Franz Kafka Storyచట్టం ముందు - ఫ్రాంత్స్ కాఫ్కా కథ
చట్టం ముందు
ఫ్రాంత్స్ కాఫ్కా కథ
అనువాదం కె బి గోపాలం
చట్టం అంటే, ఆ అధికార భవనం ముందు ఒక
వాకిటికావలి మనిషి కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి పల్లెప్రాంతాల నుంచి మరో మనిషి
వచ్చాడు. లోనికి వెళ్ళనివ్వమని అడిగాడు. కానీ గేట్ కీపర్ మాత్రం ఆ సమయంలో లోపలికి
ప్రవేశం కుదరదు అన్నాడు.
వచ్చిన మనిషి కాసేపు ఆలోచించాడు. “తరువాత వస్తే లోనికి పోనిస్తారా” అని అడిగాడు. “బహుశా వీలవుతుందేమో” అన్నాడు వాకిటి కావలి. “ఇప్పుడు మాత్రం
వీల్లేదు” అన్నాడు.
సమయంలో అధికార భవనం గేటు తీసే ఉంది. అది
ఎప్పుడూ తీసే ఉంటుంది. కావలి మనిషి కాస్త పక్కకు వెళ్ళాడు. పల్లె మనిషి లోపల
ఏముందో చూడడానికి అన్నట్టు వంగి తొంగి చూచాడు. గేట్ కీపర్ ఆ సంగతి గమనించి “నేను వద్దంటున్నా సరే లోపలికి చూడాలని అంత ఆత్రంగా ఉందా?
అయితే ఒకటి గమనించు. నేను చాలా అధికారం గలవాడిని. అయితే
నేను చిన్న గేట్ కీపర్ ను మాత్రమే. లోపల గదికి గదికి ఒకరుగా వాకిటికావలి వారుంటారు.
ఒకరికన్నా ఒకరికి ఎక్కువ అధికారం. అదంతా నాకు నిజానికి నచ్చదు” అంటూ నవ్వుతూ అన్నాడు అతను.
ఇంతగా కష్టాలు వస్తాయని పల్లెటూరు మనిషి ముందు
అనుకోలేదు. చట్టం అందరికీ అందుబాటులో ఉండాలి అని అతని ఆలోచన. కానీ ఇప్పుడు ఈ
బొచ్చుకోటు వేసుకున్న గేట్ కీపర్ ను చూస్తూ, కోసుగా ఉన్న అతని పెద్ద ముక్కును, సన్నటి నల్లటి
గడ్డాన్ని మరింతగా దగ్గరగా పరిశీలనగా చూస్తూ ఉంటే మాత్రం అక్కడ తను వేచి ఉండడమే
మంచిదని లోనికి వెళ్లడానికి అనుమతి దొరికేదాకా అలా ఉండాలని అతను
నిర్ణయించుకున్నాడు.
గేట్ కీపర్ అతనికి ఒక స్టూల్ ఇచ్చాడు. గేటు
ముందు ఒక పక్కన కూర్చోవడానికి అనుమతి కూడా ఇచ్చాడు. పల్లె మనిషి అక్కడ దినాలు,
సంవత్సరాలు కూర్చున్నాడు. లోపలికి పంపించమని చాలాసార్లు
అడిగి చూచాడు. అట్లా అడిగి కావలి మనిషిని విసిగించాడు. తరచుగా గేట్ కీపర్ కాసేపు
అతనిని ఏవో ప్రశ్నలు అడుగుతాడు. సొంత ప్రాంతం ఏదని, అలాగే మరెన్నో సంగతులు అడుగుతాడు. కానీ అవన్నీ పట్టింపు లేని ప్రశ్నలు. గొప్పవాళ్ళు
అడిగే రకం. అయితే చివరికి మాత్రం అతను పల్లె మనిషిని లోపలికి పంపించడం కుదరదని
మరోసారి చెపుతాడు. ప్రయాణం కోసమని పల్లెమనిషి తనవెంట ఎన్నెన్నో వస్తువులు
తెచ్చుకున్నాడు. ఆ విలువైన వస్తువులు ఎంత విలువైనవయినా గేట్ కీపర్ ను మెప్పించడం
కోసం ఒకటొకటిగా అతనికి ఇచ్చేశాడు. కావలి మనిషి వాటిని తీసుకుంటాడు. “నీవు ఏమీ ప్రయత్నం చేయలేదని అనుకుంటావేమోనని
మాత్రమే నేను ఇవన్నీ తీసుకుంటున్నాను” అని చెపుతాడు.
ఎన్నో సంవత్సరాల పాటు పల్లె మనిషి వాకిటి కావలి
మనిషిని తెరపి లేకుండా చూస్తూనే ఉన్నాడు. అతను మిగతా గేట్ కీపర్ లను మరిచిపోయాడు.
చట్టం భవనంలోనికి వెళ్లడానికి తనకు ఉన్న అడ్డంకిగా ఇతడిని ఒక్కడినే గుర్తించాడు.
దురదృష్టకరమైన ఆ పరిస్థితులను అతను శపించాడు. మొదటి సంవత్సరంలో ఆ శాపనార్థాలను పైకి
వినిపించేటట్టు గట్టిగానే అనేవాడు. అతనేమో పెద్దవాడు అవుతున్నాడు. అయినా లోలోపల
ఏదో గొణుక్కుంటూనే ఉంటాడు. అతనిలో పిల్లతనం కనబడుతుంది. సంవత్సరాలుగా గేట్ కీపర్
ను పరిశీలిస్తూనే ఉన్నాడు. అతని కోట్ కాలర్ లోని పురుగులను కూడా గమనించాడు. గేట్
కీపర్ కు నచ్చచెప్పమని ఆ పురుగులను కూడా అభ్యర్థించాడు.
చివరికి అతని కంటి చూపు మందగించింది. చుట్టు
పరిసరాలు నిజంగానే చీకటిగా ఉన్నాయా అన్న సంగతి అతనికి తెలియడమే లేదు. కళ్ళు తనను మప్పగిస్తున్నాయేమో
అని కూడా అర్థం కాలేదు. చట్టం భవనం గేటు లో నుంచి బయటకు వస్తున్న ఆగని వెలుగును
అతను గుర్తించాడు. అతనింకా ఎంతో కాలం బతకడు. చావుకు ముందు అతను అంతకాలం తలలో
తిరుగుతున్న తన అనుభవాలన్నింటిని కలిపి ఒక ప్రశ్న తయారు చేసుకున్నాడు. గేట్ కీపర్
ను ఆ ప్రశ్న ఇంకా అడగనేలేదు. శరీరం బిగుసుకుపోయింది. అతను పైకి లేవలేడు. కనుక సైగగా
చేయి ఆడించాడు.
పెద్ద మార్పు వచ్చింది. పరిస్థితులన్నీ
మారిపోయాయి. పల్లె మనిషితో మాట్లాడాలంటే గేట్ కీపర్ ముందుకు వంగవలసి వచ్చింది. “ఇంకా ఏం తెలుసుకోవాలి అని నీ బాధ?” అని అడిగాడతను. “నీకు ఒక చోటికి సంతృప్తి లేదు”, అన్నాడు. “అందరికీ చట్టంతో అవసరం ఉంటుంది. అయితే ఇన్ని
సంవత్సరాలలోనూ, ఒక్క నేను తప్ప, లోపలికి వెళ్తాను
అంటూ ఎవరూ రాలేదేమిటి?” పల్లెమనిషి అడిగాడు. అతనికి చివరి క్షణాలు
వచ్చేశాయని వాకిటికావలి మనిషికి అర్థమయింది. అతనికి చెవులు వినిపించవు గనుక
గట్టిగా అరుస్తూ చెప్పాడు. “ఇక్కడి నుంచి మరెవరూ లోపలికి వెళ్లడానికి
వీల్లేదు. ఇది నీ ఒక్కడికోసమే తెరిచి ఉంచిన గేటు. ఇక నేను దీన్ని మూసేస్తాను,”
అన్నాడతను.
చట్టం ముందు
ఫ్రాంత్స్ కాఫ్కా కథ
అనువాదం కె బి గోపాలం
చట్టం అంటే, ఆ అధికార భవనం ముందు ఒక
వాకిటికావలి మనిషి కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి పల్లెప్రాంతాల నుంచి మరో మనిషి
వచ్చాడు. లోనికి వెళ్ళనివ్వమని అడిగాడు. కానీ గేట్ కీపర్ మాత్రం ఆ సమయంలో లోపలికి
ప్రవేశం కుదరదు అన్నాడు.
వచ్చిన మనిషి కాసేపు ఆలోచించాడు. “తరువాత వస్తే లోనికి పోనిస్తారా” అని అడిగాడు. “బహుశా వీలవుతుందేమో” అన్నాడు వాకిటి కావలి. “ఇప్పుడు మాత్రం వీల్లేదు” అన్నాడు.
ఇంతగా కష్టాలు వస్తాయని పల్లెటూరు మనిషి ముందు అనుకోలేదు. చట్టం అందరికీ అందుబాటులో ఉండాలి అని అతని ఆలోచన. కానీ ఇప్పుడు ఈ బొచ్చుకోటు వేసుకున్న గేట్ కీపర్ ను చూస్తూ, కోసుగా ఉన్న అతని పెద్ద ముక్కును, సన్నటి నల్లటి గడ్డాన్ని మరింతగా దగ్గరగా పరిశీలనగా చూస్తూ ఉంటే మాత్రం అక్కడ తను వేచి ఉండడమే మంచిదని లోనికి వెళ్లడానికి అనుమతి దొరికేదాకా అలా ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు.
గేట్ కీపర్ అతనికి ఒక స్టూల్ ఇచ్చాడు. గేటు ముందు ఒక పక్కన కూర్చోవడానికి అనుమతి కూడా ఇచ్చాడు. పల్లె మనిషి అక్కడ దినాలు, సంవత్సరాలు కూర్చున్నాడు. లోపలికి పంపించమని చాలాసార్లు అడిగి చూచాడు. అట్లా అడిగి కావలి మనిషిని విసిగించాడు. తరచుగా గేట్ కీపర్ కాసేపు అతనిని ఏవో ప్రశ్నలు అడుగుతాడు. సొంత ప్రాంతం ఏదని, అలాగే మరెన్నో సంగతులు అడుగుతాడు. కానీ అవన్నీ పట్టింపు లేని ప్రశ్నలు. గొప్పవాళ్ళు అడిగే రకం. అయితే చివరికి మాత్రం అతను పల్లె మనిషిని లోపలికి పంపించడం కుదరదని మరోసారి చెపుతాడు. ప్రయాణం కోసమని పల్లెమనిషి తనవెంట ఎన్నెన్నో వస్తువులు తెచ్చుకున్నాడు. ఆ విలువైన వస్తువులు ఎంత విలువైనవయినా గేట్ కీపర్ ను మెప్పించడం కోసం ఒకటొకటిగా అతనికి ఇచ్చేశాడు. కావలి మనిషి వాటిని తీసుకుంటాడు. “నీవు ఏమీ ప్రయత్నం చేయలేదని అనుకుంటావేమోనని మాత్రమే నేను ఇవన్నీ తీసుకుంటున్నాను” అని చెపుతాడు.
ఎన్నో సంవత్సరాల పాటు పల్లె మనిషి వాకిటి కావలి మనిషిని తెరపి లేకుండా చూస్తూనే ఉన్నాడు. అతను మిగతా గేట్ కీపర్ లను మరిచిపోయాడు. చట్టం భవనంలోనికి వెళ్లడానికి తనకు ఉన్న అడ్డంకిగా ఇతడిని ఒక్కడినే గుర్తించాడు. దురదృష్టకరమైన ఆ పరిస్థితులను అతను శపించాడు. మొదటి సంవత్సరంలో ఆ శాపనార్థాలను పైకి వినిపించేటట్టు గట్టిగానే అనేవాడు. అతనేమో పెద్దవాడు అవుతున్నాడు. అయినా లోలోపల ఏదో గొణుక్కుంటూనే ఉంటాడు. అతనిలో పిల్లతనం కనబడుతుంది. సంవత్సరాలుగా గేట్ కీపర్ ను పరిశీలిస్తూనే ఉన్నాడు. అతని కోట్ కాలర్ లోని పురుగులను కూడా గమనించాడు. గేట్ కీపర్ కు నచ్చచెప్పమని ఆ పురుగులను కూడా అభ్యర్థించాడు.
చివరికి అతని కంటి చూపు మందగించింది. చుట్టు పరిసరాలు నిజంగానే చీకటిగా ఉన్నాయా అన్న సంగతి అతనికి తెలియడమే లేదు. కళ్ళు తనను మప్పగిస్తున్నాయేమో అని కూడా అర్థం కాలేదు. చట్టం భవనం గేటు లో నుంచి బయటకు వస్తున్న ఆగని వెలుగును అతను గుర్తించాడు. అతనింకా ఎంతో కాలం బతకడు. చావుకు ముందు అతను అంతకాలం తలలో తిరుగుతున్న తన అనుభవాలన్నింటిని కలిపి ఒక ప్రశ్న తయారు చేసుకున్నాడు. గేట్ కీపర్ ను ఆ ప్రశ్న ఇంకా అడగనేలేదు. శరీరం బిగుసుకుపోయింది. అతను పైకి లేవలేడు. కనుక సైగగా చేయి ఆడించాడు.
2 comments:
What's the meaning of those last lines Guruvu garu
I don't know if I can comment on those lines. This is Kafka's well discussed story. There is a lot to understand from it. Search on web and you will find so much about it. "Before the Law" is the title of the story.
Post a Comment