Monday, October 18, 2010

The Big Chest - A Story

This is a story from the collection of stories by Dervishes.
I am still thinkingg about the purport of this!


Here is the story!

నూరీబే - పాత పెట్టె



నూరీబే ఆలోచన గల మనిషి. అల్బేనియాలో గౌరవంగలవాడు కూడా. అతను తనకంటే మరీ చిన్న వయసు గలావిడను భార్యగా తెచ్చుకున్నాడు.

ఒక సాయంత్రం అతను మామూలుకన్నా తొందరగా ఇంటికి వచ్చే సరికి నమ్మకంగల ఒక సేవకుడు ముందుకు వచ్చి, "నీ భార్య, అంటే మా యజమానురాలు, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నది. ఆమెతో ఆమె గదిలో ఒక పెద్ద పెట్టె ఉన్నది. అందులో ఒక మనిషి పట్టేంత పెట్టె అది. ఆ పెట్టె మీ నాయనమ్మ గారిది" అని చెప్పాడు.

"అందులో పాత అల్లిక గుడ్డలు ఉండాలి!"

"కాదండీ అందులో మరేదో ఉన్నదని నా అనుమానం!, నేనేమో మీకు ఇంత పాత నమ్మకస్తుడయిన సేవకుడినా, ఆమె నన్ను అందులోకి తొంగి కూడా చూడనివ్వలేదు."

నూరీ తన భార్య గదిలోకి వెళ్లాడు. భార్య ఒక పెట్టె పక్కన నిస్సహాయంగా కూచుని ఉంది.

"ఆ పెట్టెలో ఏముందో నాకు చూపిస్తావా?" అని అడిగాడతను.

"ఒక పనివాడి అనుమానం కారణంగానా లేక నా మీద నమ్మకం లేకనా?"

"ఎందుకనే సంగతులు ఆలోచించకుండా దాన్ని తెరిస్తే పోతుందిగా!"

"అది కుదురుతుందని నేననుకోను!:

"దానికి తాళం వేసి ఉన్నదా?"

"అవును"

"తాళంచెవి ఎక్కడ?"

ఆమె తాళంచెవి ఎత్తి చూపింది. "ఆ పనివాడిని పంపించి వేయండి. నేను ఈ తాళంచెవులు మీకిస్తాను" అన్నదావిడ. పనివాణ్ణి పనిలోనుంచి తొలగించారు. ఆమె తాళంచెవులు ఇచ్చేసి మనసులో బాధ పడుతూ అక్కడినుంచి వెళ్లి పోయింది.

నూరీబే చాలా సేపు ఆలోచించాడు. అతను తోటలోనుంచి నలుగురు పని వాళ్లను రమ్మన్నాడు. వాళ్లు ఆ రాత్రి, పెట్టెను తెరవకుడానే పొలంలో ఎక్కడో దూరానికి తీసుకు పోయారు. దాన్ని వాళ్లక్కడ పాతి పెట్టారు.

ఆ సంగతి గురించి తర్వాత ఎవరూ మాట్లాడ లేదు.

ఈ కథను కలందర్ (తిరుగుతూ ఉండేవారు) దర్విష్ లు చెప్పినట్టుగా చెపుతారు.
ఇది 1916 ప్రాంతంలోనే యు ఎస్ లో అచ్చయింది.

The Ancient Coffer of Nuri Bey




NURI BEY was a reflective and respected Albanian, who had married
a wife much younger than himself.
One evening when he had returned home earlier than usual, a faithful servant came to him and said: 'Your wife, our mistress, is acting suspiciously. 'She is in her apartments with a huge chest, large enough to hold a man, which belonged to your grandmother.

'It should contain only a few ancient embroideries.

'I believe that there may now be much more in it.

'She will not allow me, your oldest retainer, to look inside.'

Nuri went to his wife's room, and found her sitting disconsolately beside the massive wooden box.

'Will you show me what is in the chest?' he asked.

'Because of the suspicion of a servant, or because you do not trust me?'

'Would it not be easier just to open it, without thinking about the undertones?' asked Nuri.

'I do not think it possible.'

'Is it locked?'

'Yes.'

'Where is the key?'

She held it up, 'Dismiss the servant and I will give it to you.'


The servant was dismissed. The woman handed over the key and herself withdrew, obviously troubled in mind.

Nuri Bey thought for a long time. Then he called four gardeners from his estate. Together they carried the chest by night unopened to a distant part of the grounds, and buried it.

The matter was never referred to again.

I want you also to think about the story!
^^^^^^^^^^

No comments: