Monday, May 25, 2009

On Sleeping - A page from the diary

An afternoon on a hot summer day!
Everybody at home sleeping as if it is night!


I cannot sleep during the day. If I do, I cannot sleep well that night.
I deserve a long and continuous sleep.
I was thinking of typing something.
I thought I will pick up a page from the old diary, which I do occasionally.
There is a page where I have written about sleeping.
Coincidence!

This is how it goes.

నిద్ర సుఖమునకు పరాకాష్ఠ.
సంతృప్తి గలవాడు, చింతలేనివాడు, సంపూర్ణ ఆరోగ్యము గలవాడు సుఖముగా నిద్రించగలడు.
ఈ మూడింటనేది లోపించినను నిద్ర కరువగును.
నిద్ర లేని వానికి సంతృప్తి యుండదు.
చింత గలుగును.
ఆరోగ్యము చెడును.
అనగా అటనుండి అదియెక చక్రనేమి క్రమమన్నమాట.
ఒకనికి ఆరోగ్యము అంతంతగనే యుండును.
వాడు మాత్రలు మింగుచునే యుండును.
ఆ మాత్రల వలన వానికి నిద్ర మెండగును.
వాడు పగలు కూడ కునుకుచుండును.
అదియొక రకమైన యనారోగ్యము.
వానిది సుఖనిద్ర కాదు.
పక్కమీద మేను వాల్చిన పది క్షణములలో గురక వేయు వారుందురు.
మరి కొందరు గంటలైనను అటునిటు దొర్లుచుందురు.
నిదుర రాని వారికి వచ్చిన వారిని జూచిన కంటగింపుగా నుండును.
కోపము గలుగుచుండును.
అసూయ అందుకాధారము.

పగటి నిద్ర పనికిచేటు అను మాట యొకటి ఉన్నది.
కానీ కొందరు అదృష్టవంతులు పగలు రాత్రి, చేతనయినంత సేపు నిదురింతురు.
వారి భాగ్యమునకు ఏ లోటు రాదు.
ప్రపంచము పట్టిలేదనుకొన్న చాలు.

కూర్కు అని ఒక మాట.
అది కునుకునకు మాండలిక భేదము.
‘పండినడు’ అనగా అనారోగ్యము పాలయినాడని అర్థము.
‘పన్నడు’ అనగా పడుకొన్నాడని అర్థము.
బొంగరము వేగముగా తనచుట్టు తాను తిరుగుచుండును.
అది అటునిటు కదలక ఒకే చోట నిలిచి తిరుగుచుండును.
అప్పుడది కూర్కు బట్టినది.
ఈ మాట ఇతర ప్రాంతముల వారికి తోచి చావదు.
తొయ్యడము లేదంటే తోచడమా? లేక తోయడమా? ఏది లేదు?
మాటలెందుకింత బహుముఖముగ నుండునో?
ఆశ్చర్యము!

This time I feel like bringing some of the ideas of the above passage into English.

Sleep is the climactic form of comfort.
A contented man, one devoid of worries, one in full health can sleep well.
Sleep evades when any one of the three is wanting.
One who cannot sleep is not satisfied.
He will be worried.
Health takes a beating.
It implies that there begins a circle of events.
One is not in good health.
He keeps popping pills into his mouth continuously.
As an after effect he feels drowsy throughout the day.
That is another kind of ill health.
His sleep is not comfortable.

There are some who start snoring ten seconds after they hit the sack.
There are the others who keep tossing themselves even after few hours in the bed.
The former are the source of heart burn for the latter class.
They will even get angry on the sleepers.
It is the jealousy which forms the basis.

Sleep during the day spoils the work, goes an adage.
But, there are few from a lucky lot, who sleep anytime without end.
They are as comfortable as all the others.
Only, they have to decide not to worry about this world.

No comments: