Monday, August 1, 2011

Skill - Tao Te Ching!

Here is a passage from Tao Te Ching!
Height of Mastery about the height of mystery!


తెలివి

గతి తెలిసిన పథికుడు తన అడుగు జాడలను వదలడు
మతి గలిగిన మాటగాడు వేలెత్తే నిందలకు తావివ్వడు
మితి తెలిసిన గణకుడు లెక్క తప్పనీయడు
ఇక ఇతనేమో, మేకులు మాకులు లేకనే పెట్టె మూస్తాడు,
దాన్ని తెరవడం అసాధ్యమవుతుంది
వేరొకతను ముడులు వడులు లేకనే కట్లు కడతాడు
విప్ప దీయను అసాధ్యమవుతుంది.

ఇదే దారిలో జ్ఞాని మనుషులను కాపాడడంలో నిపుణుడు.
ఎవరినీ వదలడు.
వస్తువులనూ కాపాడతాడు
దేన్నీ వదలడు

దీన్నే "తమ పద్ధతుల వెలుగును దాచడం" అంటారు

చెయ్యి తిరిగిన వారినే గురువులంటాము
కళ తెలియని వారు వారిని ఆశ్రయిస్తారు
ఈ తెలియని వారు, గురువులకు గుర్తింపునిస్తారు

గురువును శిష్యుడు గుర్తించకున్నా
గురువితడిని హర్షించకున్నా
వారిని చూచే
పరిశీలకుడు, తాను తెలివి గలవాడయినా, తప్పు దారి పడతాడు

ఇది "రహస్యాలకే రహస్యం"

Is there a message in this?
Oh! My Goodness!

No comments: