Sunday, January 23, 2011

Unbroken by Laura Hillenbrand

You are asked to introduce a book.
You cannot do it without reading it!
What do you do?
The same thing many people do!
Look for the book on the net.

I did the same.
What abook!
Written by someone who cannot even move from home.
About a person who has seen the worst of life.

I always feel why such books do not come in our langauages.

I recommend translation of the book seriously!

అన్‌బ్రోకన్


రచన: లారా హిలెన్ బ్రాండ్

పేజీలు: 473

ప్రతులకు:

రాండమ్ హౌస్ పబ్లికేషన్స్ఇది కల్పన కాదు. కథ అంతకన్నా కాదు. ఒక సచిత్ర జీవితయాత్ర. పుస్తకానికి ఇచ్చిన సబ్ టైటిల్ చదివితే విషయం అర్థమయిపోతుంది. A World War-II Story of Survival, Resilience and Redemption.రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నవారు రోజుకు 700 మంది చొప్పున చనిపోతున్నారట. వారితో ఇలాంటి కథలన్నీ మరుగున పడుతున్నాయి. లారా హిలెన్ బ్రాండ్ అలాంటి ఒక యుద్ధవీరుడు లూయీ జంపెరీనీని కలిశారు. అప్పుడాయన వయసు 80 సంవత్సరాలు. ప్రస్తుతం 93. అంటే ఇంతకాలమూ వారు కలవడం, కబుర్లు కలబోసుకోవడం, కథనానికి కావలసిన సామగ్రి సమకూరడం లాంటివన్నీ జరిగాయన్నమాట.

రచయిత్రి జంపెరీనీతో 75 సార్లు మాట్లాడారు. ఇందులో ఒక చిత్రం ఉంది. ఈ రచయిత్రి స్వయంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇంటికి అతుక్కుని ఉండే మనిషి. అందుకే ఆమె తన పరిశోధనకు వస్తువయిన వ్యక్తిని కలిసింది తక్కువే. మిగతా అంతా ఫోను సంభాషణల ద్వారా, చర్చలు జరిగాయన్నమాట.

ఇదంతా పుస్తకం రాయడానికి, నిజమయిన పద్ధతి కాదేమో అనిపిస్తుంది మనకు. అందుకే ఈ పుస్తకాన్ని మరింత ఆసక్తిగా చదవాలి.

రచయిత్రి గురించి: లారా హిలెన్ బ్రాండ్, 1967 మేలో పుట్టారు. గ్రాడ్యుయేషన్ అయ్యేలోగానే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి రావడంతో ఇల్లు చేరుకున్నారు. ప్రస్తుతం కూడా ఆమె ఇల్లుకదలకుండా వాషింగ్‌టన్‌లో ఉంటారు. ఆమెకు 2008లో కాలేజీ మిత్రుడు, ప్రస్తుతం ప్రొఫెసర్ అయిన బోర్డెన్ ఫానగాన్‌తో పెళ్లయింది.


లారా తొలిరచన ‘సీ బిస్కెట్’ ఎంతో గొప్ప పేరు పొందింది. ఈ పుస్తకానికి ‘స్పోర్ట్స్ బుక్ ఆఫ్ ది ఇయర్’ బహుమతి 2001లో వచ్చింది. అవును! అదే ఆశ్చర్యం. ఈ పుస్తకం సీ బిస్కెట్ అనే రేసుగుర్రం గురించిన రచన. ఆ గుర్రం, దానితో సంబంధంగల వారు అలవిమాలిన, అసంభావ్యమయిన విధంగా జీవితాలు గడపడం రచయిత్రికి గొప్ప ఆకర్షణ అయిందట. మొదట్లో ఈ విషయం కేవలం ఒక వ్యాసంగా వచ్చింది. అందరూ చాలా బాగుంది అన్నారు. అందుకని నవలగా వచ్చింది. తరువాత అదేపేరుతో సినిమగా వచ్చింది. అన్నీ గొప్ప హిట్టే అయినయి.


హిలెన్ బ్రాండ్ రెండవ పుస్తకం ప్రస్తుతం మనం చర్చించుకుంటున్నా ‘అన్‌బ్రోకన్!’ ఒక కదలలేని మనిషి ‘పరుగు పందాల గుర్రం గురించీ, జీవితంతో నిజంగా పోరాడి గెలిచిన మనిషి గురించీ, రాసి అవుననిపించుకోవడం అద్భుతం!’ నా ఊహల్లో నేను సీ బిస్కెట్ మీద దౌడు తీశాను. లూరుూతోబాటు పరుగెత్తాను’ అంటారు లారా హిలెన్‌బ్రాండ్.

అన్‌బ్రోకన్:

1943 మే నెలలో జంపెరీనీ తన బి-24 విమానంతో సహా పసిఫిక్‌లో కూలాడు. ఏడువారాల పాటు (ఇంకా ఎక్కువేనేమో?) తను, తన పైలట్ ఒక తెప్పమీద గడిపారు. రెండువేల మైళ్ళ ప్రయాణం తర్వాత నేల తగిలింది. అది జపానువారి ఖైదీల క్యాంపని తేలింది. అక్కడ రెండేళ్ళపాటు రకరకాల చిత్రహింసలకు గురయ్యాడతను. ఆ వివరాలు చదివితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జపాను వారి క్రూరత్వం కర్కశంగా కనబడుతుంది.


మనకు ఈ సరికి కథానాయకుని మీద కావలసినంత జాలి పుట్టేసింది కదూ? అతను చిన్నప్పుడు బాలనేరస్తుడు. దొంగతనాలు చేసి పట్టుబట్టాడు. పోలీసుల నుంచి తప్పించుకునే పేరుతో పరుగుల వీరుడయ్యాడు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో అతను అయిదువేల మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్నాడు. హిట్లర్ ఇతని గురించి ఏదో అనుకున్నాడట కూడా. ఇతను నాలుగు నిమిషాల్లో మైలుదూరం పరుగెత్తేవాడట. కోచ్ ఇతడిని చూసి ‘నీకన్నా వేగంగా పరుగెత్తేది, సీ బిస్కెట్ ఒకటే’ అన్నాడట. (!)


యుద్ధం వచ్చింది. జంపెరీనీ సైన్యంలో చేరాడు. విమానం కూలింది. ఉన్న 11 మందిలో ముగ్గురు మాత్రమే మిగిలారు. అనుకోకుండా తెప్పమీద వాలిన అల్బట్రాస్ (పక్షు)లను పట్టి తినడం నేర్చుకున్నారు వారు. దాడికి వచ్చిన సొరచేపను కూడా ఒకటి, రెంటిని చంపి తిన్నారు. వర్షం వస్తే మంచినీరు దొరికింది. ముగ్గుర్లో ఒకతను చనిపోయాడు. చిత్రంగా వీళ్లు ఆ శరీరాన్ని సముద్రంలోకి తోశారు. తినలేదు! ఊహల్లోనే వంటలు చేసి తింటూ, చివరకు శత్రుస్థావరానికి చేరుకున్నారు ఆ ఇద్దరూ!


అతను ఒలింపిక్ వీరుడు. అందుకే శత్రువులు అతడిని చంపకుండా వదిలారు. కానీ చిత్రహింసలకు గురి చేశారు. తరువాత అతని జీవితం మరింత నాటకీయంగా సాగింది. తాగుడు, పాడయిన సైకాలజీ. మరి ఎలా బాగయ్యాడు? ఈ విషయాలన్నీ ఎలా చెప్పగలిగాడు. తరువాతి కథ వెండితెరపై చూడడానికి ఆశించవచ్చేమో? అందాకా పుస్తకం వెదకండి!


జంపెరీనీతో సరదాగా ‘సీ బిస్కెట్’ మాట్లాడలేక పోయింది. నేనే మేలు. కనీసం మాట్లాడగలను అన్నాడుట. లారా సంవత్సరాల పాటు అన్నిమార్లు అతనితో మాట్లాడవలసి వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. రేడియో, టీవీ ఇంటర్‌వ్యూలు, ప్రోగ్రాంలను కూడా ఆమె స్టడీ చేసింది.


పుస్తకంలో అక్కడక్కడ తప్పులున్నాయి అనిపిస్తుంది. అది సమాచారం అందించిన లూయీ లోపమా? రాసిన లారా లోపమా? ఇద్దరిదీనా? చర్చ అనవసరం.


జీవితంలో చెప్పరాని బాధలు అనుభవించి, మనిషి కాకుండా పోయిన మనిషిచేత బతుకు పుస్తకం తెరిపించి, పుస్తకంగా అందించిన ఈ రచయిత్రిని అభినందించకుండా ఉండలేము.


ఇలాంటి రచనలు చేసే ప్రయత్నం ఎంతమంది చేశారు?

మచ్చుకు ‘అన్ బ్రోకన్’ నుంచి నాలుగు మాటలు..

- ఆగస్టు 25న జెపెలిన్ సాన్ ఫ్రాన్సిస్కో చేరింది. (ఇదొకరకం విమానం అనవచ్చు). తీరం వెంట అందరూ అరుస్తూ ఆహ్వానం పలికారు. అది అస్తమయంలోకి జారుకుంది. ఆ చీకటి, నిశ్శబ్దాలలోకి జారుకుంది. అర్ధరాత్రిలోకి జారుకుంది. కదిలే గాలిలాగే నెమ్మదిగా అది టొరిన్స్ మీదుగా ఎగిరింది. అక్కడ దాన్ని పట్టించుకున్నది, నిద్రమత్తులో తూగుతున్న కొందరు మాత్రమే. అందులో గ్రామర్సీ వీధిలో ఇంటి వెనకాల నుంచి చూస్తున్న పజామా తొడిగిన అబ్బాయి ఒకడు.


-ఏర్‌షిప్ కింద నిలబడ్డ, అతని కాళ్ళకు గడ్డికీ మధ్యన చెప్పుల్లేవు. అతను స్ణాణువయ్యాడు. అది భయంకరంగా, అందంగా’ ఉందన్నాడతను. విమానం ఇంజన్ రొద గాలిని కుదుపుతున్నట్లు ఉంది. కానీ చీకట్లో దాని వెండిరంగు శరీరం కనబడడం లేదు. పక్కలు, తోక కూడా కనబడడం లేదు. అది ఉన్న ప్రాంతపు చీకటి మాత్రమే కనబడింది. was not a great presence, but a great absence ఈ వాక్యాన్ని ఏమని అనువాధం చేయాలి!)


- అతనికి ఒకటంటే మాత్రం భయం. లూయీ కుర్రవాడుగా ఉండగా, ఒక పైలట్ తన విమానాన్ని టూరాన్స్‌లో దించాడు. లూరుూని అందులో ఎక్కించుకుని ఒక చుట్టు తిప్పాడు. అంత చిన్న కుర్రవాడు ఆ అనుభవంతో బ్రహ్మానంద పడిపోయి ఉంటాడని అందరూ అనుకోవచ్చు. కానీ ఆ ఎత్తు, వేగం అతడిని భయంలో ముంచాయి. ఆ రోజు నుంచి అతను ఇక విమానాల జోలికి వెళ్లకూడదు అనుకున్నాడు.

Let us enjoy great books!
!!!!!

No comments: