Showing posts with label writers. Show all posts
Showing posts with label writers. Show all posts

Monday, September 21, 2026

రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి


ఇస్మత్‌ చుగ్తాయి

              మహానటుడు శశికపూర్‌ సొంత ఖర్చుతో, సొంత ఆలోచనతో తీసిన సినిమా ఒకటి ఉంది. అది అర్థంలేని ప్రేమ గురించిన సినిమా. అందులో నాయకుడు ఒక బ్రిటిష్‌ ఆఫీసర్‌ కూతురిని మరీ మరీ ప్రేమించేస్తాడు. మనకికక్కడ ఆ సినిమా ముఖ్యం కాదు. హీరోయిన్‌ తల్లి పాత్రలో శశికపూర్‌ భార్య జెనిఫర్‌ కనిపిస్తుంది. ఆమెకు తల్లిగా ముగ్గుబుట్టలాంటి తల ఉన్న ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె సినిమా మొత్తంలోనూ మాట్లాడదు. కానీ, కథలో బలమయిన భాగంగా మిగులుతుంది. నిజానికి ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి సినీ నటి కాదు! ఆమె ప్రసిద్ధ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయి!  సాహిత్య రంగంలో అందరూ ఆమెను ఇస్మత్‌ ఆపా అంటారు. ఉర్దూలో ఆపా అంటే అక్కయ్య. సినిమాలో చూచినవాళ్లకు ఆ వ్యక్తి గురించి అభిప్రాయాలు ఏర్పడే వీలే లేదు. మహా కలిగితే, జాలి కలుగుతుంది. కానీ, ఇస్మత్‌ ఫయర్‌ బ్రాండ్‌ రచయిత్రి. ఆమె క్రూరులకే క్రూరుడయిన చంగేజ్‌ ఖాన్‌ వంశంలో పుట్టిందని ఎక్కడో చదివినట్టు గుర్తు.

              ఇస్మత్‌ ఛుగ్తాయి పుట్టుకతోనే తిరుగుబాటు స్వభావం గల మనిషి. మగరాయుడులాగ బతికింది. తన యిష్టం వచ్చినట్టు బతికింది. ఆవిడ కథలు, నవలలు, వ్యాసాలలో కూడా అదే పద్ధతి బలంగా కనిపించింది. సమకాలీనుడు సాదత్‌ హసన్‌ మంటో కూడా ఈ రకం మనిషే. అతను బతుకంతా కష్టపడ్డాడు. ఇస్మత్‌ మాత్రం బతుకంతా పోరాడుతూనే ఉన్నది.

              ఇస్మత్‌ చుగ్తాయి 1915లో పుట్టిందన్నారు. ఈ మధ్యన మాత్రం 1911లో అంటున్నారు. ముస్లిం కుటుంబాలలో ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరం లేదని గట్టి కట్టుబాట్లు ఉన్న ఆ కాలంలోనే, ఇస్మత్‌ ఎదురు తిరిగింది. బడికి వెళ్లింది. అక్కడితో ఆపకుండా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. సుమారు మూడు సంవత్సరాల పాటు వేరు వేరు చోట్ల పంతులమ్మగా పనిచేసింది. ఇంకా పైకి చదువుకున్నది. ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ స్కూల్స్‌ ఉద్యోగానికి ఎక్కింది. ఆ కారణంగా ఆమె బొంబాయి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఇస్మత్‌ పెళ్లి కూడా చేసుకున్నది. ఇద్దరు అమ్మాయిలను కన్నది.  ఉద్యోగం మానేసి రచనలతోనే కాలం గడుపుతూ, చివరి దాకా అక్కడే బతికింది.

