Monday, August 18, 2025

Franz Kafka Story in Telugu

 Literature at it's best!

Franz Kafka!

A story or is it?


నిత్యం జరిగేదే - కథ

నిత్యమూ జరిగేదే!
ఫ్రాంత్స్ కాఫ్కా


మామూలు సంఘటన : దాన్ని ఎదురుకున్నామంటే అదొక గొప్ప!
ఇతనికి పక్క ఊళ్లోఉండే అతనితో జరూరు పని ఉంది. పది నిమిషాలలో వెళతాడు. కొంత మాట్లాడి మళ్లీ వస్తాడు. ఎంత తొందరగా వచ్చానో అంటాడు పైగా.
మరునాడు అతను మళ్లీ అక్కడికి పోతాడు. ఈసారి కొన్ని గంటలయినా సరే వ్యవహారం తేల్చేయాలి. పొద్దున్నే బయలుదేరతాడు. అన్ని పరిస్థితులు, కనీసం ఇతని దృష్టిలోనిన్నటిలాగే ఉన్నాయి. కానీ అక్కడికి చేరడానికి ఇతనికి పది గంటలు పడుతుంది. అలసి సాయంత్రానికి అక్కడకు చేరుకుంటే, ఇతను రాలేదని విసుగుచెంది అతను ఇతని స్థావరానికి బయలుదేరాడన్నారు. బయలుదేరి అరగంటయింది. దారిలో ఎదురయి ఉంటాడు అనీ అన్నారు. ఇతడిని కొంచెం సేపు ఉండమన్నారు. అతను త్వరలోనే వస్తాడన్నారు. ఇతను మాత్రం ఆత్రంగా వెనుదిరిగి వచ్చాడు.
ఈసారి అతను సంగతి తెలియకుండానే, క్షణంలో ఇల్లు చేరుకున్నాడు. అతను పొద్దున్నే వచ్చాడనీ, నిజానికి ఇతను బయలుదేరకముందే వచ్చాడనీ చెప్పారు. నిజంగా అతను ద్వారం దగ్గరే ఎదురయ్యి, వ్యవహారం గురించి చెప్ప ప్రయత్నించాడు. ఇతను మాత్రం తనకు టైం లేదనీ, తొందరగా వెళ్లాలనీ అంటూసాగిపోయాడు.
ఇతని తీరు అర్థంగాక అతను అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు. ఇతని గదిలోనే ఉండి మళ్లీమళ్లీ వచ్చాడా అని అడిగాడు. అతనింకా అక్కడే ఉన్నాడిప్పుడు. అతడిని కలిసి సంగతి వివరించవచ్చునన్న సంతోషంతో ఇతను మెట్లెక్కసాగాడు. పైమెట్టు మీద పడిపోయాడు. దొర్లుతూ వచ్చి బాధ కారణంగా మూర్ఛపోయాడు. కనీసం అరవను కూడా లేదు. చీకట్లో ఉండి మూలుగుతున్నాడు. అతను కోపంగా మెట్లు దిగి గబగబా `దగ్గరనుంచా, దూరంనుంచా తెలియలేదు` వెళ్లిపోవడం మాత్రం కనబడుతూనే ఉన్నది. అతను వెళ్లిపోయాడు.
I I I I
ఇది కాఫ్కా రచన. దీన్ని కథ అనాలా? మరి కాఫ్కా కథకుడు గదా? కథానికలు రాసే వారందరికీ అతను అంత ఎత్తున కనిపిస్తాడు గదా? అందుకే కాఫ్కా తీరు (కాఫ్కాయెస్క్‌) అనే మాట పుట్టింది. పద్ధతి పుట్టింది.
ఇంతకూ కథానిక అంటే ఎట్లుండాలి? ఎవరు చెప్పగలరు
?


No comments: