Showing posts with label mullapudi. Show all posts
Showing posts with label mullapudi. Show all posts

Monday, September 14, 2009

Krishna Leelau


రమణ బాపుల శ్రీ కృష్ణలీలలు

This is an excerpt from the book written by Sri Mullapudi Venakataramana and illustrated by none other than his eternal creative partner Bapu.


I never knew that they have written a book like this.

I really stumbled on it.

I am aware of the devotion Bapu has for Ramayana and Rama In particular.


This book on Krishna is a wonderful work.


It gives a clear view of the Avataram in the simplest of the style.


Of course, Ramana got carried away by the subject and has used such language, a little on the heavier side.

Still it is eminently readable.


Interestingly when all the people think that Krishnanshtami is over in the month of Sravanam itself, some people like us who follow solar calendar have waited for the Simha masam for the same. Even in this there are some people who are celebrated the festival on 12th of September and the others a day earlier, for certain reasons.

Here is a small part of the book Krishna Leelalu.


నక్షత్రాలు కోటి సూర్య ప్రభలై దీపిస్తున్నాయి. జేగంటలు గుడిగుడిలో గుండెగుండెలో మారుమోగుతున్నాయి.



దేవకి ముఖం దుర్నిరీక్షమైన తేజంతో బాధతో, ఆనందంతో వెలిగిపోతూంది.



అంతలోనే ఆమె కన్నులు మూతపడ్డాయి. అలసి సొలసిన ముఖం భువనమోహనంగా పక్కకు వాలింది. తృప్తిగా నిట్టూర్చింది.



జగన్నాథుడు, జగదోద్ధారకుడు, జగత్పతి, జగత్పిత, జగదేకవీరుడు, జగదేకమోహనుడు, జగదేకవంద్యుడు, జగద్గురువు, జగన్నాటకసూత్రధారి, జగదభిరాముడు, లీలామానుషవిగ్రహుడై – చిన్నిశిశువై ఉదయించాడు.






శ్రావణమాసం, బహుళ పక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం, అర్ధరాత్రి, అభిజిన్ముహూర్త వేళ, దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు, లోకకళ్యాణానికి మహోజ్వల ముహూర్తవేళ. మంచివాళ్లకు గుండెలు పొంగేవేళ. చెడ్డవాళ్లకు గుండెలు కుంగేవేళ. కన్నులు తెరిచీ తెరవకుండానే ఒక్క చిన్నారి చిరునవ్వుతో జగతిని కాంతిమయం చేశాడు.






సంభ్రమంతో భక్తులు, భయంతో ఆనందంతో దేవకీ వసుదేవులు పైకిచూసి చేతులు జోడించి మొక్కుతున్నారు.



జగదానందకారకుడైన శ్రీమహావిష్ణువు చతుర్భుజుడై శంఖ చక్ర శార్జ్ఞ్గ గదాధారియై దర్శనం ప్రసాదించాడు.






‘పుణ్యదంపతులారా! నేను మీ దాంపత్యఫలాన్ని కావాలన్నమీకోరికను మన్నించి నాడు ప్రశ్నవర్గుడుగా వామనుడుగా, ఈనాడు కృష్ణవర్ణుడిగా మీ బిడ్డనై పుట్టాను. ఈ జన్మ తర్వాత మీకు ముక్తి లభిస్తుంది. వసుదేవా! నువ్వు శిశురూపాన ఉన్న నన్ను వ్రేపల్లె తీసుకు వెళ్లి అక్కడ నందుని సతి యశోద చెంత ఉంచి, ఆమె పొత్తిళ్లలో ఉన్న యోగమాయను దేవకీమాత ఒడిలో చేర్చు. దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ కాలచక్రం ద్వారా నేను సంకల్పించి ప్రయోగించే జగన్నాటకం ఈ క్షణాన నేను జన్మిస్తూన్న ఈ అభిజిన్ముహూర్తాన ఆరంభమవుతోంది. మీకు శుభం.’ అంటూ శ్రీమహావిష్ణువు అంతర్ధానం చెందాడు.



Incidentally this happens to be my 100th post on this blog!




Tuesday, October 28, 2008

Runanandalahari of Mullapudi

Happy Deepavali to all!!
Today I bring you selections from Mullapudi Venkata Ramana’s Runanandalahari.
I feel this is the best of humour in modern Telugu.
Can you believe Ramana Garu composing an impeccable poem in classical meter?
He has done it and done it so well that all the classical poets will wonder who is this?
This book under reference is about raising loans and not paying them back. He has adopted a classical style of narration wherein a story leads to another.
I have picked up one poem which is a parody to the famous poem of Potana in Bhagavatam.
The other two are stories in a language style that is not known to many these days.
There are tatacharla Kathalu and other such similar works. The language used in them is not very methodical and is funny in its own way. Read these stories. Unfortunately I cannot help those who cannot read Telugu. This proves that all the vernacular works cannot be translated. I am told that Kanyasulkam is translated. It must be as funny as the original because of the inadequacies in translation. Who can translate this kind of wonderfully native expression?
This sit eh poem! Potana salutes to the omnipotent and omnipresent god in a poem. Ramana Garu request loan from a person who is kind in this poem.

ఎవ్వనిచే జనించు ఋణ
మెవ్వనిచే భ్రమియించు లోకమం
దెవ్వని బుద్ధియే ఋణద
మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా
నివ్వగ జాలనంచనక
నివ్వగ జాలక, దిప్పనట్టి వా
డెవ్వడు --- ఆ ఋణాత్ము, ఋణదేశ్వరు
నేను ఋణంబు వేడెదన్

Long ago there was one Appadu. Because there cannot be two, there was one Appadu. He had a rich friend. Because of that he never had money. The friend out of obligation was giving a Varaha ( A coin) in loan. One day Appadu thought why not I ask him to give me a hundred Varahas. And he asked for them. The friend never had so much money and said the same. Since the obligation was also over he did not even give the usual one Varaha. That is the story. Sorry it is not said in as simple words that I could use. The expression is ancient and really interesting. Only those who can understand will enjoy it. Language and its use is as powerful as using ammunition!!

అప్పడి కథ

పూర్వము అప్పడని ఒక్కడుండెను. ఇద్దరు ఉన్ డుటకు వీలులేకనే వక్కడు వున్ డెను. వానికి డబ్బుగల స్నేహితుడూ గలడు. అందువల్ల డబ్బులేదు. అందు స్నేహితుడు అప్పడికి మొహమాటంచే ప్రతిదినమూ ఒక వరహా బదులు ఇచ్చుచుండెనూ. ఇట్లుండగా ఒక దినమున అప్పడు ఇట్లాలోచించెను. వీడు నాకు రోజురోజూ వడ్డీ వరహా ఇస్తూ వున్నాడుగదా, వక్కసారే వంద ఎందుకు అడగరాదూ, వీడు ఇవ్వరాదూ, ఇట్లా యోచించి అట్లా అప్పడు మిత్రుడుని ఒకరోజున వక్కసారిగా వంద వరహాలు అడిగేనూ. వాడు వెంటనే నా వద్ద అంత డబ్బు లేదుగదా ఏమి చేయుదునూ అని యోచించి ఓరీ అప్పడూ నా వద్ద లేదు అని చెప్పివేసెనూ. మొహమాటమూ పోయింది గావున మరునాడు ఒక వరహా కూడా యివ్వలేదూ.....అని కథ ముగించాడు చీమల సింహాద్రి ఆయాస పడుతూ.

A story no one asked.
It goes thus.
No one asked what is the story. So it was narrated by itself. Fearing that all will ask for loan, a person called Runatilakudu ( all names in this book are related to loan. Appadu is about appu the loan in Telugu.) hid it in a pit in his backyard. It was stolen. Appanna who was denied loan a week back came there and laughed and said, if you gave me a loan, the money would not have been lost I would have repaid it to you, and laughed and went away.
The whole story is narrated in one unbroken sentence. This is an ancient style again. Humour is about not making ugly expression and talking banalities. Humour is something wonderful!

అడగని కథ

ఏమా కథ అని యెవరూ అడగలేదు. అందుకని తనే చెప్పేసింది.
ఋణతిలకు డనే వాడు తన దగ్గర డబ్బుని అంతా అప్పు అడుగుతారని భయపడి పెరట్లో గోతిలో దాచుకోగా, దానిని దొంగలెత్తుకుపోగా, మర్నాడు వాడేడుస్తూ ఉండగా వాడిని క్రితం రోజే అప్పడిగి లేదనిపించుకున్న అప్పన్న వచ్చి పకపక నవ్వి ఓరి నువ్వు నాకు నిన్న అప్పు ఇచ్చి ఉండినట్లయితే దొంగతనం జరిగినా నీ డబ్బంతా నేను అచ్చుకునే వాడిని గదా అని పకపక నవ్వి వెళ్లిపోయెను, అని ఒక్క గుక్కలో కథ ముగించి అమ్మయ్య అయిపోయింది అందా కుర్ర చీమ.
Happy Deepavali again!!

Saturday, October 18, 2008

Mullapudi

I really wonder how many people have read it and remember the simple story that made a flimsy plot for the small book. I found this book in one of the pavement stalls selling old books. I read it again after a few decades, and in one spell. No wonder, the book is so small and interesting in very disproportional manner. I bring you a few lines from the same.

సుందర్రావుకిదేమీ అంతు బట్టలేదు. అనుమానంతో మెడ టకటకా ఎడాపెడా తిప్పేసి ఇద్దర్నీ చూస్తూ ఇద్దరి మాటలూ వింటున్నాడు టెన్నిస్ ప్రేక్షకుడిలా.
“వెధవ” అన్నాడు వీర్రాజు
“చవట” అన్నాడు రామారావు పుంజుకుని --- సుందరం వంక చూస్తూ.
“రౌడీ”
“రాస్కెల్”
“గూస్”
“గాండర్”
“హార్స్”
“మేర్”
“మాన్”
“ఉమన్”
“బోయ్”
“గరల్”
“ఉరేయ్ రాజూ! ఆగు! మనం గ్రామర్ చదివేస్తున్నాం!”
“ఏమటిదంతా. మిమ్మల్ని గుడి గోపురం మీదకి విసిరేస్తా” అన్నాడు సుందరం.
“దుర్మార్గుడు” అన్నాడు వీర్రాజు
“దుర్జనుడు” అన్నాడు రామారావు
“దుష్టుడు”
“దుర్మతి”
తరువాత ఇద్దరికీ తెలుగు మాటలు జ్ఞాపకం రాలేదు.
“ఆ!... ఖలుడు” అన్నాడు వీర్రాజు
“మరే--- ఖలుడు” అన్నాడు రామారావు
“ఒరేయ్ రాముడూ--- నీకు ఖలుడు పద్యం వచ్చురా?”
“ఏ ఖలుడురా?”
“అదే---- ఖలునకు నిలువెల్ల విషము...”
“అదా---- మొదలు జ్ఞాపకం లేదు. ‘సుమతీ’ అని చివర్నొస్తుంది.”
సుందరానికి జ్ఞాపకం ఉంది. కానీ చెప్పలేదు.
వీర్రాజుకి కొంచెం జ్ఞాపకం వచ్చింది. “తలనుండు విషము ఫణికిని వెలయంగా డడ్డ డడడ డడడా నానా చివరని ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ---- గదరా రావుడూ?” అన్నాడు.
“మరే! నిలువెల్ల విషము.”
“ఖలుడెంత పవర్ ఫుల్లో తెలుసా? ఆ మధ్య ఓ ఖలుణ్ణి ఒక తేలు, ఖలుడన్న సంగతి తెలీక కుట్టిందట. --- అంతే ---ఖలునకు నిలువెల్ల విషము గదూ. ఠారున చచ్చింది. అలాగే ఓ పాము. ఇంకా అలాగే నల్లులు, దోమలు...”
“వీర్రాజూ! జ్ఞాపకం ఉంచుకోరోయ్! సినిమా హాలులో నల్లులు సమృద్ధిగా ఉండడం లేదు ఈ మధ్య. మ్యాటినీకి వదిలిన నల్లులు ఆరు గంట్లాటకల్లా ఛస్తున్నాయట. ఎందుకో తెలీక ఇన్నాళ్లూ గిలగిల్లాడా. ఈ పాడు పన్లు చేసేవాళ్లూ, కొంపలు తీసేవాళ్లూ, బ్లాక్ మార్కెట్ చేసేవాళ్లూ, మతి స్థిమితంకోసం అని అస్తమాలూ సినిమాలకెళుతున్నారు. ఆ నల్లులు తెలీక వాళ్లను కుట్టి, అమాంతం ఛస్తున్నాయి. విల్లేనా రాయకుండా.”

“అలాగే,----- రిసెర్చ్ బుక్కులో రాసుకుందిగానిలే. ఒరేయ్ రాముడూ, దోమల గురించి కూడా ఒక పుస్తకం రాయరా. బంగారయ్యగారింటి దగ్గర ఇప్పుడు కాగడా వేసి వెదికినా దోమల్లేవుట. నీలాటి రేవులోనూ, రచ్చబండ దగ్గరా ఇదే చెప్పుకు విస్తుపోతున్నారు, ఆబాలగోపాలం. దోమలు ఎందుకు లేవు తెలుసా. వీడు --- ఈ ఖలుడు అయిన సుందరం గాడు అక్కడ పడుకుంటున్నాడుగా. అమాయకపు దోమలు ముందు వెనుకా చూసుకోకుండా గొర్రెల మంద గోతిలో దూకినట్లు, వీడి మీద పడి కుట్టేశాయి. ఠారున మరణించాయి.”

“హయ్యబాబోయ్!” అన్నాడు రామారావు.

Bapu and Ramana are the two persons that all Telugu people should feel proud of. When they were not really involved in making films and concentrated only on making us laugh, we were much better!

This is a page from the inimitable book, “Iddarammayiloo, Muggurabbayiloo” by Mullapoodi Venkata Ramana garu. This is a small book written with only one intention, that is to make the readers laugh. I really wonder what happened to the humour that used to overflow from the Telugu magazines and books. Come Deepavali and every magazine worth the name would come up with special issues. Even Chandamama used to bring out an excellent special with fragrance added to the printing ink.

Mullapoodi and Bapu were the perennial sources of Telugu humour. You can call it slapstick or something else, pure humour just for the sake of a few laughs!!