Sunday, October 24, 2010

He said - A Poem

This poem appeared partially in my blog earlier.
Now, the full poem has appeared in the Sahiti page of Andhra Bhoomi Telugu Daily today!

Here is the poem!

అతడన్నాడు.-కె.బి.గోపాలం,
October 25th, 2010


నీటిలో రాతి కోసం వెతుకులాట

రాతిలో నీటికోసం వెతుకులాట

పడిపోతున్నప్పుడు కూడా ఆశాభావం కనబరచేది నేనేగదా

అందమయిన అమ్మాయిలను ఆనందంగా ప్రేమించేది నేనేగదా

నాకు నిశ్శబ్దమనే మరణం గురించి ఇసుమంతయినా చింతలేదు

గుంపులో నేను కొన్ని మాటలను మింగేస్తాను

పక్కగా వెడుతున్న అమ్మాయికి కన్ను గిలుకుతాను

జింకలు ఏడుస్తుంటే చూస్తాను

నగరం నడిబొడ్డున సంతోషం తననుతాను

చంపుకుంటుంటే చూస్తాను కూడా

నాకు, నా పండు, నాడు దిసమొలతో తిరగడం గుర్తుంది

అది, చంద్రుని ముందర, దాని భయం వెనక్కు తగ్గి,

క్షమించమని అడుక్కోవడమూ గుర్తుంది

గోడమీద అక్షరాలు గోడను బూడిదగా మారమంటున్నాయి

భవనం రహస్యాలను బట్టబయలు చేయవద్దంటున్నాయి

భవనాలు తమ తలుపులను మూసుకుంటూ

విషయం అర్ధమయితే

పోలీసు వాళ్లు మాయమవుతారంటున్నాయి

సముద్రం విశాలమయినదని నీకు తెలుసు

కాలం కూడా నీళ్లలాగే వేళ్లమధ్యనుంచి జారిపోతుందని తెలుసు

ఏమీ మిగలదనీ తెలుసు

నిమ్మ వాసనలో నుంచి ఓ చుక్క రాలిందనీ

ప్రపంచమంతటా తాజాదనం నింపిందనీ, చొచ్చుకుందనీ తెలుసు

అడవి ఖర్జూర కాయలను తెచ్చిచ్చిందని తెలుసు,

ప్రేమికుడికీ, సముద్ర తీరంలో సంతోషంగా ఉన్న రాళ్లకు కూడానూ!

రాళ్లు ముక్కలు ముక్కలయ్యి, లోహ పుష్పాలుగా మారాయి.

మరి నీవెందుకు అధునాతన నగరాల గదుల్లో అంతగా దాగున్నావ్

అక్కడ అర్ధంలేని గోల, పడుచు ఎదల పండుకోత,

గుటకలు మింగడం!

గడియారం ముళ్లు గోడలోని ఓ రంధ్రంనుంచి వేలాడుతున్నాయ్

కాలం, కామాలను, ఫుల్‌స్టాప్‌లను లెక్కలు కడుతున్నది

మరో కొత్త ఉదయం కోసం,

ఎవరో తలుపు తట్టారు,

తలుపు తెరిస్తే,

అదుగో, ఉదయం నిలబడి ఉంది!

ఈ ఉదయం, ఇంత త్వరగా ఎవడిక్కావాలి?

(ఆషూర్ ఎత్వేబీ కవితలోని ఒక భాగం)

-కె.బి.గోపాలం (అనువాదం)

Here is the link to the Sahiti page of Andhra Bhoomi!

http://www.andhrabhoomi.net/features/sahiti
Let us enjoy good poetry!
&&&&&

No comments: