Showing posts with label book. Show all posts
Showing posts with label book. Show all posts

Monday, March 9, 2026

Thursday, October 16, 2025

లోకాభిరామం సన్నాయి నొక్కులు (Sannayi Nokkulu) Telugu Column Article ...

లోకాభిరామం   

సన్నాయి నొక్కులు 

సన్నాయి అనే నాదస్వరం గురించి నా వ్యాసం


Sunday, September 7, 2025

The Flute - A short story of Adivi Bapiraju (rendered into English)

The Flute

A short story of Adivi Bapiraju 

(rendered into English by K B Gopalam)


The Flute

Adivi Bapiraju

 

The sounds of the boy's flute filled the bunds of the fields, crops, canals and the hills at a distance.

He had no knowledge of the ragas (musical scales) nor had he learnt about the swaras (musical notes). His mentors were – the koel, the carpenter bee, the mountain brook, the mooing of the cows, the gentle breeze floating over the fields, the thunder, the beetle and the Lavangi birds.

A naturally gifted flautist, he had a great sense of music though ignorant of musicology, its theories, principles and terminology. Comparing notes and notes, he would tune the shruti (pitch). His breath kept the laya (rhythm & tempo). Only three talas (beats) emerged from his rhythm & tempo – they were Adi, Eka and Roopaka.

The melodic patterns (moorchanas) he conjured up were simply out-of-the-world combinations.

2

He was a cattle grazer and nine years old. After eating yesterday's remnant rice and gruel with salted fish as side dish, he put some of the rice gruel in a small pot and a pickled piece of raw mango, covering it with a plate. Wrapping the lunch-pot in a piece of cloth, he reached the river bund riding a buffalo.

The shade of the neem tree was his throne; his cattle were his subjects, and his weapon was his flute!

A tattered loin cloth and an equally torn head scarf were his silken attires. Whenever it rained, he made a couple of buffalos stand close together and sat down under them. When the river swelled, he crossed it on the buffalos. Cows and buffalos were his armed guards. Equipped so, he could stand up even to a tiger.

3

Once he reached the grazing field, he bade them go on their own and settled himself under the tree, playing and singing.

He pulled out the flute and played on it to mesmerize the world. The lyrics for the songs were his heart itself.

Sometimes his song jumped and pranced. It flowered and spread gentle fragrance all around and bubbled up like the waters of a little spring.

Sometimes his song looked at the world and wondered, paled or shivered.

Another time his song searched for something. It gazed at the sky keenly; pierced the depths of the earth, and counted the water drops in the river.

At times it went into tears. It curled with some unknown fear, sulked with hunger and took on the form of the entire gamut of human suffering and wept.

Yet another time the song assumed the all-knowing lotus yogic posture and offered grass flowers in supplication. Also, it probed the depths like a fish in the water.

Kissing the flute with his lips, the boy turned into one who lost cognizance of his own handiwork.

4

One day from an adjacent farmland, a girl worker came looking for him following the song.

She was eight. She sat still before him listening to the song.

She did not divide his kingdom or usurp it.

She became one with his kingdom, with his song and with him.

She would come every day by his song time and sit there before him.

The tattered cloth on her midriff did not cover her nakedness completely. She had a pair of bangles on her arm, and two aluminum anklets on her legs.

If the boy's face was the image of the sun, her face was the lotus in the side-by-pond.

5

One day when he played on the flute, the whole world listened to it under a spell. And the girl turned into that very song.

In the meantime, some monstrous bird hovered in the sky with an earth-shattering sound. Stunned with the sound, the boy stopped playing and fell at once to the ground. The girl flew to his side. Shivering and wailing, she embraced him.

The demon bird flew away. After a while the two naïve kids got up and surveyed around with bleary eyes.

His cows and buffalos grazed as usual. Flowers were in bloom. The neem tree stood outspread just as before. The brook flowed on gurgling.

He mustered up courage to pick up the flute and once again harmonized the three sacred notes into a cadence that questioned this universe. The girl continued to cling to him.

Far away in Europe, there was a war raging. Japan let itself loose on Pearl Harbor.

The boy came out of the impact. Matching the pitch of the daily visitor demon birds, he played a new combination to which the girl listened, smiling and captivated.

Tuesday, August 19, 2025

లోకాభిరామం - పద్యంవిద్య - Lokabhiramam - Padyamvidya

లోకాభిరామం - పద్యంవిద్య



నా పుస్తకం నుంచి మరో వ్యాసం - మీ కోసం

పద్యంవిద్య

రాస్తారా అన్నప్పుడు,

చూస్తానంటే తప్పని, రాస్తానన్నా!

రాస్తే ఏమవుతుందో,

చూస్తాననుకున్నానూ, రాస్తున్నాను!

- ఇది కంద పద్యమేనా? ఏమో? నాకు తెలియదు. రాశాను, అంతే.

నాకు పద్యం రాయడం వచ్చునని చెప్పడానికి కాదు, ఈ పద్యం రాసింది. పద్యం గురించి రాయాలని అనుకుంటుంటే, పద్యం వచ్చింది. నండూరి రామకృష్ణమాచార్యుల వారు మంచి మిత్రులు. ఆయనకు మాట్లాడినంత సులభంగా పద్యం చెప్పడం వచ్చునంటే అతిశయోక్తి కాదు. వచనం (కథ, నవల, వ్యాసం) రాయడం గాల్లో విమానం నడపడం లాంటిదనీ, పాట రాయడం, రోడ్డు మీద కారు నడపడం లాంటిదనీ అన్నారాయన. ఇక పద్యం, పట్టాల మీద రైలు నడక అన్నారు కూడా. కొంచెం పట్టుంటే, వెళ్లవలసిన చోటికి అదే వెళుతుంది! అన్నారాయన. ఏ పనయినా అంతే, చేతనయిన వారికి, చాలా సులభంగానే కనపడుతుంది. మిగతా వాళ్లకది చెక్కల బావిలో మోటార్‌ సైకిల్‌ నడిపినట్లుంటుంది.

చెక్కలతో బావి కట్టి, అందులో గోడల మీద, సైకిల్‌, మోటార్‌ సైకిలూ, నడిపిన గురుభిక్‌సింగ్‌ ప్రదర్శన నాకు ఇన్నేళ్లయినా గుర్తుంది. ఆయనకదే బతుకు. (బహుశ: దాని అంతం కూడా!) ఎట్లా నడుపుతారు, అంటే, ‘ఓస్‌! సులభం’ అంటారని నా అనుమానం. పద్యం రాయడంలో మొత్తానికి ప్రమాదం మాత్రం లేదు. కనుక, నాతో మొదలు ఎవరయినా ప్రయత్నించవచ్చు. జారిపడినా దెబ్బలు తగలవు!

చిన్నప్పుడు, అదెందుకో, ఏమిటో తెలియకుండానే, శతకాలకు శతకాలు భట్టీయం (ఇది నోటికి నేర్చుకునే విద్య!) వేయించేవారు. ఇది పక్కనే పెడితే, మా ఊరి బడి ఒక సెంటర్‌ స్కూలట. సెంట్రల్‌ కాదని మనవి. చుట్టుండే అయిదారు పల్లెలకు అది కేంద్రమని అర్థం! ఆ బడులలో పంతుళ్లు వచ్చి ఒక ‘సెంటర్‌ క్లాస్‌’ అనే కార్యక్రమంలో ‘మాదిరి తరగతి’ అనే మాడల్‌ క్లాసులు నిర్వహిస్తుండేవారు. ఇది కూడా పక్కనబెడితే, ఈ బడులన్నింటికీ కలిపి ఆటల పోటీలు కూడా పెట్టేవారు. అంతటితో ఊరుకుంటే పోదూ? నాలాంటి ఆటలు చేతగాని మొద్దబ్బాయిల కోసం, పద్యాల పోటీ పెట్టారు. అమాయకులు, కొందరు అందులో పాల్గొంటామని పేర్లు ఇచ్చారు కూడా. మన సంగతి తెలియదులాగుంది. వాళ్లంతా, నట్టుతూ, ముక్కుతూ మూడు నాలుగు పద్యాలు చదివి, అలసి ఆగిపోయారు. నేను మాత్రం, వద్దన్నా ఆపకుండా, మొత్తం శతకం ఒకటి చదివినట్టున్నాను. అది మూడవ, నాలుగవ తరగతిలో ఉన్నప్పటి మాట!

సినిమా పద్ధతిలో సీన్‌ కట్‌ చేస్తే, ఎనిమిదవ తరగతిలో తేలుతుంది. యాదగిరాచార్లు గారు తెలుగు చెపుతారు. చాలా బాగా చెపుతారు. శ్రావ్యంగా పద్యం చదువుతారు. పద విశ్లేషణ, అంటే పదాలను విడగొట్టి చూపడం, తరువాతి అంచె. అర్థం చెప్పడం, సమన్వయం, ఆ తరువాత జరుగుతాయి. పద్యాన్ని మరో సారి చదువుతారు. అప్పుడు పిల్లలను చదవమంటారు. అందరూ వరుస తరువాత వరుసగా, ఒక క్రమంలో కూచుంటారు గదా! రెండు బెంచీలు మాత్రం కుడి పక్కన గోడ వెంట ఉండేవి. అందులో మొదట్లోనే నేను ఉండేవాణ్ని! అందరికంటే ముందు లేచి పుస్తకం అవసరం లేకుండానే, ఆ పద్యం చదివేవాణ్ని! అట్లా నడుస్తూనే ఉంది. మరీ చాలాకాలం నడిస్తే ఎందుకు గుర్తుంటుంది సంగతి? క్లాసులో ఉండే ఆడపిల్లలలో ఇద్దరు, ఇదంతా నచ్చలేదనుకున్నారు. ‘మీరు ఏ పద్యం చెప్పబోతున్నారో ముందే వాడికి చెపుతారు. వాడది ఇంట్లో నేర్చుకుని వస్తాడు! బడాయి!’ అన్నారు. ఆచార్లు గారికి నేనంటే, ఆనాటికీ, ఈనాటికీ అభిమానమే. ‘ఎందుకు ఉడుక్కుంటారు? నేను చెప్పినంత సేపు, అతను పద్యం మనసులో మననం చేసుకుంటాడు. మీరు చేయరు. అంతే!’ అన్నారు. సిలబస్‌లో లేని పాఠం ఒకటి తీసి అందులో పద్యం చెప్పడం మొదలుపెట్టారు. అలవాటు కొద్దీ, వంతు రాగానే, నేను పద్యం అప్పజెప్పాను. పుస్తకం లేకుండానే! ఆ తరువాత ఏమయిందో నాకు గుర్తులేదు.

బడిలో నాతోబాటు పద్యాల పోటీలో పాల్గొన్న మిత్రుడు, బంధువు విష్ణు, చెప్పా పెట్టకుండా మిలిటరీలోకి వెళ్లిపోయాడు. వాళ్లకు ఉత్తరాలు రాసే పద్ధతి విచిత్రంగా ఉంటుంది. మొత్తం చిరునామా ఎవరికీ ఇవ్వరు. పేరుతోబాటు ఒక నంబరేమయినా ఉండేదేమో? గుర్తు లేదు. ఫలానా శర్మ, కేరాఫ్‌ 56, ఎ.పి.ఓ. అని రాస్తే చాలు, ఉత్తరం వెళ్లిపోతుంది. ఏపీఓ అంటే ఆర్మీ పోస్ట్‌ ఆఫీస్‌ అని తరువాత తెలిసింది. (తెలిసిందా?) 56 అంటే విష్ణు ఉండే చోటయి ఉంటుంది. ఈ సంగతంతా పక్కన పెడితే, ఒకసారి ఉగాదికో, సంక్రాంతికో వాడికి ఇన్‌లాండ్‌ లెటర్‌ నిండా పద్యాలతో ఉత్తరం రాశాను. ఒక కాపీ ఉంచుకోవాలని తోచలేదు. వాడి దగ్గర గానీ, ఉందేమో ఉత్తరం, అడగాలి!

చిన్నాయనగారు కొంతకాలం పాతకాలం పద్ధతిలో ‘వసుచరిత్ర’ పాఠం చెప్పారు. ఇంట్లో, సంధులు, సమాసాలు, అలంకారాలు, పద్యవిద్య ఎన్నెన్నో పరోక్షంగా నేర్పించే పద్ధతి అది. బడిలో కూడా ఇట్లా చెప్పాలనే అనుకుంటారు కానీ, ఎందుకో అది కుదరదు. దేనికదే వేరువేరుగా ఉండిపోతయి. మొత్తానికి వసుచరిత్ర, మనుచరిత్ర, ఆశ్వాసాల మీద ఆశ్వాసాలు నోటికి వచ్చేవి. ‘అన విను, గృహస్థ రత్నంబ! లంబమాన రవిరథతురగ..’ అంటూ వచనమంతా ఒక్క పట్టున అప్పజెబితే అదొక ఆనందం. అమరకోశం, శబ్దమంజరి లాంటివి అంతకు ముందు నుంచే అభ్యాసంలో ఉండేవి. అప్పుడే అప్పకవీయం పరిచయమయింది. పద్యాల లక్షణాలను పద్యాల రూపంలో చెప్పే పుస్తకమది. నిడుదలు, జడ్డక్కరములు, పిరుందకడ యూదిన యక్కరముల్‌ గురువులు. కానివి లఘువులు. ఈ గురు లఘువుల కాంబినేషన్‌తో గణములు, గణముల కాంబినేషన్స్‌తో వృత్తములు, పద్యములు. తరువాత డి.ఎన్‌.ఏ. గురించి చదువుతుంటే నాకిదంతా గుర్తుకు వస్తుండేది. ‘జరల్‌ జరల్‌ జగంబుకూడి సన్నుతిన్‌ రచింపగా, పరాజితార ధీరవీర పంచచామరంబగున్‌!’ పంచచామరం అనే పద్యం లక్షణం పంచచామరంలో!

రేడియోలో నౌకరీ కొరకు ఇంటర్‌వ్యూహము. ‘రామాండెమంటే, సామాండెమా? గొల్లేశమంత కథ!’ అని ఒక మాట. రామాయణం సామాన్యం కాదు! బయలాటలో వచ్చే గొల్లవేషమంత ఉంటుందని, అన్న మనిషి భావం! ఈ ఇంటర్‌వ్యూహము కూడా గొల్ల వేషమంత కథ. ప్రస్తుతం పద్యంలో ఉన్నాము గనుక, అందుకు సంబంధించిన ప్రసక్తి ఉంది గనుక అది గుర్తొచ్చింది. ఉద్యోగం సైన్సుకు సంబంధించింది. ముగ్గురు నిపుణులు నా బుర్ర తిన్నారు. చేతయినంత వరకు నేనూ వారి బుర్ర తిన్నాను. కైసర్‌ కలందర్‌ గారని ఒక అందమయిన పెద్దాయన, కమిటీ అధ్యక్షులు. ‘సైన్సు సరే! హాబీలేమిటి?’ అని అడిగారు. ‘తిండి, అమ్మాయిల’ గురించి చెబితే కుదరదు. కనుక ‘సంగీతం, సాహిత్యం’ అన్నాను. ‘ఒక పద్యం చెప్పగలవా?’ అన్నారాయన. ‘కలడుల్లోక మహా మహోగ్ర’ అంటూ వసుచరిత్రలోని పద్యం చదివాను. అందులో కలడు అని మొదట్లో, ఇలన్‌ అని చివర తప్పితే మిగతా మొత్తం ఒకే ఒక్క సంస్కృత సమాసం మరి! ‘అర్థం చెప్పగలవా?’ అన్నారాయన. ‘ఓ యస్‌’ అన్నాను. భయపడ్డారేమో, ‘వద్దులే’ అని మరేదో అడిగారు. నాకా ఉద్యోగం ఇస్తారని అక్కడే అర్థమయింది. అది మరో గొల్లవేషం కథ!

మళ్లీ మొదటికి వస్తే, రామకృష్ణమాచార్యుల వారికి, ఆలోచన ఏదయినా వస్తే వెంటనే ఒక కార్డు ముక్క రాయడం అలవాటు. నేనూ జవాబుగా ఒక కార్డు రాసేవాణ్ని. ఒకసారి ఆయన రాయవలసిందేదో రాసి, కార్డు వెనుక చిరునామా రాసేచోట పక్కన ఖాళీలో రెండు పద్య పాదాలు రాశారు. ‘శాంతి సంగరంబు, స్వాతంత్య్ర సమరాన, సగము కాలినట్టి సమిధ నేను’ అని మాత్రం రాశారాయన. జవాబుగా రాసిన కార్డు వెనుక నేనూ అదే పద్ధతిలో ‘కడమ సగముగాల్చి కవితా ప్రపంచాన, కారు చీకట్లను పారద్రోలె!’ అని రాసి పంపాను. నమ్ముతారో లేదో? కార్డు అందిన మరుక్షణం ఆయన ఆఘమేఘాల మీద వచ్చారు. నన్ను కౌగిలించుకున్నారు. ‘తెలుగు పద్యం’ గురించి నేను వేస్తున్న పుస్తకంలో, నీ పద్యం ఉండాలి!’ అన్నారు. పద్యం లేదు. అదే వేరే సంగతి!


Tuesday, August 12, 2025

Lokabhiramam - Goppavaru - Goppa Ooru (గొప్ప వారు - గొప్ప ఊరు)

Lokabhiramam 


లోకాభిరామం


Goppavaru - Goppa Ooru 
(గొప్ప వారు - గొప్ప ఊరు)


మీ ఊళ్లో పెద్దవాళ్లెవరయినా పుట్టారా?’ ప్రశ్న
లేదండీ! అందరూ పిల్లలే పుడుతున్నారు!’ జవాబు.


నీలంరాజువారు : లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్‌ చేశారు. నేను మురళీధర్‌ గారిని గుర్తు తెచ్చుకుని తికమకపడ్డాను. ఆయన నన్నందులోంచి బయట పడేశారు. ఈలోగా ఆయనకేదో అవాంతరం వచ్చి మళ్లా ఫోన్‌ చేస్తాను’ అన్నారు. పెద్దాయన ఎందుకు ఫోన్‌ చేశారా? అని నాకు గాభరా! ఆయన మళ్లీ పిలిచి (కాల్‌ చేసి!) ఏవో పుస్తకాల సంగతి మాట్లాడారు. ‘మా తండ్రి వెంకట శేషయ్యగారి జీవిత చరిత్ర పంపుతాను చదవండి’ అన్నారు. ‘నేనిక్కడ లేచి నిలబడి దండం పెడుతున్నాను’ అన్నాను. మరిన్ని మాటల తరువాత, మీరు చాలా ‘ఎమోషనల్‌’ కదా అన్నారు. ‘ఎక్సయిటబుల్‌’ కూడా అన్నాను నేను. పెద్దవాళ్ల భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూచానన్న సైంటిస్టు నాకు ఆదర్శం, అని వినయంగానే అన్నాను. నేను ఈ ప్లానెట్‌ మీద ఉన్నంత కాలం, మన మైత్రి ఉంటుందన్నారాయన. భుజాలు పొంగిపోయాయి. ఆయన గొప్పవారు!

(గురజాడ వారి ఇల్లు)

ఇజీనారం: గిరీశం గారు గొప్పవారుట్రా, అడుగుతుంది కన్యాశుల్కంలో బుచ్చమ్మ. అంతాయింతా కాదు, సురేంద్రనాథ బ్యానర్జీ అంత గొప్పవారు, జవాబిస్తాడు తమ్ముడు వెంకటేశం! కన్యాశుల్కం గొప్ప రచన. దాన్ని సృష్టించిన గురజాడ అప్పారావుగారు, మరింత గొప్పవారు (ఇందులో కథాక్రమం కొంతవరకు మృచ్ఛకటికానికి అనుసరణ అన్న సంగతి మీరు విన్నారా?) అప్పారావుగారి ఇంటిని కాపాడిన వారు ఇంకా గొప్పవారు. ఆయన రాతబల్లను, కళ్ల జోళ్లను కళ్లారా చూసిన నేను కూడా కుంచెం, కుంచం, కొంచెం గొప్పవాణ్ని! భళా!
గొప్ప ఊరు: విజయనగరం చూడాలని నాకు చిన్నప్పటినుంచీ ఉంది. మనకేమో, యాత్రకో, పెళ్లికో తప్ప మరో ఊరు పోయే అలవాటు లేదాయె! మొత్తానికి ప్రసాదుగారనే మిత్రుల పుణ్యమా అని విజయనగరం వెళ్లాను. అక్కడ దిగగానే, ఆ నేలను తాకి మొక్కాను. ఎందరో మహానుభావులు నడిచిన గొప్ప నేల అది. గురజాడవారు, ద్వారం నాయుడు గారు, కోడి శ్రీరామమూర్తి, శ్రీశ్రీ, రోణంకి, నారాయణ బాబు, చాసో, పతంజలి, మా దాట్ల (రచయితల పేర్లే వస్తున్నాయి. అక్కడ మరెందరో గొప్పవారుండే వారు, ఉన్నారు. ఉంటారు!) నారాయణదాసు, బుర్రకథ కుమ్మరి మాస్టారు...సరే, విషయంలోకి వస్తాను! తాపీ ధర్మారావు, సాలూరు రాజేశ్వరరావు!!! వాసా వారు, అంట్యాకుల పైడరాజుగారు. ఇక చాలు ఈ ప్రవాహం ఆగదు!
బొంకుల దిబ్బ: ఈ పేరు కన్యాశుల్కం కారణంగా నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. పూసపాటి రాజుల కోటకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం అది. బొంకులు అంటే అబద్ధాలు! అక్కడ జరిగే వ్యవహారాల కారణంగా ఆ పేరు వచ్చిందని కథ ఏదో విన్నట్టు గుర్తు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ బొంకుల దిబ్బ వద్ద వ్యక్తి సత్యాగ్రహం నిర్వహించారు. అందులో స్థానిక నాయకులు కొందరు అరెస్టయ్యారు. 1940నాటి మాట అది. మరే ఊరయినా ఆ ఖాళీప్రదేశంలో పేద్ద భవనాలు లేచి వుండేవి. అలాంటి కీలకమయిన చోటది! విజయనగరం వారు మాత్రం దాన్ని అట్లాగే కాపాడుతున్నారు. అక్కడ కూరగాయల మార్కెటు నడుస్తున్నది. మరి ఆ వ్యాపారంలో బొంకులుంటాయా? ఉండవు. లేకుంటే అంటే, ఉంటే (!) అది కొనసాగదు గదా!
గొప్పవాళ్లు: నాకక్కడ మరో ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. రచయిత, పాత్రికేయుడు అని చెప్పారు. ఆయనొక మంచితనపు మూట! మాటలంటే మంచి మాటలే గల పేటిక! నాకు ఊరు చూపింది ఆయనే. గురజాడ వారి ఇంటికి వెళ్లాము. చూడగానే నాకు కళ్లల్లో నీరొచ్చింది. నాకాయనంటే కొంచెం అభిమానం ఎక్కువ! ఇల్లు నిజంగా రోడ్‌మీద ఉంది. అది నిజంగా రద్దీగల దారి. ఇంట్లో లైబ్రరీ నడుపుతున్నారు. (అవసరమా!) ఎక్కడపడితే అక్కడ అందరూ కూచుని పత్రికలు చదువుకుంటున్నారు. పై అంతస్తు లోని పంతులుగారి స్వంత గది, పక్క గదులను వదిలేశారు నయం! అక్కడ బయట గదిలో ఒక పడమటి అమ్మాయి చిత్రం ఉంది. అది ‘మెటిల్డా’ అంటారు మా శ్రీనివాస్‌గారు! పంతులుగారి గదిలో కొన్ని అలనాటి వస్తువులను కాపాడుతున్నారు. అక్కడ కింద ఒక గదిలో నాకొక విశేషం కనిపించింది. ఒక అమ్మాయి, కన్యాశుల్కంలోని సన్నివేశాలను (శతజయంతి సందర్భంలోనా?) బొమ్మలుగా గీసి ప్రదర్శించింది. అమెచూరిష్‌గా ఉన్నా, ఆ బొమ్మలను అక్కడ ప్రదర్శనకు పెట్టారు.
ప్రసాద్‌గారు నాకు మాటల సందర్భంగా మరో గొప్ప వ్యక్తి గురించి చెప్పారు. బోలెడన్ని పొడి అక్షరాలున్న పేరున్నా ఆయనగారు ఒకానొక సాగి రాజుగారు. వృత్తిరీత్యా లాయరు. కళా, సాహిత్యాల పోషకుడు. ఆయన జిల్లాలోని రచయితల పుస్తకాలు తెచ్చి, సగం ధరకే అమ్ముతుంటారు. ఆయనను ఇంటికి రప్పించి మరీ వెళ్లి కలిసాము. నేను కొన్ని పుస్తకాలు తెచ్చుకున్నాను కూడా. అందులో ముఖ్యంగా తలిశెట్టి రామారావు కార్టూన్ల గురించిన పుస్తకాలు దొరికాయి.

(సంగీత కళాశాల - వెనుక భాగం)
(సంగీతం మర్రి చెట్టు)


సంగీత కళాశాల: కర్ణాటక సంగీతాన్ని అభిమానించే వారికి, విజయనగరం ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అక్కడి మహారాజా కళాశాల, గుడికంటే ఎక్కువ. నారాయణదాసుగారు మొదలు శ్రీరంగం గోపాలరత్నం గారి వరకు అక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్‌ పట్టిక చూస్తే ఆశ్చర్యం కలిగింది. మొదటిరోజు వెడితే గుడి తలుపులు మూసి ఉన్నాయి. మరునాడు ఉదయమే మళ్లీ వెళ్లాము. ఆ మెట్లమీద కాలుపెట్టడానికి మనసొప్పలేదు. నమస్కరించి లోనికి పోయాము. పూర్వ వైభవం లేదన్న సంగతి తెలిసిపోతున్నది. అక్కడక్కడ విద్యార్థులు చెట్లకింద అభ్యాసం చేసుకుంటున్నారు. ఆవరణలో, భవనం వెనకవైపు ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. అది కాలేజీ అంతగానూ పాతది. దాని కింద కూచుని అక్కడివారు, చూడవచ్చిన వారు, మహామహులెందరో పాడి ఉంటారు. వాద్యాలను పలికించి ఉంటారు. ఆ వాతావరణంలో గడిపినంత సేపు, నాకు గుండె బరువైన భావం కలిగింది. ఆవరణ లోని చెట్లన్నీ ఏపుగా పెరిగి ఉన్నాయి. సంగీతం వల్లనేమో అనిపించింది. కాలేజీలో చాలాకాలంగా పనిచేస్తున్న ఒక ముసలమ్మతో మాట కలిపాను. ద్వారం దుర్గాప్రసాద్‌గారి ఇంటికి వెళ్లాలన్నాను. ఆ చోటు పేరు చెప్పి, ‘మాస్టారుగారు’ అని అడగండి, ఎవరైనా చెబుతారు అన్నదామె. పాత్రికేయుడు ప్రసాద్‌గారిని తోడుగా పెట్టుకుని బయలుదేరాను. వెతకగా, వెతకగా ఇల్లు దొరికింది. కానీ తాళం వేసి ఉంది. దుర్గాప్రసాద్‌గారు ఊళ్లో లేరు. ఆ వెదుకుతున్నంత సేపు నా జేబులోంచి వినపడుతున్నది వారి వాద్యమేనని చెపితే ప్రసాద్‌ ఆశ్చర్యంగా, ఆనందంగా నావేపు చూచాడు. ఈలోగా నేను వెళ్లిన అసలు కార్యక్రమానికి టైమయింది. నిజానికి నన్ను పిలిచింది ఒక స్కూల్‌ వాళ్లు. సూర్యుడి పేరున్న ఆ బడిలో గణితం రామానుజన్‌ పేరున పండగ చేస్తున్నారు. పిల్లలతో, తల్లిదండ్రులతో, పంతుళ్లతో వేరువేరుగా కలగలిపి చాలా మాటలు, ఉపన్యాసాలు జరిగాయి. వాళ్లెంతో ఆదరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడి తాండ్ర, మోతీచూర్‌ ఇచ్చి సాగనంపారు. విజయనగరంలో ఉత్తర భారతీయులు బోలెడంత మంది ఉన్నారు గనుక మోతీచూర్‌ అక్కడ స్పెషాలిటీ అయిందన్నారు. ఆశ్చర్యం కలిగింది. ఆ ఊళ్లో దుస్తులు చాలా చవకగా, నాణ్యత గలవి దొరుకుతాయన్నారు. అందుకు టైమ్‌ లేదు. ఆసక్తి అంతకన్నా లేదు.


ఇజీనారానికి బ్రహ్మపురమనే బరంపురం చాలా దగ్గర. నాకు బరంపురం మసాలా గుర్తుకు వచ్చింది. పాత్రికేయుడు ప్రసాద్‌ గట్టివాడు. ఒక ఫోన్‌కొట్టి నన్ను ఒక మార్కెట్‌లోని సందులోకి తీసుకెళ్లాడు. నేను అడిగిన పదార్థం దొరికింది. కొని తెచ్చాను. అక్కడ దాన్ని విప్పాలన్న ఆలోచన కూడా లేదు. ఇల్లు చేరిన తరువాత విప్పి రుచి చూసాను. నాకు గుర్తున్న నాణ్యత లేదు. సరికదా ఇది మరీ నాసిగా ఉంది. బరంపురం కేతకీ మసాలాలో, తాంబూలంలో తినదగ్గ సుగంధ ద్రవ్యాలన్నీ ఉండాలి. ఉండేవి. నామమాత్రంగా ఉన్నాయిప్పుడు. నిజం చెప్పకపోతే తప్పు! అందులో పొగాకు కూడా ఉండాలి. ఉండేది. ఉంది! నాసిగా!


Sunday, August 10, 2025

Bandit Queen - A novel by Bankim Babu

 Bandit Queen



Bankim Babu


Excerpts:

Bhutanath village in Barendra county was where Profullo and her mother were going.  That was home to Profullo’s father-in-law, Hara Ballav Babu.  Profullo’s father-in-law was a wealthy man.
He owned land, houses, a temple, a walled garden, a lake.   All of this was but six miles from Profullo’s home.  Walking, Profullo and her mother reached there about three in the afternoon.
Once there, Profullo’s mother could barely make herself enter the house.  It was not that Hara Ballav Babu despised them for being poor.  No.  It was what had happened after the wedding.
Profullo was surpassingly beautiful, a matchless beauty.  This was why Hara Ballav had selected her for his son.  Delighted at this good fortune, Profullo’s mother had spent all her money on the wedding, and on lavish food for the groom’s party.  Unfortunately she had not provided half as much to her neighbors, the bride’s party.  Insulted, they had refused to eat and walked out.  Profullo’s mother had been angry, and had let her neighbors know it.  Deeply offended, they had taken their revenge.
On the third day of a wedding, the bride ritually enters her husband’s kitchen and touches the food and the cookware, showing that she is now part of her husband’s household, that she has a right to his food, and she has brought good fortune with her.
On that day, Profullo’s neighbors, (who had been invited to the feast) refused to eat.  Surprised, Hara Ballav had asked what, if anything, was wrong with the food.  Their answer shocked and dismayed him.  Profullo’s mother, they claimed, was a widow, and had lost caste by keeping bad company.  A rich man may do as he pleased, but they were poor people with nothing but their honorable caste to lose.  And they were not going to lose that by eating what Profullo had touched.  Why would they lie?
The next day Hara Ballav had sent Profullo home to her mother.
Now, as Profullo’s mother looked at Hara Ballav’s house, she trembled.  Yet they had come, they had screwed up their courage and come.  There was no going back now. Mother and daughter entered the house.
At that moment, Hara Ballav was taking his post-prandial rest.  Hara Ballav’s wife was getting her hair done – which meant having her grey hairs plucked out. 


Want to read the book?

No intention of impinging copyrights. Strictly for personal pleasure!

Download from Here!

Friday, August 8, 2025

a page from Arudra's Koonalamma Padalu

Arudra was wonderful song writer.
That is only what many people know!

He was much more than that!

He wrote crime stories like "Palakla Vendi Glasu" and others.
His "Samagra Andhra Sahityam" volumes are nothing less than a Magnum Opus.
A university or an institute could not come up with such a research work on Telugu literature.

He was very good at Humor!
Koonalamma Padalu is one such master piece!


Here is a page from the book!


Great Bapu's cartoons make the words much more meaningful!


Click on the page to see it bigger!


Sunday, July 27, 2025

Kahlil Gibran in Telugu - Sphinx


ఖలిల్ జిబ్రాన్ కథ - స్ఫింక్స్ మాట


The Sphinx spoke only once, and the Sphinx said, "A grain of sand is a desert, and a desert is a grain of sand; and now let us all be silent again."
స్ఫింక్స్ ఒకేసారి మాటాడింది, స్ఫింక్స్ అన్నదిగదా, ఒక్క ఇసుకరేణువే ఎడారి, ఇక ఎడారి అంటే ఒక్క ఇసుకరేణువు మాత్రమే, ఇక ఇప్పుడు మనం మళ్లా మౌనంగా ఉందాం అని.
I heard the Sphinx, but I did not understand.
నేను స్ఫింక్స్ మాటలు విన్నాను, కానీ నాకు అర్థంకాలేదు.
Long did I lie in the dust of Egypt, silent and unaware of the seasons.
నేనెంతో కాలం ఈజిప్ట్ దుమ్ములో పడి ఉన్నాను, నిళ్ళబ్దంగా, కాలం గతి తెలియకుండా.
Then the sun gave me birth, and I rose and walked upon the banks of the Nile,
అప్పుడు సూర్యుడు నాకు బతుకునిచ్చాడు, ఇక నేను లేచి నైలు గట్లమీద నడిచాను,
Singing with the days and dreaming with the nights.
పగలు పాడుతూ, రాత్రులు కలలుగంటూ.
And now the sun threads upon me with a thousand feet that I may lie again in the dust of Egypt.
నేను మళ్లీ ఈజిప్టు దుమ్ములో పడి ఉండాలని, సూర్యుడు నన్ను చుట్టుకుంటాడు.
But behold a marvel and a riddle!
కానీ  వింతనూ చిక్కుప్రశ్ననూ చూడండి
The very sun that gathered me cannot scatter me.
నన్ను ఒకటి చేసిన సూర్యుడు నన్ను చెదరగొట్టలేడు.
Still erect am I, and sure of foot do I walk upon the banks of the Nile.
నేనింకా నిటారుగా నిలుచున్నాను, నైలు గట్లమీద నమ్మకంగా నడయాడుతున్నాను.

It may sound like a joke!

It has a lot of thought behind!


Tuesday, July 22, 2025

Maa Ooru - Lokabhiramam - 5

Maa Ooru - Lokabhiramam -5 

My article that appeared in my book
and before that my column in 
Andhra Bhoomi daily, Sunday Magazine.



మా ఊరు

 

పేర్లు పెట్టడం అనేది ఒక గోకుడు. అది ఆ వస్తువును స్వంతం చేసుకోవాలన్న గోకుడు లాంటిదే  ` ఎడ్వర్డ్‌ ఆబి

ఎప్పుడో ఒకసారి, చెప్పడానికి ఏముంది అని ఓ కవిత రాశాను. ‘అందరితో కలిసి ఉంటున్నందుకు నేను ఉన్నాను’ అన్నాను.  కనుక ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదని కూడా అన్నాను. కానీ మనసు మారినట్టుంది, చెప్పడానికి చాలానే ఉంది అని కూడా అన్నాను. చెప్పదలుచుకుంటే ఎంతయినా చెప్పవచ్చు. మూడు సంవత్సరాలనుంచి లోకాభిరామం పేరుతో చాలా సంగతులు చెపుతున్నాను. పెద్దలు, పిన్నలు, తెలిసిన వాళ్లు, తెలియనివాళ్లు చాలామంది బాగుందని కూడా అన్నారు. ఈ మధ్యన ఒకచోటికి వెళ్లవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన చాలామందిలో నాకు పరిచయమున్న వాళ్లు నలుగురే. ఆ నలుగురితోనే నాలుగు మాటలు మాట్లాడి, మరో నలుగురితో పరిచయం చేసుకునే ప్రయత్నాలు చేసి చివరికి ఇంటిదారి పట్టే సందర్భంలో  కళకళలాడుతున్న ఒక అమ్మవారు దగ్గరగా వచ్చారు. బాగా పరిచయమున్నట్టే పలకరింపులు కూడా లేకుండా ‘మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలండీ’ అన్నారు. ‘ఉన్నట్టుండి లోకాభిరామం వ్యాసాల్లో తెలంగాణం భాష ఎందుకని వస్తుంది?’ అని ఆమెగారి అనుమానం. అప్పుడు నాకు మా ఊరు మళ్లీ గుర్తుకువచ్చింది. ఊరు గురించి, గతం గురించి, నా గురించి చెప్పినప్పుడంతా అలవాటుగా చిన్ననాటినుంచి, నేటివరకు ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటల తీరు బయటికి వస్తుంది. అదే సంగతి ఆ అమ్మగారితో చెప్పాను. ఆవిడ నవ్వేసి వెళ్లిపోయారు. ఆలోగా నా వ్యాసాలను వారి వాళ్లందరూ క్రమం తప్పకుండా చదువుతారని, అవెంతో బాగుంటాయని కూడా అభిమానం ఉట్టిపడే పద్ధతిలో చెప్పి మరీ వెళ్లారు. నాకు ఆనందమయిందా? ఏమో? అయ్యే ఉంటుంది!
మా ఊరు పేరు ఏనుగొండ. ఇంగ్లీషులో మాత్రం ‘వై’తో మొదలుపెట్టి రాస్తారు. మరిదాన్ని యేనుగొండ అనాలి కదా! కానీ అలా పలకడం అంత సులభంగా ఉండదు. కనుక అందరూ ఏనుగొండ అని మాత్రమే అంటారు. నన్ను ఇప్పటికీ మా వాండ్లందరు ఏనుగొండ గోపి అని మాత్రమే పిలుస్తారు. ఈ దేశంలో చాలా ఊళ్లున్నాయి. రాంపూర్‌ అనే ఊళ్లు మనదేశంలో 84 ఉన్నాయట. ఇది తపాలాశాఖ వారు చెప్పిన సమాచారం. నేను మాత్రం బల్లగుద్ది, మరిదేన్నయినా గుద్ది నమ్మకంగా చెప్పగలను, ఏనుగొండ అనే ఊరు మరొకటి లేదు. మా ఊరు పక్కనే పాల్కొండ లేదా పాలకొండ అనే ఊరు కూడా ఉంది. చారిత్రక ఆధారాలు తెలియవు గానీ, ఆ పాలకొండ నిజానికి పాలకుండ అని, మా ఊరేమో వెన్నకుండ అని పెద్దవాళ్లు చెప్పారు. ఆ పేర్లు రానురాను పాలకొండ, ఏనుగొండగా మారాయి. లోకాయపల్లి సంస్థానం అని ఒకటి ఉండేదట. ఆ సంస్థానం దొరలకు ఈ ఊళ్లనుంచి పాలు, వెన్న అందేవట. ఇవన్నీ అట అన్న సంగతులేగానీ ఎంతవరకు నిజాలో నాకు తెలియదు. మా ఊరికి కొంతదూరంలో ఉన్న ఒకానొక గుట్టకు ఊరగుట్ట అని పేరు. దానిమీద ఒక విచిత్రమయిన రాయి ఉంటుంది. మామిడికాయ ఆకారంలో ఉండే ఆ రాయి, ఎప్పుడు దొర్లి పడుతుందా అన్నట్టు ఒక పెద్దరాతి మీద కొంతమాత్రమే కింద రాతికి తగిలి నిలబడి ఉంటుంది. పుట్టినప్పటినుంచి చూస్తున్నాను, అది పడను మాత్రం పడలేదు. హైదరా బాద్‌ చుట్టూ ఇటువంటి రాళ్లను పరిశీలించే ఒక బృందం ఉంది. వాళ్లు మా రాతిని, మామిడికాయ రాతిని చూచింది, లేనిది తెలియదు.
ఏనుగొండ అనే మా ఊరు మొదట్లో ఆ గుట్టకింద ఉండేదట. గుట్టకింద అంటే గుట్ట ఉన్నచోట కాదు. దాని పక్కన అని అర్థం. అక్కడినుంచి ఊరు రెండు అంచెలలో ప్రస్తుతం ఉన్నచోటికి వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా గుట్ట ప్రాంతంలో, మధ్యలో ఉండే పొలాలలో తవ్వకాలు జరుగుతూ ఉంటే బూడిద, కాలినమన్ను, కుండముక్కలు లాంటివి దొరికాయి. ఒకానొక పొలంలో ఏకంగా గణేశుని విగ్రహం దొరికింది. ఆ విగ్రహానికి ఎక్కడో ఒక చిన్న లోపం ఉన్నట్టు నేను గమనించాను. అవి నేను బడిలో చదువుకుంటున్న రోజులు. ఫలానా వాళ్ల పొలంలో దేవుడు దొరికాడు అని ఊళ్లో కలకలం మొదలయింది. అందరమూ కలిసి వెళ్లాము. గణేశుని విగ్రహాన్ని తవ్వి బండికి ఎత్తించి ఊళ్లోకి తెచ్చాము. అది భారీగానే ఉంది. దానికి పూజలు, పురస్కారాలు కూడా జరిగినట్టు గుర్తు. ఇటువంటి సందర్భాలలో నాన్న నిశ్శబ్దంగా ఉండేవాడు. ఊళ్లో బ్రాహ్మణ కుటుంబాలు రెండే రెండు. అందులో మాది ఒకటి. విగ్రహం దొరికినప్పుడు దాన్ని చూడడానికి నాన్న తప్పకుండా వచ్చి ఉండాలి. ఆయన వచ్చినట్టు నాకు గుర్తులేదు. తరువాత ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. విగ్రహంలో లోపం ఏర్పడితే దాన్ని భూస్థాపితం చేయడం పద్ధతి అట. అట్లా చేసిన విగ్రహం ఏదో ఒక రకంగా మళ్లీ అందరి దృష్టికి వచ్చింది అని ఆయన అన్నారు. నాకూ నిజమే అనిపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత ఆలోచిస్తే, ఆ విగ్రహం ఏమయింది అన్న ప్రశ్న నా మెదడులో ఇవాళ పుట్టింది. దానికి పూజలు ఎందుకు కొనసాగలేదు అన్న ప్రశ్న కూడా మనసులో తొంగి చూచింది. నేను ఈ మధ్యన మా ఊరికి వెళ్లడానికి కారణం కనిపించడం లేదు. ఈసారి వెళ్లి గణపతిని వెతకాలి.
ఊళ్లో ఒక ఆంజనేయుని గుడి ఉన్నది. దాన్ని చిన్నప్పటినుంచి హనుమాండ్ల గుడి అనడం అలవాటు. నేను కనీసం హ అనే అక్షరం వాడాను. మా ఊరి వాండ్లకందరికీ అది అన్మాండ్ల గుడి మాత్రమే. నాకు తెలిసి అందులో నిత్యం ధూపం, దీపం నడిచేది కాదు. ఊళ్లో మాకున్న కొద్దిపాటి పొలం ఇనాం భూమి అని చెప్పారు. ఏం చేయడానికి ఆ ఇనాం ఇచ్చారో నా వరకు రాలేదు. ఆ గుడిలో దీపం పెట్టే బాధ్యత మాత్రం మాది కాదని, ఆ బాధ్యత ఎవరికీ లేదని అనుభవం వల్ల నాకు తెలిసింది. నేను చదువు పేర ఊరి వదిలి బయటకు వచ్చిన తరువాత ఆ గుడిని మరమ్మతు చేయించారు. నిత్యం పూజలు చేయగల కుటుంబాలు ఊళ్లో లేవు. ఈ మధ్యన మరెవరో పై ఊరి పెద్దమనిషి వచ్చి ఊళ్లో ఉంటున్నాడని, పౌరోహిత్యం సాగిస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. ఆయన ఏమయినా గుడిని పట్టించుకుంటున్నాడేమో తెలియదు.
కార్తీకమాసం వస్తే ఊళ్లో వాళ్లు రోజుకు ఒకరు చొప్పున కార్తీకపూజ అనే ఆకుపూజ చేయించే వారు. నాకే నమ్మకం కలగదుగానీ కొంతకాలం ఆ పూజలు చేసే బాధ్యత నా తలమీద పడింది. తెలిసిన కుటుంబాల వారు పొద్దున్నే సరంజామాతో వచ్చి ‘ఇవాళ కార్తీకం చెయ్యాలె! అన్మాండ్లకు చెండూరం పెట్టు, సాయంత్రం పూజ కూడ చేయించు’ అని అడిగేవారు. నాన్న ఎందుకో పౌరోహిత్యం చేయడు. కనుక నేను కాదనలేక పోయే వాడిని. సరంజామాలో సాహిత్యం ఉంటుంది. ఈ సాహిత్యానికి అక్షరాలకు సంబంధం లేదు. ఆ రోజున దేవుని నైవేద్యానికి, నా తిండికి సరిపడ బియ్యం, పప్పు, బెల్లం, కూరగాయలు లాంటివి కలిపితే దానిపేరు సాహిత్యం. సాహిత్యం అన్నమాటకు సరయిన అర్థమేమిటో ఇప్పటికయినా నేను వెతుక్కోవాలి. ఇక సింధూరం, నూనె కూడా ఉంటాయి. నూనె కలిపిన సింధూరాన్ని హనుమంతుని విగ్రహానికి పట్టించాలి. ఆ పని చేతులతోనే చేయాలి. చేతికి, గోళ్లలో పట్టిన రస సింధూరం నా శరీరానికి

 హాని కలిగిస్తుందని నాకు అప్పట్లో తెలియదు. తెలిసిన తరువాత ఎవరూ నన్ను కార్తీకం చేయించమని అడగలేదు. నేను అక్కడ ఉంటే గదా!
ఝలక్‌ : ఈ ముక్క రాస్తూ ఇక్కడ ఆపాను. చిత్రంగా అనుకోకుండా మరునాడు మహబూబ్‌నగర్‌ అనే పాలమూరుకు వెళ్లాను. అదేదో జక్కడు జాతరకు పొయ్యొచ్చినట్టు, పాతి ముట్టిచ్చుకోని (అంటే ఏమో ఎవరికన్న తెలుసునా పోవలసిన చోటికి పొయ్యి, వంటల పొయ్యి కాదు, వెళ్లి, చేరి లాంటిదన్నమాట, దాన్ని తాకి వెనిక్కి వస్తే అది పాతి ముట్టిచ్చుకోవుడు) తిరిగి వచ్చిన. నాకిప్పుడు ఏనుగొండలోకి పొయ్యే మనసు లేదు, సమయము అంతకన్నా లేదు. పోయే టప్పుడు తొందర, తిరిగి వచ్చేటప్పుడు అంతకన్నా తొందర. మొత్తానికి నాకొక చిత్రం అర్థమయింది. ఈ చిత్రము విచిత్రము గావచ్చును లేదా బొమ్మ గావచ్చును. పంచాయతి సమితిగా నాకు తెలిసిన మా ఊరు ఇప్పుడు, పట్నమయిన పాలమూరు అను మహబూబ్‌నగర్‌లోని ఒక వార్డు మాత్రమే అయింది.
ఊరి గుర్తింపు గంగలో పోయింది. అయినాసరే, మా ఊరి గురించి చెప్పుకోవలసిన సంగతులు నా మనసులో మాత్రం కావలసినన్ని ఉన్నయి.



Thursday, July 17, 2025

Sangeethapriya - Lokabhiramam 4


Sangeethapriya 

Here is my article "Sangeethapriya"

That appeared in Andhrabhoomi daily
long back.


కర్ణాటక సంగీతమనే చీమ కుట్టింది. సంగీతమంటే, ఇదే సంగీతం మిగతాదంతా కాదు అన్న భావం బాగా గట్టిబడింది. మొదట్లో శాస్త్రియసంగీతం వినాలంటే రేడియో ఒక్కటే దిక్కు. చిన్నప్పటినుంచీ, ఇంట్లో రేడియో, ట్రాన్సిస్టర్‌ రూపంలో ఉంది గనుక సరిపోయింది. చదువు పేరున ఇల్లు విడిచి దేశం మీద పడినప్పుడు మొదట్లో రేడియో లేదు. సంగీతం అంతకన్నా లేదు. వరంగల్‌లో ఎం.ఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడ, సంగీత కచేరీలు జరిగేవేమో తెలియదు. అక్కడి మెడికల్‌ కాలేజీలో ‘రేడియో’ సంగీత్‌ సమ్మేళన్‌’లో భాగంగా, శంకర్‌, సుబ్రమణ్యం, వైద్యనాథన్‌ సోదరుల వయొలిన్‌ త్రయం కచేరీ జరిగింది. ఆ సంగతి తెలిసి నేను వెళ్లాను. అక్కడ జరిగిన రెండవది గాత్ర కచేరీ, ఎవరిదో గుర్తులేదు. సోదరత్రయానికి మృదంగం మీద సహకరించినది పాలఘాట్‌ మణి అయ్యర్‌ గారని గుర్తుకువస్తే, ఒళ్లు జలదరిస్తుంది. ఆయనను నేను మళ్లీ చూడలేదు. ఆ అపర నందీశ్వరుడు కనిపించినపుడు, ఆయన గురించి నాకు అంతగా తెలియదు. వరంగల్‌లోనే భద్రకాళి గుడిలో ఎం.ఎస్‌. బాలసుబ్రహ్మణ్య శర్మగారి కచేరీ విన్నాను. ఆయన తన్మయత్వంలో ఎవరినీ పట్టించుకోకుండా పాడడం చాలా బాగనిపించింది. అక్కడ జనం గోల చేస్తుంటే, ఆయన ఆపి, గట్టిగా అరిచి, మళ్లీ పాట మొదలుపెట్టారు. బాగా గుర్తుంది!

శాస్త్రియ సంగీతం ఒకటి ఉంటుందని తెలియకుండానే చాలామంది బతుకు చాలిస్తారు. తెలిసిన వాళ్లు కూడా చాలామంది వినరు. విన్న వారికి చాలామందికి, ‘నాకిది అర్థం కాదు’ అన్న భావం ఉంటుంది. తిండి తినే వారందరికీ వంట గురించి తెలుసునా? తినడం చాలదా? సంగీతం వింటే చాలదా? అది తెలిస్తే రుచి పెరుగుతుందేమో గానీ, తెలియకుండానే వింటున్నాను నేను. అయినా బాగుంది.

హైదరాబాదుకు చేరేలోపలే, ఒక మిత్రుడిచ్చిన చిన్న ట్రాన్సిస్టరు ఒకటి నాకు సంగీతాన్ని, సంతోషాన్ని పంచి పెట్టింది. నాలుగు రూకలు రావడం మొదల యింతర్వాత ఒక ట్రాన్సిస్టర్‌ కొన్నాను. హాస్టల్లో చాలామందికి, పాటలు వినాలన్న కోరిక ఉన్నా, రేడియో కొనాలన్న ఆలోచన మాత్రం లేదు. నేను చదివే పుస్తకాలు, మెచ్చుకునే సినిమాల కారణంగా, మిత్రులంతా కలిసి నాకు, ‘తాతయ్య’ అని పేరు పెట్టారు. ‘తాతయ్య రేడియోలో సంగీతం తప్ప, సినిమా పాటలు పలకవు, వదిలేయండి’ అనేవారు. నల్లకుంటలో ఒక గదిలో, తమ్మునితో బాటు ఉంటున్నప్పుడు, కూరలకని బయలుదేరి, టేప్‌రికార్డర్‌ కొని తెచ్చాను. ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోయి ఇచ్చినట్టు గుర్తు. అప్పటికి రికార్డెడ్‌ కాసెట్లు అంతగా వచ్చేవి కావు. నా దగ్గర మరీ అంతగా పైసలు ఉండేవీ కావు.

రేడియోలో మీడియం వేవ్‌లోనే మద్రాసు కూడా వినిపించేది. బాలమురళి కచేరీ, కాసెట్లో రికార్డ్‌ చేసి విన్నాను. సంగీత సేకరణకు అది ప్రారంభం. కమర్షియల్‌ కాసెట్లకు బోలెడు డబ్బులవుతాయి. ఖాళీది కొని ఆ కాసెట్లకు కాపీలు చేసి ఇచ్చే వాళ్లున్నారని తెలిసింది. అది అన్యాయమనీ, కళాకారుల పట్ల ద్రోహమనీ భావం ఉన్నా కొంత కాలం తప్పలేదు. కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత కాసెట్లు అసలు రికార్డింగులనే కొనడం మొదలయింది. రేడియో కచేరీలను రికార్డు చేయడం కూడా సాగింది. అప్పట్లో ఒకసారి ఎల్లా వెంకటేశ్వరరావుగారు, శంకరమఠంలో 24 గంటలపాటు మృదంగం వాయించి రికార్డు సృష్టించారు. నేను నా టేప్‌ రికార్డర్‌తోబాటు వెళ్లి, కార్యక్రమంలో కొంత భాగం, ఒక గంటపాటు రికార్డు చేశాను. ఆ రికార్డింగ్‌లో నేను బంధించిన ఎన్‌.ఎస్‌.శ్రీనివాసన్‌, ఎల్లా గారలు తరువాత నాకు సహోద్యోగులు, మిత్రులు అవుతారని కలలో కూడా ఊహించలేదు. అంతకన్నా ఆశ్చర్యం, ఆ రికార్డింగ్‌ను ఎమ్‌పీ త్రీగా మార్చి, ఇంటర్‌నెట్‌లో ప్రపంచంతో పంచుకుంటానని అసలే అనుకోలేదు.

ఎక్కడ కచేరీ జరిగినా, తిండిని కూడా మరచి వెళ్లి కూచోవటం అలవాటయింది. సీకా వాళ్లు టికెట్లు అమ్ముతున్నారంటే, వారం రోజులపాటు మంచి సంగీతం వినడానికి గొప్ప అవకాశం. రవీంద్రభారతిలో జరిగే, వారి ఫెస్టివల్‌ టికెట్ల మీద, ఇంకా నంబర్లు వేయకముందే వెళ్లి, నాకు కావలసిన వరుసలో, చివరి సీటు నంబరు వేసుకుని, టికెట్‌ తెచ్చుకున్నాను. సంగీతం వినడానికి ఏకంగా మద్రాసుకే వెళ్లడం దాకా చేరింది పరిస్థితి.

ఒక్కసారి అక్కడి నుంచి, ఇటీవలి కాలంలోకి వస్తే, కంప్యూటర్‌ వచ్చింది. పాతకాలం, టేపులు, క్యాసెట్ల మీది రికార్డింగులను డిజిటయిజ్‌ చేసి వింటున్నారు. అటువంటి సంగీతాన్ని, ఇంటర్‌నెట్‌లో పంచుకుంటున్నారు. నేను ఇట్లాంటివేమీ మిస్‌ కాలేదని గర్వంగా చెప్పగలను. ఒక సహోద్యోగి అన్న మాట మీద పట్టింపు వచ్చి కంప్యూటర్‌ వాడడం నేర్చుకున్నాను. అందులో మంచి నైపుణ్యాన్ని సాధించానని చెప్పగలను. రికార్డింగులను డిజిటయిజ్‌ చేయడమూ నేర్చుకున్నాను. ఆ రికార్డింగులను ఇంటర్‌నెట్‌లో పంచుకోవడమూ నేర్చుకున్నాను. నా దగ్గర ఉన్న కాసెట్‌ రికార్డులన్నీ అయిన తరువాత, సరేలే, మనకెందుకన్నట్లు ఊరుకున్నాను. స్వర్గీయ మిత్రులు శ్రీనివాసన్‌ గారింట్లో ఆయన సేకరించిన కాసెట్లు ఉన్నాయి. శారదా శ్రీనివాసన్‌గారి మంచితనం వల్ల, వాటినన్నిటినీ తెచ్చి, ‘కన్వర్ట్‌’ చేయసాగాను. వాటిని నా ‘బ్లాగు’ ద్వారా ప్రపంచంతో పంచుకోవడమూ మొదలయింది. ఈ ప్రపంచంలో ఒకే ఆసక్తి గలవారంతా, ఒక చోట చేరడంలో ఆశ్చర్యం లేదు. ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో అది మరింత సులభంగా వీలవుతుంది.

శ్రీనివాసన్‌ రాజగోపాలన్‌ అనే ఒక ఉత్తముడు, ఇంటర్‌నెట్‌లో ‘సంగీతప్రియ’ పేరున కర్ణాటక సంగీత అభిమానుల బృందాన్ని రూపొందించారు. నా ఆసక్తి, శ్రమ వాళ్ల దృష్టిలోకి వచ్చింది. నేను సేకరిస్తున్న సంగీతాన్ని, వాళ్లతో పంచుకోవలసిందిగా పిలుపునిచ్చారు. నాకు మొదట్లో అంతగా ఉత్సాహంగా ఉండలేదు. కానీ, అప్పటికే ఇంటర్‌నెట్‌ ద్వారా, సంగీతాన్ని పంచుకునే మిత్రులతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో కొందరు అప్పటికే ‘సంగీతప్రియ’ బృందంలో ఉన్నారు. బరోడాలో ఉండే, కన్నడిగులయిన మిత్రులు గురుమూర్తిగారు, నన్ను ప్రోత్సహించారు. ‘ఈ పేరున మనకు సేకరణ మీద శ్రద్ధ పెరుగుతుంది. ధ్యాసగా సంగీతం వినడం, అవసరంగా మారుతుంది’ అన్నారు. ‘నిజం గదా!’ అనిపించింది. ఒక ఉద్యమం మొదలయింది. ఇవాళ ఇంట్లో వేల గంటల సంగీతం వచ్చి చేరింది. ఎక్కడెక్కడి నుంచి, మిత్రులు (కేవలం సంగీత మిత్రులు) వారి దగ్గరున్న రికార్డింగులు, టేపులు, కాసెట్ల రూపంలో పంపుతున్నారు. తిండి, పుస్తకాలతో బాటు, శాస్త్రియ సంగీతం, బతుకులో ఒక ముఖ్య మయిన భాగమయింది.

నా గొప్ప చెప్పుకోవడానికి మరెవరూ లేనప్పుడు, అదేదో నేనే చెప్పుకోవాలట! కర్ణాటక సంగీత ప్రచారానికి సేవ చేసిన వారికి, ‘సంగీతప్రియ’ వారు ‘రసిక ప్రియ’ అని ఒక అవార్డును ప్రారంభించారు. 2011 సంవత్సరానికిగాను, ఆ బహుమతిని నాకు ఇచ్చారు. 2012 ఫిబ్రవరిలో చెన్నైలో నాకు ఆ బహుమతిని ఇచ్చారు. ఈ సంగతి, సంగీతాభిమానులయిన కొందరికి తప్ప, చాలామందికి తెలియక పోవచ్చు! నా సంతోషం కొరకు నేనేదో చేస్తుంటే, మీరు నన్ను పిలిచి సన్మానిస్తున్నారు. అది మీ మంచితనం!’ అన్నట్లున్నాను ఆ సభలో!

గోపాలం, ఇలాంటి పనులు చేస్తాడని చెప్పి, రికార్డింగులు అడిగితే ‘ఆయనకు ఏం ఇంటరెస్టు? ఏం లాభం?’ అని అడిగారట ఒక విద్వాంసులు. వినయంగా విన్నవించుకుంటున్నాను, ‘నాకు ఖర్చేగాని డబ్బు రాదు. కానీ, కలిగే ఆనందానికి అంతుల్లేవు!’

మన దేశంలో గ్రామోఫోన్‌ రికార్డింగుల తయారీ 1903లో మొదలయిందంటారు. సేలం గోదావరి అనే ఆవిడ ఎంతమందికి తెలుసు? కోయంబత్తూరు తాయి రికార్డులు రేపిన సంచలనం గురించి కథలుగా చెపుతారు. విజయనగరానికి చెందిన కళాకారుడొకాయన ఆ రోజుల్లోనే ఈలపాట మీద కర్ణాటక సంగీతం వినిపించారు. పాతకాలపు రికార్డు చాలామంది ఇళ్లలో పడి ఉన్నాయి. అలాంటి వాటిని సేకరించి పాటలను అందరితో పంచుకోవాలని, నాలాంటి కొందరు తాపత్రయ పడుతున్నారు.

తిరువయ్యారులో త్యాగరాజస్వామి వారి ఆలయం, బెంగుళూరు నాగరత్నమ్మ అనే గాయని పుణ్యమా అని కట్టబడింది. ఆమె గురించి మిత్రులు శ్రీరామ్‌ వెంకటకృష్ణన్‌, ‘దేవదాసి అండ్‌ ఎ సెయింట్‌’ అని పుస్తకం రాశారు. దానికి తెలుగు అనువాదం కూడా వచ్చింది. సంగీత, సాహిత్య అభిమానులందరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి. తెలుగు సాహిత్యం గురించి నాగరత్నమ్మ పడిన కష్టాలు గొప్పవి!

శ్రీ  శ్రీ  శ్రీ

శిశువులకు, పశువులకు, పాములకు గూడా సంగీతం తెలుసును, అని అర్థం వచ్చే మాట ఒకటి మనవాళ్లు చెపుతుంటారు .

శ్రీ  శ్రీ  శ్రీ

మాటను సాగదీసి, పాటగా మార్చిన మొదటి మనుషులెవరో గానీ, వారికి ఈ ప్రపంచం మొత్తం రుణపడి ఉంది. పాటలేని ప్రపంచం చాలా బోసిగా ఉంటుంది కదూ!