              ఇస్మత్‌ చుగ్తాయి రచనారంగంలోకి రావడానికి బొంబాయిలోని వామపక్ష అభ్యుదయ రచయితల బృందం కారణం అంటారు. నిజానికి ఆ బృందంలో సభ్యురాలయిన రషీద్‌ జహా అనే గైనకాలజిస్ట్‌ ఇస్మత్‌ మీద నిజమయిన ప్రభావం కనబరచిన వ్యక్తి. ఆ డాక్టరమ్మ ఆదర్శభావాలన్నింటినీ పొందుపరుస్తూ కథలు రాసేది. ఆ ప్రభావంతోనే ఇస్మత్‌ కూడా నాటకాలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టింది. 1945లో ఆమె రాసిన నవల ఉర్దూ సాహిత్యంలోనే గొప్ప రచనల్లో ఒకటిగా పేరు పొందింది. నవల పేరును తెలుగులో ‘వంకర గీత’ అని చెప్పుకోవచ్చు. ఆ నవల నిజానికి రాసిన తరువాత యాభయి సంవత్సరాలకు అచ్చయింది. అందులో ఆమె ఆడవారి లైంగికతను, ఆ విషయంగా వచ్చే సమస్యలను జంకు లేకుండా చర్చించింది. అయితే, అది అసలు సిసలయిన నవల. వ్యాసాల పోగు కాదు. చెప్పదలచుకున్న విషయాలన్నీ బలంగా చిత్రించిన ఒక పాత్రలోనుంచే వస్తాయి. ఆ పాత్ర బహుశా స్వయంగా ఇస్మత్‌ అన్నారు పరిశీలకులు.  పాత్రలో ఇస్మత్‌ వ్యక్తిత్వంలోని మిగతా అంశాలు లేకపోవచ్చు. ఈమె రచయిత్రి, నవలలోని కథా నాయిక మాత్రం పుస్తకాలు పట్టని మనిషి. అసలు కళలంటేనే ఆసక్తి లేని మామూలు అమ్మాయి. కనుకనే ఆ పాత్ర, ఆమె చుట్టూ అల్లిన కథ, చివరికి నవల, చాలా సహజంగానే కనిపిస్తాయి. కథానాయిక షంషాద్‌ పెళ్లి, చర్చకు అసలు ఆధారం. ఆమెకు దొరికిన మొగుడు ఇంగ్లీషు మనిషి. అప్పట్లో అదొక పద్ధతి. రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఆ మొగుడు షంషాద్‌ను వదిలి వెళిపోతాడు. ఆమెకు మొత్తం కంపెనీ మీద, బ్రిటీష్‌వారి మీదా కోపం వస్తుంది. మొగుణ్ణి ఆమె చీదరించుకుంటుంది. వదిలేస్తుంది కూడా!

              ఈ నవల రాసేనాటికి చుగ్తాయికి పెళ్లయింది. భర్త షాహిద్‌ కూడా కలం బలం మనిషి. ‘నేను మామూలు ఆడమనిషిని కాదు. నా వల్ల కష్టాలు కలగవచ్చు. నేను బతుకులో బంధనాలన్నీ తెంపుకున్నాను. మళ్లీ ఒకసారి కట్టుబాట్లకు లొంగేది లేదు. బుద్ధిగా భార్యగా, జీవించడం, నటించడం నావల్ల కాదు’ అని ఆమె భర్తతో చెప్పిందట. చుగ్తాయి పెళ్లి తరువాత కూడా రచనలు కొనసాగించింది. దుప్పటి అనే కథలో, అప్పటికి ఎవరూ నోరు విప్పి మాట్లాడని లైంగిక సమస్యలను గురించి రాసింది. ఆడమనిషి మరో ఆడమనిషితో సెక్స్‌ అనుభవించడాన్ని చర్చించింది. కనుక ఇస్మత్‌ కోర్టు పాలయింది.  కన్నబిడ్డను చంకనెత్తుకుని ఆమె కోర్టు చుట్టూ తిరగవలసి వచ్చింది. ఆ తరువాత జీవితంలో ఇటువంటి అపభ్రంశపు సంఘటనలు ఎదురు కాలేదుగానీ, కుటుంబ జీవితం సాఫీగా సాగింది లేదు. రచనల కారణంగా ఆమెకు గొప్ప పేరు వచ్చింది. ఆమె తీరు అలాగే కొనసాగింది. భయం లేకుండా ఆమె కలం ముందుకు సాగింది. బతుకు కూడా భయం లేకుండానే ముందుకు సాగింది. అయినా, గొప్ప ఒడిదుడుకులు మాత్రం ఎదురు కాలేదు.

              కుటుంబ జీవితం గుంభనంగా సాగింది. అయినా భార్య ఖ్యాతి, ఏ భర్తకు నచ్చదు. ఇస్మత్‌ పేరు పెరుగుతున్నకొద్దీ, భర్త ఆమె నుంచి దూరం కాసాగాడు. ఈమె మాత్రం ఎక్కడా భర్త గురించి ఒక్క ముక్క రాయలేదు. అవసరం వచ్చిన చోట  ఆయన తన నేస్తము, సహచరుడు, సముడు, అని మాత్రమే అంటూ వచ్చింది. మామూలుగా రచనల్లో కల్పన పేరుతో నిజాలు కనపడతాయి. అనుభవాలు కనపడతాయి. ఆలోచనలకన్నా, ఈ అనుభవాలే బలంగా కనపడతాయి. అయినా, ఇస్మత్‌ చుగ్తాయి తన రచనల్లో ఎక్కడా తన వైవాహిక జీవితం గురించి, భర్త గురించి లోతుగా రాసిన సందర్భాలు కనిపించలేదు.

              ఈ దేశంలో నాటికీ నేటికీ ముస్లిం స్త్రీల జీవితాలు తెర వెనుక వరకే పరిమితమయి ఉన్నాయి. ఇస్మత్‌ మాత్రం ఆ తెరలను చింపేసింది. అది తొలగించడం కాదు. కథలన్నింటిలోనూ ఆడవాళ్ల కష్టాలను గురించి అలవిమాలిన ధైర్యంతో  గొప్ప సత్యాలను చెప్పింది. ముఖ్యంగా సినీపరిశ్రమలోని అమ్మాయిల కష్టాలను వర్ణించిన తీరు దేశాన్ని కుదిపింది. చెప్పకుండా జరిగే వ్యభిచారం ఆమె కథల్లో చాలా చోట్ల వస్తువుగా మారింది. అయినాసరే, ఆ కథలేవీ సంచలనాత్మకంగా మాత్రం లేవు. లైంగిక పరంగా మనుషులను కిత కితలు పెట్టేవి కూడా కావు. భయంకర సత్యాలను అంత భయంకరంగానూ  బయటపెట్టి భయపెట్టే రచనలవి! 


 

Thursday, January 22, 2026

సాదత్ హసన్ మంటో 1 : On Sadat Hasan Manto : Article in Telugu

సాదత్ హసన్ మంటో  1

సాదత్‌ హసన్‌ మంటో

సాహితీ మిత్రులతో మాట్లాడుతూ ఉండగా రచయితల గురించి ప్రసక్తి వచ్చింది. పట్టించుకుని ప్రపంచానికి ఎత్తి చూపించవలసిన రచయితల గురించి చర్చ మొదలయింది. సాదత్‌ హసన్‌ మంటో ఉర్దూలో పెద్ద ఎత్తున కథలు రాసిన మహా

రచయిత. మామూలు పద్ధతికి ఎదురుతిరిగి తన కలం వాడితో వేడి పుట్టించిన రచయిత. ఆయన కథలు తెలుగులో వందకు పైగా వచ్చాయని మిత్రులు చెపితే, ఆశ్చర్యం కలిగింది. ఆ కథలు మంటోలాగే మనుషుల మధ్యన ఉండి కూడా మనుషులకు దూరమయినట్టు భావన కలిగింది. మంటో భారతీయుడు. స్వాతంత్రం తరువాత అప్పటి దారుణ పరిస్థితులను గురించి, దేశం

విడిపోవడం గురించి, మరీ బట్టబయలుగా కథలు రాసి సంచలనం సృష్టించాడు. కోర్టులపాలయ్యాడు. చివరికి దేశాన్ని వదిలి పాకిస్తాన్‌ పారిపోయాడు. మంటో మన దేశంలో ఉండకపోవడం ఒకరకంగా మనకు నష్టం.

మంటో పేరులో మాత్రమే అతని మతం కనిపిస్తుంది. అతని అభిమతం మాత్రం పూర్తిగా వేరు. సంస్కృతి అంతకన్నా వేరు. అది అతని రచనల్లో కొట్టవచ్చినట్టు కనిపించింది.ఇక్కడ కొట్టవచ్చినట్టు అన్నమాట అక్షరాలా నిజం. “ఖోలో” లాంటి కథలు ముఖంలో పిడిగుద్దు గుద్దినట్టు వచ్చి తగిలాయి. అందరికిలాగే “టోబా టేక్‌సింగ్‌' కూడా కలకాలం గుర్తుంటాడు. మంటో కథలు అన్నీ ఇంత మొరటుగాను, ఇంత మొనగలిగినవిగాను ఉండవు. కొన్ని మెత్తగానే, చెప్పవలసిన సంగతులను తలకెక్కిస్తాయి. ఈ రచయిత కథలు తెలుగులో వచ్చి ఉంటే, వాటి గురించి చర్చ జరగకపోవడం మాత్రం గొప్ప అన్యాయం. సమాజంలో ఉన్న కుళ్లు గురించి తెలియకుండానే బతుకులు సాగుతాయి. ఉన్న కుళ్లును ఏ రకంగా ఎత్తిచూపినా, దాని గురించి చర్చ మొదలుకావాలి. చాలామంది రచయితల బాధ ఇదే. ఎత్తి చూపని సమస్యలు చివరకు అన్నిరకాలా తెరమరుగవుతాయి. అది జరగకూడదనే రచయితలందరూ గొంతెత్తి ఘోషించారు. గోలచేశారు. బాధలను గమనించిన ఈ రచయితలు వాటిని మనసులో దాచుకోకుండా అందరికీ పంచి ఇచ్చారు. మంచి మాత్రమే పంచడం ఒక పద్ధతి అయితే, చెడును ఎత్తిచూపి మంచి దారులు ఉండాలని సూచించడం మరో ఎత్తు. పూలు, వెన్నెలలను గురించి పాటలు రాసుకుంటే అభ్యంతరం లేదు. కానీ, చీకటి గురించి చెప్పి చిరు దీపం అందించిన రచయితలను మనం మరింత ఎక్కువగా గుర్తుంచుకోవాలి.

సాదత్‌ హసన్‌ మంటోను పాకిస్తానీ రచయిత అంటున్నారు. అతను రాసిన ఉర్దూ ప్రస్తుతం మన దేశంలో వాడుకలో ఉన్న ఉర్దూ ఒకటి కాదు. కానీ, మంటో కాలంలో ఆ యాసభాష మన దగ్గర కూడా మాట్లాడుకున్చదే! చివరకు అప్పటి సినిమాల్లోనూ ఆ భాష ఉండేది. మంటో కథలను నాటకాలుగా మలిచి నసీరుద్దీన్‌ షా లాంటివాళ్లు ప్రదర్శిస్తున్నారు. అసలు కథలను చదివినా, ఆ భాషను విన్నా అది మన హిందుస్తానీకి చాలా దగ్గరగా ఉంటుందని సులభంగానే అర్థమవుతుంది.

అక్కడక్కడ మాత్రం మన సమాసాల వంటి కొన్ని మాటలు అందంగానే ఎదురువుతుంటాయి. అవి బహుశా ఈ కాలం అనువాదకులకు సులభంగా లొంగవు. మంటో భారతీయ రచయిత. భారతీయ సమస్యలను ఎత్తి భారతీయ పాఠకుల కొరకు భారతీయ భాషలోనే రాశాడని మాత్రం గట్టిగా చెప్పవచ్చు. చెప్పవలసిన అవసరం ఉంది కూడా! మంటో కథలు మరిన్ని రావాలి. సంకలనాలు రావాలి. వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి.

