Tuesday, November 11, 2025

మహాత్యం సాదత్ హసన్ మంటో కథకు తెలుగు అనువాదం

మహాత్యం

సాదత్ హసన్ మంటో కథకు 
తెలుగు అనువాదం

A real 'short' story!
Listen and share!


Subscribe to the channel and thus support me


మహాత్మ్యం సాదత్ హసన్ మంటో

 

 

లూటీ చేసిన సొత్తును తిరిగి పట్టుకునే ఉద్దేశ్యంతో పోలీసులు దాడులు మొదలు పెట్టారు.

ప్రజలు భయపడి దొంగసొమ్మును రాత్రి చీకటిమాటున బయట పడేయను మొదలు పెట్టారు. కొంతమంది సందర్భం చూచుకుని తమ వస్తువులను కూడా దూరం చేసుకున్నారు. చట్టం పట్టునుంచి దూరంగా ఉండాలన్నది ఒక్కటే ఆలోచన.

ఒకతనికి చాలా కష్టం ఎదురయ్యింది. అతని దగ్గర పచారీ దుకాణంనుంచి దొంగిలించిన చక్కెర సంచులు రెండు ఉన్నయి. ఒకదాన్ని ఏదో ఒక రకంగ దగ్గరలోని బావిలోకి చీకటిపూటన పడవేశాడు. కానీ, రెండవదాన్ని కూడా బావిలో వేయబోతూ దాంతో తానూ పడిపోయాడు.

చప్పుడు విని జనం గుమిగూడారు. బాయిలోనికి తాళ్లు దించారు. యువకులు లోపలికి దిగారు. మనిషిని వెలికి తెచ్చారు. కానీ, నాలుగు గంటల తరువాత అతను చనిపోయాడు.

మరుసటి నాడు ప్రజలు మామూలుగానే బాయినుంచి నీళ్లు చేదుకున్నారు. తాగితే నీళ్లు తియ్యగా ఉన్నాయి.

 

 రాత్రి మనిషి సమాధి మీద దీపాలు వెలుగుతున్నాయి.

No comments: