Shravanam
Today it is Sarod of Ustad Ali Akbar Khan, Rag Behag!
http://vijayagopal.weebly.com/1/post/2011/02/ali-akbar-khan-sarod.html
Let us enjoy great music!
@@@@
I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Sunday, February 27, 2011
Saturday, February 26, 2011
Why Singing?
పాట ఎందుకు
బజారులో పాట, బడిలో పాట, గుడిలో పాట! కష్టానికి పాట, సుఖానికి పాట! పాట లేనిదే ప్రపంచం లేదు. కానీ ఎందుకీ పాట? నాగరికతకన్నా ముందు నుంచి మనిషికి పాట తెలుసు. అంటే పాటకు ప్రయోజనం కూడా ఉండాలి కదా! మానవజీవన పరిణామాన్ని పరిశోధించిన ఛార్ల్‌స్ డాల్విన్ కూడా ఈ ప్రశ్న గురించి ఆలోచించాడు. పాటలో గొప్ప గణితం ఉందని చాలాకాలం కిందనే తత్వపరిశోధకులు గుర్తించారు. కానీ జీవ ప్రపంచానికీ, జీవనానికి ఈ పాటకు సంబంధం ఉందా? నెమలికి సంతోషమయితే పురివిప్పి ఆడుతుంది. మనిషికి సంతోషమయితే హుషారుగా ఈల వేస్తాడు. అంటే మనిషితోపాటు పాట కూడా పరిణామం పొందింది. అందుకుగల అవసరాన్ని మాత్రం డార్విన్ గుర్తించలేక పోయాడు. మామూలు బతుకులో పాటకు చోటు లేదు అన్నాడాయన.
ఈ మధ్యన పాట ప్రభావంగా మెదడులో జరిగే మార్పులను గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. నాడీ కణాలలో పాటవల్ల జరిగే చర్యలను గమనిస్తున్నారు. రసాయనికంగా శరీరంలో జరిగే మార్పులను గమనిస్తున్నారు. మెదడు ఎంతో గజిబిజి యంత్రం. ఎవరికీ అంతుచిక్కదు. ప్రమాదవశాత్తు అందులోంచి సంగీతమనే ఈ అందమయిన అంశం బయటపడింది అన్నారు కొందరు. మొత్తానికి సంగీతం, పాట మన శరీరంలో, జీవనంలో గట్టిగా పాతుకుపోయినయి. పాటలేని మానవ సమాజం ఇప్పటికి ఒక్కటికూడా కనిపించలేదు అంటారు ఆంత్రపాలజిస్టులు. చెప్పకుండానే పిల్లలు పాడతారు. నాగరికతన్నా ముందు నుంచే మనిషి బతుకులో పాట భాగంగా ఉంది. పురాతత్వ పరిశోధకులు జర్మనీలో 35వేల సంవత్సరాల నాటి వేణువునొకదాన్ని కనుగొన్నారు. సంగీతం అంతటా ఉంది. అలనాటి నుంచి ఉంది. అలవోకగా మనిషికి అబ్బింది.
మిగతా జంతు జాతుల్లో మగవి, శరీర విన్యాసంతోబాటు రకరకాల ధ్వనులు చేసి జంటకట్టవలసిన ఆడను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. మనుషులు కూడా ప్రాచీన కాలంలో ప్రేమధ్వనులు, లయలను వాడుకుంటున్నారంటారు పరిశోధకులు. పాట ప్రేమ కొరకే పుట్టిందంటాడు డార్విన్.
మనిషికి పాట సహజంగా వచ్చింది నిజమే కానీ డార్విన్ అభిప్రాయం మాత్రం సరికాదు అంటారు న్యూమెక్సికో పరిశోధకులు డీన్ షాక్ వాషింగ్టన్ సైంటిస్టు ఎలెన్ దిస్సనాయకే లాంటివారు. పాట కేవలం ఆడ, మగ మధ్య ఆకర్షణ కొరకే పుట్టింది కాదు. ఆ తర్వాత కూడా ఎన్నో అంశాలలో దాని పాత్ర ఉందని వీరి అభిప్రాయం. తల్లులు పిల్లలను ఆడించి అలరించేందుకు పాటలాంటి ధ్వనులను చేస్తారు. దానికి ‘మదరీస్’ అని పేరు పెట్టారు వీరు. ఈ లక్షణం మనుషుల్లో తప్ప మరే జంతువులోనూ లేదు. ఈ తల్లిభాష ప్రపంచమంతటా ఒకే రకంగా ఉంటుంది. ఎక్కువ స్థాయిలో తక్కువ వేగంతో సాగే ఈ పాట పిల్లలకు ప్రత్యేకం. ఈ పాటతో తల్లీ బిడ్డల మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది. అందుకే పెద్దయిన తర్వాత కూడా మనిషి పాట విని ఆనందించగలుగుతాడంటారు ఈ పరిశోధకులు!
పరిణామంలో పాటను గురించి మూడవ అభిప్రాయం కూడా ఉంది. ఇది కేవలం ఇరువురు వ్యక్తుల మధ్యకాక, రెండు వర్గాల మధ్య బంధం కొరకు పుట్టింది అంటారు ఈ వర్గం వారు. మనుషులు గుంపులుగా బతకడం నేర్చుకున్న మొదట్లో ఆ గుంపులోని వ్యక్తుల మధ్య సంబంధాలను గట్టి పర్చడానికి పాట సాయపడింది అంటారు ఆక్స్‌ఫర్డ్ మనస్తత్వశాస్తవ్రేత్త రాబిన్ డన్‌బార్. ఈయన మనుషులను గాక కోతి జాతులను గురించి కూడా ఎంతో పరిశోధన చేశారు. కోతులలో ఒకదానికి మరొక దానికి మధ్య బంధం ఏర్పడడానికి, వెంట్రుకలు సవరించడం, పేలు తీయడం లాంటి పనులు మాధ్యమంగా ఉంటాయి. ఈ భౌతిక సంబంధంతో వాటి మెదళ్ళలో ఎండాల్ఫిన్స్ అనే రసాయనలు పుడతాయి. అవి బాధను తగ్గిస్తాయి. ఆనందం, అన్నభావాన్ని కలిగిస్తాయి. మనుషులు కూడా తొలిరోజుల్లో ఇలాంటి పనులు చేసి ఉంటారు. రాను రాను మనుషుల గుంపులు పెద్దవిగా మారసాగాయి. అంతమందిలో ఈ శరీరపరమయిన సంబంధం కుదరలేదు. శారీరకంగా సాయపడడానికి బదులు పాట పుట్టిందంటారు డన్‌బార్. అందరూ కలిసి హాయిగా ఆడడం, తోడుగా పాడడం నేర్చుకున్నారు. పాట వినడంతో కూడా ఎండాల్ఫిన్స్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్స్ పుడతాయని కొన్ని పరిశీలనల్లో గమనించారు. వినడం కన్నా పాడడంతో ఈ రసాయనాలు మరింత బాగా పనిచేస్తాయని గమనించారు.
ఈ పరిశోధకులు రకరకాల చోట్ల బృందాలుగా ఆటపాటతో గడుపుతున్న వారిమీద పరిశీలనలు చేశారు. ఆట, పాట ముగిసిన తర్వాత ఆ వ్యక్తుల శరీరాలలో ఎండాల్ఫిన్ స్థాయిని పరీక్షించారు. అలాగే, అవసరం లేకున్నా ఏదోరకమయిన సంగీతం వింటూ ఉండే, అంగర్ణాలో వ్యక్తుల మీద కూడా పరిశోధనలు చేశారు. పాటకు అనుగుణంగా శరీరం కదిలించే డాన్సర్లు, మొదలయిన వారిలో రసాయనం ఎక్కువయింది. వారికి బాధను భరించే శక్తి కూడా ఎక్కువగా ఉంది. ఊరికే వింటున్న వారిలో ఈ రకమయిన మార్పులు కనిపించలేదు.
సంఘీభావం కోసం సంగీతం పుట్టిందన్న సిద్ధాంతాన్ని అనిరుధ్ పటేల్ లాంటి పరిశోధకులు సరికాదంటున్నారు. సంగీతం, మానవ సంబంధాలకు దారితీసేదయితే, ఒంటరితనాన్ని ఇష్టపడే వారికి పాట చికాకు కలిగించాలి మరి! కానీ అలా జరగడం లేదు! ‘పాట ఒక ప్రయోజనం కొరకు పుట్టలేదు. అది దొడ్డిదారిన మనిషి మెదడులోకి చేరింది అంటారు ఈ వర్గం పరిశోధకులు. మనుషుల మధ్యన జరిగే సమాచార వినిమయం కొంత ముందుకు జరిగి పాటగా తేలింది అన్నారు వీరు.
మెదడులో శృతి, లయ మొదలయిన అంశాలను గ్రహించే భాగాలమీద పరిశీలనలు జరిగాయి. ఈ పనుల కొరకు అక్కడ ప్రత్యేకమయిన భాగాలు లేవని తెలిసింది. మిగతా పనులను చూచే భాగాలేవో ఈ పనులను కూడా చూస్తున్నాయి.
పాటను గుర్తించగల జంతువుల మీద పరిశోధనలు జరిగాయి. కానీ చాలా జంతువులకు పాట, మాట తెలియవు. కొన్ని పక్షులు, క్షీరదాలకు ‘పాట’ తెలుస్తుంది. కోతులలో, చివరకు చింపాజీలకు కూడా పాట తెలియదు. లయ అంతకన్నా రాదు. వెయ్యిసార్లు ప్రయత్నించినా కోతులకు లయ పట్టబడలేదని ఈ మధ్యన గమనించారు. స్ట్రోక్ వచ్చిన కొంతమందికి మాట పడిపోతుంది. వారికి తిరిగి మాట నేర్పించడానికి పాటలాగ సాగదీసి మాట్లాడే పద్ధతిని వాడుతుంటారు. రాను రాను ‘సాగడం’ తగ్గితే మామూలుగా మాట వస్తుంది
Did you ever think about the matter?

Friday, February 25, 2011
Shravanam - Rajeswari Padmanabhan - Veena
Friends,
Let us enjoy a Veena recording of the above mentioned artist.
http://vijayagopal.weebly.com/1/post/2011/02/smt-rajeswari-padmanabhan-veena.html
Does this feel new?
That is what I want!!!

Thursday, February 24, 2011
Mullapudi Venkata Ramana
ఎన్నో అనుకుంటుంటే
అన్నీ వదిలేసి మీరు అట్లా వెళితే
ఉన్నది కన్నీరొకటే
విన్నారా వీడుకోలు వెంకటరమణా
???????
-------
Monday, February 21, 2011
Be in Limits!
హద్దులు అవసరమే!.
An article that appeared in Yuva suppliment of Andhra Bhoomi on February 2nd, 2011
‘హాయ్ గైస్! వాట్సప్!’ అంటూ వర్క్ ఏరియాలోకి వచ్చి వీపు చరిచేది ఏ టీం లీడరో అయితే బాగానే ఉంటుంది. ఏకంగా బాసే వచ్చి వీపు చరిచి మాట్లాడతాడనుకోండి. కొంత బాగుంటుంది, కొంత చికాకుగానూ ఉంటుంది. కొన్ని ఆఫీసుల్లో అందరూ బిగదీసుకుని ఎందుకొచ్చిన గొడవ అన్నట్టు పని చేసుకుని పోతుంటారు. అదీ చికాకే. కొత్తతరం ఆఫీసుల్లో అలా ఉండకూడదని అందరూ అనుకుంటున్నారు.
అందరూ అందరితో స్నేహంగా ఉండాలనీ, పని సరదాగా గడవాలనీ అనుకోవటంలో తప్పు లేదు. అందరూ ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి పని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతుంటాయి. మంచి చర్చలు, ఫార్మాలిటీస్ అవసరం లేని మీటింగులు, ఎవరితోనైనా ఎవరైనా సంప్రదింపులు చేయగల వాతావరణం మొదలైన పద్ధతులను ఈ మధ్య చాలా ఆఫీసుల్లో ప్రవేశ పెడుతున్నారు. అయితే, ఈ ప్రయత్నాల ఫలితాలు అందరి మీదా ఆధారపడి ఉంటాయి. ఎంత చేసినా పరిశ్రమ, ఆఫీసులాంటి ఆర్గనైజేషన్స్‌లో వ్యక్తుల మధ్య సంబంధాలకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. మరీ స్నేహపూర్వకమైన వాతావరణంలో -కొందరు మంచి పద్ధతులను తప్పుగా అర్థం చేసుకుని హద్దులు మీరే అవకాశం ఉంటుంది.
‘వాట్సప్!’ అన్న బాసుకు, ‘ఏముంది బాస్! పని లేదు.. హాయిగా కాలక్షేపం చేస్తున్నాము’ అన్న ఇంప్రెషన్ కలిగించే ప్రమాదం ఉంటుంది. అది చూద్దామనే బాసులు ఎంతో ఫ్రెండ్లీగా అందరినీ పలకరించే ప్రయత్నం చేస్తారు. అందరూ, అవసరమయిన దానికంటే ఎక్కువ దోస్తీ కనబర్చడం ఒక చిక్కు. అలాగ ఉండేవారు బాసులయినా, మన దగ్గర పని చేసేవారయినా చిక్కే. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, అవసరం ఉండనీ లేకపోనీ మధ్యన తలదూర్చే వారితో తలనొప్పి తప్ప మరో ప్రయోజనం ఉండదు. స్వంత విషయాలు గురించి ఆరాలు తీయడం, అనుమతి అడగకుండానే, మరొకరి పని సమయంలో దూసుకుని రావడం, అనవసరంగా సలహాలు పడేయటం, పనిలో అనవసరంగా కలగజేసుకోవడం ఎవరు చేసినా పని పాడవుతుంది తప్ప లాభాలు ఏరకంగానూ ఉండవు.
ఎదుటివారిలో మంచితనాన్ని అర్థం చేసుకోలేని వారు కొందరుంటారు. అన్ని సంగతులూ తమకే తెలుసునన్నట్టు పోజు పెడుతుంటారు. ఆఫీసులో అందరూ కలిసి మెలసి ఉండాలి, అంటే, అవసరం లేని చోట్ల కూడా జోక్యం కలిగించుకోవాలని మాత్రం అర్థం కాదుగదా! కలిసి మెలిసి పని చేయాలన్న ఆలోచన గొప్పది. కానీ, గౌరవం, మర్యాదలను పక్కన పెట్టమని మాత్రం అర్థం ఎంతమాత్రమూ కాదు. పని చేసే వారందరూ హాయిగా, ఆనందంగా రిలాక్స్‌డ్‌గా ఉండి పని చేయాలి. ఎవరికి వారు తమ పని చేతయినంత బాగా చేయాలి. అందుకు, ముందుగా సంస్థలోని నియమ నిబంధనల పట్ల, సిబ్బంది పట్ల, గౌరవంగా ఉండగలగటం మొదటి మెట్టు. ముడుచుకుని ఉండవద్దు. అలాగని దూసుకునీ వెళ్లిపోవద్దు. తోటివారి ప్రైవసీని గౌరవించటం నేర్చుకోవాలి. అందరితోనూ గౌరవంతో కూడిన స్నేహ సంబంధాలు ఏర్పర్చుకోవాలి. ఆఫీసులో ఎవరిస్థాయి వారికి ఉంటుంది. అందుకు తగిన బరువు బాధ్యతలు ఉంటాయి. ప్రివిలైజెస్ కూడా ఉంటాయి. వీటికి ఎక్కడా భంగం రాకుండా చూడటం అందరి బాధ్యత. అధికారం ఉన్నవారు, అందరి వెనుకనుంచీ పనిలోకి తొంగి చూస్తుంటారు. అది తమ హక్కు అనుకుంటారు. లేదా కనీసం బాధ్యత అనుకుంటారు. సూపర్‌విజన్ లేదా పర్యవేక్షణ అనేది ఒక కళ. ఎవరినీ చికాకుకు గురి చేయకుండా, మరీ చనువు ఉండకుండా కావలసిన సమాచారాన్ని రాబట్టడం పర్యవేక్షకులకు ఒక
పరీక్ష! టీ టైంలో, వాటర్ కూలర్ దగ్గరా సూపర్‌విజన్ చేస్తుంటే, సరైన ఫీడ్‌బ్యాక్ రాదు. సరికదా, అందరూ చికాకు పడతారు.
లంచ్ సమయంలో ఆఫీసు వ్యవహారాలు చర్చించటం ఎంత ఇబ్బందిగా ఉండవచ్చునో ఊహించండి. వ్యక్తి సంబంధాలలో ఎక్కడ చూపవలసిన స్థాయి అక్కడ ఉండాలి. ఎదుటివారి మానసిక పరిస్థితిని మనం చెడగొట్టే హక్కు ఏనాటికీ ఉండదు. ఎదుటివారి గౌరవ మర్యాదలకు భంగం రాకుండా ప్రవర్తించగలగడం అందరికీ చేతగాదు. ‘టాక్సిన్ వేస్ట్ డంప్’ అనే పద్ధతి గురించి చాలా చర్చ జరిగింది. మనుషులను ముట్టుకుంటే చాలు రెండు అర్థాలు వచ్చే మాటలు, నాకు నీకన్నా బాగా తెలుసన్న భావం వచ్చే ప్రవర్తన, నాదీ అధికారం అన్న భావనతో టీములు ‘టాక్సిక్’గా మారుతుంటాయి. టీములో స్నేహవాతావరణం దెబ్బతింటుంది. తోటి వారందరితో మనకు ఒకే రకమైన స్నేహం ఉండదు. మరీ స్నేహం ఉన్నా, ఇష్టం లేకపోయినా, ఆ సంగతులు అందరిముందూ బయటపెట్టనవసరం లేదు.
ఇంట్లోనయినా, పనిచోట్లలోనయినా, స్నేహపూర్వక వాతావరణం ఉండాలంటే హద్దులను గౌరవించటం అవసరం!

Friday, February 18, 2011
Stories from Dr Goel
I met Dr Goel only recently.
He has a Ph D and the subject is Hindi film songs!
Dr Goel is an interesting man after all!
He is a good conversationalist too!
So, we struck a chord very easily!
During the course of talking he narrated some stories.
I liked them!
The one I am going to tell first is the shortest of the short stories.
Many may be knowing it too!
I heard it long back but, forgot!
Here it goes!
Bhoot!
Two people were walking together on a dark night.
One of them asked the other whether he believes in Ghosts!
The person said "No!"
And he disppeared.
Hahaha!! Good one that is!
The next story is also on ghosts!
Haunted House
A man left his house locked for long and was living elsewhere.
After sometime he had to return to his own place.
He came with family and cleaned the place.
They were cooking and it was getting dark.
Then a Ghost came and picked up a quarrel with the man.
It said, "I made this place mine. How can you throw me out?"
It threatened the family that it would eat all of them if they did not vacate the place immediately.
The man asked for a weeks time so that he could look for a place.
After a week he asked for one more week saying he could not get a decent place yet.
Later he complained that his wife was not well and he would move later.
The ghost was getting restless.
Then the man sked him "By the way, what do you do during the daytime?"
The ghost said, "I work with the God of Death!"
Then the man said, "Would you do me a favour? Find out from him when are we going to die."
Ghost said "Yes" and came the next night.
It informed the man that they all have different dates of death.
The man asked "Why dont you help me? Ask him to make it the same date for all of us!"
Ghost went back and came the next night.
It brought the information that the dates are predestined and cannot be changed.
Then the man with all the confidence told the ghost to get lost.
He told that the ghost cannot wait and kill them on different days!
I am sure the ghost really went away from there!
Some stories do not make sense!
But, they are good to listen!
^^^^^^^^^

Subscribe to:
Posts (Atom)