు కళ్లు నల్లగ ఉంటే, నిజంగా కాటుక
పెట్టినట్టు ఉంటుంది. మా ఇంట్లో పుట్టిన ఇటువంటి దూడ, కోడె దూడయి, ఎద్దయి మా మధ్యన, ఇంట్లో మనిషిగ పెరిగి,
పోయింది. దాని పేరు గుమ్మడి. నాన్నగారుంటే, వాని పేరు అని సరిదిద్ది ఉండేవారు!
అంత ప్రేమ ఆయనకు గుమ్మడి మీద. గుమ్మడి సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత మేమెవరము
కనిపించకపోతే నేరుగ వంటింట్లోదాక వచ్చేది. విషయం మరెక్కడికో వెళ్లిపోయింది గానీ, దూడను కొంతమంది
‘దుడ్డె’ అని అంటరు. బిడ్డను బిడ్డె అని పలికిన వారిని చూచిన, విన్న. బిడ్డలు అనే
మాటను ‘బిడ్లు’ అంటరని పుట్టపర్తివారు వ్యాసంలో రాసినరు. ఇంతకూ నేను అడగదలచుకున్న ప్రశ్న అట్లనే ఉండిపోయింది. యముని
మహిషపు లోహ ఘంటలు అంటరు సిరిసిరి అనగా శ్రీశ్రీగారు. అంత ఎమ్ ధర్మరాజు వారి వాహనం
గదా? బంగారపు
గంటలెందుకు లేవో? మహిషమనగా
బర్రె, గేదె, ఎనుము (తప్పు!)
పుంలింగమయితే దున్న, దున్నపోతు
గద! మహిషియనగా బర్రె, గేదె, ఎనుము. రాజుగారి
భార్యను పట్టమహిషి అంటరెందుకని(?) ఇంద్రునికి వృషభముతోపోలికచెప్పినసందర్భాలున్నయి. వేదంలోకూడాఈరకమయినపోలికలుచెప్పినరు. గొప్పకవులనుకవివృషభులుఅనడమువిన్నము. కనీసంచదివినము. రాజుగారినిసింహంతోనో, ఎద్దుతోనో పోల్చి చూపిస్తరు.
అందుకే పట్టమహిషి అనడం వెనక మరేదో సంస్కృతంకిటుకుఉండిఉంటుందనినాకుతీవ్రమైనఅనుమానం! అంతేగానీఅర్ధంలేనిజోక్వేసి, అనర్థం చేయడం నా ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని మనవి! సింహము, సింగమవుతుంది. టామిల్ అనగా తమిళంలో చింగం కూడా అవుతుంది.
(జానీ లీవర్ అనే హాస్యనటుడు చ్యూయింగ్ గమ్‌ను చింగం అన్నాడు. హాస్యానికని అన్నాసరే, అది అంటుకుంటుంది!)
యశోదై యిలైచ్చింగం అని బాలకృష్ణునివర్ణించిందిగోదామాత. సింహి, అనే మాట ఉందా? సింగానికి మాత్రం
సింగి ఉంది. సింగమ్మ అన్నది తెలిసిన పేరు. శివంగి అనే మాట ఎట్లా వచ్చింది? మరి శివాంగి అంటే
ఎవరు. శివునియందు సగమయిన పార్వతి, శివాంగియయి ఉండవలె. శివాన్విత అన్న పేరు ఒకటి గుర్తుంది. శివంగి సంగతి మీకంతా తెలుసా? మగసింహం వేటకు పోదు. శివంగి మాత్రమే
పోతుంది. ఆయమ్మ కొట్టుక తెచ్చిన తిండిని సింహరాజు తిని పడుకుంటడు. ఆ రాజుకు ఒకే
శివంగి కాక కావలసినన్ని శివంగులు ఉంటాయి. అదొక దర్జా. అందులో తిండి వెసులుబాటు
కూడా ఉందన్నమాట. భాష,
బాస (బహాసా) విచిత్రమయినది. ఆసక్తి కరమయినది కూడ! నల్లని దున్నను కారెనుము, కారుదున్న అనడం ఉంది. ఇంకా దూడను
వేయని బర్రెను ‘పడ్డ’ అంటము మా ప్రాంతంలో. లేత బర్రెపాలు అంటే ఈని, అనగా దూడను కని
ఎక్కువ కాలం కాని బర్రెపాలు. ఆ పాలలో దూడ కొరకు రకరకాల ప్రత్యేక రసాయనాలు ఉంటయి.
కనుక అవి కాచితే గడ్డ కడతయి. జున్నుపాలు అను పేరుతో దానిని తింటము. ఆ పాలు తాగినా, తిన్నా వాతం
చేస్తుందనే వారు. అంటే ఆ పాలలో మనకు పడని ప్రొటీన్లు ఏవో వుండి, శరీరంలో మార్పులకు
కారణ మవుతాయని నాకు అర్ధమయింది. ఈ పరిస్థితి నాలుగు దినాలు సాగుతుంది. ఆ తరువాత
పాలు కాచినా గడ్డ కట్టవు. కానీ వాటిలో జిగురు మాత్రం ఎక్కువ ఉంటుంది. వాటి రుచి
కూడా వేరుగ ఉంటుంది. రెండు మూడు నెలల తరువాత పాలు మామూలవుతయి. బర్రె తిన్న తిండి, తాగిన కుడితి కారణంగా పాల రుచి
మారుతుందంటే కొంతమందికి అర్ధం కాకపోవచ్చు. కుడితి, తవుడు తిన్న బర్రె పాలు, పెరుగులో కొంత పులుపు
ఉంటుంది. పత్తి గింజలు తిన్న బర్రె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పచ్చిగడ్డి, ఎండుగడ్డితో కూడ
పాలలో తేడా వస్తుంది. ఆ పాలతో చేసిన పెరుగులో కూడా రుచి తేడా తెలుస్తుంది. ఇదం,
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పని లేకుండ, రైతుల ఇండ్లలో అందరికీ తెలిసిన
విజ్ఞానం. పాలు పాకెట్లనుంచి, మెషీన్‌నుంచి వస్తయనుకునే వారికి ఇవేం అర్ధమవుతయి?
No comments:
Post a Comment