Tuesday, January 17, 2012

Sri Sri Poem


 శ్రీ శ్రీ కవిత
 తెలుగు స్వతంత్ర, అక్టోబరు 1948


ఔను, వాహనం మారింది
దూరానికి పూర్వపు టర్థం పోయింది
పూర్వం దూరం పోయింది,
వెనకటి వాహనం మారింది
ఆ సూర్యుడే నేడూ
ఆ చంద్రు డీనాడూ
అవే నక్షత్రాలూ
ఐనా కాలం మారింది

ఔనా, కాలం మారింది మరి
మానవుడా మేలుకో, నేస్తం
ఎద్దుబండితో కొలవకు దూరాన్ని
ఎగరవోయ్ చదలయెద చీలుస్తూ
రేపు బయల్దేరాలనుకున్నావు
నేడే ఇచ్చటికి వచ్చేశావు
విచ్చేసింది నీ తరుణం
పుచ్చుకో ఇది నీ భావి

ఇది నీ భావి, గ్రహించు
ఈ భావి నీకు నా ప్రెజెంటు
భూతకాలపు సరీసృపాలని
పాతరాతి యుగంలో పారెయ్
పాతెయ్ నీ సందేహాలని
తోలెయ్ నీ మందాక్షాలని
నిటారుగా నిలబడు నేస్తం
హుటాహుటిగా ముందుకి సాగు

హుషారుగా ముందుకి సాగు
ఊరికే వెనక్కి చూస్తావేం
దుప్పివీ కుక్కవీ కావు
తిర్యగ్దృక్కువి నువ్వు కావు
దూరం కరిగిపోతోంది
కాలం మరిగిపోతోంది
మానవుడిగా మేలుకో నేస్తం
ఏలుకో ఈ విశ్వం సమస్తం

Yes, the vehicle is changed.
The old meaning of distance has changed
Past has gone far away
Past vehicle has changed
the same Sun today
That moon today too
Same are the stars
Still times have changed

Isn't it, the times have changed
O Man, awake Friend
Don't measure the distance with the bullock cart
Fly high splitting the heart of the sky
You thought of embarking tomorrow
Today itself have arrived here
Your time has come
Get it, it is your future

This is your future, get it
This future is my present to you
The crawlers of yesterday
Throw into the stone age
Bury your apprehensions
Drive your slow axles
Stand erect Oh Friend
Proceed further majestically

Proceed further with gusto
Why do you again and again look back
Neither a deer or a dog you are
You are neither the birds view
Distance is melting away
Time is boiling away
Awake as a man Oh Friend
Rule this entire universe

 - Sri Sri