Showing posts with label excellence. Show all posts
Showing posts with label excellence. Show all posts

Thursday, June 25, 2026

ఖలిల్ జిబ్రాన్ రచన ఇసుక - నురుగ

 


 ఇసుక - నురుగ 

Long did I lie in the dust of Egypt, silent and unaware of the seasons.

Then the sun gave birth to me, and I rose and walked upon the banks of the Nile,

Singing with the days and dreaming with the nights.

And now the sun threads upon me with a thousand feet that I may lie again in the dust of Egypt.

But behold a marvel and a riddle!

The very sun that gathered me cannot scatter me.

Still erect am I, and sure of foot do I walk upon the banks of the Nile.

నేనెంతో కాలం ఈజిప్ట్ దుమ్ములో పడి ఉన్నాను, నిళ్ళబ్దంగా, కాలం గతి తెలియకుండా.
అప్పుడు సూర్యుడు నాకు బతుకునిచ్చాడు, ఇక నేను లేచి నైలు గట్లమీద నడిచాను,పగలు పాడుతూ, రాత్రులు కలలుగంటూ.
నేను మళ్లీ ఈజిప్టు దుమ్ములో పడి ఉండాలని, సూర్యుడు నన్ను చుట్టుకుంటాడు.
కానీ  వింతనూ చిక్కుప్రశ్ననూ చూడండి
నన్ను ఒకటి చేసిన సూర్యుడు నన్ను చెదరగొట్టలేడు.
నేనింకా నిటారుగా నిలుచున్నాను, నైలు గట్లమీద నమ్మకంగా నడయాడుతున్నాను.


 

 

Remembrance is a form of meeting.

Forgetfulness is a form of freedom.

గుర్తుండడమంటే కలయికలకు మరో రూపం.
గుర్తుండకపోవడం స్వతంత్రానికి మరో రూపం.



We measure time according to the movement of countless suns; and they measure time by little machines in their little pockets.

Now tell me, how could we ever meet at the same place and the same time?

మనం కాలాన్ని అంతులేని సూర్యుల కదలికలను బట్టి లెక్కవేస్తాం. వాళ్లుమాత్రం కాలాన్ని వాళ్ల చిన్ని జేబుల్లో ఉన్న ఒక చిన్ని యంత్రంతో కొలుస్తారు.

ఇప్పుడు చెప్పండిక మనం ఒకేచోట, ఒకే సమయాన కలవడం ఎలా వీలవుతుంది


Space is not space between the earth and the sun to one who looks down from the windows of the Milky Way.

పాలపుంత కిటికీలోంచి కిందకు చూచే వాళ్లకు, అంతరిక్షం అంటే భూమికి సూర్యునికీ మధ్యనుండే శూన్యం కానేకాదు.

Humanity is a river of light running from the ex-eternity to eternity.

మానవత అంటే మాజీ అనంతంనుంచి అనంతానికి ప్రవహించే ఒక నది.


Do not the spirits who dwell in the ether envy man his pain?

అనంతవాయువుల్లో నివసించే భూతాలు మనిషి బాధను చూచి భాధ పడతాయిగదూ

On my way to the Holy City I met another pilgrim and I asked him, "Is this indeed the way to the Holy City?"

And he said, "Follow me, and you will reach the Holy City in a day and a night."

And I followed him. And we walked many days and many nights, yet we did not reach the Holy City.

And what was to my surprise he became angry with me because he had misled me.

 

పవిత్ర నగరానికి దారిలో మరో ప్రయాణికుణ్ని కలిసి నేనడిగానూ, పవిత్ర నగరానికి దారి ఇదేనా అని నావెంటే నడువు, ఒక పగలు ఒక రాత్రిలో, పవిత్రనగరం చేరుకుంటావు అన్నాడతను.

ఇక నేను అతనివెంటే నడిచాను. మేం ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్లు నడిచాము, కానీ పవిత్రనగరం చేరనే లేదు.

ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే, నన్ను దారి తప్పించినందుకు అతనికి నా మీద కోపం వచ్చింది.




 

 

3

Make me, oh God, the prey of the lion, ere You make the rabbit my prey.
ఓ దేవుడా నన్ను సింహానికి ఎరగా చెయ్యి. ఇక కుందేటిని నాకు ఎరగా చెయ్యి.

One may not reach the dawn save by the path of the night.

రాత్రి బాటన నడిచి తప్ప ఉషస్సును చేరడానికి వీలులేదు.


My house says to me, "Do not leave me, for here dwells your past."

And the road says to me, "Come and follow me, for I am your future."

And I say to both my house and the road, "I have no past, nor have I future. If I stay here, there is a going in my staying; and if I go there is a staying in my going. Only love and death will change all things."

నన్ను వదలకు, నీ గతమంతా ఇక్కడే ఉంది, అంటుంది నా ఇల్లు నాతో.నా వెంటరా, నీ భవిత నేనే, అంటుంది రహదారి నాతో.

ఇక నేను మాత్రం ఇంటికీ రహదారికీ ఒకే మాట చెపుతాను. నాకు గతం లేదు, భవిత అంతకూ లేదు. నేనిక్కడే ఉండిపోతే నా నిలకడలో ఒక పోవడముంది. ఇక నేను బయలుదేరితే నా నడకలో ఒక నిలకడ ఉంది. కేవలం ప్రేమ మరణాలు మాత్రమే అన్నింటినీ మార్చగలుగుతాయీ అని.

***********

 

How can I lose faith in the justice of life, when the dreams of those who sleep upon feathers are not more beautiful than the dreams of those who sleep upon the earth? Strange, the desire for certain pleasures is a part of my pain.
హంసతూలికల మీద నిదురించిన వారి కలలు నేల మీద పడుకున్నవారి కలలకన్నా అందమయినవి కానప్పుడు, నేను జీవన న్యాయం మీద నమ్మకాన్ని ఎలా వదులుకుంటాను. విచిత్రం, అదేదో ఆనందం కొరకు నా తపన, నా దుఖంలో భాగమయింది.

 

 

Seven times have I despised my soul:

నేను నా ఆత్మను ఏడుమార్లు మోసగించాను.
The first time when I saw her being meek that she might attain height.

మొదటిసారి, అది ఉన్నతమవుతుందనుకుని మెత్తపడుతుండగా.
The second time when I saw her limping before the crippled.

రెండవసారి, అది వికలాంగుల ముందు కుంటుతుండగా.
The third time when she was given to choose between the hard and the easy, and she chose the easy.

మూడవసారి, అది కష్ట సుఖాల ఎంపికలో సులభం వేపు మొగ్గినందుకు.
The fourth time when she committed a wrong, and comforted herself that others also commit wrong.

నాలుగవసారి, అది తప్పుచేసి, అందరూ తప్పుచేసే వారేనని, సరిపుచ్చుకున్నందుకు.
The fifth time when she forbore for weakness, and attributed her patience to strength.

అయిదవసారి, అది బలహీనతకు తలవంచి, తన ఓపిక బలం వల్ల వచ్చిందన్నందుకు.
The sixth time when she despised the ugliness of a face, and knew not that it was one of her own masks.

ఆరవసారి, అది తన ముఖమేనని తెలియక ఒక వికార రూపాన్ని అసహ్యించుకున్నందుకు.
And the seventh time when she sang a song of praise, and deemed it a virtue.

ఇక ఏడవసారి, అది శ్లాఘనగీతం పాడి అదొక సద్గుణమని అనుకున్నందుకు.


I AM IGNORANT of absolute truth. But I am humble before my ignorance and therein lies my honor and my reward.
నాకు శాశ్వత సత్యం తెలియదు. కానీ నేను నా అజ్ఞానం ముందు తల వంచుతాను. అందులోనే నా గౌరవమూ లా బహుమానమూ ఉన్నాయి.
There is a space between man's imagination and man's attainment that may only be traversed by his longing.

మనిషి అనుకున్నదానికీ అందుకున్నదానికీ మధ్య ఖాళీ ఉంది. ఆ ఖాళీని దాటడం కేవలం కోరికతోనే వీలవుతుంది.

Paradise is there, behind that door, in the next room; but I have lost the key.

స్వర్గం, పక్కగదిలో, ఆ తలుపు ఆవల ఉంది. కానీ నేను తాళంచెవులు పడేసుకున్నాను.
Perhaps I have only mislaid it.

బహుశ పొరపాటున ఎక్కడో పెట్టినట్టున్నాను.

You are blind and I am deaf and dumb, so let us touch hands and understand.

నీవు గుడ్డి. మరి నేనేమో చెవిటి, మూగ. అందుకే మనం చేతులు కలిపి ఒకరినొకరు అర్థం చేసుకుందాం.

The significance of man is not in what he attains, but rather in what he longs to attain.

మనిషి ఏం సాధించాడన్నది ముఖ్యంకాదు. ఏం సాధించాలనుకున్నాడన్నది ముఖ్యం.

Some of us are like ink and some like paper.

మనలో కొందరం సిరాలాంటి వాళ్లం. కొందరం కాగితంలాంటి వాళ్లం.

 

And if it were not for the blackness of some of us, some of us would be dumb;

మనలో కొందరి ఆ నలుపే లేకుంటే కొందరు మూగవాళ్లుగా మిగిలేవారు.
And if it were not for the whiteness of some of us, some of us would be blind.

మనలో కొందరి తెల్లదనమే లేకుంటే కొందరు గుడ్డివాళ్లుగా మిగిలేవారు.




Friday, April 3, 2026

Thursday, March 12, 2026

అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....


అడివి బాపిరాజు నవల నారాయణరావు నుంచి....


ఆ సాయంకాలం సభలో పరమేశ్వరుడు మాట్లాడినాడు. నారాయణరావు కంఠముకన్న బరమేశ్వరుని కంఠము ఉపన్యాసములిచ్చుటలో నెక్కువ గంభీరత దాల్చును. అతడు వేలకొలది జనమును దన వాగ్ధారలో ముంచి మెత్తుకొని పోగలడు. నారాయణరావు గొంతుక యుపన్యాసములో మధురముగా నుండును. ధారాశుద్ధిగలది. ప్రతివిషయమును గూర్చిలెక్కలు మున్సగు వివరములు చెప్పుచు శ్రోతల హృదయమును చూరగొనును. బరమేశ్వరుడు లేచి “మానవుని హృదయం విశాలం అవ్వాలంటే దేశాలు తిరగడం ఒక మార్గం. (ప్రతివిద్యార్థినీ, ప్రతిరైతుకుర్ర వాణ్ణి చివరకు ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగి రమ్మనాలి, ఆంధ్రదేశం మాత్రం తక్కువ ఉందా! బుషి కుల్యానదికడనుండి కంచివరకు, సముద్రం, ఇటు, అటు ముచికుందనది, భీమనది మొదలైనవి ఎల్లలు. మన దేశం ఏలినవాళ్ళు ఆంధ్రులు. మొదట్ల తనకు చరిత్రలో తెలిసివున్నంత మట్టుకు ఆంధ్రులు ఆఖరి కాణ్వాయణచక్రవర్తిని చంపి తాము చక్రవర్తులై రాజ్యం చేశారు. ఆరువందల సంవత్సరాలు. తర్వాత ఇక్ష్యాకులు, సాలంకాయనులు, బృహత్పాలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోను, తర్వాత గాంగులు, చాళుక్యులు,  కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు. ఆంధ్రమహారాజ్యము యొక్క చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటశాల, నాగార్జునమెట్ట ముఖ్యమైనవి. ఆంధ్రశిల్ప మత్యంత ప్రాభవము పొందినది. అంత ఉత్తమ శిల్పము నాటికి నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పాలరాతిలో చెక్కారు.

ఆంధ్రశిల్పం యొక్క గొప్పంతా చెన్నపురి, లండను, బెర్లిను వస్తు ప్రదర్శనశాలలో ఉన్నది. పల్లవులున్నూ తమయొక్క చివ్నోలు కాంచీపురంలో, మహాబలిపురంలో అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణ ఒడ్డునే కొండమీద ఉన్నది.”

అతని ఉపన్యాసం వరదలనాటి గోదావరి నదివలె ప్రవహించుచున్నది.

మహాబలిపుర శిల్పంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతులగుంపు, యేనుగుల శిల్పవిన్యాసం మాధుర్యం వెదజల్లుచుండును. అచ్చట రాతిరథములు, ఒకేరాతిలో దొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, (ద్రౌపదిరథము నున్నవి. ఆ పట్టణమంతయు సముద్రమున మునిగిపోవుచున్నది.చాళుక్యుల శిల్పము దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, (ధ్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో ఇంకా అనేక దేవాలయములలో విగ్రహములలో చాళుక్యుల శిల్పచమతృతి కనబడుతుంది. చాళుక్యదేవాలయములు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవికావు.

కాకతీయ శిల్పకళాప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీనటేశ్వరుని నాట్యామహదానందము చూపించుకొన్నారు. వారి శిల్పములో, విజయనగర సామ్రాజ్యము, హంపీ, తాడిపత్రి, పెనుగొండ, గుత్తి, మాచెర్ల, లేపాక్షులలో జూడగలము. హంపీ దృశ్యములు జూచిన యే మానవుని గుండెలు   తరుగుకొని పోవు?

మనహృదయములు విశాలత నొంది సర్వమానవ (పేమవిలాసితాలు కావలెనంటే కళాపూజకన్న ఇంకోటిలేదు. ఇంతమందిలో భద్రాచలము ఎంత మంది వెళ్ళారు? భద్రాచలము వెళ్ళుటే ఒకచక్కనియాత్ర. గోదావరిలో పడవలలో ఒక వారమురో జులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ పాపికొండల్లో

పడవ మీద ప్రయాణంచేస్తూ తిప్పలమీద పండుకుంటూ, వెన్నెల్లో తిప్పలమీద పరవశిస్తూ కొండలు, అడవులు, గోదావరీ నీలపు లోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి.

అజంతా లోయలో జలజల ప్రవహించే భోగీరానది ఒడ్డున నిలుచుండి, ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ గోడల్లా పైకెగసి ఉన్న ఆ కొండలమధ్య కనబడే ఆకాశంచూస్తూ అర్థచంద్రాకృతిగా ఉన్న ఆ  విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణకాంతులు ఆకాశాన (ప్రసరిస్తూ కొండ శిఖరాన్ని ఎరుపు చేస్తూంటే, ఆ దివ్యప్రపంచంలో పూరాతన శిల్పి చెక్కిన విగ్రహాలకుమల్లే అలా నిలుచుండిపోయాము.

వాతాపినగరములో పశ్చిమచాళుక్యుల శిల్పచమత్ఫతి ఉన్నది. 50 గుహలు గ్రీకుల లేబ్రినులవలె ఉంటవి. కార్లేగుహలు అతిపురాతనమగు ఆంధ్ర బౌద్ధగుహలు. రెండువేల రెండువందల సంవత్సరాల క్రితమా గుహలలో నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కు చెదరకుండా ఉన్నవి.

నాసికలోని గుహలలో ఆంధ్రరాజుల శాసనములు చెక్కించినారు. బెరంగాబాదు గుహలలో గూడ మంచి విగ్రహములు, చిత్రలేఖనములున్నవి. నానా ఘట్టములలో ఆంధ్రశాతవాహన (ప్రభువుల శిల్పాలున్నవి. నొకటి. “బీజపురములో గోలు గుంబాజ్‌ అనేది ప్రపంచమేలో నున్న పెద్ద గుమ్మటములలో నొకటి. ఆ గుమ్మటములో పెకెక్కి గుమ్మటమున కావల నీవల నిద్ధరు మనుష్యులుండి ఎంత కేక వేసినా వినబడదు. గుమ్మటము గోడపై పెదవి యొకరూ, చెవి యొకరూ ఆన్చి రహస్యములు, గుసగుసలు సల్పినచో గూడ స్పష్టముగ  వినబడును.

దౌలతాబాదు కోట అజేయము. తినుబండారములు చేరనీయక మాడ్చవలసినదేగాని మానవమాత్రుడా దుర్గమును శౌర్యముచే చేరలేడు. ధాన్యపురాశివలె అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న కొండను, వరికుప్పవలె చెక్కినారు. కొండచుట్టూ సమతలానికి నూరడుగుల లతు కందకం నూరడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన కొండభాగం ఎత్తు నూ ఏభయి అడుగులు. కొండంతా కోటగోడలు, కొండశిఖరంపై చిన్నకోట, కోటమధ్య రాజభవనం, భవనం శిఖరం మీద ఫిరంగి.

త్ర్యంబకంలో గోదావరి పుట్టింది. కోట్లకొలది సంవత్సరాల యీడున్న ఆ కొండ నాలుగువేలు, అయిదువేలు అడుగుల ఎత్తు. సగంఎత్తువరకూ కంకరా, అడవులూ ఆవరించి ఉంటాయి. తక్కినభాగం అంతా నల్లటిరాయి. అట్లాంటి ఒక కొండ వెయ్యి, పదిహేనువందల అడుగుల ఎత్తు ఎక్కాము. ఆపైన ఒక చిన్న గుహ, కోనేరున్ను కోనేటిప్రక్కను ఒక గోముఖ విగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కలా గోదావరినది పడుతోంది.  అసలు అక్కడ అన్నీ కొండలలోంచి ప్రవహించే జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్నయేటితో కలుస్తాయి. అక్కడి నుంచి ఇరువది ఐదు మైళ్ళు దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికి గోదావరి రెండువందల అడుగుల వెడల్పున గొప్ప నదియైనది. ప్రతిష్టానంలో నాలుగువందల అడుగుల వెడల్పు, నిజామాబాదులో ఆరువందల అడుగుల వెడల్పు,  భద్రాచలము దగ్గర మైలు, రాజమహేంద్రవరముకడ రెండు మైళ్ళు, ధవళేశ్వరముకడ నాలుగు మైళ్ళు, డెల్హా ముఖమున ముప్పది మైళ్ళు వెడల్పున్నది.”

పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోలుకొండ, ఒరంగల్లు మొదలగు (ప్రదేశముల వింతలన్నియు కనులకు గట్టునట్లు పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.


 

Tuesday, March 10, 2026

నగరం మండుతున్నది - హాల్ మార్ షోడెర్ బెర్గ్ (స్వీడన్) కథ


నగరం మండుతున్నది

హాల్ మార్ షోడెర్ బెర్గ్ (స్వీడన్) కథ


కథ 

రెండు కిటికీలున్నాయి. వాటిలో చిత్ర విచిత్రమైన డిజైన్లు మలచిన రాతి తెరలున్నాయి. ఆ చలికాలం ఉదయాన చల్లని సూర్యకాంతి ఏటవాలుగా, చతురస్రాలుగా మెత్తని ఆకుపచ్చ కార్పెట్ మీద పడుతున్నది. ఆ ఎండ వెలుగులో ఒక చిన్న బాబు హాయిగా ఆడుతున్నాడు. వాడికి ఇంకా ఈ ప్రపంచం గురించి తెలియదు. తాను చిన్నవాడినని తెలుసు. పెరిగి పెద్దవాడిని అవుతానని తెలుసు. అయితే తాను పుట్టానని, ఒకనాటికి మరణిస్తానని మాత్రం తెలియదు. తనకు నాలుగు సంవత్సరాలు వయసని తెలుసు. త్వరలోనే ఐదు అవుతుందని తెలుసు. అయితే సంవత్సరం అంటే ఏమిటో మాత్రం తెలియదు. వాడికి కాలం అంటే నిన్న, ఇవాళ, రేపు వరకే తెలుసు.
పాపా! వాడు ఒక్కసారి ఆశ్చర్యంగా తండ్రిని పిలిచాడు. ఆ తండ్రి అప్పుడే బ్రేక్ ఫాస్ట్ ముగించి, ఆనాటికి మొదటి చుట్ట ముట్టించుకున్నాడు. అతనికి కాలం లెక్క చుట్టలమీద ఆధారపడి సాగుతుంది మరి! నాన్నా! రాత్రి నాకు కలలో చాలాసంగతులు కనిపించాయి! మొత్తం గది కనిపించింది! కుర్చీలు, పచ్చతివాచీ, అద్దం, గడియారం, స్టవ్, అల్మరాలు అన్నీ కనిపించాయి,’ అన్నాడు వాడు.
మాట్లాడుతూనే వాడు స్టవ్ వద్దకు వెళ్లాడు. ఆ పొయ్యి చిటపటలాడుతూ మండుతున్నది. వాడు పొయ్యిని, దాని స్థలాన్ని గమనించ సాగాడు. వాడి దృష్టిలో మొత్తం గదిలో అవి అన్నింటికన్నా గౌరవకరమయిన ప్రదేశాలు.
నాన్న పేపర్ చదువుతూ దాని అంచు మీదుగా బాబును చూచి నవ్వుతున్నాడు. బాబు కూడా జవాబుగా నవ్వాడు. పట్టరాకుండా నవ్వుతున్నాడు. వాడి వయసులో నవ్వు అంటే సంతోషాన్ని తెలియజేసే పద్ధతి. అర్థం లేని సంగతులను చూచి చేసే చప్పుడు కాదు. కొన్ని రోజులక్రితం బాబు కిటికీ దగ్గర నిలుచున్నాడు. చంద్రుడిని చూచి నవ్వాడు. అంటే చంద్రుడు అతనికి నవ్వులాటగా కనిపించిందని కాదు. గుండ్రంగా, అందంగా వెలుగుతున్న చంద్రుని చూసిన బాబుకు ఆనందం కలిగింది. అంతే!
వాడి నవ్వు అయిపోయింది. కష్టపడి కుర్చీ మీదకు ఎక్కాడు. గోడ మీది ఒక చిత్రాన్ని చూపించాడు.
అన్నిటికీ మించి కలలో ఈ బొమ్మ కనిపించింది,’ అన్నాడు.
అది, ఏ బర్నింగ్ సిటీ అనే పాత డచ్ పెయింటింగ్ యొక్క ఫోటోగ్రాఫ్.
అవునా! కలలో ఏం కనిపించింది అందులో?’ నాన్న అడిగాడు.
నాకు తెలియదు.
గుర్తు తెచ్చుకో!
ఆ! అంతా మండుతున్నది. నేనేమో కుక్కను నిమిరాను.
కానీ మామూలుగా నీకు కుక్కలు అంటే భయం కదా?’
అవును. కానీ బొమ్మలో కుక్కను ముట్టుకుంటాను.
వాడు మళ్ళీ నవ్వసాగాడు. హాయిగా ఆడడం సాగించాడు.
చివరకు బాబు నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్నా, నాన్నా! ఆ బొమ్మని కిందకు తీయవా? నాన్న నాకు నిన్నటి లాగే ఆ బొమ్మను చూపిస్తాడోచ్! అన్నాడు.
ఆ బొమ్మ గదిలోకి కొత్తగా వచ్చింది. సరిగ్గా మొన్ననే వచ్చింది. మిగతా గోడలమీద ఉన్న చిత్తరువులన్నీ బాబుకు బాగా తెలుసు. అంకుల్ స్ట్రిండ్ బెర్గ్, అంకుల్ షోపార్ (షోపెనవర్), అంకుల్ నెపోలియన్, ముసలి గ్యోఠే, నానమ్మ చిన్ననాటి ఫోటో. అయితే ఈ మండుతున్న నగరం కొత్తది. అంతేగాక అది మిగతా వాటికన్నా ఎంతో ఆసక్తికరంగా ఉంది. తండ్రి తన బాబు మాట విన్నాడు. చిత్తరువును గోడ మీదనుంచి తీశాడు. ఇద్దరూ ఆనందంగా దాన్ని చూడసాగారు. ఒక పెద్ద నీటిమడుగు ఉంది. అది వంపు తిరిగి సముద్రంలో కలుస్తున్నది. నీటిలో తెప్పలు, బోట్ లు ఉన్నాయి. వంకర వంతెనల కిందుగా అవి పోతున్నాయి. ఆ పక్కన పెద్ద టవర్ ఉంది. ఎడమతీరం మీద మండుతున్న నగరం ఉంది. పైన నిటారు గోపురాలుగల వరుస యిండ్లు, వాటి పైకప్పులు, చర్చ్ లు, మరిన్ని టవర్లు. బోలెడంత మంది అటుయిటు పరుగెత్తుతున్నారు. సముద్రంలాగే మంటలు వ్యాపిస్తున్నాయి. పొగ మేఘాలుగా లేస్తున్నది. గోడలకు నిచ్చెనలు వేసి ఉన్నాయి. గుర్రాలు బండ్లను లాగుతూ పరిగెడుతున్నాయి. రేవుల్లో బ్యారెల్స్, సంచులు చెత్తచెత్తగా పడి ఉన్నాయి. నదిమీద ఒక తెడ్లనావలో బోలెడంత మంది జనం. అదేమో తలకిందులు అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వంతెన మీద జనం ప్రాణభీతితో పరిగెడుతున్నారు. బొమ్మలో ముందువైపు మాత్రం, రెండు కుక్కలు ఒకదాన్ని మరొకటి వాసన చూస్తున్నాయి. బొమ్మలో మరీ వెనుక నీళ్లు, సముద్రంలో కలిసిన చోట చంద్రుడున్నాడు. చాలా చాలా చిన్నగా ఉన్నాడు. చుట్టూ మబ్బులు పాలిపోయినట్లున్నాయి. అవి కింద బీభత్సాన్ని నిస్సహాయంగా చూస్తున్నట్టున్నాయి.
నాన్నా! నగరం ఎందుకు మండుతున్నది?’ బాబు అడిగాడు.
ఎవరో మంట విషయంగా నిర్లక్ష్యం చేసి ఉంటారు!
నిర్లక్ష్యం చేసింది ఎవరు?’
ఇంత జరిగిన తర్వాత చెప్పడం కష్టం
ఎంత జరిగిన తర్వాత?’
ఈ నగరం తగలబడి వంద సంవత్సరాలయింది,’ నాన్న చెప్పాడు.
అదే బాబుకు అర్థం కాని సంగతి. ఆ సంగతి నాన్నకు తెలుసు. అయినా ఏదో చెబుతాడు. బాబు ఆలోచిస్తూ కొంతసేపు ఉండిపోయాడు. అతనికి మెదడులో విషయాలను గురించి కొత్త ఆలోచనలు, భావనలూ పుడుతున్నాయి. అవి పాతవాటితో కలుస్తున్నాయి. చిన్న వేలుతో పఠం వైపు చూపిస్తూ, అవును, కానీ నిన్న కూడా అది తగలబడుతూ ఉంది. ఇక ఇవాళ ఇప్పుడు కూడా తగలబడుతున్నది. వాస్తవానికి, చిత్రాలకూ మధ్య తేడాను వివరించాలని తండ్రి ప్రయత్నం మొదలుపెట్టాడు. అది నిజమైన నగరం కాదు, అన్నాడు. అది కేవలం బొమ్మ, అసలు నగరం ఏనాడో తగలబడిపోయింది, అది యిప్పుడు లేదు. బొమ్మలో అటుయిటు పరిగెత్తుతున్నవాళ్లంతా చనిపోయారు. వాళ్ళిప్పుడు లేరు. ఇళ్లన్నీ కాలిపోయాయి. టవర్స్ పడిపోయాయి. వంతెన కూడా కూలింది.
