ముసలి మొరెట్టి ముందర నరకవలసిన కట్టెలు చాలనే ఉన్నయి. అతని వేళ్లుమాత్రం అప్పటికే కొంకర్లు పోతున్నయి. కాలి వేళ్ల గురించి చెప్పనవసరమేలేదు. అవి ఉన్నయో లేవో తెలియడము లేదు. ఇంకో పక్క ముక్కుమరగకాచిన నీటిలో ముంచినట్టు మండుతున్నది. మెడ చుట్టు మేక వెంట్రుకల మఫ్లర్ ఉంది. నెత్తికి ఒక గుడ్డ చుట్టి ఉంది. దాని మీదినించి ఒక వెడల్పు అంచు ఉన్న షాంబర్గో టోపీ పెట్టుకున్నడు.
(Mathias Nespolo)
గంటసేపటినుంచి ఆయన ఆగకుండ కట్టెలు కొడుతున్నడు. అలిసి పోయినడు. వయసు పైనబడిందాయె. ఎంతకూ తెగని ఒక ముక్కను ఆయన తిడుతున్నడు. ఇంక ఓపిక నశించింది. మొరెట్టీకి కాలయాపన చేసే ఆలోచన లేదు. బాగా ఊపిరి పీల్చి గట్టి దెబ్బ ఏసినడు. సూటిగ. పడవలసిన చోట. ఎదలోనుంచి ఒక్క మూలుగు వచ్చింది. కట్టె మూడు తునుకలయ్యింది. కాని, గొడ్డలి ఆయన చేతినించి జారి పోయింది. అది మంచులో నాటుకున్నది. ఆయన కాలి బూటు పక్కననే.
మొరెట్టికి సంగతి తెలిసేందుకు కొంచెం సేపు పట్టింది. చలిగాలిలో ఆయన ఊపిరి కనబడుతున్నది. గొడ్డలిని తీసుకునేందుకు వంగినడు. అది బాగా బలంగ నాటుకుని ఉంది. కామ మంచుకన్న చల్లగ ఉంది. ఇప్పటి వరకు అది తన చేతిలోనే ఉంది. మరి అంత ఎట్ల చల్లగయ్యింది.
దాన్ని అట్లనే ఇడిచి పోదమా అనుకున్నడు. ఇంకొన్ని కట్టెపుల్లల కొరకు, మంచులో గడ్డగట్టుకపోతే అర్థం లేదు. వాతావరణం బాగయిన తరువాత పని మళ్ల మొదలు పెట్టవచ్చు. ప్రస్తుతానికి రాత్రి మంటకు సరిపోను కట్టెలున్నయి. రేపు ఆదివారం. కొడుకు సెర్జియో ఒస్తడు. వాడు పట్నములో గొంగళ్ల సంగెములో పనిజేస్తడు. పిల్లగాడే. కాని కనీసము సెక్రటేరీ అన్న అయ్యి ఉంటడని ముసలాయన నమ్మకము. మొరెట్టీకి కొడుకు గురించి గర్వంగ ఉంటుంది. వాడు వచ్చినంక కట్టెలుగొట్టి కొట్టము నింపమని సాయం అడుగవచ్చు. ఇంక ఎండకాలము దనుక ఏ ఆలోచన ఉండదు. వాడు ఎట్లనన్న రెండు వారాలు ఉంటననే అన్నడు మరి. వానికి గూడ పని నించి తెరిపి గావాలే. అప్పటికల్ల చెట్లు పడగొట్టి పెడితే రెండు మూడు వారాలల్ల పని అయితది. పొయ్యిల పట్టెటంత తునుకలు జేస్తే చాలు. Read on
No comments:
Post a Comment