13 మార్చి 2000
ఆసక్తి యుండుట మంచి లక్షణమే. రకరకములైన విషయములందు ఆసక్తియుండుటగూడ మంచి లక్షణమే. కానీ ఏదో ఒక విషయమున మంచి పారంగత్వముండుట ఎంతయో అవసరము. అన్నియు దెలిసినట్లు మాటలాడువారు కొందరుందురు. వారు తెలియని విషయమును గూర్చిగూడ యనర్గళముగ నుపన్యసింతురు. తమ తెలివిలేమిని పదుగురి ముందుంచుటయందు వారికెటువంటి సందియమును గలుగదు. వినుచున్న వారిలో ఆ విషయమును గూర్చి బాగుగా దెలిసినవారుండ వచ్చునను అనుమానము గూడ వారికి గలుగదు. ఎవరయిన వారి ప్రవాహమునడ్డగించి చర్చకు దిగవచ్చును. వానికి విషయము దెలియదని, విషయము దెలిసిన వానికే తెలియును. అట్టివాడు చర్చకుపూనుట యనవసరమని తేల్చివేయును. కావున మిన్నకుండును. కడమవారికి సంగతి దెలియదు.
కొందరు ఇట్లు మాట్లాడి మంచి హోదాలు సంపాదించుకొందురు. ఆ తరువాత వారేమి మాట్లాడినను చెల్లును. కడకు వారు చెప్పినదే నిజమేమోయను వరకు పోవును. లోన లొటారము పైన పటారమన నిదియే.
అన్నియున్న విస్తరి అణిగిమణిగియుండునని ఒకమాటయున్నది. అణిగిన విస్తరి కేవలము యాదృచ్ఛికము మాత్రమే. అది భోజనమునకు ఆధారము. భోజనము మాత్రము గాదు. భోజనమైన పిదప విస్తరిని కుక్కలకు వదులుదురు. అప్పుడది అయోగ్యము. అవసరము తీరిన పిదప ఏదయినను అయోగ్యమే.
ఆసక్తిగలవారు ఆసక్తికి ఆధారముగనేదో ఒక విషయమును ఎంచుకొన వలయును.
అందు మంచి నైపుణ్యము సంపాదించ వలయును.
అంబటిలో తెడ్డుగానుండరాదు.
I used to write my diary in a language that is not exactly of daily use. I do not have any reason to do so. I like the style.
In this entry I have written about people who shine by their eloquence but not exactly expertise. I really do not remember what provoked me to pen these lines. I know many people who attained heights though they are empty on the content.
Thus goes the narrative.
To be interested is a good character. To be interested in many things is also a good thing. But, it is necessary that one has good expertise in at least one subject. There are some who speak as if they know all the things. They wax eloquent even on things that they do not know. They do not have an iota of apprehension in exposing their hollowness before people. That there could be some in the audience who know much about the topic does not occur to them. Anyone can stop their flow and challenge to a discussion. That the speaker does not know what he is speaking about is known to only him who knows it. Such person knows that a discussion there is futile and keeps quiet. The rest of them do not anything!
Some people achieve high offices by speaking in this manner. After that whatever they speak will be accepted. It will even reach a situation where what they say will remain as the truth. An appearance being deceptive is the paradigm here. A leaf plate with all the material on will be stable. Thus goes a saying. Stability of the plate here is only incidental. The plate is the basis for the meal. It is not the meal itself. Once the meal is over the plate is thrown to the dogs. At that time it is a symbol of uselessness. After all anything that has already served its purpose is useless!
For our interest we have to choose one subject.
We have gain good knowledge in that subject.
One should not be a jack of all trades!
No comments:
Post a Comment