Monday, September 14, 2009

Krishna Leelau


రమణ బాపుల శ్రీ కృష్ణలీలలు

This is an excerpt from the book written by Sri Mullapudi Venakataramana and illustrated by none other than his eternal creative partner Bapu.


I never knew that they have written a book like this.

I really stumbled on it.

I am aware of the devotion Bapu has for Ramayana and Rama In particular.


This book on Krishna is a wonderful work.


It gives a clear view of the Avataram in the simplest of the style.


Of course, Ramana got carried away by the subject and has used such language, a little on the heavier side.

Still it is eminently readable.


Interestingly when all the people think that Krishnanshtami is over in the month of Sravanam itself, some people like us who follow solar calendar have waited for the Simha masam for the same. Even in this there are some people who are celebrated the festival on 12th of September and the others a day earlier, for certain reasons.

Here is a small part of the book Krishna Leelalu.


నక్షత్రాలు కోటి సూర్య ప్రభలై దీపిస్తున్నాయి. జేగంటలు గుడిగుడిలో గుండెగుండెలో మారుమోగుతున్నాయి.



దేవకి ముఖం దుర్నిరీక్షమైన తేజంతో బాధతో, ఆనందంతో వెలిగిపోతూంది.



అంతలోనే ఆమె కన్నులు మూతపడ్డాయి. అలసి సొలసిన ముఖం భువనమోహనంగా పక్కకు వాలింది. తృప్తిగా నిట్టూర్చింది.



జగన్నాథుడు, జగదోద్ధారకుడు, జగత్పతి, జగత్పిత, జగదేకవీరుడు, జగదేకమోహనుడు, జగదేకవంద్యుడు, జగద్గురువు, జగన్నాటకసూత్రధారి, జగదభిరాముడు, లీలామానుషవిగ్రహుడై – చిన్నిశిశువై ఉదయించాడు.






శ్రావణమాసం, బహుళ పక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం, అర్ధరాత్రి, అభిజిన్ముహూర్త వేళ, దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు, లోకకళ్యాణానికి మహోజ్వల ముహూర్తవేళ. మంచివాళ్లకు గుండెలు పొంగేవేళ. చెడ్డవాళ్లకు గుండెలు కుంగేవేళ. కన్నులు తెరిచీ తెరవకుండానే ఒక్క చిన్నారి చిరునవ్వుతో జగతిని కాంతిమయం చేశాడు.






సంభ్రమంతో భక్తులు, భయంతో ఆనందంతో దేవకీ వసుదేవులు పైకిచూసి చేతులు జోడించి మొక్కుతున్నారు.



జగదానందకారకుడైన శ్రీమహావిష్ణువు చతుర్భుజుడై శంఖ చక్ర శార్జ్ఞ్గ గదాధారియై దర్శనం ప్రసాదించాడు.






‘పుణ్యదంపతులారా! నేను మీ దాంపత్యఫలాన్ని కావాలన్నమీకోరికను మన్నించి నాడు ప్రశ్నవర్గుడుగా వామనుడుగా, ఈనాడు కృష్ణవర్ణుడిగా మీ బిడ్డనై పుట్టాను. ఈ జన్మ తర్వాత మీకు ముక్తి లభిస్తుంది. వసుదేవా! నువ్వు శిశురూపాన ఉన్న నన్ను వ్రేపల్లె తీసుకు వెళ్లి అక్కడ నందుని సతి యశోద చెంత ఉంచి, ఆమె పొత్తిళ్లలో ఉన్న యోగమాయను దేవకీమాత ఒడిలో చేర్చు. దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ కాలచక్రం ద్వారా నేను సంకల్పించి ప్రయోగించే జగన్నాటకం ఈ క్షణాన నేను జన్మిస్తూన్న ఈ అభిజిన్ముహూర్తాన ఆరంభమవుతోంది. మీకు శుభం.’ అంటూ శ్రీమహావిష్ణువు అంతర్ధానం చెందాడు.



Incidentally this happens to be my 100th post on this blog!




No comments: