Saturday, June 12, 2010

Who is Jane Goodall?

జేన్ గుడాల్ ఎవరు?




టార్జాన్ అనే అడివి మనిషి గురించి కథల పుస్తకాలు సినిమాలు వచ్చాయి. టార్జాన్ కథానాయకుడయితే, కథానాయకురాలి పేరు జేన్. కథ అక్కడి వరకే. ఆమె పేరు జేన్ గుడాల్ కాదు. ఆ పేరుగలావిడ నిజంగా ఉన్నారు. ఆమె ప్రపంచం పట్టకుండా, ఆఫ్రికాలోను టాంగన్యీకా సరస్సు ప్రాంతంలో గోంబీ అనే చోట, చింపాంజీలను గురించి పరిశోధనలు చేస్తూ అడవుల్లో కాలం గడుపుతున్నారు.


ఈ ప్రపంచంలో రకరకాల జంతువులను గురించి రకరకాల పరిశోధనలు చేస్తున్నవారు లెక్కలేనంతమంది ఉన్నారు. కానీ అందరిలోకీ ఈ జేన్ ఎంతోప్రత్యేకత గల వ్యక్తి.


మానవుల పరిణామం, చరిత్ర గురించి పరిశోధనలు జరిపిన ఎస్. బీ. లీకీ గారి బృందంలో జేన్ గుడాల్ కూడా చేరారు. ఈ రంగంవారికి ఆఫ్రికా అంటే స్వంత పరిశోధనశాల లాంటిది గనుక, గురువుగారితోబాటు ఆమెకూడా అక్కడికి వెళ్లారు. గురువుగారు, “నువ్వు ఇక్కడే ఉండి చింపాంజీల ప్రవర్తన, సమస్యల గురించి, పరిశోధన చేయవచ్చుగదా!’ అన్నారు. జేన్ “సరే”నన్నారు. అదెప్పుడో తెలుసా 1960 సంవత్సరంలో. ఆనాటినుంచి నేటి వరకు, జేన్ ఆ అడవులలోనే గడుపుతున్నారు. అదీ పట్టుదలంటే.


పదేళ్లపాటు ఆవిడ, చింపాజీల ప్రవర్తనను గురించి పరిశీలిస్తూ గడిపారు. పుట్టలోనుంచి చీమలను తీయడానికి చింపాంజీలు పుల్లలను వాడుకుంటాయని మొట్టమొదట ఆమే గమనించారు. ఆ చింపాంజీల మాంసాహారం, కుటుంబ వ్యవస్థ లాంటి మరెన్నో ఆసక్తికరమయిన అంశాలను గమనించి, పుస్తకాలుగా, పరిశోధన పత్రాలుగా ప్రకటించారు.


జేన్ గుడాల్ ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకురాలు అని పేరు సంపాదించుకున్నారు. అక్కడే అడవిలోనే, తమ స్వంత పరిశోధన సంస్థను ప్రారంభించారు. అడవినే తమ ఇంటిగా గుర్తించుకున్నారు. ప్రజలకు చింపాంజీల రక్షణ అవసరం గురించి తెలియజేయాలని, ఆమె అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో తమ పరిశోధన సంస్థ శాఖలను ఏర్పాటు చేసి, ప్రచారం చేస్తున్నారు. “చింపాంజీలు చాలా మటుకు మనలాంటివే. మనుషులకూ ఇతర జంతుజాతులకూ మధ్య వారధిలాంటివి!” అని అంటారు జేన్.


ఇంకా పెద్ద వయసు రాని ఒక మగ చింపాంజీ, దిక్కులేని ఒక పిల్ల చింపాంజీని తెచ్చుకుని పెంచుకున్న తీరు, వాటి స్వభావానికి గుర్తింపుగా జేన్ గుడాల్ పరిశోధనల్లో తెలిసింది.


ఒక విషయానికి జీవితం అంకితం చేసిన వ్యక్తుల గురించి చెప్పడానికి జేన్ చక్కని ఉదాహరణ.

Who is Jane Goodall?

There are books and films about a character by name Tarzan. He lives in jungles. If the hero of the stories is Tarzan, heroine is Jane! The story ends there. This Jane is not a Goodall! There exists a lady with the name Jane Goodall in this world right now. Unmindful of the world, she lives in the Gombi forests in the Tanganyika area of Arica. She spends her time there researching Chimpanzees. There are many researchers researching many animals in this world. But, Jane is an exceptional researcher.


Jane joined the group of scientists under the leadership of S B Leaky, who studied human evolution and history extensively. Since Africa happens to be a place like the own laboratory for people in this line Jane also went there along the leader. The leader asked her to stay there and research the life of Chimpanzees. Jane accepted. Do you have any idea when all this happened? It was 1960. Till date Jane is still there in those forests. That is real dedication.


For ten years, Jane researched the behavioral patterns of chimps. She was the oen to notice for the first time that chimps use tools like a twig to pull out ants from a anthill. She also found out the meat eating chimps and the family hierarchy in the species and many more things. She published many such results as books and research papers.


Jane Goodall is now known as a reputed researcher. She has established her own research organization in the same forest. She chose the place as her home. With a view of educating the populace on the need of conservation of the chimps she has established branches of her institute in America, Canada and Britain and is working extensively. She says that Chimps are after all like us and they are the links between humans and the other animal races.


Jane noticed that an old chimpanzee taking a young orphan into its fold and rearing it jealously. She says that this is the identity of the race.

Science and life spent in science are always interesting!!
>>>>>>>>>

No comments: