Saturday, August 30, 2025

Sufi Story - కలలు - రొట్టె ముక్క

Sufi Story - కలలు - రొట్టె ముక్క


కలలు - రొట్టె ముక్క

ముగ్గురు ప్రయాణికులు చాలాకాలంగా, చాలాదూరం కలిసి వెళుతున్నారు. కనుక స్నేహితులయ్యారు. కష్టసుఖాలను పంచుకున్నారు.

కొన్నాళ్లు అట్లా గడిచిన తర్వాత వాళ్లకు తమదగ్గర ఒక రొట్టెముక్క, గుక్కెడు నీళ్లు మాత్రమే మిగిలాయని అర్థమయింది. అవి ఎవరికి చెందాలనే విషయంలో కీచులాటలు కూడా మొదలయినయి. ఉన్నదాన్ని పంచుకు తినాలనుకున్నారు. ఉండేది తక్కువ కనుక పంపకం కుదరలేదు.

చీకటి పడసాగింది. పడుకోవడం మంచిది, అన్నాడొకతను. నిద్రలో ఎవరికి గొప్ప కలవస్తే వారు జరగవలసిందేమిటో నిర్ణయించాలని కూడా సలహాయిచ్చాడతను.

మరుసటి ఉదయం పొద్దు పొడుస్తుంటే ముగ్గురూ నిద్ర లేచారు.

నాకల చెప్పనా?’ అంటూ మొదటి మనిషి మొదలు పెట్టాడు  ‘నేను వర్ణించనలవిగాని ప్రదేశాలకు కొనిపోబడ్డాను. అక్కడంతా అందమే. ప్రశాంతతే. అక్కడొక జ్ఞాని కనిపించాడు. ‘నీ గతము, భవిష్యత్తు గొప్పవి. అందరూ మెచ్చుకోదగ్గవి. తిండి నీకే చెందాలి’ అని చెప్పాడా జ్ఞాని.

అతని మాటలు ముగియక ముందే రెండవ మనిషి అందుకున్నాడు ‘కదూ! అసలు నాకు నా గతం, భవిష్యత్తు అన్నీ కలలో కనిపించాయి. నేను భవిష్యత్తులో ఒక సర్వజ్ఞుడిని దర్శించాను. అతనన్నాడు గదా! నీ మిత్రులకన్నాముందు ఆతిండి నీకే అందాలి. నీవు తెలివి, ఓపిక గలిగినవాడివి. నీవు నాయకుడవు కావాలి గనుక, నీకు మంచి పోషణ అందాలి’ అని చెప్పుకు వచ్చాడతను.

మూడవ ప్రయాణికుడు నెమ్మదిగా చెప్పసాగాడు. ‘నాకు కలలో ఏమీ కనబడలేదు. ఏమీ వినబడలేదు. ఏమీ అనలేదు కూడా. నాకు నిద్ర తేలిపోయి మెలుకువ వచ్చింది. రొట్టె, నీళ్లు వెదికాను. అక్కడిక్కడే తిన్నాను కూడా. అదీ అసలు సంగతి’ అన్నాడతను.

 

ఈ కథను షా మహమ్మద్‌ షత్తారీ చెప్పాడంటారు. ఆయన 1563లో గతించాడు. హుమాయాన్‌ చేత గౌరవం పొందిన వాడతను. షత్తారీ, మతానికి వ్యతిరేకమయిన మాటలు చెపుతున్నాడని, మరణశిక్ష వేయాలన్నారు. కానీ ప్రత్యేక పరిస్థితులలో చెప్పిన మాటలను మామూలు పండితపద్ధతిలో విమర్శించడానికి లేదని, ఆయనను వదిలేశారు. ఆయన సమాధి గ్వాలియర్‌లో ఉంది.


Nedunuri Krishna Murthy : Kailasanathena - Kambhoji - Muttuswamy Dikshitar

Nedunuri Krishna Murthy 

Kailasanathena - Kambhoji - Muttuswamy Dikshitar

Friday, August 29, 2025

చీకటి వెలుగులు - గోపాలం మాటలలో

చీకటి వెలుగులు 
గోపాలం వ్యాసం

చీకటి వెలుగులు

 
ఒకప్పుడు పట్నంలో  కూడా ప్రతి దినం కొన్ని గంటలపాటు  కరెంటు ఉండేది కాదు. పల్లెల్లో నయితే  ఎన్ని గంటలసేపు ఉంటుందో చెప్పగలిగితే గొప్ప! పల్లెలకు కూడా పంటల పేరున కరెంటు ఇస్తామంటున్నరట. పట్నమంటే పెద్దలంతా ఉండి వ్యవహారం నడిపేచోటు. ఎక్కడ కరెంటుపోయినా అక్కడ పోవడానికి వీలులేదు. అక్కడ అంతా వెలుగే, నీడలు ఉండకూడదు. నేను రాజధాని ఢిల్లీలో ఉండగా డిప్లోమేటిక్ ఏరియా పక్కన ఉండే వాడిని. ఊరంతా కరెంటు పోయినా సరే అక్కడ మాత్రం పోయేది కాదు. గొప్పవారికి చీకటితో పనిలేదు. వాళ్లకు బతుకంతా వెలుగే.
వెదకగలిగితే  నీడల్లోనూ, చీకట్లోనూ అందం ఉందనే సంగతి అందరం మరిచిపోయాం. చిన్నప్పుడు నూనె దీపాలుండేవి. అంతకుముందు ఉండే ఆముదం దీపాలకంటే  నేలలోంచి బయటకు వచ్చిన మట్టినూనె దీపాలు మేలనిపించింది. అప్పట్లో ఇప్పటిలాగా పగలూ, రాత్రీ తేడా తెలియకుండా  చిటుక్కుమని `లైటు' వేసుకుని  నీడలు లేకుండా  బతకడం తెలిసేది కాదు. బుడ్డి దీపం ముట్టించిన తర్వాత ఉండేది వెలుతురా చీకటి కూడానా? చెప్పడం కష్టంగా ఉండేది. ఏం చూడాలన్నా  కళ్లు చికిలించాల్సి వచ్చేది. చదువు కూడా వాటి ముందే కొనసాగేది. ఇంట్లో ప్రతి గదిలోనూ కోడిగుడ్డు దీపాలు మాత్రమే ఉండేవి. కోడిగుడ్డుతో దీపాలు పెడతారని ఎవ్వరికీ అనుమానం రాకూడదనే. ఆ దీపాల బుడ్డీలు, కోడిగుడ్డు ఆకారం కంటే కొంచెం పెద్దగా ఉండేవి. చిన్న అక్షరాల అపరాధ పరిశోధన నవలలను కూడా నేను అటువంటి కోడిగుడ్డు దీపాల దగ్గర చదువుకున్నాను. వంట ఇంట్లో, భోజనాల శాలలో వెలుతురు వచ్చేటట్టు ఒక కందిలీ ఉండేది. వృద్ధులు కందిల్ అంటే దీపం అని అర్థం. ఇది కొంచెం పెద్ద దీపం. దీన్ని హరికేన్ లాంతరు అంటారు. అది కూడా నిజానికి అంతంత వెలుగే. అందరి భోజనాలు అయ్యేదాకా అది అక్కడే ఉంటుంది
నిజానికి చేయవలసిన  రాచకార్యాలన్నీ పగలుండగానే చక్కదిద్దుకోవడం, పొద్దుకూకిన తర్వాతవిరామంగా కాలం గడపడం అప్పటి పద్ధతి. ఇంత ఉడకేసుకుని తినడం, చేతనయినంత త్వరగా పడకేయడం అప్పటి కార్యక్రమంఆ చీకటిలాంటి  వెలుతురులో అంతకన్నా  చేయవలసిన పనులు ఏవయినా ఉంటే అవి సరదాకూ, ఉల్లాసం కొరకు చేయవలసినవే. ఊరికే కూచుని ముచ్చట్లు చెప్పుకోవడం మొదలు భజన, పాట, ఆట మొదలయిన కాలక్షేపం కార్యక్రమాలకు  అనువయిన సమయం  రాత్రిలో మొదటి భాగం.
మంచి వెలుతురులో  చదువుకోవాలంటే  దాని ముందుకే చేరాలి. ఇక వీధుల్లో దీపాలు ఉండేవి కాదు. వెన్నెల రోజులయితే, `వెన్నెల- నీడ' ఆట, `వెన్నెల కుప్పల' ఆట సాగుతుందిఅమావాస్య పక్షమయితే  ముడుచుకు పడుకోవడమొక్కటే ఆట. కొంచెం ధైర్యం చేసి  ఆ గుడ్డి చీకట్లో బయటకు వెడితే దృశ్యం చాలా బాగుండేది. కరెంటు దీపాలు ఆ అందాలను దొంగిలించేశాయి. ఇప్పుడంతా పట్టపగలే! అందుకే కరెంటు పోయినప్పుడు  ఉండే చీకటిని  ఎవరూ ఇష్టపడడం లేదు.
 సంధ్య వేళలు రెండూ ఎర్రగానే ఉంటాయి. అయితే రెండింటిలోనూ తేడా ఉంది. పొద్దుటి ఎరుపులో నుంచి పసుపురంగు పుడుతుందినేనున్నానంటూ వెలుగు వస్తుందినీడలు వస్తాయి. నిజాలు బయటపడతాయి. మరో కొత్తరోజు  మొదలవుతుందికానీ సాయంత్రం  పరుచుకునే  ఎరుపు  సంగతి మరో రకంగా ఉంటుంది. అది నెమ్మదిగా నీడలను మాయం చేస్తుంది. చీకటిని  పరిచయం చేస్తుంది. అదీ నెమ్మదిగానేఆ చీకటి  మనతో దోస్తీ చేస్తానంటూ  చేయి చాపుతుందిచల్లగా వెన్ను  నిమురుతుందినిద్ర పుచ్చుతుంది. కాలమంటే ఏమిటో తెలియని పాతకాలం మానవుడు, చీకట్లో ఇంకేమీ చేయలేకనే రాత్రి నిద్రపోవడం మొదలు పెట్టాడు. మనం ఇప్పుడు తెలివి మీరి తెల్లవార్లూ  పనిచేయడం నేర్చుకున్నాం! సహజంగా,ప్రకృతి సిద్ధంగా  వచ్చే చీకటి, వెలుతురూ నెమ్మదిగా  వస్తాయి. మీటలతో వచ్చేవి మాత్రం హఠాత్తుగా వస్తాయి.
 ఎన్నిసార్లు  అనుకున్నా మళ్ళీ దొరకని అందం, జొన్నలు చల్లినట్లు నక్షత్రాలు కనిపించే ఆకాశం! చీకటి పోయింది. దానితో బాటే  ఆకాశం అందాలూ మాయమయినాయి. పగలంతా ప్రపంచతంత్రం నడుస్తుంది. రాత్రి నడిచేది రమ్యమైన తంత్రం. లేదా రహస్య తంత్రం! మెదడుకు  పనిచెప్పే పనులు, సాహిత్య, కళాజగత్తుకు సంబంధించిన  కార్యక్రమాలకు  ఈ చీకటి పొద్దుకన్నా మించిన  సమయం మరొకటి లేదు. ఇంత వెలుగుల కాలంలోనూ, ఒకనాటకం, సినిమా, సంగీత కచేరీ నడవాలంటే సాయంత్రం కావల్సిందే. అంతా వచ్చి చేరిన తర్వాత దీపాలు ఆర్పి చీకటి చేయవలసిందేజరగబోయే కార్యక్రమానికి ఆ చీకటి  మన మనస్సుల్లో ఒక వాతావరణాన్ని  తయారు చేస్తుంది.
పాత కాలంలోనయినా  అమ్మమ్మ కథల నుంచి మొదలు అన్ని రకాల కళారూపాలకు అనువయిన కాలం రాత్రిలో తొలిజాముఆ చీకట్లోనే మనసు పంచుకున్న జంటలు, భయం భయంగానే ఒకచోట చేరి మాటలూ పంచుకునేది. అదంతా చీకటి సమయం. నీడల కాలం. ఈనాటి మీటలకాలంలో నీడలకు తావులేదు. సినిమాల్లో టెలివిజన్కథల్లో నీడలుండవు. అంటే అదంతా నిజం కాదని  సూచన. అన్యాయంగా నిజం జీవితంలో కూడా  నీడలు లేకుండా పోతున్నాయి.    నీడలతోనే కాలం కొలతలు వేసుకున్నారు. ఒకప్పటి సన్డయల్‌, జంతర్మంతర్లు అందుకు  ఉదాహరణలు.
వెలుతురు  లాంటి చీకటి, వెలుతురు కలిసిన  చీకట్లో నీడలు ఒకటే కాక లోతులూ తెలుస్తాయి. చిత్రపటంలో  లోతులు తేవడం కోసం చీకటిని ఆశ్రయించే, నీడలను సృష్టించే  కళాకారులు ఈ సంగతిని  అంగీకరిస్తారు. వెలుగులో  దృశ్యం, ప్లాష్వేసి తీసిన ఫోటోలా చదునయిపోతుంది.
దక్షిణ భారతదేశపు గుడులలో ఇప్పటికీ చీకటిని నిలబెడుతున్నారని  చాలామంది గమనించారు. బయట  ఇంటి అలంకరణలు, దీపాలు ఉన్నా, గర్భగుడిలో  చమురు దీపాలు, నెయ్యి దీపాలు మాత్రమే మినుకు మినుకు మంటుంటాయి. ఆ మసక వెలుతురులో భక్తునికి కనిపించీ, కనిపించని దేవుడు,నిజంగా ఆస్తినాస్తి విచికిత్సను కలిగిస్తాడు. నక్షత్రాల హోటళ్ళల్లోనూ ఇదే పద్ధతి! బయటంతా వెలుగుల పండుగయినా తిండి తినే చోట మాత్రం చీకటి! అంటే అది అందమనే గదా!
ఎంతమంది గమనించారో తెలియదు కానీ, సినిమాలలో నీడలు కనిపించవు. అక్కడి వెలుగంతా అసలు వెలుగు కాదు. కృత్రిమమైనది. అందులో నీడలకు చోటులేదు. మరీ ఎక్కువ వెలుగు ఏర్పాటుచేసి అందులో చీకటి సృష్టించాలని ప్రయత్నిస్తారు. టీవీ షూటింగ్ లో వరుసగా మూడు రోజులు కూర్చుంటే, ముఖం నల్లగా మాడిపోయేది. మనకు అది అలవాటు లేని వ్యవహారం. అందునా భారీగా మేకప్ కూడా వేసుకునే పద్ధతి లేదు. సినిమా వాళ్ళు కావాలనే ఎక్కువ మేకప్ వేసుకుంటారు. కనుక వాళ్ల చర్మం బహుశా రక్షింపబడుతుంది.
వెలుగునీడలు గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది. నక్క ఒకటి పొద్దున్నే వేటకు బయలు దేరింది. ఉదయం కనుక దాని నీడ నిటారుగా కనిపించింది. ఇవాళ కనీసం నేను తినడానికి ఒక ఏనుగు అయినా కావాలి అనుకున్నది నక్క. మధ్యాహ్నం సమయంలో ఏనుగు కాదు కదా ఎలుక కూడా దొరకలేదు. ఆకలి మాత్రం మండుతున్నది. సూర్యుడు నడినెత్తిన పొందుతున్నాడు. ఇప్పుడు నీడ చూస్తే అది పొట్టిగా ఉంది. అసలు లేనట్టుంది. ఇంత ఆకలి ఉన్నా నాకు తిండి ఎంత కావాలి అని నక్క ఆశ్చర్యపోయింది. నీడలు మనిషిని మప్పగిస్తాయి.
చూడు చూడు నీడలు, నీడలు పొగ మేడలు అన్న పాట బహుశా పెద్ద కవి ఎవరో రాశారు. నీడలు ఉండవు. కానీ కనిపిస్తాయి. అవి మారుతుంటాయి. మనం ఉన్న చోటును బట్టి వాటిని గుర్తించాలి. దీపంలో నీడలు కదలాడుతాయి. పగటి నీడలు పద్ధతిగా ఉంటాయి.
అందరికీ వెలుగు మీద ప్రేమ ఎక్కువ అయినట్టు కనబడుతుంది. నేనేమో ఇంటి పై కప్పు లో ఏర్పాటుచేసిన లైట్ల లో బల్బులు తెచ్చి పెట్టాను. కానీ గోడ మీద ఎల్ఈడి ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆ ట్యూబ్ లైట్ వెలిగిస్తే ఇళ్ళు ఇంటిలా గాక బట్టల అంగడిగా కనబడుతుంది. నాకు మరీ వెలుగు అంటే ఇష్టం లేదు. చీకటిని ఇష్టపడే మనిషిని. ఇక ఈ మధ్యన హైదరాబాద్ నగరంలో అంగళ్లు మిగతా వాటికి, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వాటి వెలుగుతో వీధి వీధి మొత్తం వెలిగిపోతున్నది. మా ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వెళితే ఎదురుగా ఒక కొత్త హోటల్ పెట్టారు. ఆ పక్కన ఒక చెప్పుల దుకాణం ఉంది. అవి రెండూ కలిసి స్ట్రీట్ లైట్ల అవసరం లేకుండా చేస్తున్నాయి. ఇటువంటి లైట్లు నగరమంతా ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. హైదరాబాదు అదేదో లాస్ వేగస్ లాగ, ఇలాంటి వెలుగు నగరంగా మారిపోయింది. ఈ వెలుగులో నీడలో అస్సలు ఉండవు.
ఏ రంగు లేకుంటే నలుపు మిగులుతుంది. నలుపు అంటూ ఒక వేరు రంగు లేదు. అచ్చంగా అలాగే, వెలుగు లేకుంటే చీకటి మిగులుతుంది. చీకటి అనే ఒక పద్ధతి లేదు. వెనుకకు తిరిగి చూస్తే, ఎక్కడ వెలుగు కనిపించడం లేదు. గుండె మండింది చూచినా, గతం కనిపించడం లేదు. అని నేను కవిత లాంటిది ఒకటి రాసుకున్నాను. అందరికీ ముందుచూపే కానీ, గతం గురించి పట్టడంలేదు. గతం అంతా చీకటి కాదు. గతం వెలుగులోనే మనం ముందుకు సాగుతున్నాము. ముందు ముందు మరింత వెలుగు సాధిస్తా మేమో. కానీ వెలుగు కన్నా చీకటి ప్రాముఖ్యం ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. చీకటిని అలవాటు చేసుకోవాలి. చీకటిలో చిన్న దీపం పెట్టాలి. చీకట్లో దారి వెతకాలి. చీకటిలో చూడగలగాలి. చిన్నపిల్లలకు చీకటిని చూపించి బూచి ఉందని ఏనాడూ చెప్పకూడదు.
నిజానికి కళ్లకు చీకటి అలవాటవుతుంది. కొంతసేపటికి చీకట్లో కూడా చూడగలుగుతాము. కనీసం వస్తువులు చూచాయగా నైనా కనిపిస్తాయి. తెలివి విషయంలో మాత్రం ఈ పద్ధతి పనికిరాదు. అజ్ఞానం అనే చీకటి లో నుంచి అందరూ వెలుగులోకి రావాలి. అప్పుడే చీకటి వెలుగుల మధ్య తేడా తెలుస్తుంది.

 


Thursday, August 28, 2025

T N Rajrathnam Pillay Two Items

T N Rajaratnam Pillay - Nadaswaram


Janakiramana - Shuddha Seemantini
Ninnujoochi- Saurashtra



Tuesday, August 26, 2025

M S Subbulakshmi - at Aradhana 1976

 M S Subbulakshmi 

At Tyagaraja Aradhana - 1976


Muripemu - Mukhari


Shobhillu - Jaganmohini


Samanamevaru - Kaharaharapriya


Challare - Ahiri












Mani Krishnaswamy - Ramabhirama - Saveri

Mani Krishnaswamy


Ramabhirama - Saveri

pallavi

rAmAbhirAma raghurAma rAma

anupallavi

tamasamulEla sItA manOramaNa

caraNam 7

AjAnubAhu karamIra shrI tyAgarAjuni bhavAbdhi dATinci para mIrA


(It could be varamira also.)

Though there are 7 charanams she sang only the 7th!


Balamurali - Ravalavelugula - Light song రవల వెలుగుల - బాలమురళి - లలిత గీతం

Balamurali 

sings a light song


Ravala Velugula

P B Srinivas Padavanadapavoy

P B Srinivas

Light song - Padava Nadapavoy

Saturday, August 23, 2025

Friday, August 22, 2025

N Ramani - Flute : Gajavadana - Sriranjani

N Ramani - Flute

Gajavadana Karunasadana - Sriranjani

M D Ramanathan - Samajavaragamana - Hindolam

M D Ramanathan

Samajavaragamana - Hindolam

A Short presentation!

It's just a short piece! I request you to kindly listen!

Thursday, August 21, 2025

Nedunuri Krishna Murthy Shritakamala Ragamalika

Nedunuri Krishna Murthy 

 

Shritakamalakucha - Ragamalika - Jayadeva Kavi


శ్రిత కమలా కుచమండల! ధృత కుండల! ఏ
కలిత లలిత వనమాల! జయ జయ దేవ! హరే! ॥(ధ్రువమ్‌)
దినమణిమండల మండన! భవ ఖండన! ఏ
మునిజనమానస హంస! జయ జయ దేవ! హరే! ॥
కాళియ విషధర గంజన! జన రంజన! ఏ
యదుకులనళిన దినేశ! జయ జయ దేవ! హరే! ॥
మధు ముర నరక వినాశన! గరుడాసన! ఏ
సురకుల కేళి నిదాన! జయ జయ దేవ! హరే! ॥
అమల కమల దళ లోచన! భవ మోచన! ఏ
త్రిభువన భవన నిధాన! జయ జయ దేవ! హరే! ॥
జనకసుతా కుచ భూషణ! జిత దూషణ! ఏ
సమర శమిత దశ కంఠ! జయ జయ దేవ! హరే! ॥
అభినవ జలధర సుందర! ధృత మందర! ఏ
శ్రీముఖ చంద్ర చకోర! జయ జయ దేవ! హరే! ॥
తవ చరణే ప్రణతా వయమితి భావయ ఏ
కురు కుశలం ప్రణతేషు జయ జయ దేవ! హరే! ॥
శ్రీ జయదేవ కవేరిదం కురుతే ముదం ఏ
మంగళముజ్జ్వల గీతం జయ జయ దేవ! హరే! ॥

śrita-kamalā-kuca-maṇḍala dhṛta-kuṇḍala e
kalita-lalita-vana-māla
jaya jaya deva hare ||dhruvapadaṃ||

dina-maṇi-maṇḍala-maṇḍana
bhava-khaṇḍana e
muni-jana-mānasa-haṃsa
jaya jaya deva hare ||1||

kāliya-viṣa-dhara-gañjana
jana-rañjana e
yadukula-nalina-dineśa
jaya jaya deva hare ||2||

madhu-mura-naraka-vināśana
garuḍāsana e
sura-kula-keli-nidāna
jaya jaya deva hare ||3||

amala-kamala-dala-locana
bhava-mocana e
tribhuvana-bhuvana-nidhāna
jaya jaya deva hare ||4||

janaka-sutā-kṛta-bhūṣaṇa
jita-dūṣaṇa e
samara-śamita-daśa-kaṇṭha
jaya jaya deva hare ||5||

abhinava-jala-dhara-sundara
dhṛta-mandara e
śrī-mukha-candra-cakora
jaya jaya deva hare ||6||

tava caraṇaṃ praṇatā vayam
iti bhāvaya e
kuru kuśalaṃ praṇateṣu
jaya jaya deva hare ||7||

śrī-jayadeva-kaver idaṃ
kurute mudam e
maṅgalam ujjvala-gītaṃ
jaya jaya deva hare ||8||

Tuesday, August 19, 2025

లోకాభిరామం - పద్యంవిద్య - Lokabhiramam - Padyamvidya

లోకాభిరామం - పద్యంవిద్య



నా పుస్తకం నుంచి మరో వ్యాసం - మీ కోసం

పద్యంవిద్య

రాస్తారా అన్నప్పుడు,

చూస్తానంటే తప్పని, రాస్తానన్నా!

రాస్తే ఏమవుతుందో,

చూస్తాననుకున్నానూ, రాస్తున్నాను!

- ఇది కంద పద్యమేనా? ఏమో? నాకు తెలియదు. రాశాను, అంతే.

నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు, ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటుంటే, పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు. వచనం (కథ, నవల, వ్యాసం) రాయడం గాల్లో విమానం నడపడం లాంటిదనీ, పాట రాయడం, రోడ్డు మీద కారు నడపడం లాంటిదనీ అన్నారాయన. ఇక పద్యం, పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే, వెళ్లవలసిన చోటికి అదే వెళుతుంది! అన్నారాయన. ఏ పనయినా అంతే, చేతనయిన వారికి, చాలా సులభంగానే కనపడుతుంది. మిగతా వాళ్లకది చెక్కల బావిలో మోటార్‌ సైకిల్‌ నడిపినట్లుంటుంది.

చెక్కలతో బావి కట్టి, అందులో గోడల మీద, సైకిల్‌, మోటార్‌ సైకిలూ, నడిపిన గురుభిక్‌సింగ్‌ ప్రదర్శన నాకు ఇన్నేళ్లయినా గుర్తుంది. ఆయనకదే బతుకు. (బహుశ: దాని అంతం కూడా!) ఎట్లా నడుపుతారు, అంటే, ‘ఓస్‌! సులభం’ అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు. కనుక, నాతో మొదలు ఎవరయినా ప్రయత్నించవచ్చు. జారిపడినా దెబ్బలు తగలవు!

చిన్నప్పుడు, అదెందుకో, ఏమిటో తెలియకుండానే, శతకాలకు శతకాలు భట్టీయం (ఇది నోటికి నేర్చుకునే విద్య!) వేయించేవారు. ఇది పక్కనే పెడితే, మా ఊరి బడి ఒక సెంటర్‌ స్కూలట. సెంట్రల్‌ కాదని మనవి. చుట్టుండే అయిదారు పల్లెలకు అది కేంద్రమని అర్థం! ఆ బడులలో పంతుళ్లు వచ్చి ఒక ‘సెంటర్‌ క్లాస్‌’ అనే కార్యక్రమంలో ‘మాదిరి తరగతి’ అనే మాడల్‌ క్లాసులు నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కనబెడితే, ఈ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదూ? నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం, పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు, కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులాగుంది. వాళ్లంతా, నట్టుతూ, ముక్కుతూ మూడు నాలుగు పద్యాలు చదివి, అలసి ఆగిపోయారు. నేను మాత్రం, వద్దన్నా ఆపకుండా, మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. అది మూడవ, నాలుగవ తరగతిలో ఉన్నప్పటి మాట!

సినిమా పద్ధతిలో సీన్‌ కట్‌ చేస్తే, ఎనిమిదవ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్లు గారు తెలుగు చెపుతారు. చాలా బాగా చెపుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ, అంటే పదాలను విడగొట్టి చూపడం, తరువాతి అంచె. అర్థం చెప్పడం, సమన్వయం, ఆ తరువాత జరుగుతాయి. పద్యాన్ని మరో సారి చదువుతారు. అప్పుడు పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా, ఒక క్రమంలో కూచుంటారు గదా! రెండు బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి. అందులో మొదట్లోనే నేను ఉండేవాణ్ని! అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే, ఆ పద్యం చదివేవాణ్ని! అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలాకాలం నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి? క్లాసులో ఉండే ఆడపిల్లలలో ఇద్దరు, ఇదంతా నచ్చలేదనుకున్నారు. ‘మీరు ఏ పద్యం చెప్పబోతున్నారో ముందే వాడికి చెపుతారు. వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు! బడాయి!’ అన్నారు. ఆచార్లు గారికి నేనంటే, ఆనాటికీ, ఈనాటికీ అభిమానమే. ‘ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంత సేపు, అతను పద్యం మనసులో మననం చేసుకుంటాడు. మీరు చేయరు. అంతే!’ అన్నారు. సిలబస్‌లో లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ, వంతు రాగానే, నేను పద్యం అప్పజెప్పాను. పుస్తకం లేకుండానే! ఆ తరువాత ఏమయిందో నాకు గుర్తులేదు.

బడిలో నాతోబాటు పద్యాల పోటీలో పాల్గొన్న మిత్రుడు, బంధువు విష్ణు, చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్లిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవరికీ ఇవ్వరు. పేరుతోబాటు ఒక నంబరేమయినా ఉండేదేమో? గుర్తు లేదు. ఫలానా శర్మ, కేరాఫ్‌ 56, ఎ.పి.ఓ. అని రాస్తే చాలు, ఉత్తరం వెళ్లిపోతుంది. ఏపీఓ అంటే ఆర్మీ పోస్ట్‌ ఆఫీస్‌ అని తరువాత తెలిసింది. (తెలిసిందా?) 56 అంటే విష్ణు ఉండే చోటయి ఉంటుంది. ఈ సంగతంతా పక్కన పెడితే, ఒకసారి ఉగాదికో, సంక్రాంతికో వాడికి ఇన్‌లాండ్‌ లెటర్‌ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు. వాడి దగ్గర గానీ, ఉందేమో ఉత్తరం, అడగాలి!

చిన్నాయనగారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో ‘వసుచరిత్ర’ పాఠం చెప్పారు. ఇంట్లో, సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యవిద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ, ఎందుకో అది కుదరదు. దేనికదే వేరువేరుగా ఉండిపోతయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర, ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. ‘అన విను, గృహస్థ రత్నంబ! లంబమాన రవిరథతురగ..’ అంటూ వచనమంతా ఒక్క పట్టున అప్పజెబితే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అప్పకవీయం పరిచయమయింది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకమది. నిడుదలు, జడ్డక్కరములు, పిరుందకడ యూదిన యక్కరముల్‌ గురువులు. కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్‌తో గణములు, గణముల కాంబినేషన్స్‌తో వృత్తములు, పద్యములు. తరువాత డి.ఎన్‌.ఏ. గురించి చదువుతుంటే నాకిదంతా గుర్తుకు వస్తుండేది. ‘జరల్‌ జరల్‌ జగంబుకూడి సన్నుతిన్‌ రచింపగా, పరాజితార ధీరవీర పంచచామరంబగున్‌!’ పంచచామరం అనే పద్యం లక్షణం పంచచామరంలో!

రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్‌వ్యూహము. ‘రామాండెమంటే, సామాండెమా? గొల్లేశమంత కథ!’ అని ఒక మాట. రామాయణం సామాన్యం కాదు! బయలాటలో వచ్చే గొల్లవేషమంత ఉంటుందని, అన్న మనిషి భావం! ఈ ఇంటర్‌వ్యూహము కూడా గొల్ల వేషమంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము గనుక, అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది గనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్సుకు సంబంధించింది. ముగ్గురు నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతయినంత వరకు నేనూ వారి బుర్ర తిన్నాను. కైసర్‌ కలందర్‌ గారని ఒక అందమయిన పెద్దాయన, కమిటీ అధ్యక్షులు. ‘సైన్సు సరే! హాబీలేమిటి?’ అని అడిగారు. ‘తిండి, అమ్మాయిల’ గురించి చెబితే కుదరదు. కనుక ‘సంగీతం, సాహిత్యం’ అన్నాను. ‘ఒక పద్యం చెప్పగలవా?’ అన్నారాయన. ‘కలడుల్లోక మహా మహోగ్ర’ అంటూ వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్‌ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక్క సంస్కృత సమాసం మరి! ‘అర్థం చెప్పగలవా?’ అన్నారాయన. ‘ఓ యస్‌’ అన్నాను. భయపడ్డారేమో, ‘వద్దులే’ అని మరేదో అడిగారు. నాకా ఉద్యోగం ఇస్తారని అక్కడే అర్థమయింది. అది మరో గొల్లవేషం కథ!

మళ్లీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి, ఆలోచన ఏదయినా వస్తే వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేనూ జవాబుగా ఒక కార్డు రాసేవాణ్ని. ఒకసారి ఆయన రాయవలసిందేదో రాసి, కార్డు వెనుక చిరునామా రాసేచోట పక్కన ఖాళీలో రెండు పద్య పాదాలు రాశారు. ‘శాంతి సంగరంబు, స్వాతంత్య్ర సమరాన, సగము కాలినట్టి సమిధ నేను’ అని మాత్రం రాశారాయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేనూ అదే పద్ధతిలో ‘కడమ సగముగాల్చి కవితా ప్రపంచాన, కారు చీకట్లను పారద్రోలె!’ అని రాసి పంపాను. నమ్ముతారో లేదో? కార్డు అందిన మరుక్షణం ఆయన ఆఘమేఘాల మీద వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. ‘తెలుగు పద్యం’ గురించి నేను వేస్తున్న పుస్తకంలో, నీ పద్యం ఉండాలి!’ అన్నారు. పద్యం లేదు. అదే వేరే సంగతి!


Nedunuri Krishna Murthy - Santhanagopalakrishnam - Khamas

Nedunuri Krishna Murthy


Santhanagopalakrishnam - Khamas

pallavi

santAna gOpAlakrSNam upAsmahE shrI

anupallavi

santAna saubhAgya vitaraNa nipuNataram santatam sadguruguha sannutam sArasakaram

caraNam

shrI rukmiNI satya bhAmA samEtam arjuna prEmAspadam Ashrita jana phaladam
nartana muraLIdharam nata shuka sanaka nAradam nIrajAsanAdi nutam nIlamEgha jita gAtram


Monday, August 18, 2025

Franz Kafka Story in Telugu

 Literature at it's best!

Franz Kafka!

A story or is it?


నిత్యం జరిగేదే - కథ

నిత్యమూ జరిగేదే!
ఫ్రాంత్స్ కాఫ్కా


మామూలు సంఘటన : దాన్ని ఎదురుకున్నామంటే అదొక గొప్ప!
ఇతనికి పక్క ఊళ్లోఉండే అతనితో జరూరు పని ఉంది. పది నిమిషాలలో వెళతాడు. కొంత మాట్లాడి మళ్లీ వస్తాడు. ఎంత తొందరగా వచ్చానో అంటాడు పైగా.
మరునాడు అతను మళ్లీ అక్కడికి పోతాడు. ఈసారి కొన్ని గంటలయినా సరే వ్యవహారం తేల్చేయాలి. పొద్దున్నే బయలుదేరతాడు. అన్ని పరిస్థితులు, కనీసం ఇతని దృష్టిలోనిన్నటిలాగే ఉన్నాయి. కానీ అక్కడికి చేరడానికి ఇతనికి పది గంటలు పడుతుంది. అలసి సాయంత్రానికి అక్కడకు చేరుకుంటే, ఇతను రాలేదని విసుగుచెంది అతను ఇతని స్థావరానికి బయలుదేరాడన్నారు. బయలుదేరి అరగంటయింది. దారిలో ఎదురయి ఉంటాడు అనీ అన్నారు. ఇతడిని కొంచెం సేపు ఉండమన్నారు. అతను త్వరలోనే వస్తాడన్నారు. ఇతను మాత్రం ఆత్రంగా వెనుదిరిగి వచ్చాడు.
ఈసారి అతను సంగతి తెలియకుండానే, క్షణంలో ఇల్లు చేరుకున్నాడు. అతను పొద్దున్నే వచ్చాడనీ, నిజానికి ఇతను బయలుదేరకముందే వచ్చాడనీ చెప్పారు. నిజంగా అతను ద్వారం దగ్గరే ఎదురయ్యి, వ్యవహారం గురించి చెప్ప ప్రయత్నించాడు. ఇతను మాత్రం తనకు టైం లేదనీ, తొందరగా వెళ్లాలనీ అంటూసాగిపోయాడు.
ఇతని తీరు అర్థంగాక అతను అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు. ఇతని గదిలోనే ఉండి మళ్లీమళ్లీ వచ్చాడా అని అడిగాడు. అతనింకా అక్కడే ఉన్నాడిప్పుడు. అతడిని కలిసి సంగతి వివరించవచ్చునన్న సంతోషంతో ఇతను మెట్లెక్కసాగాడు. పైమెట్టు మీద పడిపోయాడు. దొర్లుతూ వచ్చి బాధ కారణంగా మూర్ఛపోయాడు. కనీసం అరవను కూడా లేదు. చీకట్లో ఉండి మూలుగుతున్నాడు. అతను కోపంగా మెట్లు దిగి గబగబా `దగ్గరనుంచా, దూరంనుంచా తెలియలేదు` వెళ్లిపోవడం మాత్రం కనబడుతూనే ఉన్నది. అతను వెళ్లిపోయాడు.
I I I I
ఇది కాఫ్కా రచన. దీన్ని కథ అనాలా? మరి కాఫ్కా కథకుడు గదా? కథానికలు రాసే వారందరికీ అతను అంత ఎత్తున కనిపిస్తాడు గదా? అందుకే కాఫ్కా తీరు (కాఫ్కాయెస్క్‌) అనే మాట పుట్టింది. పద్ధతి పుట్టింది.
ఇంతకూ కథానిక అంటే ఎట్లుండాలి? ఎవరు చెప్పగలరు
?


B N Suresh - Ragam Tanam Pallavi - Shanmukhapriya

Shravanam of a master!

B N Suresh  - Flute 

Ragam Tanam Pallavi  -  Shanmukhapriya

Great music makes your day great!!

Sunday, August 17, 2025

Voleti Venkateswarlu - Sri Raghuvara - Kambhoji శ్రీ రఘువర - కాంభోజి -...


Voleti Venkateswarlu


Sri Raghuvara - Kambhoji 



Lyrics:

shrI raghuvara-apramEya mAmava


shrI raghukula jalanidhi sOma shrI rAma pAlaya


sArasa hita kulAbja bhrnga sangIta lOla

virOcana kulEshvara svara layAdi mUrcanOllAsita nArada vinuta

shrI bhAskara kulAdri dIpa shrI bhAgavata vinuta sucaraNa

sItA nAtha (bhAgadEya) tyAgarAjanuta nIla sutApta suguNAbharaNa

Chevilo Roda (చెవిలో రొద) - అరేబియా జానపద కథ

చెవిలో రొద - 

అరేబియా జానపద కథ

Told by Saadi Shirazi


Saturday, August 16, 2025

Kadri Gopalnath - Saxophone - Two offerings

Kadri Gopalnath - Saxophone


Vinayaka Ninuvina - Hamsadhwani



Samanamevaru - Kharaharapriya


Enjoy some scintilating Music!




Sadasiva Gurinchi - సదాశివ గురించి


సదాశివ గురించి


వినండి.
మీకే అర్థమవుతుంది

Friday, August 15, 2025

M Balamuralikrishna - Aligite - Husseni - Kshetrayya Padam

M Balamuralikrishna


Aligite  - Husseni

aligitE bhagya mAye marEmi vADalagitE bhAgyamAye 
taliru bONirO vAni danDincha galana vA||Dali ||

ara sompu mATa lADE vAnikinE
taruNirO manchi dAna nayyEnA
sarasaku rADAye sakhiyarO nAmOmu
tirigi chooDaDEmO dEvuDunnADu vA||Dali ||

bALi lEdinka nEla nAtO pondu
chAlu gAbOlu santOsha mAye
neelAgune vAni kitavu kAdEmO
neela vEni rO nATi nenarinchuka lEka vA ||Dali ||

bAla prAyamu nADe bhramiyinchi nannu vA
DElina suddu lennennO kalavu
chAla nAtO bAsalu chEsinADE yO
balarO muvva gOpAlu DippuDu vA||Dali ||

D K Pattammal Patriotic Song - Our Land

D K Pattammal



Patriotic Song - Our Land "Engal Nattukenda Nadu Eedu?"
A song of Subramanya Bharati!


An independence day offering!

D K Pattammal - Vannegadu Muvvagopaludu - Kapi

D K Pattammal 


Vannegadu Muvvagopaludu - Kapi

D K Pattammal - Tyagarajayogavaibhavam - Anandabhairavi

D K Pattammal


Tyagarajayogavaibhavam -  Anandabhairavi


Lyric:

Notice the Gopucchyati letter and word play!

pallavi

tyAgarAja yOga vaibhavam sadAshivam
tyAgarAja yOga vaibhavam sadAshrayAmi
tyAgarAja yOga vaibhavam
agarAja yOga vaibhavam
rAja yOga vaibhavam
yOga vaibhavam
vaibhavam
bhavam
vam

samaashTi caraNam

nAgarAja vinuta padam nAdabindu kalAspadam
yOgirAja vidita padam yugapadbhOga mOkSapradam
yOgarUDha nAma rUpa vis'va srSTyAdikaraNam
yugaparivrtyAbda mAsa dina ghaTikAdyAvaraNam

madhyama kaalam

srI guruguha guru sachitAnanda bhairavisham
shiva shaktyAdi sakala tatvA
swarUpa prakAsham
swa prakAsham
swarUpa prakAsham
tatva swarUpa prakAsham
sakala tatva swarUpa prakAsham
shiva shaktyAdi sakala tatvA swarUpa prakAsham

Thursday, August 14, 2025

Pelli Dustulu - A Story from Marakesh in Telugu


Pelli Dustulu - A Story from Marakesh in Telugu


పెళ్లి దుస్తులు - మరాకష్ జానపద

 కథ


అలీ తన భార్య ఇద్దరూ షేఖ్‌ హమీద్‌తో పాటు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో శ్రమ తెలియకూడదని వాళ్లు కథలు మొదలుపెట్టారు. అలీకి కథలు వినడం చాలా ఇష్టం. ఇక షేఖ్‌ హమీద్‌ చరిత్రకథలు చెప్పడంలో చాలా గొప్పవాడని పేరున్న మనిషి. ఆయన చెపుతున్న కథను అలీ చాలా ధ్యాసతో వింటున్నాడు. ఒక్కసారి అతని చూపు పక్కకు కదిలింది. ఇసుకలో ఏదో ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది. వెళ్లి ఆ వస్తువు ఏమిటో చూడాలని అలీకి బలంగానే కోరిక కలిగింది. కానీ బాబాయి కథను వినకుండా మధ్యలో పక్కకు పోతే అది మర్యాద కాదని అనుకుని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన జేబులో ఉన్న గింజలను అతను బయటకు తీశాడు. దారివెంట వాటిని వరుసగా పడవేయసాగాడు.

చివరికి వాళ్లు తమ గూడానికి తిరిగి వచ్చారు. షేఖ్‌ హమీద్‌ తన గుడారం లోకి వెళ్లిపోయాడు. కానీ అలీమాత్రం గుర్రంమీదనుంచి దిగనేలేదు. తల్లితో అతను తన గురించి ఎవరయినా అడిగితే పడుకున్నాడని చెప్పమన్నాడు. గుర్రాన్ని వెనుకకు తిప్పి అతను వచ్చినదారిలోనే మళ్లీ పోసాగాడు. దారివెంట తాను జారవిడిచిన విత్తనాలను గమనిస్తూ సరయిన చోటికి తిరిగివచ్చాడు. అక్కడ దిగి చూస్తే ధగధగలాడుతూ ఒక బంగారు చేతికడియం కనిపించింది. దానిమీద ముత్యాలు పొదిగి ఉన్నాయి. పనితనం చాలా గొప్పగా ఉంది. అది తప్పకుండా ఎవరో ఉన్నతవంశురాలయిన అమ్మాయి కడియం అనుకున్నాడు అలీ.

అతను కడియాన్ని తీసుకుని తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన అలీకి వాళ్ల అమ్మ, మీ బాబాయి రెండుసార్లు నీగురించి అడిగాడు, అని చెప్పింది. అలీ కడియం కూడా తీసుకుని షేఖ్‌ హమీద్‌ దగ్గరకు వెళ్లాడు. అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. ఆ సంగతి, ఈ సంగతి మాట్లాడుతున్నారు. అలీ కడియాన్ని షేఖ్‌ హమీద్‌ చేతికి ఇచ్చాడు. ఆయన కడియాన్ని అటుఇటూ తిప్పుతూ చాలా జాగ్రత్తగా చూచాడు. ‘ఇది తప్పకుండా చాలా మంచి పనితనంగల కంసాలి చేతిలో తయారయ్యింది. నీకు ఎక్కడ దొరికింది?’ అంటూ అడిగాడు.

అలీ వివరమంతా చెప్పాడు.

ఈ కడియం సొంతదారు మామూలు వ్యక్తికాదు. వెళ్లి వెతుకుదాం పద’ అన్నాడు షేఖ్‌ హమీద్‌.

వాళ్లు గూడెంలోని దాయిని పిలిపించారు. కడియాన్ని ఆమె చేతికి ఇచ్చారు. మొత్తంలో గూడెమంతా వెతికి ఈ కడియం ఎవరిదో తెలుసుకురావాలని ఆమెకు పనిపెట్టారు. బహుశా వేరే గూడెంలోని మనిషి అయి ఉండవచ్చు. మొత్తానికి నీవు సంగతి తెలుసుకు రావాలన్నారు.

దాయి కడియం తీసుకుని వెతుకులాట కొరకు బయలుదేరింది. ఒక గుడారం నుంచి మరొక గుడారానికి తిరగసాగింది. చాలాచోట్ల ఆ పద్ధతిగా అడుగుతూ పోయింది. ఆమె ఆ రకంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ప్రాంతానికి చేరేసరికి అక్కడ గుడారాలన్నీ నల్లని గుడ్డతో వేసిఉండడం కనిపించింది. అందులోనూ ఒక గుడారం మరీ పెద్దది. ఎనిమిది వాసాలమీద దాన్ని నిలిపి ఉంచారు. అక్కడ ఒక యువతి దాయికి స్వాగతం చెప్పి లోనికి పిలిచింది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె శరీరం అద్దంలాగ నిగారింపుతో మెరుస్తున్నది. ఆమె ముఖంకూడా చంద్రునికన్నా బాగా వెలిగిపోతున్నది.

దాయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నది. మంచినీళ్లు తాగింది. అప్పుడిక రుమాలులోనుంచి కడియాన్ని బయటకు తీసి చూపించింది. గుడారంలో అమ్మాయి కడియాన్ని చేతికి తీసుకుని అటు ఇటూ తిప్పి చూచింది. ఈ కడియం నాదేనంటూ తన పెట్టెలోనుంచి దాని జతకడియాన్ని కూడా తెచ్చి దాయికి చూపించింది. రెంటిలోను ఎంతమాత్రమూ తేడాలేదు. ‘ఈ కడియం తప్పకుండా నీదే. కనుక రెండూ నీవే తీసుకో’ అన్నది దాయి.

అమ్మా, మీరు చాలా శ్రమపడ్డారు. కనుక మీరే ఈ రెండు కడియాలను తీసుకోండి. ఒకటి లేకుంటే మరొకటి ఎందుకూ పనికిరావు అవి’ అన్నది ఆ అమ్మాయి. ఇక దాయి వాళ్ల గూడెం వివరాలు, అమ్మాయి పేరు, మిగతా అవసరమయిన విశేషాలన్నీ అడిగి తెలుసుకున్నది. ఇక తిరిగి తమ గూడానికి వచ్చి చేరింది.

ఆమె షేఖ్‌ హమీద్‌ గుడారానికి తిరిగి వచ్చింది. అక్కడ వాళ్లంత దాయి కొరకే ఎదురుచూస్తున్నారు. దాయి రెండు కడియాలు బయటకు తీసి చూపింది. అమ్మాయి గురించి పొగుడుతూ ఎంతో చెప్పింది. అమ్మాయి నిజంగా ఉదారతగల మనిషి, అంత అందమయిన మనిషి అంటే మామూలు వంశం మనిషి కావడానికి వీల్లేదు అనుకున్నాడు షేఖ్‌ హమీద్‌. ఆ అమ్మాయి తప్పకుండా చాలా ప్రత్యేకమయిన వ్యక్తి అని అతనికి తోచింది. తన గూడెంలోని కొంతమంది పెద్ద మనుషులను, అలీని కూడా వెంటతీసుకుని గుర్రాలమీద బయలుదేరాడు. నల్లని గుడారాల ప్రాంతానికి వాళ్లంతా చేరుకున్నారు.

నల్ల గుడారాలలో వారికి గొప్ప స్వాగతం ఎదురయింది. మొదలు గుర్రాలకు మేత దొరికింది. లోపల చక్కని మర్యాదలు జరిగాయి. చాపలు పరిచి కూర్చోబెట్టారు. గొర్రెలు, ఒంటెల పిల్లల మాంసంతో మంచి విందు కూడా జరిగింది. మూడు రోజులపాటు విందులు కొనసాగాయి. ఇక నాల్గవనాడు ఆ అమ్మాయి తండ్రి అయిన అమీర్‌ అతిథులుగా వచ్చినవారి పనిగురించి అడిగాడు. షేఖ్‌ హమీద్‌ కడియాలగురించి వివరం చెప్పాడు. ‘ఈ కడియాల సొంతదారు చాలా ఉదారస్వభావంగల మనిషి. చాలా అందమయిన మనిషి కూడా అయి ఉంటుందని నాకు తోచింది. ఆమె గొప్ప వ్యక్తిత్వంగల మనిషి అనుకున్నాను. ఆమెతో నా వివాహం జరిగితే బాగుంటుందని నా ఆలోచన’ అన్నాడు హమీద్‌.

అమ్మాయి తండ్రి ఒక్కసారి బరువుగా నిట్టూర్చాడు. కోరిక కలగడం చాలా సులభంగానే జరుగుతుందన్నాడు. అయితే ఒక తండ్రికి తన కూతురు అన్నిటికన్నా విలువయినది అన్నాడు. ‘కానీ మీరు అతిథులుగా వచ్చారు. అతిథులను నిరాశపరచడం అరబ్బుల సాంప్రదాయంలో లేదు. ఇక మీవంటి గొప్పఇంటి అతిథుల విషయం మరింత ప్రత్యేకం. నా తలను మీముందు వంచుతున్నాను’ అన్నాడతను.

అమ్మాయిని పెళ్లికూతురుగా అలంకరించారు. డెబ్బయి ఒంటెలు, తివాచీలు, దుప్పట్లు, తలగడలు మరెన్నో సరంజామాను వాటిమీద ఎక్కించారు. ఒక సేవకురాలిని, ఒక బానిసనుకూడా అమ్మాయితోబాటు అప్పగించారు.

వాళ్లు బయలుదేరుతుండగా అమ్మాయి తండ్రి షేఖ్‌ హమీద్‌తో ‘దేవుని దయతో పెళ్లికూతురు వల్ల మీకు మంచి జరుగుగాక’ అన్నాడు.

షేఖ్‌ హమీద్‌ తమ గూడానికి తిరిగి వచ్చాడు. అక్కడి వారంతా డెబ్భయి ఒంటెలు, కొత్త పెళ్లికూతురిని చూచి సంతోషించారు. పెళ్లిపాటలు పాడసాగారు. ఇక షేఖ్‌ హమీద్‌ అలీని ముందుకు పిలిచాడు. ‘నీ పెళ్లికూతురు, పెళ్లి గుడారంలో ఉంది. కంట్లో కాటుక పెట్టుకుని నీకోసం ఎదురుచూస్తున్నది’ అన్నాడు. 

అదెలా కుదురుతుంది? అమ్మాయిని మీరు వెతికారు. ఆమె తండ్రితో మీరు మాట్లాడి పెళ్లి నిర్ణయించారు’ అన్నాడు అలీ.

షేఖ్‌ హమీద్‌ ఒక్కమాట కూడా పట్టించుకోలేదు. పెళ్లి దుస్తులను అలీకి అప్పగించాడు. ‘కడియం నీకు దొరికింది. పెళ్లికూతురు కూడా నీకే చెందవలసి ఉంది. ఇక ఆలస్యం చేయకు. ఆమె దగ్గరకు వెళ్లి చేరు’ అన్నాడు ఆయన.

అలీ పెళ్లి గుడారం వేపు బయలుదేరాడు. కొంతదూరం కూడా నడవక ముందే ఒక వ్యక్తి వచ్చి అతని కాళ్లమీద పడ్డాడు. కాళ్లను ముద్దుపెట్టుకుంటూ ‘నన్ను ఒక అతిథిగా గుర్తించి దయచూపండి షేఖ్‌ హమీద్‌!’ అన్నాడు.

పెళ్లి దుస్తుల కారణంగా అతను అలీని చూచి షేఖ్‌ హమీద్‌ అనుకున్నాడు.

ఇంతకూ నీవు ఎవరని అలీ వివరం అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చావని కూడా అడిగాడు.

మీరు పెళ్లి చేసుకుని తెచ్చుకున్న అమ్మాయి నాకు బాబాయి కూతురు’ అన్నాడు ఆ యువకుడు. ‘ఆమెతో నా పెళ్లి నిశ్చయమయింది. మీరేమో ఒక అతిథిగా మా బాబాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం ప్రస్తావించారు. ఆయన మిమ్మల్ని కాదనలేకపోయాడు’ యువకుడు వివరించాడు.

అలీ వెంటనే తన పినతండ్రి తనకు అందజేసిన పెళ్లి దుస్తులను తీసి యువకుడికి కట్టబెట్టాడు. ‘యువకుడా, ఆ అమ్మాయి మీద అన్నిరకాల నీవే హక్కు కలిగి ఉన్నాయి. పెళ్లికూతురు నీకే చెందుతుంది.’ అన్నాడు.

మరుసటి రోజు అలీ మామూలు దుస్తులలో తిరుగుతూ ఉండడం షేఖ్‌ హమీద్‌ గమనించాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. విషయం ఏమిటని ఆయన అలీని అడిగాడు. ‘మరి నీవు పెళ్లికొడుకు దుస్తులలో ఉండాలి కదా?’ అన్నాడు.

అలీ తనకు కలిసిన నవయువకుని గురించి వివరం చెప్పాడు. విషయం విన్న షేఖ్‌ హమీద్‌ ఎంతో సంతోషించాడు. బుద్ధిమంతుని లక్షణం అంటే ఇదే అని కూడా అన్నాడు.

పెళ్లికూతురితో వచ్చిన డెబ్భయి ఒంటెలతో మరొక డెబ్భయి ఒంటెలను కూడా కలిపి షేఖ్‌ హమీద్‌ పెళ్లిజంటకు మరెన్నో విలువయిన బహుమతులను కూడా ఇప్పించాడు. యువకుడు అతని భార్య చాలాసంతోషంగా వీడ్కోలు చెప్పి తమదారిన పోయారు.

(మరాకష్‌ దేశపు జానపద కథ)

Pelli Dustulu - A Story from Marakesh in Telugu

Pelli Dustulu - A Story from Marakesh in Telugu

 
పెళ్లి దుస్తులు - మరాకష్ జానపద కథ



B N Suresh - Flute - Darini Telusukonti - Suddha Saveri


B N Suresh  - Flute

 Darini Telusukonti - Suddha Saveri

Tuesday, August 12, 2025

Lokabhiramam - Goppavaru - Goppa Ooru (గొప్ప వారు - గొప్ప ఊరు)

Lokabhiramam 


లోకాభిరామం


Goppavaru - Goppa Ooru 
(గొప్ప వారు - గొప్ప ఊరు)


మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా?’ ప్రశ్న
లేదండీ! అందరూ పిల్లలే పుడుతున్నారు!’ జవాబు.


నీలంరాజువారు : లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్‌ చేశారు. నేను మురళీధర్‌ గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయట పడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్‌ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్‌ చేశారా? అని నాకు గాభరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్‌ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్‌’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్‌’ కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్‌ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!

(గురజాడ వారి ఇల్లు)

ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు (ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం గొప్పవాణ్ని! భళా!
గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది. మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడు గారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణ బాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!) నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను! తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు!!! వాసా వారు, అంట్యాకుల పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!
బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది! విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!
గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తు లోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది ‘మెటిల్డా’ అంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. అమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగి రాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిశెట్టి రామారావు కార్టూన్ల గురించిన పుస్తకాలు దొరికాయి.

(సంగీత కళాశాల - వెనుక భాగం)
(సంగీతం మర్రి చెట్టు)


సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్‌ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణ లోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతం వల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారు’ అని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్‌ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్‌ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్‌ పేరున పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్‌ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్‌ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయన్నారు. అందుకు టైమ్‌ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.


ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్‌ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!