Wednesday, October 28, 2026

నూరీబే పాత పెట్టె : జానపద కథ


నూరీబే - పాత పెట్టె


నూరీబే ఆలోచన గల మనిషి. అల్బేనియాలో గౌరవంగలవాడు కూడా. అతను తనకంటే మరీ చిన్న వయసు గలావిడను భార్యగా తెచ్చుకున్నాడు.
ఒక సాయంత్రం అతను మామూలుకన్నా తొందరగా ఇంటికి వచ్చే సరికి నమ్మకంగల ఒక సేవకుడు ముందుకు వచ్చి, "నీ భార్య, అంటే మా యజమానురాలు, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నది. ఆమెతో ఆమె గదిలో ఒక పెద్ద పెట్టె ఉన్నది. అందులో ఒక మనిషి పట్టేంత పెట్టె అది. ఆ పెట్టె మీ నాయనమ్మ గారిది" అని చెప్పాడు.
అందులో పాత అల్లిక గుడ్డలు ఉండాలి!"
కాదండీ అందులో మరేదో ఉన్నదని నా అనుమానం!, నేనేమో మీకు ఇంత పాత నమ్మకస్తుడయిన సేవకుడినా, ఆమె నన్ను అందులోకి తొంగి కూడా చూడనివ్వలేదు."
నూరీ తన భార్య గదిలోకి వెళ్లాడు. భార్య ఒక పెట్టె పక్కన నిస్సహాయంగా కూచుని ఉంది.
ఆ పెట్టెలో ఏముందో నాకు చూపిస్తావా? అని అడిగాడతను.
ఒక పనివాడి అనుమానం కారణంగానా లేక నా మీద నమ్మకం లేకనా?"
ఎందుకనే సంగతులు ఆలోచించకుండా దాన్ని తెరిస్తే పోతుందిగా!"
అది కుదురుతుందని నేననుకోను!
దానికి తాళం వేసి ఉన్నదా?
అవును"
తాళంచెవి ఎక్కడ?
ఆమె తాళంచెవి ఎత్తి చూపింది. "ఆ పనివాడిని పంపించి వేయండి. నేను ఈ తాళంచెవులు మీకిస్తాను" అన్నదావిడ. పనివాణ్ణి పనిలోనుంచి తొలగించారు. ఆమె తాళంచెవులు ఇచ్చేసి మనసులో బాధ పడుతూ అక్కడినుంచి వెళ్లి పోయింది.
నూరీబే చాలా సేపు ఆలోచించాడు. అతను తోటలోనుంచి నలుగురు పని వాళ్లను రమ్మన్నాడు. వాళ్లు ఆ రాత్రి, పెట్టెను తెరవకుడానే పొలంలో ఎక్కడో దూరానికి తీసుకు పోయారు. దాన్ని వాళ్లక్కడ పాతి పెట్టారు.
ఆ సంగతి గురించి తర్వాత ఎవరూ మాట్లాడ లేదు.


ఈ కథను కలందర్ (తిరుగుతూ ఉండేవారు) దర్విష్ లు చెప్పినట్టుగా చెపుతారు.
ఇది 1916 ప్రాంతంలోనే యు ఎస్ లో అచ్చయింది.


 

No comments: