Thursday, July 15, 2010

First Crops - A Question

మనిషి మొదట్లో పంటలుగా పనికి వచ్చే రకాలను ఎట్లా గుర్తించాడు?


జంతువుల మాంసం విషమయ్యే అవకాశం లేకపోవడం నిజంగా విచిత్రం. కనుక సులభంగా దొరికే జంతువులను చంపి తినవచ్చు. ఇక జంతువులను మచ్చిక చేసుకుని ఉంచుకో దలుచుకుంటే, వాటి ఉపయోగం ఆధారంగా ఆ పని జరుగుతుంది. కానీ, ఒకరకం మొక్క ఆహారంగా పనికి వస్తుందని ఆలోచన రావడం, నిజంగా కష్టమే. కనిపించిన ప్రతి కాయ, ప్రతి గింజ కొరికి చూడడం మంచిది కాదని, ఆదిమానవునికి అనుభవంమీద సులభంగానే తెలిసి ఉంటుంది.

మనం పంటలుగా తింటున్న రకాలన్నీ ఒకప్పుడు అడవిరకాలే. వ్యవసాయం రాకముందు, ఈ రకాలను మనం పండించవచ్చునన్న ఆలోచన, ఆ తర్వాత ప్రయత్నం గురించి ఆలోచిస్తే, బుర్ర తిరిగిపోతుందని పరిశోధకులే అంటున్నారు. ఉదాహరణకు బాదంకాయలు మనిషికి మొదటినుంచీ తెలుసునట. కానీ అవి చాలా చేదుగా ఉండేవి. విషంగా కూడా ఉండేవి. ఏదో కారణంగా ఒక చెట్టు కాయల్లో ఆ లక్షణాలు పోయి, రుచి బాగా ఉండడం గుర్తించి, ఆ చెట్టునుంచి కాయలను తీసి పండించుకున్నారని సిద్ధాంతం. మొక్కజొన్న మొదట్లో ఉండిన తీరుకు ఇప్పటి తీరుకూ సంబంధం లేదని గుర్తించారు. అయినా ఈ రకాలు పెంచవచ్చునని చెప్పడానికి అంతకు ముందు వ్యవసాయమే లేదు. ఏదో రకాన్ని పెంచితే తిండి అవసరాలు తీరుతాయన్న నమ్మకం అంతకన్నా లేదు. అంతా ప్రయోగాలే.

పెంచుకోదలుచుకున్న పంట మొత్తంగా అనుకూలంగా ఉండనవసరం లేదు. బాదం విషయంగా చెప్పినట్టే, నచ్చిన రకం దొరికితే చాలు. అక్కడినుంచి మొదలు పెట్టి పంటను పెంచుతూ పోవడమే. ఈ నచ్చడానికి మనిషి మొక్కలలో కొన్ని లక్షణాలకోసం వెతికాడు. అందులో మొదటిది పండు లేదా గింజ సైజు. గంటలకొద్దీ వెతికి సేకరించినా కడుపు నిండకపోతే లాభం లేదు. మొక్కజొన్న, రకరకాల పండ్లు ఈ పద్ధతి కింద చెప్పుకోవచ్చు. ద్రాక్షలాంటివి తప్ప మనం తినే పండ్లన్నీ మంచి సైజులోఉండి కండగలిగి ఉంటాయి. అందులో చాలా పాతదయిన అరటిలో గింజలు కూడా ఉండవు. మొదట్లో అరటి కూడా తినడానికి అనువుగా ఉండేది కాదు. అందులోనూ ఏదో ఒక చెట్టు పనికి వచ్చేదిగా దొరికింది. దాన్ని పెంచారు.

ఇక రుచి గురించి వేరుగా చెప్పనవసరం లేదు. తిండికీ రుచికీ మొదటినుంచి లంకె ఉంది. ఒంటికి మంచిదయినా సరే, ఈ నాటికీ మనిషి రుచిలేని తిండి తినడు. చమురుకోసం కొన్ని రకాల పంటలను పెంచారు. నారకోసం, దుస్తులపేరున కొన్ని రకాలను పెంటారు.

ఇంతకూ ఈ ఎంపిక ఒకరోజున చటుక్కున జరిగింది కాదని గుర్తుంచుకోవాలి.

It is interesting to note that flesh never becomes poisonous to man. So, one can kill an animal that is easily available and eat. If one wants to domesticate an animal, it depends on the utility value of the type. It is hard to imagine that a particular plant will be of use as food. That it is not advisable to taste all the fruits and berries or grain was perhaps learnt by man easily on experience.


All the crops that we are eating now were once wild types. Scientists themselves say that it is mind boggling to imagine the process of identifying cultivable types and the efforts thereafter. It appears almonds were known to the early man. It is also known that they were not only bitter but also poisonous. For some reason the fruit of a particular tree lost those characteristics. That tree was identified seeds from it were collected and cultivated. Maize now and in early days are two different things scientists say. The process called cultivation itself was not there to identify the suitable types. The hope that a particular type would be helpful as a crop was also not there. It was all experimentation.


It is not necessary that the entire crop should be useful. Like with almonds, it is enough if the good type is found. It is enough to start from there and go on growing it. Man looked for certain traits in the crop before taking up for cultivation. The first of it is the size of the fruit or the seed. It would not be meaningful to spend time and collect something not enough to fill the belly. Maize and many kinds of fruits were identified with this view. Excepting grapes, most of the fruits that we eat are big in size and have enough flesh in them. In Banana, the oldest domesticated fruit, even seeds are absent. Taste is another important matter. There was always a link between the food and taste. Man would not eat anything unless tasty even if it is good for health. Certain crops were adopted for oils. Certain others were grown for the fibre in the name of clothing.


All said and done, this selection never happened overnight.

Certain questions really make us think!!
%%%%%%%

No comments: