Thursday, September 15, 2011

Slaps on the neck

నిశ్శబ్దంగా...

జకరియా తామిర్ కథ

జుహేర్ సాబ్రీకి, పచ్చని కొమ్మ మీది ఎర్రని పువ్వులాంటి అమ్మాయి తగిలింది. ఆమె తాను ప్రేమలో పడ్డానని నిన్ను తప్ప మరెవరినీ ప్రేమించ లేననీ అన్నది. అతను కూడా తన భవిష్యత్తుకన్నా కావలసింది మరొకటి లేదని అన్నాడు. కానీ మెడ మీద ఎవరో చరిచినట్లయి ఉలిక్కి పడ్డాడు. చుట్టూ చూచాడు, ఎవరా చరిచిందీ అని. కానీ ఎవరూ కనిపించలేదు.


ఈ దేశంలో మీకంటే గొప్ప మనిషి ఎవరూ లేరని ఒక ధనవంతునికి చెప్పునప్పుడు కూడా అతనికి అలాంటి దెబ్బ పడింది. ఈ సారికూడా దెబ్బ వేసిన వారు మాత్రం కనిపించలేదు.


పెద్ద నిడుపాటి గడ్డం గల మనిషికి ఒకాయనకు దండం పెట్టి నన్ను దీవించండి అన్నప్పుడు మూడవసారిగా దెబ్బ పడింది. ఇంతకూ చరిచిందెవరో ఈ సారీ కనిపించలేదు.


జుహేర్ సాబ్రీకి నిత్యం దెబ్బలు పడుతూనే ఉన్నాయి. చరిచిన వారు మాత్రం కనిపించింది లేదు. అతనీ రహస్యపు చరుపులను గురించి ఎవరికీ చెప్పలేదు. నీకు పిచ్చెత్తిందంటారని అతని భయం. తనలాగే అందరికీ ఇలాటి దెబ్బలు పడుతూనే ఉంటాయని, అందరూ తనలాగే నోరు మూసుకుని భరిస్తున్నారనీ అతనికి గట్టి నమ్మకం కలిగింది. 



Zakaria Tamer

SILENT ONES

Zuhair Sabri met a woman like a red flower on a green branch and she told him in a trembling voice that she loved and could love no one else but him.  He said to her that he cared about nothing except his future, but was startled by a painful slap on his neck.  He looked around, but did not see who had slapped him.

He was slapped again when he told a rich man he was the greatest man the country had brought forth, and again did not see who had slapped him.

He was slapped a third time when he reverently kissed the hand of a man with a long, flowing beard and asked to be blessed, but he still did not see who had slapped him.

Zuhair Sabri was slapped a lot on a daily basis without ever seeing the unknown slapper. He never spoke to anyone about all those secret slaps so that no one would mock and accuse him of being insane. And he was certain that everyone else was being slapped just as he was being slapped but were also keeping quiet.

Let us enjoy good stories!
^&**&^^&**&^^&**&^

No comments: