Monday, May 4, 2009

Confucius for you


Confucian Analects

The Master said, "At fifteen, I had my mind bent on learning.
"At thirty, I stood firm.
"At forty, I had no doubts.
"At fifty, I knew the decrees of Heaven.
"At sixty, my ear was an obedient organ for the reception of truth.
"At seventy, I could follow what my heart desired, without transgressing what was right."

గురువన్నాడు గదా,
పదిహేనేళ్ల వయసులో నా మనసంతా నేర్చుకోవాలన్న ధ్యాస.
ముప్ఫయి ఏళ్లకు నేను గట్టిగా నిలువ గలిగాను.
నలభయ్యేళ్లకు నాకు అనుమానాలే లేవు.
యాభయ్యేళ్లకు నాకు స్వర్గం సంగతులు తెలిశాయి.
అరవయ్యేళ్లకు నాచెవి సత్యాన్నందుకునేందుకు చక్కని అవయవమయింది.
డెబ్భయ్యేళ్లకు నేను నా మనసు మార్గంలో నడవగలిగాను. అదీ, సరయిన దారినుంచి తప్పకుండా.


Mang I asked what filial piety was. The Master said, "It is not being disobedient."
Soon after, as Fan Ch'ih was driving him, the Master told him, saying, "Mang-sun asked me what filial piety was, and I answered him,- 'not being disobedient.'"

Fan Ch'ih said, "What did you mean?" The Master replied, "That parents, when alive, be served according to propriety; that, when dead, they should be buried according to propriety; and that they should be sacrificed to according to propriety."

Mang Wu asked what filial piety was. The Master said, "Parents are anxious lest their children should be sick."

Tsze-yu asked what filial piety was. The Master said, "The filial piety nowadays means the support of one's parents. But dogs and horses likewise are able to do something in the way of support;-without reverence, what is there to distinguish the one support given from the other?"

Tsze-hsia asked what filial piety was. The Master said, "The difficulty is with the countenance. If, when their elders have any troublesome affairs, the young take the toil of them, and if, when the young have wine and food, they set them before their elders, is THIS to be considered filial piety?"



వంశ మర్యాదంటే ఏమిటని మాంగ్ వన్ అడిగాడు. అవిధేయత లేకుండడమే అన్నాడు గురువు.

వెంటనే, ఫాన్ చీ తో వెళుతూ, వంశ మర్యాదంటే ఏమిటని మాంగ్ సన్ అడిగాడూ, నేనేమో అవిధేయత లేకుండడమే అన్నానూ అని గురువన్నాడు,
అంటే ఏమర్థం అన్నాడు ఫాన్ చీ. అంటే తల్లిదండ్రులు బతికున్నంతకాలం పద్ధతిగా వారికి సేవ చేయాలి. వారు మరణించిన తర్వాత పద్ధతిగా అంత్యక్రియలు చేయాలి. ఆ తర్వాత వారికి పద్ధతి ప్రకారం శ్రాద్ధాలు చేయాలి. అన్నాడు గురువు.
వంశ మర్యాదంటే ఏమిటని మాంగ్ వూ అడిగాడు. గురువన్నాడూ, పిల్లలెక్కడ జబ్బు పడతారోనని తల్లిదండ్రుల ఆదుర్దా అని.

వంశ మర్యాదంటే ఏమిటని ట్సే యూ అడిగాడు. ఈ కాలంలో వంశమర్యాదంటే తల్లిదండ్రుల సాయం అనాలి. కానీ కుక్కలూ, గుఱ్ఱాలుకూడా ఏ సంబంధమూ లేకుండానే సాయంగా ఏదో చేయగలిగి ఉంటాయి. ఈ రెండు రకాల సాయాలకూ తేడా చెప్పడానికి ఏముంది అన్నాడు గురువు.
ఇక ట్సే సియా వంశమర్యాదంటే ఏమిటని అడిగాడు. కష్టమంతా చూడడంలో ఉందన్నాడు గురువు. పెద్దవాళ్లెవరయినా కష్టాల్లో పడితే పిల్లలు వాళ్ల బాధలను పంచుకుంటారు. ఇక పిల్లలకు తిండీ తాగుడూ దొరికితే దాన్ని పెద్దల ముందు పెడతారు.వంశమర్యాదని దీన్నే అనుకోవాలా అని కూడా అడిగాడాయన.




The Master said, "I have talked with Hui for a whole day, and he has not made any objection to anything I said;-as if he were stupid. He has retired, and I have examined his conduct when away from me, and found him able to illustrate my teachings. Hui!-He is not stupid."
నేను హుయీతో ఒకరోజంతా మాట్లాడాను. నేనన్న ఒక్కమాటకూ అతను అభ్యంతరం చెప్పలేదు. అతను తెలివిగలవాడు కాదనిపించింది. అతను వెళ్లిపోయాడు. అతను నాముందు లేనప్పుడతని ప్రవర్తనను గమనించాను. నా బోధనలన్నిటినీ బాగా చెపుకున్నాడు. హుయీ తెలివిగలవాడు అన్నాడు గురువు.


The Master said, "See what a man does.
"Mark his motives.
"Examine in what things he rests.
"How can a man conceal his character? How can a man conceal his character?"
ఒక మనిషి ఏంచేస్తాడో గమనించు. అన్నాడు గురువు.
అతని ఉద్దఏసాలేమిటో గమనించు.
అతను ఏ విషయాలలో మునుగుతాడో గమనించు.
ఏ మనిషయినా తన వ్యక్తిత్వాన్ని ఎలా దాచగలడు ఏ మనిషయినా తన వ్యక్తిత్వాన్ని ఎలా దాచగలడు


The Master said, "If a man keeps cherishing his old knowledge, so as continually to be acquiring new, he may be a teacher of others."
ఒక మనిషి తన పాత తెలివిని గుర్తుంచుకుంటూ క్రమంగా కొత్తవిషయాలను తెలుసుకుంటుంటే, మిగతావారికి అతను గురువు అయ్యుంటాడు అన్నాడు గురువు.
The Master said, "The accomplished scholar is not a utensil."
యోగ్యుడయిన విద్వాంసుడంటే ఓ గిన్నె లాంటిది కాదు అన్నాడు గురువు.

No comments: