ఏమిటిది
‘నదినించి కడివెడు నీళ్లు తీసుకపోయి ముసలాయనకు ఇస్తే మంచి జరుగుతుంది’ అన్నది కాకి.
‘మన ఊరు చుట్టుపక్కల ఎక్కడ నది లేదుగద!’ అని ప్రశ్న
‘అదే మరి!’ అన్నది కాకి
సంగతేమో తెలుసుకుందమని ముసలాయన వద్దకు పోతిని.
‘మీకు నీళ్లు అవసరమా?’
‘ఎవరన్నరు?’
‘కాకి చెప్పింది’
‘చెప్పి ఉండదు అట్ల!’
‘నిజమే! నీళ్లు ఇస్తే మంచిది, అని మాత్రమే చెప్పింది’
‘కాకికి, నీవు నా వద్దకు వస్తే మంచిది అనిపించిందేమో!’
‘ఎందుకట్ల?’
‘తెలిస్తే బాగనే ఉండు’
‘నీళ్లు తేలేదు. మంచి జరుగుతుందా?’
‘నాకేమి ఎరుక?’
‘మంచి అంటే, ఏమి జరుగుతుంది?’
‘నీకేది మంచో నాకెట్ల తెలుస్తుంది?’
‘ఇంత ఆలోచన జరిగింది! ఇది మంచేగద!’
‘కాకి, నీకీ ముచ్చటజెప్పినప్పుడు ఏంజేస్తుంటివి?’
‘అలోచిస్తుంటి!’
‘దేని గురించి?’
‘ఏమి ఆలోచింతునా? అని!’
*********
No comments:
Post a Comment