పాబ్లో నెరూడా ప్రశ్నలు
పాబ్లో
నెరూడా – ప్రశ్నల పుస్తకం
అతడిని
కవిత్వ వారసత్వం అన్నారు. అంతకన్నా ఎక్కువే అన్నారు. ఒక కవి కేవలం తన మాటలతో తన
దేశంలోని రాజకీయాలనే కాక మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు అంటే చటుక్కున
గుర్తుకు వచ్చేది పాబ్లో నెరుడా. అతని కవిత్వం చాలా విస్తృతంగా అనువాదానికి
నోచుకున్నది. ప్రపంచమంతటా ప్రభావాన్ని కనబర్చింది. స్పానిష్ మాట్లాడే ప్రపంచంలో
అతని పేరు తెలియని వారు లేరు. తన దేశంలో అయితే రాళ్లకు కూడా తన గొంతు తెలుసు అన్నాడు
నెరుడా. అతని కవిత ఇంగ్లీషులోకి వచ్చి మాత్రం మరీ ఎక్కువ కాలం కాలేదు. మనదేశంలో
అతని పేరు తెలుసు, అంతే కానీ కవిత తీరు తెలిసిన వారు చాలా తక్కువ.
నెరూడా కవితలు
వైశాల్యంతో బాటు లోతును కూడా కనబరుస్తాయి. ఆ కవితలను చదివి అర్థం చేసుకోవడానికి
చాలా ఓపిక, మనసు అవసరం. అతను బహుశా ఏం చెప్పదలచుకున్నా కవిత ద్వారానే చెప్పాడు
అనిపిస్తుంది. ఆ మాటలను చదివిన తరువాత ఒకరకంగా భయం పుడుతుంది. మనిషికి ఇటువంటి
ఆలోచనలు కూడా వస్తాయా అనిపిస్తుంది.
నొబేల్ గ్రహీత నెరూడా
చిలీ దేశంలో పుట్టాడు. చాలా మంచి రచనలు కూడా తమ ప్రయోజనాన్ని సాధించిన తరువాత
తెరమరుగు అవుతాయి అని ధైర్యంగా అన్నాడు అతను. మొదట్లో మామూలు కవిత రాసినా కొంతకాలానికి
కమ్యూనిస్టు ఆలోచనా ధోరణి వైపు అతను మొగ్గు చూపాడు. సరికొత్త ప్రపంచంలో న్యాయం
కోసం మనిషి చేస్తున్న పోరాటాన్ని కవితలలో ఆవిష్కరించాడు. ప్రభుత్వం వారు ఇచ్చిన
హోదాలతో అతను ప్రపంచమంతటా రాయబారిగా తిరిగాడు. తన దేశానికి తిరిగి వచ్చిన తరువాత
మాత్రం కవితల తీరు బాగా మారింది. 20
ప్రేమ కవితలు
అన్న పుస్తకం నేటికి కూడా ప్రపంచమంతట అందరికీ తెలుసు. ఉత్సాహం, పట్టుదలల ఆధారంగా సాగిన
అతని కవిత్వాన్ని సోల్ ఫుల్ అన్నారు, సారోపుల్ యెట్ బయాంట్ అన్నారు. మరొక నొబేల్
కవి గాబ్రియేల్ గార్సియా మార్క్వేజ్ ఇతనిని ఇరవయ్యవ శతాబ్దిలో అన్ని భాషలలోనూ
కలిపి గ్రేటెస్ట్ కవి అన్నాడు.
1971 లో చిలీ
కమ్యూనిస్టు పార్టీ వారు పాబ్లో నెరుడాను ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి
నిలబడమన్నారు. కానీ అతను ఒప్పుకోలేదు. మిత్రుడు సాల్వడర్ అలెండీకి మద్దతు ఇచ్చి
గెలిపించాడు.
పాబ్లో నెరూడా
కవితా సంకలనాలలో బుక్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది చాలా విలక్షణమైనది. ఇందులో అన్ని
ద్విపద లాంటి ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు అడిగిన తీరు గమనిస్తుంటే ఒళ్ళు
జలదరిస్తుంది. మేఘాలు, రొట్టె, నిమ్మకాయలు,
ఒంటెలు, స్నేహితులు, శత్రువులు
అన్నింటిని గురించి అతను చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాడు. పాఠకుడు లోతైన ఆలోచనలో
పడిపోతాడు. కానీ వాటిలో ఎక్కడ భావావేశం, మరొక పద్ధతి కనిపించవు. కొన్ని
ప్రశ్నలు అమాయకంగా చిన్న పిల్లవాడు అడిగినట్టు ఉంటాయి. ఏదో తెలుసుకోవాలి అన్నది
అతని బాధ. అటువంటి బాధ మళ్లీ మరెక్కడా ప్రపంచ సాహిత్యంలో కనబడలేదు. అసలు ఈ రకంగా
కవిత చెప్పవచ్చును అన్న ఆలోచన కూడా ఎవరికీ కలిగినట్టు కనిపించదు. అతని కవితలు
అన్నింటిలోనూ లోతైన ఆలోచన, తాత్వికత స్పష్టంగా కనిపిస్తుంటాయి.
ఈ ప్రశ్నలో అవి మరింత బలంగా కనబడతాయి.
the same questions I ask them?
wait in little lakes?
Are all sevens the same?
పాబ్లో
నెరూడాను కళాకారుడు అన్నారు. అతను కేవలం రాజకీయ కవి కాడు. ప్రేమ కవి, ప్రకృతి కవి
అంతకన్నా కాడు. తనలో చాలా మంది ఉన్నారు అనగలిగాడతను.
ఏ పసుపు పక్షి తన గూటిని
నిమ్మపండ్లతో నింపుతుంది, అంటుంది అతని ఒక ప్రశ్న కవిత.
హిట్లర్ నరకంలో ఎటువంటి
వెట్టిచాకిరి చేశాడు, మరో కవిత
ఈ ప్రశ్నల
పుస్తకాన్ని నెరూడా తన మరణానికి కొన్ని నెలలు ముందు రాశాడు. అతని తెలివి,
తెలుసుకోవాలన్న కోరిక ఇందులో మరే సంకలనంలోనూ లేనంత బలంగా కనబడతాయి. తెలుసుకున్నది
మరిచిపోతే దాన్ని మళ్లా నేర్చుకోవచ్చు అన్నాడీ కవి.
కొడుకు కొడుకుల కొడుకులు
వాళ్లు ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు
వాళ్లు మంచో చెడో అవుతారా
పురుగులకు, గోధుమలకు సరి విలువ కలిగి ఉంటారా
మీరు జవాబు చెప్పదలుచుకోరు
అయినా ప్రశ్నలు చావవు.
ఈ
మాటలు ప్రశ్న కవితల పుస్తకంలోనివి కావు. అంతకు ముందు రాసిన మరొక సంకలనంలోవి.
కొన్ని ప్రశ్నలు (అంటే కవితలు)
ఈ గులాబీ
దిసమొలగా ఉందా చెప్పండి,
లేక
ఆమె దుస్తుల తీరే అంతా....
ఆకులు
ఆత్మహత్య చేసుకుంటాయెందుకు,
అసలు
పచ్చబడతాయెందుకు....
క్రిస్టఫర్
కొలంబస్ ఎందుకని
స్పెయిన్
ను కనుగొనలేదు....
ఈ
వచ్చిన సూర్యుడు నిన్నటి వాడేనా,
లేక ఈ
వేడి ఆ వేడి వేరా....
నా
కవిత్వం గురించి వాళ్లేమంటారు,
నా
రక్తాన్ని ముట్టుకోకుండానే....
గురువారం
కాస్త మంతనాలు చేసి,
శుక్రవారం
తరువాత రావచ్చుగదా....
Why do the waves
ask me
Some both sting and
salve with their almost unbearable soulfulness:
Do unshed tears
Some break us free
from the solitary confinement of our own consciousness:
Is 4, 4 for
everyone?
No comments:
Post a Comment