Friday, March 30, 2012

Faiz Ahmed Faiz

The following is a poem of Faiz.
I have tried to give the essence in Telugu.




నిజమే, మీరన్న మాటలు మేము ఒప్పలేదు నిజమే
అనుమానమే లేదు, ప్రభువుల ప్రతాపము కూడ మైత్రి కదా

అవును మీరేమి చేసినను అది పద్ధతిగనే
మరియు మేము మంచి దారి నడుచుట ఎరుగము గదా

వచ్చినను ఎట్లు, కలకాలము మా మీద దయయే
మరచినది ఎట్లు, మరి మీకు మాకు పరిచయమే లేదు గదా

బాధలకు కొంత శమనము కోరితిని తప్పే
నాకంటె బాధ పడువారు భువిని మరి ఎందరో గదా

గాయముల తలపు చేయుట నిజమగు నేరమే
వారి విషపు బాణాల ఒడుపును మెచ్చలేకుండుటదేల గదా

వైద్యులకు తమ వృత్తి మనసున నచ్చలేదంతే
కాక నా బాధలంత మందు లేనివి కావు గదా

పెదవులవి బతుకు చేదును రుచి చూచెనంతే
లేకున్న నాకు చేదుతనము సహజము కాదు గదా


Great words!

No comments: