Monday, July 21, 2025

Chikilinta - Telugu Short Story - Malladi Ramakrishna Sastry


A Telugu short story by Malladi teh great!
As a tribute to Sri Rajeswara Sastry, his grandson who passed away recently....

చికిలింత

              వెంకట్రాయులుగారి భవనంలో ధనలక్ష్మి మూలుగుతూంటుంది ` అని అందరూ చెప్పుకుంటారు. ధనలక్ష్మి మూలుగు సంగతి దైవమెరుగునుకాని, నౌకరు రంగడు మట్టుకు ` ఆడాపాడా మద్దెలకొట్టా ` ఒక్కడే కావడం మూలాన, గంపచాకిరీ చెయ్యలేక ఓపికున్నప్పుడు విసుక్కుంటాడు: ఓపిక లేనప్పుడు విసుక్కుంటాడు: ఓపిక లేనప్పుడు మూలుగుతూంటాడు. వాడి మూలుగు రాయలకి అలవాటై పోయింది.
              అలవాటుకొద్దీ, ఆపూట రాయలు రంగడిని పక్కయింటికి వెళ్లి, పత్రిక పట్టుకురమ్మన్నాడు. అలవాటుకొద్దీ వాడు వెళ్లాడు. వట్టి చేతుల్తో తిరిగి వచ్చాడు.
              ` ఏం?
              ` వాళ్లు పత్రిక కొనడం మానేశారుట!`
              ` మన బాదపడలేకట!` మొగంమీద కొట్టినట్టు అనేశాడు, ఆ పెద్దమనిషి!
              `ముష్టి అణా పేపరు అడిగి పట్టుకు రాలేని నీవు ఎందుకు పనికివస్తావురా?`
              `ముప్పొద్దులూ మీ యింటపడి మేయడానికి`
              `మేయబట్టే,` యింత పోతరం!`
              `పోనీండి : పొమ్మంటే పోతాను`
              `చేతనైతే పొమ్మనకముందే పోవాలి:
              ` పోతున్నానుగా`
              రంగడు ఓపిక తెచ్చుకుని, గిరుక్కున వీధి గుమ్మంవేపు తిరిగాడు.
              `ఒరేయ్‌ రంగడూ!` నీ వాలకం చూడగా, అన్నమాట నిలుపుకునేట్టున్నా వేంరా?- నీకు యిదేం దుర్బుద్ధిరా?’
              రాయడు, కుర్చీలోంచి, కాళ్లు క్రింద పెట్టి లేవడానికి ప్రయత్నం చేశాడు.
              ఎదురు గుమ్మంలోకి, ఎవరో అమ్మాయి వచ్చింది. పచ్చగా ఉంది. పది పద్ధెనిమిది ఏళ్ళుంటాయి. మొగాన లక్ష్మి ఓడుతూంది. కట్టుకున్న కోక, తగని దరిద్రగొట్టుగా ఉంది.
              ఎవరమ్మాయ్‌, నీవు?
              పనిమనిషినండి!`
              ఎవరింట్లో?
              యీ యింట్లోనే.
              ఎప్పటి నుంచీ ?`
              మీరు ఒప్పుకుంటే ఇప్పటినుంచీ!-
              రంగడు, ఉన్నచోటే నిలిచిపోయి, విరగబడి నవ్వాడు.
              `మా అయ్యగారిది అదృష్ట జాతకం! నేను యింతకు ముందే నౌకరీ మానుకున్నాను`
              ఏం జీతం సరిగా యివ్వరా?
              అసలు యిచ్చిందెప్పుడు? యిన్నేళ్లాయె, ఎర్రని ఏగాని కళ్ల జూడలేదు.
              ఉన్న నౌకరీ ఊడితే, ఈ వయసులో అన్నం ఎట్లా?
              సన్నాసుల్లో కలిసిపోతాను!
              మంచి ఆలోచనే!` కలిసిపోగానే నాకో కార్డుముక్క రాసేయి! తెరిపి చేసుకుని నేను వచ్చి కలుస్తాను.
              రాయడు, వాళ్ల మాటకు అడ్డం వచ్చాడు.
              అమ్మాయ్‌!` నీకు నౌకరీ ఎందుకు?
              ఉద్యోగం పురుష లక్షణం అన్నారు భారత ప్రభుత్వం వారు!
              అయితే పోయి వారినే అడుగు.
              అడుగుదామనుకున్నాను కాని ` అంతలోనే యిది ప్రజా ప్రభుత్వం అన్నమాట జ్ఞాపకం వచ్చింది. ఏరాjయయితే నేం పళ్లూడగొట్టుకునేందుకు? మీరూ ప్రజలేకదా అని వచ్చాను.
              హుఁ` కూత ఘనంగా ఉందే వచ్చిన దోవనే దయచేయి`
              యింతలో రాయల భార్య, నాగమ్మ రంగడిమీద పొల్లుకేకలెట్టుకుంటూ అక్కడికి వచ్చింది.
              ఆలా, దుంగల్లే అక్కడ నిలబడిఉంటే కూరెవరు తరుగుతారనుకున్నావురా!`
              `అయ్యగారు!` నేను నౌకరీ మానేశాను లెండమ్మ!`
              ఆ నౌకరీ నా కిప్పించండమ్మా! తరగడంలో నేను మొనగాడిని ` అని అందుకుంది ఆ వచ్చిన అమ్మాయి!
              `నీ వెవరు!`
              `అమాయకులందరూ నన్ను అభం శుభం తెలియని ఆడపిల్లంటారు: ఆడపిల్ల లందరూ అచ్ఛం ` మొగరాయడంటారు. ఎవరేమన్నా పడేందుకు ఓపికలేక,` ఇలా పరుగెత్తుకుంటూవచ్చి యిక్కడ తేలాను.
              నీ పేరేమిటి?
              ఇన్నాళ్లూ రోజుకోపేరు : ఇవాళ మీరేం నామకరణం చేస్తారో?
              ఇన్నాళ్ళూ ఎలా బ్రతికావ్‌?
              మునుపు తిన్న తాయిల్లాలు మనసులో నెమరేసుకుంటూ! పండగనాడూ పబ్బంనాడూ, మీలాంటివాళ్ల లోగిళ్ళముందు నిలవబడి, గారెలవేపుడు గుమాయించే గాలి పీల్చుకుంటూ!’
              గాలిపీలుస్తూ బ్రతకమట్టే, కన్నుల పండువుగా వున్నావు మా తల్లీ! కనీ పెంచే వయస్సంతా మా అయ్యగారి పాదాల దగ్గిర గడిచిపోయింది. నిన్ను పెంచుకుంటా నమ్మడూ: దేవుడితోపులో చిక్కని చెట్టుక్రింద, అల్లంతమేర చిమ్ముకుని, ఆ నీడనే పడుందాం: రా అమ్మా` నన్ను కన్నతల్లి చిన్నప్పుడే కన్ను మూసింది. ఆపేరుని పిలుచుకుంటా?... అచ్చటా ముచ్చటా తీరాలి తల్లీ! కాదనకమ్మా’ అన్నాడు రంగడు ` మాట కలిపించుకుని`
              ముషిట అణాపేపరు కాగితం అడిగితేలేనివాడివి, ఆడపిల్లనేం సాకుతావురా అని ధుమధుమలాడాడు రాయడు.
              చూస్తారుగా! రా అమ్మా! రా! అక్కడ నుంచుంటే లాభం లేదు.` అయ్య పెట్టాపెట్టడు, అడుక్కుతినా నివ్వడు’ అని అడుగు ముందుకువేశాడు రంగడు.
              రాయడు కుర్చీలోంచి ఒక్కదుముకు దుమికి`
              ముష్టి`నీ పెంపకమేమిటి? నేను పెంచుకుంటాను’ అన్నాడు.
              అమ్మాయి ఉహుఁ అన్నట్టు తలవూగించింది.
              అంతమాట మీరనరాదు ` నే వినరాదు. కనీ పెంచే తల్లి ` యింట మహలక్ష్మల్లే ఉండగా, యీ తలకుమాసిన దాన్ని పెంచుకోవల్సిన అవసరం ఏం వచ్చె? ఏం తాతా? ఈ యింట ఎన్నడూ తొట్టెకట్టలా? భోగిపళ్లు పోయలా` ముద్దకుడుము లీయలా,` అన్నెం పున్నెం లేకుండా అంత నిప్పచ్చరంగా కాపురం చేస్తున్నారంటావా, అయ్యగారూ,` అమ్మగారూ?`’ అని గదమాయింపుగా మనసు చివుక్కుమన్నట్టు ` అయ్యో పాపం!` అని వాపోయినట్టు, వీళ్లది ఇలాటి పుటకేమా అని, విస్తుపోయినట్టు,` భూమ్మీద ఇలాంటి మనుష్యులుకూడా ఉంటారా?` అని, ముక్కుమీద వేలేసుకున్నట్టు, చెంపపెట్టు పెట్టినట్టు, మృదువుగా అడిగింది.
              రంగడు, నోరెత్తాడు: రాయడు, పీక నులుముతానన్నట్టు, ఉరిమిచూసి, చేయిజాపి, పంజావిప్పాడు.
              ఆ అమ్మాయి, కనుఱెప్ప అయినా కదిలించకుండా, రాయడిని పసిపిల్లవాడిని చూసినట్లుచూసి, ఫక్కున నవ్వింది:
              పైకి భీకరంగా ఉండేవాళ్లు ` పరమ పిరికివాళ్లు! నిండుకుండ ఎన్నడూ తొణకదు. ఏమీలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నది అణిగి ఉంటుంది. ఈ నీతులన్నీ మామూలుగా కాపీబుక్కుల్లో కనబడుతాయే! అయ్యగారు, అంతలెక్కన్నా, బళ్లోకి వెళ్ళినపాపాన పోలేదా ` ఏం? ఈ ఉరుములూ మెరుపులూ చూడగా చూడగా యీ యింట కలిమంత లేమి కూడా ఉన్నట్టు ఘట్టిగా స్పష్టమౌతుంది`
              ఏం తాతా?` ఏమిటి వీరికి లోటూ`?’
              `‘నాకేలోటూ లేదు!’ అని రాయడు గర్జించాడు.
              అవునమ్మా ` నిజానికి ఏ లోటూ లేదు: బంగారం లాటి కొడుకున్నాడు`’
              `ఒరేయ్‌ రంగడూ!` వాడి పేరు యీ యింట ఎత్తితే`’
              నాలుక చీలుస్తా నన్నారు. నాకెరికే!` అయ్యా! ఆమాటమీదనే ఉండండి! నాకు రెండునాలిక లున్నాయ్‌! ఒకటి చీల్చినా ఒకటి మిగుల్తుంది’
              పీక తెగ్గోస్తే`’
              చేతుల్తో సైగచేసి, చెప్పాల్సింది చెపుతాగాని, యింత లెక్క వచ్చినాక, యిక వదుల్తానా! అమ్మడూ, మా ఊళ్లో, మంచివాళ్ళున్నారు. మనసు చంపుకోనివాళ్ళున్నారు. కాని, మా అయ్యడబ్బుకి వెరచి, మా అమ్మ నోటికి వెరచి ఒక్కళ్ళూ ఇదేమని అడిగినవాళ్లేలేరు! నీవు వచ్చి అడిగావు. ఆ భారతం విప్పుతున్నా చూసుకో!` నిజానికి నన్ను నిగ్గదీసి అడిగితే అబ్బాయిగారు యీ యింట పుట్టవలసినబిడ్డ కాడమ్మా! పెద్దలు చేసుకున్న పుణ్యంకొద్దీ పుట్టాడుకాని. దక్కించుకునే యోగ్యత మాకు లేకపోయిందమ్మా! తరిమేశామమ్మా!’
              అదేం?’
              అంతే! మాఅయ్య తీరంతే` ‘మూడుతరాలకు సరిపోయే సంపదుంది` నౌకరీ చెయ్యను నాన్నా!’ అన్నాడు బిడ్డ’ ` ‘అంతా నా స్వార్జితం` కూచుని మేసేందుకు కాదు`నౌకరీచేయకపోతే`బయటికి నడవరా నాన్నా!’ అన్నాడు`అయ్య`అంతే`మాటపడి, ఒక్క నిమిట్‌ ఈ ఇంట ఉండలా, బిడ్డ! పచ్చిమంచినీళ్లన్నా ముట్టలా! కట్టుబట్టలతో తలొంచుకుని దారిపట్టాడు!’
              ఉహుఁ`నీవు అడ్డం వెళ్ళలేకపోయినావా తాతా!`’
              ఎందుకు అమ్మడూ! బిడ్డకు యీ యమచర వదలకుండాలనా, ` బయటికి పోయాడో ` బాగుపడ్డాడే’
              బాగుపడ్డా డంటావా’
              ఢంకామీద దెబ్బకొట్టిచెపుతా! ఎంతకలికాలమైనా` ఉన్నాడని నమ్మినవాడికి నిదర్శనం యిస్తూనే ఉన్నాడమ్మా దైవం` ఆ బిడ్డేబాగుపడక ` అడవులుపట్టి అల్లాడిపోతే` పట్టపగలు చుక్కలు రాలవూ! మున్నీరు ఏకంగాదూ? భూమంతా వరదేసుకుపోదూ!’
              ఎక్కడున్నాడంటావ్‌?’
              ఎక్కడున్నా ` చల్లగా ఉంటాడు!` బిడ్డకోసం, రోజుకు వేయి మొక్కులు మొక్కుతా ` ఒక్క మొక్కన్నా వరం యివ్వదూ?’
              ఇంతసేపటికి రాయడికి గొంతు పెగిలింది! ‘రంగడూ! నన్ను చంపకురా!-’ అన్నాడు! నాగమ్మ కళ్లు ఎర్రబడి, ఉబ్బిపోయినాయి. వచ్చే శోకం, దిగమింగుకుంటూ ‘నోరు మూస్తావా లేదా!’ అనబోయి, బావురుమంది:
              రాయడు, నాగమ్మవంక కొరకొర చూడబోయి కొరమారినట్టు దగ్గి గొంతు రాసుకుని`
              ముష్టివాగుడు కట్టిపెట్టి పడుంటావా లేదా? వెధవ బెదిరింపులూ నీవూను! ఇదిగో అమ్మాయ్‌! వాడి వాగుడుకు దరీ అంతూ అంటూ ఉండదు కాని ` వినిపించుకోక! ఉండాలని వచ్చావు కదా ` ఉండిపో `  ఏం ` అలా చూస్తావేఁ?` నిన్నేం పస్తులుంచంలే` బంగారం మేపలేంగాని, కలో గంజో మాతోబాటు తాగుతూ పడుండు! పో` లోపలికి వెళ్లి ` తల దువ్వుకొని బొట్టూ కాటుకా పెట్టుకుని అమ్మగార్ని అడిగి మరోకోక కట్టుకో!’
              రాయడు యీ మాటలంటూనే పైపంచ బుజాన గిరవాటు వేసుకొని వీధిలోకి చక్కాబోయినాడు.
              అయ్యగారికి ఊష్ణం వచ్చిందేమోనమ్మా! లేకుంటే యింతమంచిగా, యింత యీవిగా మాట్లాడటమే!`’ అని రంగడు కసురుకున్నాడు. నాగమ్మ నవ్వింది.
              అమ్మాయ్‌! నీ పేరేమిటే!’ అని చనువుగా అడిగింది.
              మీ కే పేరు యిష్టం?’
              మా అమ్మపేరు భావమ్మ. ఆ పేరు ఆడపిల్ల పుడితే పెట్టుకుందా మనుకున్నా` నా నొష్టను రాయలా...’
              పోనీ మనవరాలికి పెట్టుకోవచ్చునుగా!’
              నాగమ్మ ` కుమిలిపోయింది. ఆపిల్ల చప్పున ఆమె కాళ్లు పట్టుకుని` ‘ఎన్నడూ నోరెత్తనమ్మా మనసు నొప్పించనమ్మా!’ అంది!
              నాగమ్మ, పిల్లదాని తల నిమురుతూ ‘నిన్నేమని పిలవనే?’ అంది!
              పిల్లా!’
రేయ రేయ రేయ
              రోజులు గడచిపోతున్నాయి ` పిల్ల గుణగణాలు చూసి, నాగమ్మ, నీ కుల మేమని అడగలా? యింటి పెత్తనం అప్పగించింది. యివతల చెంబు అవతల పెట్టనీయకుండా, నాగమ్మను కూచోపెట్టి పిల్ల, ఆరిందాగా యిల్లు దిద్దుకుపోతూంది.
              పిల్ల, రోజుకో కథ చెప్పకలదు. పూటకో పాట పాడకలదు! రాయడు కథలంటే చెవికోసుకుంటాడు. నాగమ్మ పాటలు వింటూ అన్నంనీళ్ళూ మరచిపోతుంది.
              సంక్రాంతి వచ్చింది.
              పిల్ల తలంటి నీళ్ళు పోసుకుని నాగమ్మ పట్టుబలవంతాన, ఒకటో అరో సరుకు పెట్టుకుని, యింట మహలక్ష్మల్లే తిరుగుతూంది. చిటికలో పంచభక్ష్య పరమాన్నాలూ తయారు చేసింది. వడ్డించాను రమ్మంది పదిగంటలకల్లా.
              రాయడు పడమటింట్లోకి వచ్చి కూర్చుని, పక్క విస్తరి చూసి ‘అది ఎవరికి?’ అన్నాడు.
              తండ్రిప్రక్క ఎవరు కూర్చుంటారు?’
              రాయడు తెల్లబోయి చూస్తూ కూర్చున్నాడు.
              కలుపుకోండి, నెయ్యి వడ్డిస్తాను ` పండగనాడన్నా మారు విస్తరి వేయాలి కదా, కోపంవస్తే ముఖం కండలు చించుకుంటాం గాని, అనుబంధాలు కోసేసుకోగలమా? పాపం. ఎక్కడున్నాడో, ఏంచేస్తున్నాడో, తిన్నాడో లేదో మీ అబ్బాయి. పోన్లెండి, చెప్పినమాట వినకుండా శఠించి పోయినవాడిని మీరేం చేయగలరు? పక్కన వున్నట్టే భావించుకుని` పప్పూ బువ్వా తింటే కొంత మనశ్శాంతి!’
              రాయడు అన్నంమీద వేసిన చెయ్యి వెనక్కు లాక్కుని, అంత ఎత్తున ఎగిరిపడి` ‘పోఁ బయటికి పోఁ’ అని అరిచాడు! నాగమ్మ, పరుగునవచ్చి, పిల్లను కౌగలించుకుని, ‘నీవు పోతే నూతులో పడతా!’ అంది.
              రాయడు గది తలుపు బిడాయించుకుని ముసుగెట్టుకున్నాడు. పిల్ల, ఒకసారికి పదిసార్లు, గుమ్మంలో నుంచుని బ్రతిమాలింది. ఉలకలా`పలకలా!
              నాగమ్మ ` పిల్ల, కనపడీ కనపడటంతోనే బావురుమంటోంది.
              రంగడుమట్టుకు డొక్కలు దించుకుపోతున్నా గుక్క చెల్లగా గుక్కెడు మంచినీళ్లు త్రాగుతూ ‘నా సామిరంగా! యిన్నాళ్ళకు, నా కళ్లు చల్లబడ్డాయి అమ్మడూ!’
              అని జపం చేస్తున్నాడు.
              ఒంటిగంట అయింది.
              మబ్బేసింది. ఒక చినుకు పడ్డది.
              అబ్బాయి వచ్చాడు. ‘అమ్మా!’... అన్నాడు. నాగమ్మ దిక్కులు దద్దరిల్లి పోయేట్టు ఆవురుమంది. రంగడు చిందులు తొక్కుతున్నాడు. రాయడి గదితలుపు బద్దలయ్యేట్టు మోగించాడు.
              రాయడు తలుపుతీశాడు.
              బిడ్డ తండ్రిని పలుకరించాడు.
              ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు, యిల్లువిడిచి పోనట్టు, కలతలే లేనట్టు ` క్షణంలో కలసిమెలసి పోయాడు.
              అందరూ భోజనంచేశారు.
              తల్లి కొడుకును దగ్గిర కూర్చోబెట్టుకుని లక్షప్రశ్నలు వేసింది. ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా ‘ఆ పిల్ల ఎవరమ్మా’ అని అడిగాడు.
              పనిమనషిని!’ అని పిల్ల నదురూ బెదురూ లేకుండా జవాబు చెప్పింది.
              అలా అనుకుంటే మా కళ్ళుపోతయ్‌. ఎవరోఏమో, అడిగినా చెప్పదు. ఓ నాడు వచ్చింది. ఉండిపోయింది: నాతల్లే చేసేది ` మళ్ళీ, యీ పిల్లే చేస్తూంది నాకు పోషణ! మన యింటికి లక్ష్మి వచ్చిందిరా నాయనా!’ నా తండ్రిని నాకిచ్చిందిరా తండ్రీ!’
              ఏమండీ! ఆమాటమటుకు అనద్దు! మాటమీదుండటం మొగసిరికాని, బింకాలు కొట్టిపోయి బిక్కమొగం వేసుకురావడం యిదేం ప్రజ్ఞ! అయ్యగారికి తగ్గకొడుకే!’ అందిపిల్ల!
              గడుసుది లాగుందమ్మా!’ అన్నాడు బిడ్డ!’
              గడుసో దుడుసో! మీ అయ్య కళ్ళు తెరిచింది. అందుకు సంతోషించు!’ అన్నాడు రంగడు.
              అమ్మాయ్‌! నీకు పెళ్లిఅయిందా?’ అన్నాడు రాయడు, ఉన్నట్టుండి.
              కాకపోతే`’
              మావాడికి నీకిచ్చి చేస్తాను!’
              పిల్ల నవ్వింది.
              చేసుకోగా చేసుకోగా యీ అడ్డాలపాపణ్ణే చేసుకోవాలా? నేనే చేసుకుంటే ` నాకు తాళికట్టేవాడు నాన్నకు వెరవనివాడు కావాలి!’
              మావాడు అంతేనమ్మా! నన్నూ నాడబ్బుకూ ఠోలీ క్రింద కట్టి చక్కా పోయినాడు.’
              పోయినవాడు పోకుండా తలవంచుకు వెళ్ళిన త్రోవనే మళ్లీ దయచేశాడు కద! ఇక బుద్ధివచ్చింది. మీ చెప్పు చేతుల్లో ఉంటాడు. ఏరినపిల్లను కట్టుకుంటాడు. పెళ్ళానికి కానీ మల్లెపూవులు కావాలన్నా మీకు ప్రాధేయపడతాడు. అంతేనా ` ఏమండోయ్‌, ఇలాటివాణ్ణి కట్టుకునేందుకు, ఆడపిల్లలు కానీకి మూడు చొప్పున బజారులో చవగ్గా దొరకడంలేదు. నా ఎరికలో, మీవాడికి` పెళ్ళి అయే యోగం లేదు`’ అని గట్టిగా గదమాయించింది`పిల్ల!’ లక్షరూపాయలిచ్చి ` కట్ట బెట్టినా ` నా కక్కరలేదు’ అని రెట్టించింది.
              అమ్మా!` అమ్మా!` అంతమాటనకమ్మా! నాబిడ్డ గుణగణాలు నీకు తెలియవమ్మా! కోటిలో ఒకడమ్మా!’ అని బ్రతిమాలింది, నాగమ్మ. అంటూ చప్పున కాళ్లుపట్టుకోపోగా, పిల్ల ఎగిరి, పక్కకు గంతేసి`
              ‘‘అత్తయ్యా’’ అంది. నాగమ్మ ` తెల్లబోయింది. బిడ్డ ఫక్కున నవ్వాడు.
              రాయడు` ఊఁ`ఊఁ అని మూలిగి, బిడ్డవంక చూసి` అంటే`? అన్నాడు.
              ‘‘మీ కోడలన్నమాట!’’ అన్నాడు బిడ్డ.
              రాయడు వినీ వినడంతోనే ` ముఖకవళిక మార్చాడు`
              ఉహు` యిదా నీ ప్రతాపం!- ఎలా పోషిస్తావురా-’
              ‘‘మనకా బాధలేదు నాన్నా!` ఈ పిల్ల పోషణలో ఉన్నాను`’’
              ఉహు!` అత్తగారు స్థితిమంతులన్న మాట`’
              కాదండీ మామగారు` మీతో పోలిస్తే గర్భ దరిద్రులు!` అల్లుడికో వేయి రూపాయలు జీతం ` దాంతో, ఏదో ఓపూట తినీ, ఓపూట తినకా`’ పిల్ల నవ్వేసింది`
              ఆఁ`ఆఁ` అంత వాడివైనావటరా నాన్నా!`’’ అంటూ రాయడు కొడుకుని కౌగలించుకునేందుకు ఉద్యుక్తుడైనాడు`
              బిడ్డ ` ఒక అడుగు వెనుకకు వేసి` ‘ఆగు!` నీకు ఆ అర్హతలేదు`’ అన్నాడు `రాయడు ఎంతో చిన్నబుచ్చుకున్నాడు`
              అదేమిట్రా నాయనా!’ అని అతి దీనంగా అన్నది నాగమ్మ!`
              పిల్ల ` అత్తగారి దగ్గిరకు చేరి రహస్యంగా `
              మరేం లేదు అత్తయ్యా! మీ అబ్బాయిది చంక వేసుకునే యీడు కాదుగదా! మరి, రేపో మాపో ` మనవణ్ణికని ` పిల్ల సిగ్గు పడ్డది!`
              నాగమ్మ ` ఎగిరి గంతేసి నీ కడుపుడకా!’ అంది!.
              రాయడు ` ముఖం చిట్లించుకొని బిడ్డతో ‘ఒరేయ్‌ ` నీకు పిన్నంతరం పెద్దంతరం లేదురా ` నా కోడలుచేత నాకు బుద్ధి చెప్పిస్తావుట్రా` కానీ`నీకూ`యిదే`.’
              అదృష్టం పడుతుంది!`’ అని రంగడు పూర్తి చేశాడు. Presented with a heavy heart!

No comments: