Friday, February 6, 2026

ఏమైనా అర్థమైందా? - యువ వికాసం వ్యాసం


ఏమైనా అర్థమైందా?

 యువ వికాసం వ్యాసం


ఏమైనా అర్థమైందా?

- విజయగోపాల్ vijayagopalk@gmail.com

January 12th, 2011

ఫ్రమదానేకప గండభిత్తి కషణా భగ్న స్రవచ్చందన ద్రుమముఅనే పద్యం ఎవరికయినా గుర్తుందా? ‘ఉప్పు కప్పురంబులేదా చెప్పులోని రాయిఅనే పద్యాలు సులభంగా గుర్తుంటాయి కదూ!
ఇంగ్లీషులో సింపుల్ సైమన్అని చిన్నపిల్లల పద్యం ఒకటి ఉంది. ఈ సైమన్ సింపుల్ మనిషి. ఏం అమ్ముతున్నావు?’ అని బిస్కట్ల అబ్బాయిని అడిగాడు. ఆ గడుసు అబ్బాయి డబ్బు చూపించు!అన్నాడు. నా దగ్గర లేవన్నాడుమన సింపుల్ సైమన్. తర్వాత ఏమయిందో నేను చెప్పనవసరం లేదనుకుంటా!
అతను చాలా సింపుల్ మనిషి!అంటే పాపం! వెర్రివాడు!అని గదా అర్థం.
ఆ యొక్క బీదరికం అనేది ఏదయితే ఉందో, మనందరం ఏకతాటిగా, నడుముకట్టి, ఆ యొక్క బీదరికం మీద యుద్ధం ప్రకటించాలిఅంటే ఏమిటండీ? అర్థం ఒక్క మాటలో మీరు చెప్పగలరు కదా!మహిళా సాధికారితఅని ఒక మాట పుట్టింది. ఎలా వచ్చింది? అందులో గ్రామరుందా అని అడిగే దమ్ము ఎవరికీ లేదు.
ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్! మీరు మాట్లాడేది ఏ భాషయినా సరే, సులభంగా అర్థమయ్యే భాషలో మాట్లాడితే బాగుంటుంది గదా!అని!
ఎదుటి వాళ్ళు ఏదో చెప్పినప్పుడు, గొప్ప గజిబిజి భాష వాడారు అనుకుందాం. ఏమిటది? అని అడిగితే ఏమనుకుంటారో అనుకుని నోరు మూసుకుని తిరిగి వచ్చారంటే, ఏమీ అర్థం చేసుకోకుండా వచ్చినట్లే గదా? అందుకే అంటే ఏమిటి?’ అని సింపుల్‌గా అడగండి. వాళ్ళూ సింపుల్‌గా చెపితే అంతా సింపుల్‌గా ముగుస్తుంది.
తెలివిగల వారు తమ తెలివిని ప్రదర్శించేందుకు గొప్ప నాటకాలు ఆడతారు: మనం బుర్ర ఊపి వచ్చేస్తే ఈ జన్మలో మనం తెలివిగల వాళ్ళం కాలేము. మనం తెలివిగల వాళ్ళమయిన తర్వాత మరింత మందిని, మన దారిలో నడిపించే పద్ధతి పాటిస్తే మంచిది.
ప్రశ్న అడిగితే మూర్ఖులుఅనుకుంటారేమోనన్న అనుమానం పనికిరాదు. చాలా సందర్భాల్లో చాలా చిన్న ప్రశ్నలు, గొప్ప సమాధానాలను, సామచారాన్ని బయటకు లాగితీస్తాయి.
గొప్ప ఆలోచనలు అన్నీ చిన్న మాటలలోనే వెలువడతాయి
===============================
===============================
ఆఫీసు ఎలాగుంది?
మీ ఆఫీసులో అందరూ గోడ దిక్కుమళ్లి సబ్బు రుద్దుతూ ఉంటారు! అక్కడ సరదాగా ఉంటుందా?’ అని అడిగాడు ఒక పెద్దాయన నన్ను. అప్పట్లో ఒక గ్రాఫిక్స్ కంపెనీలో నేనూ ఉండేవాడిని. ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో అందరూ గోడదిక్కు మళ్లి, సబ్బు రుద్దుతుంటారు. (ఈ సబ్బు ఏమిటో అర్థమయ్యే ఉంటుంది మరి!) ఎవరూ మనిషి గురించి పట్టించుకోరు. లంచ్ బ్రేక్‌కు టయిమయిందని కూడా మెయిల్లో పిలవవలసిందే, మరిక సరదాగా ఉంటుందా?
మనం బాగా పనిచేయాలంటే, సరదాగా, ఉత్సాహంగా ఉండడం ఎంతో అవసరం. నిజమయిన ఉత్సాహం, ఎవరికి ఎందులో నుంచి వస్తుందో చెప్పలేము. కానీ అందరికీ ఒక్క విషయం మాత్రం నచ్చుతుంది. ఆఫీసు వాతావరణం బిగుసుకు పోయి ఉండకూడదు.
జపానులో, సోనీ (సనీ అనాలేమో?) కంపెనీలో పనిచేసే వారంతా నేను సనీ మనిషిని!అని గర్వంగా చెప్పుకుంటారట. ఆఫీసు, సంస్థతో అంతగా మమేకం కావాలంటే అక్కడ మనం ఆనందంగా ఉండాలి. ఇందుకు అవసరమయిన వాతావరణం కల్పించే బాధ్యత ఎక్కువగా మేనేజ్‌మెంట్ చేతుల్లో ఉంటుంది. మిగతాదంతా, అందరిమీదా ఉంటుందని ఒప్పుకోక తప్పదు!
ముందుగా మనకు, మనం చేస్తున్న పనిమీద ప్రేమ ఉండాలి. మనం మేనేజర్ అయినా, అందరికన్నా తక్కువ నిర్ణయాధికారంగల మరో ఉద్యోగి అయినా ఈ ప్రేమ అవసరం. నేనేదో శాపగ్రస్త గంధర్వుడిని. కనుక ఈ ఉద్యోగంలో పడి కష్టపడుతున్నాను, లేకుంటే, నేను ఈ ఆఫీసుకు బాసు కాలేక పోయానా?’ అనుకుంటూ పని చేస్తున్నంతకాలం ఈ ప్రేమ, అందులోంచి వచ్చే ఆనందం అందవు.
చేసే ఉద్యోగం నచ్చకపోతే ఉద్యోగం మార్చు!అని ఒక మాట ఉందనుకోండి. కానీ అది అంత సులభం కాదు. కనుక ఆ తర్వాతి మాటను కూడా మనం గమనించాలి. ఉద్యోగం మార్చడం వీలుగాక పోతే, ఆ ఉద్యోగం పట్ల నీ అభిప్రాయం మార్చు!అన్నది, ఆ సూక్తి! కష్టపడి పనిచేస్తే సుఖం లేదు. ఇష్టపడి చేయడంలో ఆనందం ఉంది.
సరే! నేను ఇష్టంగానే పని చేస్తున్నాను. కానీ ఆ ఆఫీసు వాతావరణం ఎట్లా ఉంటుందో తెలుసా?’ అని తర్వాతి డయలాగు వస్తుంది. అవును, అది ఇల్లయినా, ఆఫీసయినా, చిందర వందరగా, చికాకుగా ఉంటే అందులో ఆనందం వెతికినా కనిపించదు. భలే బాగుంది అనీ, లేక బాగానే ఉంది అనో అనుకోగలిగే వాతావరణం ఉండాలి. అందులో కొంత కృషి మనమూ చేయవలసి ఉంటుంది. కూచుని పనిచేసే ప్రాంతానికి అలంకారాలు చేయకున్నా కనీసం అస్తవ్యస్తంగా లేకుండా చూడడం మన బాధ్యతే గదా! మనం నీట్‌గా అన్ని కాయితాలూ, మిగతా వస్తువులు అమర్చుకుంటే అది పక్కవారికి కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది. అందరూ నీట్‌గా ఉన్నారంటే ఇక మానసిక విషయాలవేపు దృష్టి మళ్లుతుంది.
మన ఆఫీసులో అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉందా?: ఏ ఆఫీసులోనయినా, మనభావాలను పదుగురితో పంచుకునే వాతావరణం ఉంటే బాగా పని జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఎవరితో, ఎప్పుడు దేనిగురించి మాట్లాడవచ్చు? అనే ప్రశ్నకు సరయిన జవాబు ఎవరికి వారే అర్థం చేసుకోవాలి. అప్పుడో ఇప్పుడో తప్పించి, ఎప్పుడూ సరదాగా కబుర్లు చెపుతుంటే పని జరగదు. అధికారులతో మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంది. వారితోనూ సరదాగా మాట్లాడడానికి సందర్భాలు ఉంటాయి. మీరు అలాంటి పని సరయిన సమయంలో చేయగలిగితే బాసు మిమ్మల్ని ఇష్టపడతారు. మీరే బాసయితే తప్పకుండా ఆ వ్యక్తిని ఇష్టపడతారు.
మీరు బాసు, చిన్న బాసు అయితే లేక చివర మనిషే అయినా, మరొకరికి పని చెప్పి చేయించవలసి వచ్చినప్పుడు మాట్లాడవలసిన తీరు మరోరకంగా ఉంటుంది. అందరికీ వర్తించే సూత్రం ఒకటి ఉంది. కోపాలు, అరుపులు ఏమాత్రం పనికిరావు. అరవకుండానే కోపం వచ్చిందని సూచించడం ఒక కళ! అదెలా కుదురుతుంది? అందరూ తలకెక్కి కూచుంటారు?’ అని చాలామంది ప్రశ్నిస్తారు. ఇదీ, అనుభవం మీద వాళ్ళు కూడా ఈ సూత్రాన్ని అంగీకరిస్తారు.
ఇక తోటివారితో మాట్లాడటంలో మరిన్ని చిక్కులున్నాయి. మిత్రులయినా మన సెక్షన్‌లో వారితోనయితే మాత్రమే, అవసరమయినప్పుడే పని గురించి మాట్లాడడం మంచిది. మిగతావారికి మన పనితో పని లేదు. వారి పనిలో మనం తలదూర్చనవసరం లేదు. మిగతా సంగతులను అయినా సందర్భం గుర్తించి మాట్లాడితేనే బాగుంటుంది. పనిలో ఉన్న వారిని పలకరించడం తప్పు!
ఆఫీసులో ఆనందంగా ఉండడానికి ఇది మొదటి మెట్టు మాత్రమే!
=======================
తెలివి అంటే అది!
నియంత బిస్మార్క్ జెర్మనీకి ఛాన్సలర్‌గా ఉన్న రోజుల్లో రుడాల్ఫ్ విర్చో అనే వైద్యుడు, రాజకీయ వేత్తగా ప్రతిపక్షంలో ఉండేవాడు. అతనెప్పుడూ ఛాన్సలర్‌ను విమర్శలతో ముంచెత్తేవాడు. విసిగి వేసారిన బిస్మార్క్ ఒకసారి రుడాల్ఫ్‌ను ద్వంద్వయుద్ధానికి రమ్మని ఛాలెంజ్ చేశాడు. (పాశ్చాత్య దేశాలలో ఇరువురు వీరుల మధ్యన వచ్చిన సమస్యలను ఈ రకం యుద్ధంతో తేల్చుకునే సంప్రదాయం ఉండేది!)
రుడాల్ఫ్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. చాలెంజ్ చేసింది తమరు గనుక యుద్ధానికి ఆయుధాన్ని ఎంచుకునే అవకాశం నాది! (అదీ ఒక ఆచారం!) నేను ఈ మాంసపు సాసేజ్‌లను ఆయుధాలుగా ఎంపిక చేశాను. ఇందులో ఒక దాంట్లో ప్రాణాంతకమయిన క్రిములున్నాయి. రెండవది శుభ్రంగా ఉంది. ఛాన్సలర్ గారు దయతో ఒకటి తీసుకుని తింటే రెండవది నేను తింటానుఅన్నాడతను!
బిస్మార్క్ ద్వంద్వయుద్ధం నుంచి విరమించుకున్నాడని వేరే చెప్పాలా?
==============================
మాటబలం
ఇప్పుడొక ఖడ్గమృగం ఇక్కడికి వస్తే, ఇక్కడ అన్నిటికన్నా బలంగల ప్రాణి అదే అవుతుంది. అయినా నేను మాత్రం లేచి తనకు ఇది నీ చోటు కాదని చెప్పగలను!
-
-జికె చెస్టర్‌టన్
మనుషులకు గొప్పతనం నేర్పించడం నాయకుని పనికాదు. గొప్పతనం వారిలో మొదటి నుంచీ ఉంది. దాన్ని నాయకుడు బయటకు తేవాలి!
- హెన్రీ కిస్సంజర్
తనకన్నా కిందనున్న వారి ఆలోచనలు, అభిప్రాయాలను వినగలిగిన వారికి సరయిన సమాచారం అందుతుంది. చెడుపును కూడా వినగలిగిన వారికి అసలు సమాచారం అందుతుంది.
- ఎల్‌బి బెల్కర్
నీకు మరొకరి వెంట నడవడం ఎలాగో తెలిస్తేనే నువ్వు ముందు నడిచి, అందరినీ వెంట రమ్మనగలవు!





 

No comments: