అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....
ఆ సాయంకాలం సభలో పరమేశ్వరుడు
మాట్లాడినాడు. నారాయణరావు కంఠముకన్న బరమేశ్వరుని కంఠము ఉపన్యాసములిచ్చుటలో నెక్కువ
గంభీరత దాల్చును. అతడు వేలకొలది జనమును దన వాగ్ధారలో ముంచి మెత్తుకొని పోగలడు.
నారాయణరావు గొంతుక యుపన్యాసములో మధురముగా నుండును. ధారాశుద్ధిగలది.
ప్రతివిషయమును గూర్చిలెక్కలు మున్సగు వివరములు చెప్పుచు శ్రోతల హృదయమును
చూరగొనును. బరమేశ్వరుడు లేచి “మానవుని హృదయం విశాలం అవ్వాలంటే దేశాలు
తిరగడం ఒక మార్గం. (ప్రతివిద్యార్థినీ, ప్రతిరైతుకుర్ర వాణ్ణి చివరకు
ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగి రమ్మనాలి, ఆంధ్రదేశం మాత్రం తక్కువ ఉందా! బుషి కుల్యానదికడనుండి
కంచివరకు, సముద్రం, ఇటు, అటు ముచికుందనది, భీమనది మొదలైనవి ఎల్లలు. మన దేశం
ఏలినవాళ్ళు ఆంధ్రులు. మొదట్ల తనకు చరిత్రలో తెలిసివున్నంత మట్టుకు ఆంధ్రులు ఆఖరి
కాణ్వాయణచక్రవర్తిని చంపి తాము చక్రవర్తులై రాజ్యం చేశారు. ఆరువందల సంవత్సరాలు.
తర్వాత ఇక్ష్యాకులు, సాలంకాయనులు, బృహత్పాలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోను, తర్వాత గాంగులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు. ఆంధ్రమహారాజ్యము యొక్క
చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటశాల, నాగార్జునమెట్ట
ముఖ్యమైనవి. ఆంధ్రశిల్ప మత్యంత ప్రాభవము పొందినది. అంత ఉత్తమ శిల్పము నాటికి
నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పాలరాతిలో చెక్కారు.
ఆంధ్రశిల్పం యొక్క గొప్పంతా
చెన్నపురి, లండను, బెర్లిను వస్తు ప్రదర్శనశాలలో ఉన్నది. “పల్లవులున్నూ తమయొక్క చివ్నోలు
కాంచీపురంలో, మహాబలిపురంలో
అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణ ఒడ్డునే
కొండమీద ఉన్నది.”
అతని ఉపన్యాసం వరదలనాటి గోదావరి
నదివలె ప్రవహించుచున్నది.
“మహాబలిపుర
శిల్పంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతులగుంపు, యేనుగుల శిల్పవిన్యాసం మాధుర్యం
వెదజల్లుచుండును. అచ్చట రాతిరథములు, ఒకేరాతిలో దొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, (ద్రౌపదిరథము నున్నవి. ఆ పట్టణమంతయు
సముద్రమున మునిగిపోవుచున్నది.“చాళుక్యుల శిల్పము దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, (ధ్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో ఇంకా అనేక దేవాలయములలో విగ్రహములలో చాళుక్యుల శిల్పచమతృతి
కనబడుతుంది. చాళుక్యదేవాలయములు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవికావు.
“కాకతీయ
శిల్పకళాప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీనటేశ్వరుని
నాట్యామహదానందము చూపించుకొన్నారు. వారి శిల్పములో,
విజయనగర సామ్రాజ్యము, హంపీ, తాడిపత్రి, పెనుగొండ, గుత్తి, మాచెర్ల, లేపాక్షులలో జూడగలము. హంపీ దృశ్యములు జూచిన యే మానవుని
గుండెలు తరుగుకొని పోవు?
“మనహృదయములు
విశాలత నొంది సర్వమానవ (పేమవిలాసితాలు కావలెనంటే కళాపూజకన్న ఇంకోటిలేదు. ఇంతమందిలో
భద్రాచలము ఎంత మంది వెళ్ళారు? భద్రాచలము వెళ్ళుటే ఒకచక్కనియాత్ర. గోదావరిలో పడవలలో ఒక
వారమురో జులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ
పాపికొండల్లో
పడవ మీద ప్రయాణంచేస్తూ
తిప్పలమీద పండుకుంటూ, వెన్నెల్లో తిప్పలమీద పరవశిస్తూ కొండలు, అడవులు, గోదావరీ నీలపు లోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము
చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి.
“అజంతా లోయలో
జలజల ప్రవహించే భోగీరానది ఒడ్డున నిలుచుండి, ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ గోడల్లా పైకెగసి ఉన్న ఆ
కొండలమధ్య కనబడే ఆకాశంచూస్తూ అర్థచంద్రాకృతిగా ఉన్న ఆ విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణకాంతులు ఆకాశాన (ప్రసరిస్తూ కొండ
శిఖరాన్ని ఎరుపు చేస్తూంటే, ఆ దివ్యప్రపంచంలో పూరాతన శిల్పి చెక్కిన విగ్రహాలకుమల్లే అలా నిలుచుండిపోయాము.
“వాతాపినగరములో
పశ్చిమచాళుక్యుల శిల్పచమత్ఫతి ఉన్నది. 50 గుహలు గ్రీకుల లేబ్రినులవలె ఉంటవి. కార్లేగుహలు
అతిపురాతనమగు ఆంధ్ర బౌద్ధగుహలు. రెండువేల రెండువందల సంవత్సరాల క్రితమా గుహలలో
నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కు చెదరకుండా ఉన్నవి.
నాసికలోని గుహలలో ఆంధ్రరాజుల
శాసనములు చెక్కించినారు. బెరంగాబాదు గుహలలో గూడ మంచి విగ్రహములు, చిత్రలేఖనములున్నవి. నానా ఘట్టములలో
ఆంధ్రశాతవాహన (ప్రభువుల శిల్పాలున్నవి. నొకటి. “బీజపురములో గోలు గుంబాజ్ అనేది
ప్రపంచమేలో నున్న పెద్ద గుమ్మటములలో నొకటి. ఆ గుమ్మటములో పెకెక్కి గుమ్మటమున కావల
నీవల నిద్ధరు మనుష్యులుండి ఎంత కేక వేసినా వినబడదు. గుమ్మటము గోడపై పెదవి యొకరూ, చెవి యొకరూ ఆన్చి రహస్యములు, గుసగుసలు సల్పినచో గూడ స్పష్టముగ వినబడును.
దౌలతాబాదు కోట అజేయము.
తినుబండారములు చేరనీయక మాడ్చవలసినదేగాని మానవమాత్రుడా దుర్గమును శౌర్యముచే
చేరలేడు. ధాన్యపురాశివలె అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న కొండను, వరికుప్పవలె చెక్కినారు. కొండచుట్టూ
సమతలానికి నూరడుగుల లతు కందకం నూరడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన
కొండభాగం ఎత్తు నూ ఏభయి అడుగులు. కొండంతా కోటగోడలు,
కొండశిఖరంపై చిన్నకోట, కోటమధ్య రాజభవనం, భవనం శిఖరం మీద ఫిరంగి.
“త్ర్యంబకంలో
గోదావరి పుట్టింది. కోట్లకొలది సంవత్సరాల యీడున్న ఆ కొండ నాలుగువేలు, అయిదువేలు అడుగుల ఎత్తు. సగంఎత్తువరకూ
కంకరా, అడవులూ ఆవరించి ఉంటాయి.
తక్కినభాగం అంతా నల్లటిరాయి. అట్లాంటి ఒక కొండ వెయ్యి, పదిహేనువందల అడుగుల ఎత్తు ఎక్కాము. ఆపైన
ఒక చిన్న గుహ, కోనేరున్ను కోనేటిప్రక్కను
ఒక గోముఖ విగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కలా గోదావరినది పడుతోంది. అసలు అక్కడ అన్నీ కొండలలోంచి ప్రవహించే
జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్నయేటితో కలుస్తాయి. అక్కడి
నుంచి ఇరువది ఐదు మైళ్ళు దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికి గోదావరి రెండువందల
అడుగుల వెడల్పున గొప్ప నదియైనది. ప్రతిష్టానంలో నాలుగువందల అడుగుల వెడల్పు, నిజామాబాదులో ఆరువందల అడుగుల వెడల్పు, భద్రాచలము దగ్గర మైలు, రాజమహేంద్రవరముకడ రెండు మైళ్ళు, ధవళేశ్వరముకడ నాలుగు మైళ్ళు, డెల్హా ముఖమున ముప్పది మైళ్ళు
వెడల్పున్నది.”
పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోలుకొండ, ఒరంగల్లు మొదలగు (ప్రదేశముల వింతలన్నియు కనులకు గట్టునట్లు
పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.
No comments:
Post a Comment