మంటో మన దేశం వదిలి వెళ్లడానికి కారణాలు ఉన్నాయి. అలాగని ఆ మహారచయితను మనం వదిలివేసుకోవడానికి లేదు. పారిపోయేనాటికి మంటోకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అతను ఇప్పటి ముంబై, అప్పటి బాంబేలో ఉండేవాడు. దేశం విడిపోయిన తరువాత మాహీమ్‌, భేండీ బజార్లలో జరిగిన ఘాతుకాలను గురించి అతను కథలలో రాశాడు. నిజానికి ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటే, ఇంకా ఇక్కడే మిగిలినవాళ్ల గురించి ఆలోచనలు మొదలవుతాయి.

మంటో ఎక్కువగా చదువుకున్నవాడు కాదు. అసలు అతనికి చదువు మీద పెద్ద పట్టింపులేదు. కాశ్మీర్‌కు చెందిన మంటో కుటుంబం కొంతకాలం అమృత్‌సర్‌లో కొనసాగింది.

తండ్రి గతించిన తరువాత మంటో పత్రికారంగంలో పని వెతుకుతూ బొంబాయి చేరుకున్నాడు. పత్రిక ఆఫీసుల్లోనే పడుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాలలో కొంచెం పని దొరికింది. అయితే, సినిమాల్లో అతని రచనలు పేరు సంపాదించలేదు. నిలదొక్కుకోవడానికి చోటు అసలే దొరకలేదు. అతను రాసిన సినిమాలన్నీ భయంకరంగా కుప్పకూలాయి! విచిత్రంగా మహానటుడు అశోక్‌కుమార్‌ లాంటివారు మాత్రం అభిమానులుగా మిగిలిపోయారు. మంటో అప్పట్లో నిజంగా కుర్రవాడు. అయినా, బాబూరావ్‌ పటేల్‌ లాంటి పాత్రికేయులు అతడిని అభిమానించారు. అతని కథలను మెచ్చుకున్నారు. భారతదేశపు మౌపాసా అన్నారు.

అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులు మంటోకు మంచి కథా వస్తువులను అందించాయి. ఆ కథలలో భారతీయత నిండుగా కనిపించింది. కానీ, ఎంచుకున్న విషయాలు, వాటిని చెప్పిన తీరు మాత్రం కొంత కలకలానికి దారి తీశాయి. అతని

కథలు అద్భుతమయినవి. కానీ, అంతే అసాధారణమయినవి.

పాకిస్తాన్‌ భారతదేశం నుంచి విడిపోయింది. చాలామంది ఇక్కడ కొనసాగలేక పాకిస్తాన్‌కు పారిపోయారు. తమస్‌ లాంటి రచనలలో ఆ పరిస్థితులు మామూలు టీవీ (ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాయి. కానీ, మంటో రచనలలో కనిపించిన లోతు మరింత ఎక్కువ. మంటో తన రచనలలో ఏమాత్రం జంకకుండా తన మతం వారు చేస్తున్న ఘాతుకాలను కూడా వివరించాడు. నిరసించాడు. కథలు చదివినవారికి ఆ విషయం సులభంగానే అర్థమవుతుంది.

మంటో 1912లో పంజాబ్‌ రాష్ట్రంలో పుట్టాడు. తండ్రి పెద్ద పేరున్న బారిస్టర్‌. అతను మరీ మొరటుమనిషి మారుటి తల్లి మాత్రం మంచిది. మంటో రచనల మీద మొదట్లోనే ఆ తల్లిదండ్రుల ప్రభావం కూడా కనిపించింది. మంటోలోని తిరుగుబాటు పద్ధతి అక్కడే మొదలయింది అనవచ్చు. ఇక అమృత్‌సర్‌లో అప్పటి పరిస్థితులు దారుణమయిన వని వేరుగా చెప్పనవసరం లేదు. జలియావాలా బాగ్‌ గురించి చాలామందికి తెలుసు. అయినా, ఆ పరిస్థితిని మనసులో చిత్రీకరించుకున్న

వారు ఎక్కువగా లేరని అనాలి. ఏడేళ్ల వయసులోనే సాదత్‌, ఆ సంఘటనను అర్ధం చేసుకున్నాడు. అతనితోపాటు దేశంలో మరెంతమందో ఆ విషయాన్ని అర్ధంచేసుకున్నారు. జాతీయ ఉద్యమం బలం పుంజుకున్నది. అది మరింతగా ముందుకు సాగింది.

సరిగ్గా ఈ కాలంలోనే మంటో ఆలోచనలు కూడా స్థిరపడసాగాయి. కుర్ర వయసులోనే అతను తిరుగుబాటుదారు మనస్తత్వంలో స్థిరపడిపోయాడు. అనుభవం లేకున్నా ఎక్కడో చదివిన మాటలను అరువు తెచ్చుకుని ఆకర్షణగల మాటలతో పోస్టర్లు తయారుచేయడంలో పాలుపంచుకున్నాడు. ఆస్కార్‌ వైల్డ్‌ రచనల నుంచి నినాదాలను ఎత్తుకువచ్చాడని పరిశీలకులు తరువాత చెప్పారు. యూరోపియన్‌ సాహిత్యం ప్రభావం భారతీయ రచయితల మీద అప్పట్లో బాగా ఉండేదని వాళ్లు సిద్ధాంతం కూడా చేశారు.

అలీఘడ్‌ ముస్లిం యూనివర్సిటీలో అర్ధమనస్కంగా చదువుకుంటున్న రోజుల్లోనే మంటో ప్రోగ్రసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌లో చేరాడు. భారతీయ సాహిత్యమంతా రాజుల బూజు పద్ధతిలో సాగుతున్నదని దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని సంఘం వారు ప్రచారం చేస్తున్న భావనలకు మంటో తానూ భుజం కలిపాడు. అందరి పంథాలోనే తానూ రచనలు చేశాడు. అయినా, స్వంత ఆలోచనలు గల సాదత్‌ త్వరలోనే సంగతి అర్థంచేసుకున్నాడు. “బూ” అంటే వాసన అని అర్ధం. ఈ పేరుతో మంటో ఒక విచిత్రమయిన కథ రాశాడు. అది అతని అసలయిన రచనాక్రమానికి శంఖుస్థాపన రాయిగా గుర్తించదగిన కథ. ఈ కథ చదవనివారికి ఇప్పుడయినా గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. కథలో ఇద్దరే మనుషులు. రణ్‌ధీర్‌ అన్న ఒక ధనిక యువకుడు. మరొక నిమ్బవర్గపు అమ్మాయి. నిజానికి వారు మాట్లాడుకోరు. ఒక వర్షపురాత్రి ఆ అమ్మాయి రణ్‌ధీర్‌ ఇంట్లో ఆశ్రయం తీసుకోవలసి వస్తుంది. పరిస్థితులు వాళ్లు భౌతికంగా కలిసే వరకూ దారితీస్తాయి. వర్షంలో తడిసి లోపలికి వచ్చిన అమ్మాయి వణుకుతూ ఉంటుంది. మరే భావమూ లేకుండా, కేవలం జాలితో అబ్బాయి ఆమెకు పొడి బట్టలు ఇస్తాడు. అమ్మాయి వణుకుతూ తడి బట్టలను విప్పుకోవడంలో తడబడుతుంది. యువకుడు సాయంచేయడానికి వెళతాడు. అక్కడ మంటో కథను నడిపించిన తీరు మరొకరికి చేతగానిదిగా కనపడుతుంది. మొత్తానికి రణ్‌ధీర్‌కు ఆ అమ్మాయి వాసన మనసులో మిగిలిపోతుంది.