టవర్స్ కాలి, కూలిపోయినయా?’ బాబు అడిగాడు.
అవును. కాలినయి, కూలినయి.
బోట్లు కూడా చచ్చినయా?’
బోట్లు కూడా ఎప్పుడో పోయాయి. అయితే నీవు అనుకుంటున్నట్టు అవి స్టీమ్ బోట్స్ కావు. మామూలు తెరచాప రకం. ఆ కాలంలో స్టీమ్ బోట్స్ లేవు.
బాబు కింద పెదవి ముందుకు చాచాడు. అర్థం కాలేదు అన్న భావం వెలిబుచ్చాడు.
నాకేమో అవి స్టీమ్ బోట్స్ లాగా కనబడుతున్నాయి. ఆ స్టీమ్ బోట్ పేరేమిటి నాన్నా?’
వాడి మెదడు వాడికి ఉంది. బాబు మెదడు. తండ్రి విసిగిపోయాడు. కానీ ప్రశాంతంగా ఉన్నాడు. బాబు వేలితో డచ్ వ్యాపార నౌకలను చూపించాడు. ఆ స్టీమర్ పేరు బ్రేగ్. ఆ పక్కది హిల్లర్ సీ. ఇక మరొకటి ప్రిన్సెస్ ఇంగెబోర్గ్. తనకు తానే అనుకుంటున్నాడు.
నాన్నా! చంద్రుడు కూడా కూలిపోయాడా?’ వాడు ఒక్కసారిగా అడిగాడు.
లేదు. చంద్రుడు ఇంకా ఉన్నాడు. బొమ్మలోని అన్నింటిలోనూ మిగిలింది చంద్రుడే. ఆ చంద్రుడినే కిటికీలోనుంచి చూచి నీవు నవ్వింది.
మళ్లీ కుర్రవాడు ఆలోచనలో పడిపోయాడు. మళ్ళీ ఒక ప్రశ్న పుట్టింది.
నాన్నా! ఈ నగరం కాలిపోయి చాలాకాలం అయిందా? మనం ప్రిన్సెస్ మీదకు వెళ్ళామే. అంతకంటే చాలా ముందా?’
ఇంకా చాలా చాలా ముందు. ఆ నగరం తగలబడినప్పుడు, నీవు లేవు. నేను, అమ్మా, లేము. నాయనమ్మ కూడా లేదు! తండ్రి వివరించాడు.
ఒక్కసారిగా బాబు ముఖం గంభీరంగా మారింది. అతడు చిక్కులో పడినట్టు తెలుస్తుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అయినా ఏమీ తోచినట్టు లేదు.
ఒకటి చెప్పు నాన్నా! నగరం మండినప్పుడు నేను ఎక్కడున్నాను? నేను అమ్మతో ఊరికి వెళ్ళినప్పుడా అది మండిపోయింది?’’
కాదు, ముసలాయనా! నగరం మండినప్పుడు నీవింకా లేనేలేవు! జవాబిచ్చాడు.
చిన్నబాబు కింద పెదవి మళ్లీ ముందుకు వచ్చింది. నీవు చెప్పేది నేను అవుననడానికి లేదు, అని చెబుతు న్నట్టు ఉంది తీరు. ఈసారి రెట్టించి అడిగాడు.
సరే, అయితే మరి నేను అప్పుడెక్కడున్నాను?’
నీవు లేనే లేవు,’ తండ్రి జవాబు యిచ్చాడు.
బాబు కళ్ళు పెద్దవి చేసి తండ్రి వైపు చూచాడు. ఒక్కసారిగా చిన్నారి ముఖంలో వెలుగు కనిపించింది. తండ్రి నుంచి అతను దూరంగా జరిగాడు. మళ్లీ ఆటలో పడిపోయాడు. పచ్చని తివాచీ మీద పడిన ఎండల్లో తిరుగుతున్నాడు. గట్టిగా అరుస్తున్నాడు.
అవును. అదే మరి. నేను ఎక్కడో ఉన్నాను. ఎక్కడో ఉన్నాను.
తండ్రి తనతో తమాషా చేస్తున్నాడని బాబు అభిప్రాయం. అర్థంలేని ఆలోచన. పని అమ్మాయిలు అప్పుడప్పుడు తనతో సరదాగా అర్థంలేని మాటలు అంటారు. తండ్రి కూడా అదే చేస్తున్నాడని బాబు భావన.
అందుకే హాయిగా ఎండమరకల్లో ఎగురుతూ ఆడుతున్నాడు.
 

Thursday, January 22, 2026