వువ్వులకు రంగులు
ఎందుకు?
ఒక్క గులాబీలే లెక్కలేనన్ని రంగుల్లో ఉండడం చాలామందికి
తెలియకపోవచ్చు. నల్లని గులాబీలు కూడా
ఉన్నాయి. నెదర్లాండ్స్ వంటి యూరప్ దేశాలలో పనిగట్టుకుని ట్యూలిప్ పువ్వులను రకరకాల రంగులలో పోటీపడి తయారు
చేస్తుంటారు. కొత్త రంగులు తయారు
చేయడానికి సంకరకరణం అనే పద్ధతిని వాడుకుంటారు.
ఈ ప్రపంచంలో ఎన్ని రకాల, ఎన్ని రంగుల పువ్వులు
ఉన్నాయన్నది ఊహకందని ప్రశ్న. ఆ రంగుల
అవసరం మాత్రం ఒకే ఒక్కటి. అది పునరుత్పత్తి. ఈ ప్రపంచంలోని జీవులన్నింటికీ తమ జాతి కొనసాగవలెనన్నది ఏకైక కార్యక్రమం.
మొక్కలకు కూడా ఇదే పద్ధతి
వర్తిస్తుంది. మొక్కలు కదలజాలవు. తమ పువ్వులలోని పరాగం మరొక పువ్వులోకి చేరాలి. అప్పుడే పళ్లు వస్తాయి. విత్తనాలు
మరిన్ని పద్ధతులతో విస్తరిస్తాయి. మొత్తానికి
కొత్తమొక్కలు పుడతాయి. తాము కదిలి వెళ్లడానికి వీలులేని మొక్కలు తమ పరాగం మరొకచోటికి చేరాలంటే కీటకాలు,
పక్షుల మీద ఆధారపడాలి. కనుకనే వాటిని ఆకర్షించడానికి
పువ్వులకు అన్ని రకాల రంగులు ఉంటాయి.
పువ్వులు ఎరుపు,
పసుపు రంగుల్లో ఎక్కువగా ఉండడం సులభంగానే గమనించవచ్చు. నీలం రంగులు పువ్వులు మాత్రం చాలా అరుదు.
ఇందుకు కారణాలు లేకపోలేదు. పువ్వులలో
నీలంరంగు రావాలంటే వాటికి అందే రసాయనాలు ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం వస్తుంది.
గులాబీలలో కూడా ఇప్పటివరకు నీలం రకం రాలేదనే చెప్పాలి.
పువ్వులకు నీలంరంగు రావాలంటే రకరకాల పరిస్థితులు ఏర్పడాలి. అవన్నీ కలిసి పనిచేయాలి. వాటిలోని ఆమ్లత,
క్షారత అనే లక్షణాలు సరిగా ఉంటే గానీ నీలం పువ్వులు రావు.
రంగులకు అవసరం అయ్యే పిగ్మెంట్స్ అనే రసాయనాలు కొన్ని ప్రత్యేకమయిన లోహాలను కలిగి ఉండాలి.
హైడ్రాంజియాస్ అనే మొక్కలు పెరుగుతున్న నేలలో తగిన మోతాదులో అల్యూమినం ఉంటేగానీ నీలం
పువ్వులు పెరగవు. పువ్వులలో నీలం రకాలు
ఎక్కువగా లేకపోవడానికి పరిణామపరమయిన కారణాలు కూడా
ఉన్నాయంటారు పరిశోధకులు. పక్షులు సులభంగా ఎర్రని పువ్వుల మీదకు వెళ్లిపోతాయి. కొన్నిరకాల కీటకాలు లేతరంగులను చూడ గలుగుతాయి. తేనెటీగ జాతులకు
ఎరుపురంగు కనిపించదు. అవి తెలుపు,
పసుపు రంగులున్న పువ్వుల మీదకు ఎక్కువగా వెళతాయి. చెట్ల ఆకులు నీలంగా
ఉంటాయన్నది తెలుసు. ఆ ఆకుల మధ్యన తెలుపు,
పసుపు లేదా ఎరుపు రంగుల పువ్వులుంటే అవి బాగా కనపడతాయి. ఆకుపచ్చని ఆకుల మధ్యన
నీలం పువ్వులు కనిపించకపోవచ్చు. కనుకనే పువ్వులు సులభంగా కనిపించే రంగులలో ఎక్కువగా ఉంటాయి.
జంతువులయినా, మొక్కలయినా మనుగడ కొరకు తమ శరీరాలలో, బతుకుతీరులో రకరకాల పద్ధతులను
ఏర్పాటు చేసుకుంటాయి. మొక్కలకు పువ్వులు ఉండడం, కొత్తతరం పుట్టడానికి జరిగే కార్యక్రమంలో
పాల్గొనడానికి మాత్రమే. వాటి రంగులు కూడా ఆ
కార్యక్రమం కోసమే. చివరికి పండ్లు కూడా పునరుత్పత్తి కొరకే. మనం రకరకాల పువ్వులను, రకరకాల జీవులను చూచి ఆనందిస్తాము.
మొక్కలను, జంతువులను ఆహారంగా వాడుకుంటాము.
అంటే వాటి పునరుత్పత్తికి స్వార్ధంకొద్దీ మనం అన్యాయం చేస్తున్నామని అర్థం.
మరిన్ని విశేషాలు
హార్స్ చెస్ట్‌నట్ అనే పువ్వులలో పుప్పొడి అవసరం ఇక లేదనుకుంటే పువ్వుల మీద మరకలు మొదలవుతాయి. అంటే
ఇక పురుగులను, పక్షులను ఆకర్షించవలసిన అవసరం లేదన్నమాట. అవసరం ఉన్నంతకాలం మంచి రంగును కనబరిచిన పూలు ఆ అవసరం తీరిన తరువాత మారిపోవడం కూడా
కొన్ని రకాలలో కనిపిస్తుంది.
మరిన్ని విశేషాలు
పెద్ద మొక్కలు పరాగవ్యాప్తి కొరకు పురుగులు,
వక్షుల మీద ఆధారపడతాయి. అయితే కొన్ని మొక్కలకు ఈ అవసరం
లేదు. గడ్డిజాతి మొక్కలకు వరపరాగ నంపర్కం గాలి ఆధారంగానే జరుగుతుంది. అందుకే ఆ రకం మొక్కలలో వువ్వులు
ఉన్నప్పటికీ వాటికి ఆకర్షణీయమయిన రంగులు ఉండవు.
నేలబారున పెరుగుతున్న చిన్న మొక్కల పూలన్నీ
తెలుపుగానే ఉంటాయి. కొంచెం ఎదిగిన మొక్కలన్నింటి పూలు రకరకాల రంగుల్లో ఉంటాయి.
No comments:
Post a Comment