ఆ వాసన బాగుంటుంది, బాగుండదు. అది ఆమె బాహుమూలాల్లో, తల వెంట్రుకల్లో, ఎదలో, ఒళ్లంతా గుప్పుమన్నదని అతను అనుభవం చెపుతాడు. జరిగినదంతా ఒళ్లు తెలియని తమకంలో జరిగింది. తెలివిలోకి వచ్చిన తరువాత కూడా, ఆ వాసన అతగాణ్ణి వదలదు. అది అతనికి వర్షాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ రాత్రి అందిన అనుభవాన్ని గుర్తుకు తెస్తుంది. కథ చివరకు వస్తుంది. రణ్‌ధీర్‌ ఒక గొప్ప యింటి అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. ఆమె అన్నిరకాలా అతనికి తగిన జోడు. అయినా, అందరినీ ఆకర్షించిన ఆ నవవధువు నాయకునిలోని మగటిమిని మాత్రం ఆకర్షించలేకపోతుంది. సాదత్‌ హసన్‌ మంటో కథలు చాలా అదుపులేకుండా ఉంటాయి. అవి బండ బూతులని అన్నవాళ్లే ఎక్కువ. 


Wednesday, January 7, 2026

My Words on Viswanatha Satyanarayana : Part 3 (English) విశ్వనాథ గురించి...

My Words on Viswanatha Satyanarayana
Part 3 

He opens one of those novels, describing the pitter patter of the mid-summer showers. He goes on saying that if you stay put, sleeping on the roof, thinking the rain would cease, it would make your covers wet. But if you get up and go down, it would cease even before you go into the house. With the same breath, He would explain a scheme of bringing irrigation waters to the parched lands in an innovative way. Pavani, his youngest son, recollected father’s discussions with Shri K.L. Rao, the irrigation expert, about the various ways of bringing water to the lands.  He was assiduously collecting material to be used at suitable places. Even if He takes up narration of an irrelevant subject during a story, it would equally sound interesting.  In one of those novels, perhaps ‘Samudrapudibba’ He writes of frogs that lay dried up during summer and come to life after rains and start their cacophonic orchestra! Whoever said He was unscientific? His observation was so keen. He boldly claimed that his writings contain all the knowledge that He collected from all over the world.

If He was old styled and against progress, he would not write novels like ‘Cheliyalikatta’ and ‘Terachi Raju’.  The ideas about human relations expressed through the characters in these novels are examples of His thought process. He was more progressive than the most progressive perhaps!

It’s interesting that He lived and taught in Karimnagar. He inquired and collected details about the mendicant tradition of Bavaji’s at Yelagandala Matham nearby. These Sadhus were great musicians. They had their own ways of music. Taking cue from this, He composed a novel under the title ‘Mroyu Tummeda’. This is perhaps one of his novels which go beyond the comprehension of readers who even sympathise with his style and subject. ‘Bhramaravasinividya’ a way of meditating on classical music and the associated Goddess that He explains in this novel, is worth a lot.

A mention must be made of the mystery novel ‘Puli mruggu’ that would make any writer of suspense thrillers go bonkers.  In this novel, a man keeps turning into a tiger. One cannot imagine what made Him pick up such a theme and write a sensational work. Pavani, tried bringing this novel in the usual language that appears in magazines of the present day. The experiment did not really give any good results. ‘Puli mruggu’ was approved to be made into a TV serial. It never happened. It could never happen perhaps. The imagination required and such skills to turn the story into a visual feat using lot of technical methods, is not at hand so easily. The present day graphic driven film people also may not come equal to the task.

Puranam Subramanya Sharma, writer and magazine editor says, that the orthodoxy and the stubborn belief in traditions in Him is perhaps a cover that He intentionally arranged for self. His humanism and love for life were no means lesser. He says VS was one of those who could not be an example of justified combination of old and new during the times when new values, new beliefs and new ways of life were not yet well defined!

Katuri Venkateswararao, a great poet and close family friend of Him says, if great poets could imagine a theme in ten ways, VS could do the same in hundred ways! Writing great works for Him says Katuri, is like playing marbles!

His works deserve to be read by the entire world. Only since Tagore translated his own works into English, world noticed him. Not all of His works are could be translated. But those that are, should be made available to readers of other languages!

Once again to say, geniuses are rare! But there are geniuses! And there is Him, the writer, poet and many more things, and is called Viswanatha Satyanarayana! Could there be another one like him? There never was! There never is! There never would be! That is Him, the true Monarch! Kavisamrat!!

 



Friday, November 14, 2025

My Words on Viswanatha : Part 2 (In English)

Viswanatha - My Article 

Part two


Rare are the geniuses.  Rare are persons with such versatility. He was unique. He was special. Whatever format that he touched turned into gold. His poetry is known widely. How many know that he acted in the stage performance of the famous play ‘Kanyashulkam’ many times? Talking about his own novels He mentions at one place about one of the characters in Terachiraju. He mentions the name of Sri Munjuluri Krishna Rao of Bandaru town and says He learnt stage acting from him! He reveals that the description of acting all over that novel is after all from this great actor. Of the novel and the character, we could read His own words, thanks to a source that translated him.

He talks of the role that intensity of nature plays in the creation of an art.

” People of shallow intensity can only produce some commonplace creations, if they ever try to create. Their creations are only pleasing to the senses at the most. If the artist is a musician, he cannot create new music and his talent would be limited to singing melodiously. If he is a sculptor, the technique of creating his sculptures would be perfect, though the subjects he chooses do not depict anything fantastic. But the creations of an artist with a powerful, intense mind transcend all earthly boundaries. The passion he puts into his art is discerned by the audience’s inner conscience though they cannot comprehend why it makes them happy. An ordinary artist would be well acclaimed, but an intense artist will be worshipped by them in their hearts.”

The imaginative mind of such an artist never sleeps. It makes him restless, drives him to meander upon untrodden lands. For his mind, the state closest to rest is languor, as it is incapable of true rest. Petty pastimes and physical strain help him tame the ever surging waves of imagination. Saradhi goes on walks along the sea shore and tends his garden when he is supposed to rest. He spends days, nights and twilights on the shore, seeking repose in its monotony. There is a whole chapter on his all night walk along the shore. It should be read in an utterly calm room. You can hear the sea roaring at midnight though you stay miles away from it. The novel has an immensely nocturnal feel to it, as several key scenes take place at night. Viswanatha writes the most lustrously original descriptions of nights in this novel. The hours of night are bewitched by Gods to house illusions. Night isn’t all darkness. It is an amalgamation of light and darkness, each trying to overpower the other. A fistful of both is present in an artist’s psyche. They constantly injure Saradhi in their perpetual wars.

His novels numbering more than sixty are masterpieces in each. The world speaks about always about His magnum opus ‘Veyipadagalu’.  But, smaller novels like ‘Pralayanayudu’, ‘Pululasatyagraham’ are equally interesting to a discerning reader. His series of Purana Vairagarandhamala, Nepala raja Charitra and Kashmira Raja Charitra are reinterpretation of Indian history. They deserve to be studied by historians and perhaps throw light on the history of the country! The writer himself says that our history is very clear about the past. He says Kalhana mistook some facts about the beginning of the Kali era. Put together these 24 novels bring forth the history with clear information on periods and dynasties. He says all wouldn’t take trouble like he did. People now a days, He says do not worry about the pride of belonging to a race! He says some people even find fault with such feelings. Ultimately He says that literature must be national in nature. It must not be outlandish. The bird after flying on the sea all the day would come back to the nest. He says that is nationality and that is the tradition!

Whether it is poetry, prose or whatever format, the flow that He commanded is unparalleled. People who worked as scribes and took dictation narrate about his memory power and clarity of expression with awe! Once, people from a village came visiting and requested Him to go with them to be honoured the next day in a temple festival. He asked them to stay over for the night saying they could travel early next morning. He composed a set of poems that night about the village and the God there and said now he is ready to be honoured!

The flow sometimes results in peculiar situations. He would digress from the main theme and perhaps describes making brinjal curry. He conceives of telling something, and says ‘There is one thing here’. Immediately He realizes that there are two things to be expounded, and says ‘One means two’.  He boldly accepts the digression and leads the reader back into the story! Only He could get away with such expressions. Nobody dared question Him.