Saturday, April 24, 2010

Sneha Hastam - My Science Fiction Story

Vedagiri Rambabu is a friend.
He was on the Editorial of this magazine Pallaki.
He made me write this story.
He made me write a lot of other things too!

Here is the story for you!

స్నేహ హస్తం



డా. కె.బి.గోపాలం



“సర్!”

“.....”

“వింటున్నారా”

“వినడంలేదని అనుమానం ఎందుకొచ్చింది?”

“సర్ వాళ్లు కూడా మాంసం....”

“ఎవరావాళ్లు?”

“సర్!”

“నీకెన్ని సార్లు చెప్పాను ఈ సర్ బుర్ నాకు నచ్చవని!”

“సారీ రాజ్! ఇంతకూ నేను చెప్పేదేమిటంటే, ఆల్ఫా అరిటేమియా నుంచి సంకేతాలు వచ్చేవిగదా వాళ్లను ప్రోబ్ చేసి మనవాళ్లు రిపోర్ట్ పంపారు.”

“ఆ రేడియో సంకేతాల వాళ్లేనా? ఏమిటి రిపోర్టు?”

“వాళ్లుకూడా మనలాగే మాంసంతో నిర్మింపబడిన ప్రాణులంటున్నారు.”

“రక్తంకూడా ఉందా?”

“లక్షణంగా బాస్! కానీ వింతేమిటంటే ఎముకల్లేవు!”

“డామిట్! మరి శరీరం ఎలాగుందట?”

“మాంసం ముద్ద బాస్!”

“ఛట్! వీల్లేదు!”

“అలాగంటే ఎలా రాజ్? రెండు సార్లు స్పెసిమన్స్ తెప్పించి పరిశీలించి తయారు చేసిన రిపోర్టు చదవకుండానే కాదు పొమ్మంటే ఎట్లా?”

“అయితే ఆ మాంసం ముద్దలు మనకు రేడియో సంకేతాలు పంపాయా?”

“అంతేగదా! అయితే సంకేతాలు వాళ్ల శరీరాలనుంచి కాదు. యంత్రాలనుంచి వస్తున్నాయి. వాళ్లు మాట్లాడడమంతా యంత్రాలతోనే!”

“నిలబడలేని ఆ మాంసం ముద్దలు యంత్రాలను తయారుచేశాయంటావా? నన్ను నమ్మమంటావా?”

“నేను కేవలం రిపోర్టు గురించి చెపుతున్నాను. ఇందులో నమ్మకం అపనమ్మకం లేనేలేదు. చచ్చీచెడీ తయారు చేసిన రిపోర్టును కాదనడానికి ఏమిటి నీఅధికారం?”

“నేను మీ పరిశోధన బృందానికి లీడరునని తెలుసా?”

“తెలుసు! అందుకే సర్ అంటూ వచ్చాను. ఈ మారుమూల గెలాక్సీలో పడి నీతో తలపగలగొట్టుకుంటున్నాను. బుద్ధిజీవులు దొరికితేనేగానీ కొంప జేరనిచ్చేట్లు లేదు నీ వాలకం. పాజిటివ్ గా ఫలితాలొచ్చాయంటేనేమో వినవు!”

“ఇంటిమీద ధ్యాస పుడుతోందా?”

“ఇల్లొకటి ఇంకా ఉందేమిటి మనకు?”

“ఇంతకూ ఆ సంకేతాలిచ్చిన వాళ్లు యానవులేమో ఆలోచించావా? యానవులంటే, అదే, ఒక స్టేజిలో మాత్రం మానవుల్లాగ ఉండి, తరువాత యంత్రాలయిపోయే ఆ జాతి! ఆర్ ఎక్స్ ఫోర్ నాట్ సెవేన్ లోనా అక్కడే గదూ కనపడింది?”

“కాదు కాదు. తెచ్చిన రెండు సార్లూ స్పెసిమన్లను ఒక్క జీవితకాలం పెంచి చూచారు మనవాళ్లు. జీవితకాలమంటే ఎంతో తెలుసా? మనకు మూడున్నర సంవత్సరాలు! వాళ్ల లెక్కలో అది ముప్ఫయి అయిదు రోజులు! మొత్తం జీవితమంతా ఎముకలు లేని రక్తమాంసాలుగానే ఉన్నారు వాళ్లు!”

“ఏమో నాకు నమ్మకం కలగడం లేదు! తలమాత్రమే మాంసంగా ఉండే రానవులేమో వీళ్లు! పాలపుంత చివర్లో దొరికిన రానవులకు శరీరమంతా ఒకరకంగా, తల ఒక రకంగా ఉండడం గుర్తుందా? ఇంతకూ ఈసారి వీళ్లకు మెదడు ఉందా?”

“పుర్రెలో కాదుగదా! అందుకే సగం శరీరం మెదడే ఉంది! అందుకే వాళ్లు అంతబాగా యంత్రాలు తయారుచేసి పుట్టిన నాటి నుంచి చచ్చేదాకా వాటి సాయంతోనే మాట్లాడుకుంటున్నారు!”

“ఛట్! బతికినంత కాలం యంత్రాలతోనే మాట్లాడడం ఏమిటి? అబ్సర్డ్!”

“చూడూ! నమ్మకపోతే పోయిందేమీ లేదు. ఇక నీతో వాదు నాకు తగదనిపిస్తోంది!”

“కూల్ డౌన్! అంటే నీకు కోపం కూడా వస్తోందన్నమాట!”

“సర్! అందుకే ఈ బుద్ధిజీవులను మాంసవులు అందామని మనవాళ్లు ప్రతిపాదించారు.
It goes further ..........
 
 
To read the full story, go to my website
 
http://vijagopalk.tripod.com/
 
Thanks for reading the story!!
^^^^^^^^^

No comments: