Tuesday, August 10, 2010

Welcome to a friend on a rainy day!!

రావోయి నేస్తమా వానకాలముతోటి



మంచుపట్టీ మబ్బుపట్టిన వానరోజున రాగదోయీ
మనుషులందరి వదిలి నీవూ మాటలాడని రాతిరోలే
అడుగులో అడుగేసుకుంటూ చడీచప్పుడు కాకుండా
మంచుపట్టీ మబ్బుపట్టిన వానరోజున రాగదోయీ

ఉదయమూ కనుమూసుకుందీ గాలికూడా ఉస్సురందీ
నగ్నమయినా నీలినింగీ మబ్బులను కప్పేసుకుందీ
చెట్లమీదీ పక్షులన్నీ చప్పుడూ మానేసినాయీ
ఇళ్లవాకిళ్లన్ని గట్టిగ బిడాయించీ ఉన్నాయీ

ఒంటరీ దారెంట నీవూ ఒంటరిగ వస్తున్నావూ
ఒంటిగాడా ఓ నేస్తం, ఇంటి తలుపులు తెరిచి ఉంచుత
ఇంతకూడా పట్టకుండా అంతలో ముగిసేటి కలలా
జారిపోకోయ్ చల్లగానూ దారి పక్కనె నాయిల్లోయ్ 

This is a lyrical poem I have composed recently after reading one of those Ravindra Sangeet songs!!
The situation really describes a friend, lover who is alone in a rainy loneliness!
I am smitten by this topic of rain!
I have translated a story "Rain" by Friend D. Venkaramayya garu.
It also talks about the effect rain has over people!
Lovely the feelings are!
Some abominable too!

This year interestingly there are enough rains expecting in my place that is Mahabubnagar!!
What could that mean?
Ofcourse, I am not at Mahabubnagar these days!!
@@@@@@

No comments: