I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Thursday, September 24, 2026
Sunday, June 14, 2026
లోకాభిరామం - బ్యాడల పుళి (On languages and me)
లోకాభిరామం - బ్యాడల పుళి
బ్యాడల పుళి
నేను పాలమూరు వాణ్ని. అంటే మహబూబ్‌నగర్
వాడినని అర్ధం. మాకు కర్నాటకలోని రాయచూరు దగ్గర. జిల్లా అంచుల లోని మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లో మాట్లాడే తెలుగు
చిత్రంగ ఉంటుంది. కన్నడము కలయికతో అది వింతగ తోస్తుంది. పప్పును బేడలు అనడం మాకు
అలవాటు. మా ఇంట్లో బేడల పుళి అని ఒక వంటకం ఉంటుంది. అందులోని బేడలంటే కన్నడ బేళె.
అనగా పప్పు. ఇక పుళికి, చారల, కోరల పులికి సంబంధం లేదు. పచ్చి
తెలుగులో చెప్పాలంటే అది చింతపండు పులుసు. కన్నడలో అది హుళి. తెలుగులో ‘ప’ వాడే
చోట్ల కన్నడంలో హకారం వస్తుంది. హాలు అంటే
పాలు. హాడు అంటే పాట. హావు అంటే పాము. కనుక అది బేళెహుళి (కన్నడం) గాక పుళి
అయింది. తమిళంలో పుళియ మరం అంటే చింత చెట్టు. పుళి అంటే పులుపు. ఇంతకూ మా
వంటకాన్ని పప్పు పులుసు అనవలె. అట్ల అంటే మా వాళ్లకు కోపం వస్తుంది. చాలా మాటలకు
తమిళం గాని తమిళం వాడాలె. లేకుంటే సాంప్రదాయం పాడయింది అంటరు. మా ఇండ్లలో
పచ్చిపుళి కూడ ఉంటుంది. మా ఇండ్లలో పెట్టే దేవుని దీపం పేరు పెరుమాండ్ల తిరువళికె.
పెరుమాళ్ అంటే దేవుడు. తిరువిళక్కు అంటే శ్రీదీపము. అది తిరువళికె అయింది.
ఇక్కడ నాకు సంబంధం లేని సంగతి ఒకటి
చెప్పాలె అనిపిస్తున్నది. ‘రాజ్యాలు పోయినా పూసలు పోలేదు’ అని ఒక మాట ఉన్నది.
శ్రీకృష్ణదేవ రాయల బొమ్మను అందరు చూచి ఉంటరు. పుస్తకాలలో ఆయన పొట్టివాడని, స్ఫోటకం మచ్చలు గలవాడని రాసి ఉంది.
బొమ్మల్లో, విగ్రహాల్లో
మాత్రం ఆయనను ఆజానుబాహువుగా చూపిస్తరు. అది వేరే సంగతి. అట్ల పక్కన బెడుదుము.
ఆయనకు కిరీటము గాని కిరీటము ఒకటి ఉంటుంది. అది పౌరాణికం సినిమా తరహా బంగారు కిరీటం
కాదు. పట్టుబట్టతో తలపాగా చుట్టి, ముందు
బాసికము వంటి అలంకరణ బిగించి ఉంటుంది. అందముగ వుంటుంది. అయినా అది కూడ మనకు ఇక్కడ
అది చర్చనీయాంశము కాదు. కిరీటము ముందు భాగము లో ఒక పక్కన ముత్యాలు, లేదా అటువంటి వెలగల పూసల గుత్తి ఒకటి
అమర్చి ఉంటుంది.(ఎడమ వేపా, కుడి
పక్కనా? కుడి
అయ్యుండాలె!) ప్రభువులు కదులుతుంటే అవి కదులుతూ,
కంటి పక్కన ఆడుతుంటయి. కృష్ణదేవరాయలు
కూడ రాజ్యము పోగొట్టుకున్నడు. కానీ ఈ మాట ఆయన గురించి చెప్పినదని నేను అనుకోను.
పూసల గుత్తి కిరీటం గల ఒకానొక రాజు గారికి కిరీటం పోయింది. అంటే రాజ్యం పోయింది.
ఆయనకు కనుకొలుకులలో పూసల కదలాట కనిపించడం లేదు. రాజ్యము గురించిన బాధ ఉండనే ఉంది.
ఆ రాజ్యాన్ని అనుక్షణం గుర్తు చేసే పూసలు లేకుండడము మాత్రం ప్రభువులకు ఎంతమాత్రం
నచ్చలేదు. ఉత్త తలపాగా కట్టుకుని, అందులో
పూసల గుత్తి పెట్టుకుని సంతృప్తి పడినడట ఆ అమాయక చక్రవర్తి. అదే రాజ్యాలు పోయినా,
పూసలు పోలేదు అంటే. మా తమిళ సంప్రదాయం కూడ అట్లనే మిగిలింది.
అన్నము వడ్డించు’ అనడాన్ని ‘సాదం’
పరిమారండి అనాలె. అట్లంటే మా తమిళ వైష్ణవ సాంప్రదాయపు మాట కింద లెక్క. మొన్న
మొన్నటి వరకు ‘అన్నము’ అంటే ‘మాటలు రావా? అని
పెద్దలు గద్దించే వారు. తమిళనాట అందరు ‘సాదము’ అని అంటరు. అని నేనంటే, నీవు చార్వాకుడవు అన్న వారున్నరు.
సంప్రదాయమంటే, అదేమిటి
అని అడిగే దినములు వచ్చినవి. గుడిలో కూడ వైట్‌రైస్‌లు, బఫే పద్ధతిలో వడ్డిస్తున్నరు. అయినా
మావాండ్లు ఇంకా కొన్ని మాటలను వదలలేదు. వదిలితే నిజంగానే మూలాల గురించిన సోయి
లేకుండ అవుతుందేమో?
సాపాటు అనాలె. భోజనం అన్నది అలవాటు
లేదు. సాపాట్ల వ్యాళ (సమయంలో) హిందీ, ఉరుదూ
మాటలు తప్పు అని ఒక సంప్రదాయము. దేశంలో మిగత ప్రాంతాలలో అందరు ఉరుదూ (ఉర్దూ అనాలె)
కలిసిన హిందీ మాత్రమే మాట్లాడతరని నేను అంటే అది వితండవాదన కింద లెక్క. కానీ నా
అనుమానాలు నాకు ఉండనే ఉన్నయి. ఉత్తర భారతంలో కూడ సాంప్రదాయ పరులు, సంస్కృత పదాల వాడకాన్ని కోరుకుంటరన్నది
అందులో ఒకటి. జల్దీ అంటే ఉర్దూ. త్వరగా, తొందరగా
అని అర్థం కానీ ఉత్తరప్రదేశ్ బ్రాండ్, శుద్ధ్
హిందీ వారు, తురంత్, శీఘ్ర్ అనే మాటలు వాడుకుంటరు. ఈ కల్తీ
సమస్య అక్కడ కూడ ఉండేది. ఉంది అని నా అనుమానం.
హైదరాబాద్ స్టేట్‌లో ఉరుదూ ప్రభావం బాగ
ఎక్కువ. ‘విస్తరి ఫరోఖ్త్‌గ ఉండంగ చట్నీ కినారాలో వడ్డించిన సబబేమి’ అన్నడట ఒక మొగుడు పెళ్లాన్ని, పెండ్లామును నిలదీస్తూ. ఆకు ఖాళీ (ఖర్మ, ఇది ఉర్దూ మాట!)గ ఉంటే పచ్చడి (తొక్కు)
అంచున వేయడానికి గల కారణం ఏమి అని భావము. ఆమె ఏం సంజాయిషీ (ఖర్మన్నర, ఇదీ ఉర్దూ మాటనే!) ఇచ్చుకున్నదో
తెలువదు. తెలువదు అంటే తప్పు. తెలియదు అనాలె (ఖర్మ!) (కర్మ వేరు ఖర్మ వేరు. ఖర్మ!
ఖర్మ!)
హైదరాబాదులో ఈ పక్క జిల్లాలలో కన్నడము
మాట్లాడే వాండ్లు చాలమంది ఉన్నరు. మేము పాలమూరులో,
ఒకానొక గుడిపక్కన ఉన్న గదులలో కిరాయికి
ఉన్నము. కిరాయి అన్నది ఉర్దూ మాట. బాడుగకు, అద్దెకు
అనే మాటలు మా ప్రాంతంలో ఎవరికీ అర్థం కావు. ఆ గుడిలో ఆంజనేయులు, శివుడు ఇద్దరు ఉంటరు. ఇద్దరు వేరువేరుగ
ఉంటరు. మధ్వులకు లేక మధ్వలకు భీముడు, ఆంజనేయ
స్వామి ఆరాధ్య దైవములు. ఆ గుడిలో పూజారులు ముందు నరసింహభట్టు, ఆ తరువాత నారాయణభట్టు. వాండ్లిద్దరు
కన్నడిగులు. అంటే కన్నడ మాట్లాడే వారు. అంటే కన్నడ ప్రాంతము వారు. కనుకనే, ఈ రకము సహజీవనము కారణముగనే మాకు కొంత కన్నడము
అర్థము అవుతుంది. నారాయణభట్టు గారిని చుట్టు పక్కల ఇండ్లవారు తమ ఇండ్లలో పూజలు, వ్రతాలు చేయించేందుకు పిలిచే వారు. ఆయన
గారి తెలుగు అన్యాయంగ ఉండేదంటె అన్యాయం కాదు. నారాయణ భట్టు పూజలో భాగంగా
సత్యనారాయణ కథ చెప్పే తీరు విని తీరవలసిందే. ఈ రకం ప్రభావాల కారణంగనే నేను భాషల
పట్ల ఆసక్తి కలవాడినిగ అయినట్లున్న. ఆయా భాషలు విని నేర్చుకునేందుకు అన్నిటి కన్నా
మంచి మార్గము రేడియో. కన్నడ వార్తలు, ఉపన్యాసాలు
అనే ప్రసంగాలు వింటే శుద్ధమయిన భాష గురించి తెలుస్తుంది. నాటకము, సినిమాలతో ప్రజల భాష తెలుస్తుంది.
మొత్తానికి భాషతో పరిచయము పెరుగుతుంది. హైదరాబాదు వచ్చిన తరువాత బసంత్ టాకీసులో
కన్నడ సినిమాలు చాలనే చూచినట్టు జ్ఞాపకముంది. గిరీష్ కార్నాడ్, గిరీష్ కాసర వల్లి, లంకేష్ మొదలయిన వారి సినిమాలు చాల
శ్రద్ధగ చూచిన. కార్నాడ్ సినిమాల గురించి గంటల పాటు చర్చలు జరిపిన గుర్తు కూడ
ఉన్నది.
ఝలక్ : యూనివర్సిటీ దినాలలో గురురాజ
రావు అని ఒక మిత్రుడు ఉండేవాడు. అతను పాలమూరు మండలానికి చెందినవాడేనని
అనుకుంటున్న. జెనెటిక్స్‌లో ఎమ్మెస్సీ చదివినడు. పరిశోధన వదిలేసి విదేశాంగ శాఖలో
పెద్ద ఉద్యోగాలు చేసినట్టు అతని గురించి విన్నాను. గురురాజరావు అన్న పేరుతోనే అతను
కన్నడిగుడని తెలిసిపోతుంది. నాకు కన్నడము వచ్చునని గురురాజ్‌కు నా మీద కావలసినంత
అభిమానము. కన్నడము మీద అంతకన్న అభిమానము. అతను వచ్చి మామూలుగ నన్ను కన్నడములో ఏదో
ప్రశ్న అడుగుతడు. నేను అంతే మాములుగ, అంతే
వేగముగ తెలుగులో జవాబు (ఉర్దూ మాట) అనే సమాధానము చెపుత. గురు తిరిగి కన్నడములో
మాట్లాడతడు. నేను తెలుగులో మాట్లాడత. మమ్ములను గమనించిన ఒక మిత్రుడు ‘మీరిద్దరు
కన్నడములో, లేదా
తెలుగులో మాట్లాడవచ్చు గద. ఈ రెండు భాషల సంభాషణ ఏమి?
అని అడిగనడు. గురు అంటే గురురాజరావుకు
తెలుగు కూడ బాగ వచ్చును. నాకు మాత్రము కన్నడ వ్యాకరణమును తొక్కి ముక్కలు
చేస్తనేమోనని అనుమానము. అందుకనే కన్నడములో మాట్లాడను. మొన్ననొక వదినగారితో కన్నడము
మాట్లాడవలసిన అవసరము వచ్చింది. ఆమెకు కన్నడము తప్ప మరొక భాష రాదు. అప్పుడు నాకు ఎంతగా ఆ భాషను మరిచిపోయిననన్న
సంగతి అర్థమయింది. చుట్టుపక్కల కన్నడవారెవరూ లేరు. ఈ మధ్యన కన్నడ దేశానికి
తిరిగినది కూడ తక్కువే. అది అట్లుండగ, తమిళ
ప్రభావం మరీ ఎక్కువయింది. తమిళ దేశానికి తిరగడం కూడ నిజంగనే ఎక్కువయింది. కన్నడము
మాట ప్రయత్నిస్తే తమిళము అడ్డముగ వస్తున్నది.
నిజానికి హైదరాబాదులోనే తమిళ, కన్నడ,
మళయాళ సంపర్కం వీలవుతుంది. ఒకప్ప్పుడు ఈ
భాషల సినిమాలు కూడా వచ్చేవి. ఇప్ప్పుడు టీవీ ఛానల్స్ కావలసినన్ని ఉన్నయి. కానీ
చూడడము ఇష్టం ఉండదు.
నేను ఉర్దూ నేర్చుకున్న. జర్మన్ భాష
మూడు డిప్లొమాల వరకు చదువుకున్న జర్మన్ ఇప్పుడు గుర్తు లేదు. ఆ సంగతులు మరొకసారి
విన్నవించుకుంట.
Friday, June 12, 2026
ఆరుద్ర శుద్ధ మధ్యాక్కరలు Arudra's Poem
Wednesday, May 13, 2026
బదరీ (చిన్న కథ) : లక్ష్మీనాథ్ బెజ్ బారువా (అస్సాం గ్రామీణ జీవిత దృశ్యము)
బదరీ (చిన్న కథ) : లక్ష్మీనాథ్ బెజ్ బారువా
బదరీ
(చిన్న కథ)
లక్ష్మీనాథ్ బెజ్ బారువా (అస్సాం గ్రామీణ జీవిత
దృశ్యము)
శిశురాం అప్పుడే పొలం నుంచి తిరిగి
వచ్చాడు. తొందరగా స్నానం చేసి అంగవస్త్రాన్ని మార్చుకుని, సరాసరి
వంటింటిలోనికి వెళ్ళాడు. అతని భార్య బదరి మధ్యాహ్న భోజనానికి వంట చేస్తున్నది.
అన్నం ఇంకా వండలేదని, కూర ఇంకా తయారు కాలేదని చూసి శిశురాంకు
కోపం వచ్చింది. ఆకుకూర లింకా తరగనే లేదు, అరిటాకు మధ్య కత్తిపీట చచ్చిపడి
ఉన్న నెమలిలా ఉంది. పక్కనే పడుకున్న చేప, వంటి నిండా బూడిద పూసుకుని,
త్రాగడంతో మత్తెక్కిన సన్యాసిలా ఉంది. మరొక పక్క, పొగ
వల్ల కళ్ళు మూతలు పడిపోయిన బదరి, పొయ్యి రాజేస్తున్నది.
భోజనం ఇంకా తయారు కాలేదని శిశురాం
చిందులు తొక్కుతున్నాడు. ఉదయం నుంచి అతని మనసు చికాకుగానే ఉంది. అనేకానేక కారణాల
వల్ల అతని ఆగ్రహం పెరిగిపోయింది. నిన్నటి రోజున కృష్ణ ఏకాదశి కనుక దోషమని నాగలి
పట్టనే లేదు. నేడు గిత్తలు చాలా చికాకు కలిగించాయి. ఉదయాన్నే పొరుగింటి బహువాతో
సరిహద్దురాళ్ల గురించి పేచీ పెట్టుకున్నాడు. తగాదా ముదిరిపోయేదే, కానీ బహువా
రానున్న ప్రమాదం గమనించి, చల్లగా జారుకున్నాడు. కోపమంతా ఇల్లాలి మీద
తీర్చుకోనడమనేది సామెత కాదు, పూర్తిగా సత్యం. ఇదివరకు ఒకసారి బహువా వల్లనే
బుర్ర వేడెక్కిపోయి, గిత్తలకు వేళ్ళకి మేత వేయలేదని కారణం
మీద, శిశురాం తన భార్యను చితక కొట్టడం ద్వారా తన కోపాన్ని తీర్చుకున్నాడు.
బదరీ భూదేవి వంటిది. భర్త ఆగ్రహావేశాలను
పల్లెత్తు మాట అనకుండా సహించింది. నిజానికి - నిద్ర, ఆకలి
ఎలాంటివో వివాహిత స్త్రీకి దెబ్బలు, ఛీత్కారాలు అటువంటివేనని ఆమె
నమ్మకం. కానీ దేనికైనా ఒక పరిమితి ఉన్నది. సహనానికి మారుపేరైన భూదేవి కూడా
ఒక్కొక్కప్పుడు ఆగ్రహిస్తుంది. భూకంపం సంభవిస్తుంది. పరిస్థితులు భరింపరానివిగా
తయారైనప్పుడు బదరీ కూడా ఎదురు తిరిగితే అసహజమవుతుందా?
బదరీ పొగతో వేగిపోయింది. ఆమె వంక కసిగా
చూసి, ఆవేశంతో
అరిచాడు. 'ఇంత
పొద్దెక్కినా వంట ఎందుకు చేయలేదే? ఫలాని వారి కూతురా’ అతని కళ్ళు, ముఖం కోపంతో జేవురించాయి.
పొగలోంచి తల వెనుకకు తిప్పి బదరీ ఇలా
అన్నది, ‘నా
కాళ్లు చేతులు పొయ్యిలో పెట్టి వంట చేయనా? ఇంట్లో ఒక్క ఎండు పుల్ల అయినా
లేదు. తడిపుల్లలు ఊది ఊది ప్రాణం కడగంటుతోంది. ఏమీ చూడకుండా అలా విరుచుకుపడడం
బాగున్నదా?’ ఆమె
కనురెప్పలు చెమటతో బరువెక్కాయి.
‘ఏమిటి అన్నావు, ముండా?’ అని
శిశురాం కంఠం చించుకున్నాడు. ఆవేశంతో బదరీ వంకకు ఒక అడుగు వేసి, కిందనున్న
కత్తిపీట తీసి దానితో ఆమె వీపున ఒక్క వేటు వేశాడు. మరొక దెబ్బ తీసే లోపల బదరీ ఆర్తనాదం
విని శిశురాం తమ్ముడు కినారాం ఒక్క అంగన వచ్చి, అన్నను పట్టుకొని బయటకు లాగి
వేశాడు. పాపం బదరి నెత్తురు మడుగులో స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత ఆమెను
ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
మూడవ నాడు బదరికి తెలివి వచ్చింది.
కళ్ళు తెరిచి,
ఎవరి
కోసమో అన్నట్టు గది అంతా కలయ చూచింది. చేరువగా వచ్చిన నర్స్ ను చూచి, బదరీ
నీరసంగా ‘ఏరీ ఆయన?’ అని అడిగింది.
‘ఎవరు కావాలెనమ్మా?’
‘మా బాబు తండ్రి.’
‘ఆ దుష్టుడా? జైల్లో
ఉన్నాడు.’
‘వారిని ఇక్కడికి రప్పించరూ? బదరీ
జాలిగా అడిగింది.
‘ఎలా రాగలడూ, అయినా
ఇప్పుడు అతన్ని గురించి ఆలోచించకూడదు నువ్వు. నీ ఆరోగ్యం మరింత పాడవుతుంది.’
నర్స్ మాటలు వింటూ ఉండగానే బదరీ కళ్ళు
మూతపడ్డాయి. కొద్ది క్షణాలలో ఆమెకు తెలివి తప్పింది. విషయం తెలుసుకున్న డాక్టరు, శిశురాంను
తీసుకురాకపోతే రోగి పరిస్థితి విషమించవచ్చునని గ్రహించాడు. తిరిగి తెలివి
వచ్చేసరికి బదరి తన భర్తను చూడడానికి వీలుగా శిశురాంను రప్పించే ఏర్పాటు చేశాడు.
మరునాటి ఉదయం బదరికి స్పృహ వచ్చేసరికి, శిశురాం
ఆమె తల నిమురుతూ పక్కన కూర్చున్నాడు. భర్తను చూసేసరికి ఆమెకి ఏదో బరువు తీసినట్టు
అయింది- మెల్లగా నవ్వి, ‘ఎలా ఉన్నారు? భోజనం సరిగా చేస్తున్నారా?’ అంది. ‘వంట చేసుకోవడం మీకు కష్టమే. ఇంకెంత, మరో
రెండు రోజులలో నాకు నయం అవుతుంది. నన్ను ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేయండి. మీకు
ఇబ్బంది ఉండదు” అంది. శిశురాం కళ్ళనుండి అశ్రువులు రెండు
ధారలు కట్టాయి.
డాక్టర్ను చూసి బదరీ ఇలా అంది, ‘బాబూ, ఆయన
ఏ పాపం ఎరుగరు. వట్టి అమాయకులు. ఆయన్ను ఏమీ చేయకండి. నేనే కత్తిపీట మీద పడి గాయం
చేసుకున్నాను’, అని వెక్కివెక్కి ఏడ్చింది. అంతా
నిస్తబ్ధులయ్యారు. శిశురామ్ తన దుఃఖాన్ని అణుచుకోలేక పోయాడు. పసివానిలా ఏడ్చాడు.
‘అది నిజం కాదు బాబూ, నేనే
కత్తిపీటతో ఆమెను కొట్టాను. నాకు శిక్ష విధించండి. నేను పాపిష్టి వాడిని బాబూ, కట్టుకున్న
భార్యని కత్తితో పొడిచిన దుష్టుడిని’, అని
తొందర తొందరగా,
జాలిగా
అన్నాడు శిశురాం.
కొద్ది వారాలలో బదరీ గాయం నయమయింది.
ఆమెను ఆసుపత్రి నుంచి పంపించి వేశారు. శిశురాం ఏ పాపం ఎరగడని బదరీ శతవిధాలు
చెప్పడానికి ప్రయత్నించినా, నేరం రుజువై, అతనికి
మూడు నెలల కఠిన శిక్ష విధించారు. శిశురాం తన పాపానికి ప్రాయశ్చిత్తం
అనుభవించేందుకు నవ్వుతూ వెళ్ళాడు జైలుకి.
భర్త జీవితంలో వచ్చిన ఈ మచ్చకు తనే
కారకురాలని నిందించుకున్నది బదరీ. తన్ను తాను నిందించుకున్నట్టుగా మరెవ్వరూ ఆమెను
నిందించలేకపోయారు.
బదరి అన్న ఈ కథ నిజంగా పాతకాలంనాటిది.
రచయిత లక్ష్మీ నాథ్ బెజ్ బారువా ఈ శతాబ్ది మొదటి మూడు దశకాల్లో గొప్ప పేరు
సంపాదించుకున్న అస్సామీ రచయిత. కథలో ఆ కాలపు పల్లె స్త్రీల మానసిక పరిస్థితి
కనబడుతుంది. మొగుడు ఎంత ఘాతుకం చేసిన ఆడవాళ్లు భరించాల్సిందే, అన్న
పద్ధతి ఈ కథలో కనపడుతుంది. నిజానికి ఇప్పటికి కూడా దేశంలోని పల్లెల్లో పరిస్థితి
ఇంచుమించు అట్లాగే ఉందేమో.
Saturday, February 7, 2026
The Struggle : English version of a Telugu story by Devaraju Maharaju
The Struggle
English version of a Telugu story by
Devaraju Maharaju
Eyelids closed.
Nerves move, the lids move, and the eyes are opening slowly.
A scene showing the wind pushing open the door.
Light penetrates past the threshold.
A clear eye. Dark pupil in the center. Pupil turns into
globe and revolves around it.
Oceans, continents, countries as cut pieces of continents,
states as cut pieces of countries. The globe revolves. Tides in the
ocean….trees, animals, fields, villages, uncivilised people, deserts, cities,
civilised people, hills, valleys…..
Tides in the ocean…. globe revolves slowly.
Europe, Africa, North America, South America, Australia,
Asia, and in its southernmost tip India.
“Dad, My ball…..”
“Don’t you worry. Mother must be on the way back. …I will
bring chocolates for you when returning in the night. Don’t cry…” Steps were
proceeding further as words of solace dropped back. The lane from that house
joins the main road. He caught the bus that appeared. It was moving slowly.
There were three busloads of people in a single bus. It was him who wrote that
there were buses after every five minutes.
(Please bring down
this glass pane. Wind that is blowing is causing trouble. – in typical
Hyderabadi slang) Yadav could not understand. He looked in confusion. The man repeated the same sentence.
People listening laughed in themselves. That language - was then clear. He was
asking for the window to be closed. He did it. The man laughed in gratitude.
Cough obstructed the laughter. He put the muffler to his mouth.
Sunday, January 11, 2026
లోకాభిరామం ఎవరు చెప్పాలి? : Lokabhiramam - Evaru Cheppali?
లోకాభిరామం
ఎవరు చెప్పాలి?
ఎవరు చెప్పాలి?
ఊరికంతా అప్పిగాడు లోకువ, అప్పి గానికి నేను లోకువ అన్నాడట ఆ మహానుభావుడు ఎవరో, అప్పిగానికి తాను ఊరికి లోకువ అన్న సంగతి గురించి బాధ లేదు. తనకు కూడా ఎవరో ఒకరు లోకువ అయితే చాలు. ఇది ఒక అప్పిగానికి మాత్రమే సంబంధించిన విషయం కానేకాదు. మనదేశంలో అందరి మనస్తత్వం ఇట్లాగే ఉంటుంది. మానావమానములను సమానముగా చూడవలెనని సూత్రం చెప్పగలిగిన దేశం మనది. తుల్య నిందా స్తుతిర్మానేః అని గదా సూక్తి! రాజపూజ్య అవమానాలు గ్రహచారం కొద్ది వచ్చేవి మాత్రమే అనుకోగలిగిన మంచి సంప్రదాయం మనది. దూషణ భూషణ తిరస్కారాలకు చలించని గట్టి మనుషులం మనమంతా.
అవమానం భరించినందుకు కొంప మునగకపోవచ్చు. అలాగని అన్యాయాన్ని కూడా అంతే సులభంగా భరించడం మనకు అలవాటయింది. ఇందులో కొంచెం తంటా ఉంది. రాజకీయాల్లో తప్ప ఓడిపోయిన వారికి ఎవ్వరికీ కోపం రాదు. అందుకే మన వాళ్లు ఆటల్లో ఓడి కూడా జల్సా చేసుకోగలరు. కోర్టులో వ్యాజ్యం పోయి ఇల్లు గుల్ల అయినా సరే పర్వాలేదు. ఎందుకు ఓడితిమి అన్న చర్చ మనసులో బాధను మాత్రం కలిగించదు. అంగడివారు చచ్చుపుచ్చు వస్తువులను అంటగడితే ఎందుకిలా అని అడిగే సత్తా లేదు. అన్నింటికీ ఒకటే ఊరడింపు. ప్రారబ్దమిట్లుండగా ఒరులనను పని లేదు అని త్యాగరాజస్వామి వారు పాడి చెప్పారు. ఖర్మం ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు అని సరిపెట్టుకోవడం మన పద్ధతి. అడిగితే తంతారేమోనన్న భయం కూడా ఓ మూలన కొంత లేకపోలేదు. అంతా కలిపితే తాత్పర్యం ఒకటే. అవసరం లేని వాళ్ళు కూడా అన్యాయం చేయడానికి అడుగు ముందుకు వేస్తారు.
జంటనగరాల్లో ఆటో వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించిన వారందరికీ ఒక అనుభవం ఎదురయింది ఉంటుంది. నాకు రెండు చక్రాలు, నాలుగు చక్రాలు తెలియవు కనుక ఆటోల మీద ఆధారపడతాను. కొత్తగా వచ్చిన ఓలా, ఉబెర్ లు కూడా అన్యాయంగానే ఉన్నాయని నా అభిప్రాయం. యక్షులు గంధర్వులుగా విమానాల్లో తిరిగి ఏదో శాపం కారణంగా భూలోకం మీదకు వచ్చిన జాతి వారు విమానాలను, రథాలను మరిచిపోలేక ఆటోలు నడుపుతున్నారని ఒక పెద్దమనిషి నాకు విడమర్చి చెప్పారు. అది అక్షరాల నిజం అనిపిస్తుంది. వారు మీరు అడిగిన చోటికి వస్తానంటే గొప్ప అనుగ్రహం ప్రసాదించినట్టే లెక్క. ఈ మధ్యన అసలు ఆటో వాళ్లు అసలు నీ దగ్గర పైసలు ఉన్నయా అన్నట్టు చూస్తున్నారని నాకు అనుమానంగా ఉంటుంది. ఆ రథంలో కూర్చున్న తర్వాత మొదలవుతుంది కథ. మీటరు మినిమం కిలోమీటర్ల దూరం కాకముందే పరగుపెట్టడం మొదలవుతుంది. ఈ రహస్యం చాలా మంది ఆటో ఎక్కే వాళ్ళకి తెలియదు. నిత్యము ఎక్కే వాళ్లకు కూడా అంత ధ్యాస ఉండదు. ఉన్నా సరే ఎవరికి తెలుసు అనుకుని ఊరుకుంటారు. ఈ మధ్యన అసలు మీటర్ మీద నడిచే ఆటోలు లేకుండా అయినయి. పాత కాలంలో రిక్షాల వలె బేరాలు ఆడవలసి ఉంటుంది. ఎక్కడో సకృత్తుగా మీటర్ తో వచ్చే ఆటో దొరికినప్పటికీ చేరవలసిన చోటికి వెళ్ళిన తరువాత అది ఒక భయంకరమైన అంకెను చూపిస్తుంది. మామూలుగా 60 కావలసిన చోటికి 66, 70 ఆ పైన ఎంతైనా చూపిస్తుంది. ఎలక్ట్రానిక్ మీటర్లు రాకముందు ఈ పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. డిజిటల్ మీటర్ లలో ఈ బాధ లేదు అన్నారు. కానీ చూస్తుండగానే వాటిని కూడా గోల్మాల్ చేసే పద్ధతులు మనవాళ్లు తెలుసుకున్నారు. అంకెలు చూచిన మీ అంతరాత్మ ఘోషించింది అనుకోండి. ఇక జరిగిన అన్యాయానికి తోడుగా అవమానం కూడా ఎదురై సిద్ధంగా నిలబడుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా ఆటో ఎక్కావా, అని అనిపించుకుంటే ఆశ్చర్యం లేనే లేదు. మంచి తనం మీద నమ్మకం గల గంధర్వుడు అయితే, ఏం చేయమంటావు పెట్రోల్ బంక్ వాళ్ళు, ఆటో సొంతదారుడు నన్ను మోసం చేస్తుంటే నేను నిన్ను ఎంచుకున్నాను మోసం చేయడానికి అంటాడు. నీవు వెళ్లి మరెవరినైనా వెతికి చేతనైనంత
మోసంచెయ్యి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేస్తాడు. అది నాకు చేత కాదు అన్నారే అనుకోండి, అర్భకుడా అన్నట్టు నీ వైపు చూస్తాడు. బతుకు దారి గురించి విడమర్చి చెప్పిన యోగిలాంటి కటాక్ష వీక్షణం మనమీద పడవేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరి మనకు రక్షణగా తాత్వికత అనే రక్షణ కవచం ఉండనే ఉంటుంది. మళ్లీ నా ఖర్మ లాంటివి, గుర్తు తెచ్చుకోవాలి. తాత్వికతను, కొంచెం భయాన్ని మేళవించి అంతకన్నా ఫిలసాఫికల్ నవ్వు ముఖమంతా పూసుకుని జేబులో లేదా పర్సులో చేయి పెట్టక తప్పదు. గంధర్వులు పూర్తిగా రూపాయలే గాని చిల్లర పుచ్చుకునే కాలం ఎప్పుడో గడిచిపోయింది. ఈ మధ్యన చిల్లర అంటే ఐదు రూపాయలు కూడా లెక్కలోకి తీసుకుంటున్న పరిస్థితి. పది రూపాయలకు పూర్తి చేసి చెల్లింపులు జరపాలి. ఖర్మం కొద్ది 5 రూపాయల నోట్లు, అంతకు చిన్న బిళ్ళలు కనక 5 వద్ద కనిపిందాయంటే, గంధర్వుడి నిన్ను పురుగులాగా చూడడం మొదలు పెడతాడు. నేనే దొరికానా అని నేను ఒకరి చేత అనిపించుకున్నాను. ఇక మరీ పెద్ద నోట్లతో సమస్య మరొక రకంగా ఉంటుంది. గంధర్వుల వద్ద వందకు కూడా చిల్లర ఉండదు. ఉంటుంది అనుకుంటే అది మన మూర్ధత్వం తప్ప మరొకటి కాదు. ఆ సంగతి మనం అర్ధం చేసుకోవడానికి అక్కడ ఒక చిత్రమైన నాటకం జరుగుతుంది. మొత్తానికి కొంత అదనపు ఖర్చు, కొంత అన్యాయం,
మరికొంత జ్ఞానోదయంతో యాత్ర ముగుస్తుంది. తెలివి తక్కువ కొద్ది నోరు చేసుకోవడానికి పూనుకుంటే ఎదురుగా తిట్లు రావన్న గ్యారెంటీ లేదు. పోలీసులకు మరొకరికో ఫిర్యాదు చేయాలనుకోవడం కన్నా తెలివితక్కువ పని ఇంకొకటి లేదు. ప్రపంచంలో
రక్షకులు అనుకున్న వారంతా దొంగలతో గట్లు పంచుకున్న వారేగానీ మామూలు మనిషి మాట వినే వారు కాదన్నది అనుభవం మీద తెలిసిన సత్యం. ఈ ఆటోల మీటర్లకు బాధ్యులైన ప్రభుత్వశాఖ వారు జరుగుతున్న అన్యాయాలను అన్నింటిని హాయిగా నవ్వుతూ చూస్తున్నారు కానీ అందులో కలుగ చేసుకునే ప్రయత్నం చేయడం లేదు అంటే ఎంత మంది నమ్ముతారు?
నేను ఏకంగా హైదరాబాదు ఆటోలను గురించి ఇంటర్నెట్ లో అదేదో డాట్ కామ్ లో పిటిషన్ మొదలు పెట్టాను. వారం అయింది. రెండు వారాలు అయినయి. కదలిక లేదు. నెట్ వాడుతున్న వారు ఎవరూ ఆటోలు వాడరేమో అన్న అనుమానం మొదలటయింది. నోరు మూసుకుని ఉండిపోయాను. అంతా మోసం! అంతా అన్యాయం!! తిరువనంతపురంలో ఒక మిత్రుడు కనిపించిన ప్రతి ఆటో మీద కోర్ట్ కేసు వేసి అందరినీ తికమక పెట్టడం నాకు బాగా తెలుసు. చివరికి అతను కూడా బహుశా తన ప్రయత్నాలు మానుకొని ఉంటాడు. స్వయంగా లాయర్ కాబట్టి ఖర్చులేకుండా కావాల్సినన్ని కేసులు వేశాడు. కానీ ఒక మనిషి ఒక వర్గంతో, అందునా అధికారుల అండ గల వర్గంతో పోరాడ కలగడం అసాధ్యం కాదా?
ఆటో వాళ్లు అన్యాయం చేస్తున్నారు అన్న సంగతి మహా ఘనత వహించిన ప్రభుత్వము వారికి తెలియకుండా ఉండదు. ఇన్ని సమస్యలు ఉండగా ఇదొకటా అన్న ధోరణి తప్ప నిర్లక్ష్యానికి కారణం మరొకటి కాదు. మామూలు మనుషుల గోల ఎవరికీ పట్టదు. పట్టిన పక్షంలో సమస్యకు సమాధానం ఒక పూటలో దొరుకుతుందని నా నమ్మకం. ఈ వ్యాసం తుంపును సదరు సర్కారు వారికి ఎవరయినా అందిస్తే ఎంతో బాగుంటుంది. కార్డు ముక్కలను పిటిషన్ లుగా తీసుకుంటారట. నా వ్యాసాన్ని కూడా అట్లాగే తీసుకుంటే మంచి జరుగుతుంది.
అన్యాయం గురించి గొంతు చించుకుని గోల చేయడం కన్నా అర్థం లేని పని మరొకటి లేదని అనుభవం మీద మనకు అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం కంటే వ్యభిచార గృహానికి, లేదా కల్లు పాకకు వెళ్లడం గౌరవంగా ఉంటుంది అనుకునే పరిస్థితి మనది. ఒక ట్రాఫిక్ పోలీిసాయనకు ఒకానొక సాయంత్రం మందే మాతరం సమయం గనుక నా మీద వల్లమాలిన కోపం వచ్చింది. మాయావిడ చిన్న పొరపాటు చేసింది. అతను అవమానకరంగా మాట్లాడ సాగాడు. ఇద్దరమూ గౌరవంగా బతుకుతున్న వాళ్లమే. తప్పు ఒప్పుకుంటున్నాము అని ఏదో చెప్పబోయాను. అతనికి తిక్క రేగినట్టుంది. బూతులకు దిగాడు. జర్నలిస్టు సోదరులను పిలిచి గోల చేసి ఉండవచ్చు. కానీ అక్కడ పరిస్థితి శృతి మించి రాగాన పడుతున్నది. మందు ప్రభావంలో సోదరుడు మితి మీరుతున్నాడు. అసలు సంగతి, మేము మెడికల్ ఎమర్జెన్సీలోకి వెళ్తున్నాము. అడిగిన డబ్బు ఇచ్చి రసీదు లేకుండానే బయట పడినట్టు గుర్తు.
ఇక కోర్టుకు వెళ్లడం కన్నా కనకష్టమైన పని మరొకటి లేదు. న్యాయం కోసం న్యాయస్థానానికి వెళితే అక్కడ ఆ సరుకు
దొరుకుతుందన్న నమ్మకం అసలు లేదు. అధవా దొరికిన ఆలోగా ఈ మనిషి మిగిలే అవకాశం ఉండదు. న్యాయం దొరికే లోపల దాని అవసరం తీరిపోతుంది. ఇంతకూ అన్యాయం చేసేందుకు వీళ్లు మాత్రమేనా అనేది అసలైన ప్రశ్న! అందరికంటే ముందు నాకు అనుభవంలో ఉన్న విషయం కనుక ఆటో వాళ్ళు గుర్తుకు వచ్చారు. నేను ఈ వ్యాసం రాశాను అన్న సంగతి తెలిస్తే, వాళ్లంతా చేరి నాకు దేహశుద్ధి చేస్తారేమో? చేస్తే బాగుండును! టీవీ చానల్ వాళ్లందరినీ పిలిచి పెద్ద గోల సృష్టించి విషయానికి ప్రచారం కలిగించగల అవకాశం దొరుకుతుంది. అక్కడికి టీవీ వీళ్లు నేను ఎప్పుడు పిలుస్తానా అని ఎదురు చూస్తూ కూచున్నారని అనుకోవడం నా తెలివితక్కువతనం. వాళ్ల అన్యాయం పద్ధతులు వాళ్లకూ ఉంటాయి.
ఒకరు అన్యాయం చేయడానికి వందమంది కారణం అవుతున్నారు. పెట్రోల్ వాళ్లు తక్కువ పోస్తారు. చూచే వాళ్లు తక్కువ తూస్తారు. ఈ సంగతి అనుభవం లేకుంటే కోఠీ కి వెళ్లి ఏవైనా పళ్లు కొని చూడండి. దిమ్మ తిరుగుతుంది. కిలో అని ఇచ్చిన పళ్ళు ఇంటికి వస్తే ఆరు ఏడు వందల గ్రాములు గా మిగిలితే చాలు. కొలిచి ఇచ్చేవాళ్ళు తక్కువ కొలిస్తే, కొలిచి తీసుకునే వాళ్ళు ఎక్కువ కొలుస్తారు. జనాభా వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే మనుషుల సంఖ్య ఒకటి అయితే రేషన్ కార్డు వాళ్లకు చెప్పే సంఖ్య ఇంకొకటి. ఇప్పుడు ఆధార్ కార్డు అని ఒకటి తయారు చేసి మనుషుల ఫోటోలు కూడా తీసి చూస్తున్నారు కనుక కొంచెం పరిస్థితి మెరుగైందేమో ఏమో తెలియదు. పొద్దున హైదరాబాదులో ఓటు వేసి సాయంత్రం లోగా ఏరు దాటి అక్కడ మళ్లీ ఓటు వేసిన వాళ్ళు ఉన్నారని విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ రకంగా మనుషులు రెండు రెండు చోట్ల బతుకుతున్నారు. ఇటువంటి అన్యాయాన్ని భరించడం కష్టం కాదు అనుకుంటే పొరపాటే. అందరూ ఇదే పని చేస్తే కొన్ని లెక్కల ప్రకారం దేశ జనాభా రెండింతలు అవుతుంది. అందవలసిన తిండి నిజంగా అవసరమైన చోట అందనే అందదు.
సర్కారు వారు బడి లేదా ఆసుపత్రి కట్టిస్తారు. దానికి ఇంత ఖర్చయిందని ఒక లెక్క చూపుతారు. ఆ భవనాన్ని కట్టిన గుత్తేదారు పక్కనే బడికి ఆరంతలు ఉండే బంగ్లా కట్టుకుంటాడు. ఆ బంగ్లా కట్టడం ఎట్లా వీలయింది అన్న సంగతి మొత్తం ప్రపంచానికి తెలిసి ఉంటుంది. కానీ ఎవరూ గొంతు ఎత్తరు. మన పని కాదని అందరూ అనుకుంటారు. బంగ్లా కట్టడం మన పని కాదు. కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడం మన పని అంతకన్నా కాదు. అది ప్రజాధనం అన్న మాట ఎవరికీ గుర్తు రాదు. కరకరలాడే రూపాయి నోట్లు పోసిన చోట జరిగే అన్యాయాన్ని గురించి గొంతెత్తి ధైర్యం లేనివాళ్లు ఈ రకమైన ప్రజాధనం గురించి మాట్లాడవచ్చు అని అనుకోవడం కూడా ఉండదు. కొని తెచ్చిన గుడ్డ వారం రోజులలో పోయి తడిపిన ప్రతిసారి కి జానెడు తక్కువ అయితే మరో దేశంలోనైతే ఆ గుడ్డ తయారుచేసిన ఫలానా కంపెనీ మీద నష్టపరిహారం దానికి తోడు మానసిక క్షోభ కలిగింది అంటూ దానికి కూడా వెలకట్టి పెద్ద ఎత్తున దావా వేస్తారు. కంపెనీ వారి కిక్కురుమనకుండా ఆ సమ్మెతో ఇచ్చి సరుకును దుకాణం నుంచి తొలగిస్తారు కూడా.
ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే. అడిగే దిక్కు లేకపోతే అది అలా పెరుగుతూనే ఉంటుంది మరి

